హోమ్ / వార్తలు / ఫిబ్రవరి 10న భవిష్యనిధి అదాలత్‌
పంచుకోండి

ఫిబ్రవరి 10న భవిష్యనిధి అదాలత్‌

ఫిబ్రవరి 10న భవిష్యనిధి అదాలత్‌

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 10న భవిష్యనిధి అదాలత్‌ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ బర్కత్‌పురలోని ప్రాంతీయ పీఎఫ్‌ కార్యాలయంలో ఈ అదాలత్‌ ఉంటుందన్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు పీఎఫ్‌ చందాదారులు, ఉదయం 11.30 నుంచి 12.30 వరకు యాజమాన్యాలు, మధ్యాహ్నం 12.30 నుంచి 1.15 వరకు మినహాయింపు పొందిన సంస్థల ఫిర్యాదులకు పరిష్కారం చూపిస్తారు. చందాదారులు, యాజమాన్యాలు తమ ఫిర్యాదులను ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ కార్యాలయం, బర్కత్‌పుర, హైదారాబాద్‌లో లిఖిత పూర్వకంగా అందజేయడంగానీ, పోస్టులోగానీ పంపాలన్నారు.ro.hyderabad@epfindia.gov.in కు ఈ-మెయిల్‌ కూడా చేయవచ్చని పీఎఫ్‌ కమిషనర్‌ సూచించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు