హోమ్ / వార్తలు / పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
పంచుకోండి

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌ 3.23; డీజిల్‌ 2.05 పెంపు అర్ధరాత్రినుంచే పెరిగిన ధరలు

 

పెట్రో ధరల బాదుడు మళ్లీ మొదలైంది. మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు లీటరు పెట్రోలుపై రూ.3.23, డీజిల్‌పై రూ.2.05 వంతున పెంచుతున్నట్లు ఇంధన చిల్లర విక్రయాల్లో దేశంలోనే అతిపెద్దదైన చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఎప్పటిలాగానే అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుత అంతర్జాతీయ చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువలో వ్యత్యాసం ఫలితంగా పెరుగుదలను వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని ఐవోసీ తన ప్రకటనలో వివరించింది.
ఈ ధరల సవరణను మంగళవారమే అమలులోకి తేవాల్సి ఉండగా, చిల్లర విక్రేతలు ఒకరోజు వాయిదా కోరినట్లు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి 15 రోజులకొకసారి అంతోఇంతో తగ్గుతూ వచ్చిన పెట్రోలు ధరను మళ్లీ పెరుగుదల దిశగా మళ్లించగా, వరుస పెంపు బాటలో ఉన్న డీజిల్‌ ధరను మరోసారి పెంచారు.
చివరిసారిగా ఈ నెల 1న పెట్రోలు ధరను లీటరుకు రూ.3.02 వంతున తగ్గించగా, తాజా పెంపుతో అదికాస్తా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మరో ఐదు పైసలు అధిక భారం పడింది. ఇక 1న డీజిల్‌ ధర రూ.1.47మేర పెంచగా, ఇప్పుడు దానిపైన మరో రూ.2.05 పెంచారు.

పెట్రో ధరల బాదుడు మళ్లీ మొదలైంది. మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు లీటరు పెట్రోలుపై రూ.3.23, డీజిల్‌పై రూ.2.05 వంతున పెంచుతున్నట్లు ఇంధన చిల్లర విక్రయాల్లో దేశంలోనే అతిపెద్దదైన చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఎప్పటిలాగానే అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుత అంతర్జాతీయ చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువలో వ్యత్యాసం ఫలితంగా పెరుగుదలను వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని ఐవోసీ తన ప్రకటనలో వివరించింది. ఈ ధరల సవరణను మంగళవారమే అమలులోకి తేవాల్సి ఉండగా, చిల్లర విక్రేతలు ఒకరోజు వాయిదా కోరినట్లు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి 15 రోజులకొకసారి అంతోఇంతో తగ్గుతూ వచ్చిన పెట్రోలు ధరను మళ్లీ పెరుగుదల దిశగా మళ్లించగా, వరుస పెంపు బాటలో ఉన్న డీజిల్‌ ధరను మరోసారి పెంచారు.చివరిసారిగా ఈ నెల 1న పెట్రోలు ధరను లీటరుకు రూ.3.02 వంతున తగ్గించగా, తాజా పెంపుతో అదికాస్తా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మరో ఐదు పైసలు అధిక భారం పడింది. ఇక 1న డీజిల్‌ ధర రూ.1.47మేర పెంచగా, ఇప్పుడు దానిపైన మరో రూ.2.05 పెంచారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

పైకి వెళ్ళుటకు