హోమ్ / వార్తలు / హైదరాబాద్ లో మరో ఏడు నైట్‌ షెల్టర్లు
పంచుకోండి

హైదరాబాద్ లో మరో ఏడు నైట్‌ షెల్టర్లు

హైదరాబాద్ లో మరో ఏడు నైట్‌ షెల్టర్లు

నగరంలో ఫుట్‌పాతలు, రైల్వే స్టేషన్‌లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు గ్రేటర్‌లో ఏడు నైట్‌షెల్టర్లను నిర్మిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో దీన్‌దయాల్‌ అంత్యోదయయోజనపై నిర్వహిం చిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైదరా బాద్‌లో 3500మంది ఫుట్‌పాతలు, ఇతర చోట్ల తల దాచుకుంటున్నట్టు సర్వేలో తేలిందని, వీరిలో 12 షెల్టర్ల ద్వారా 360 మందికి ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. త్వరలో మరో ఏడు షెల్టర్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. రోగుల సహాయకుల కోసం ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు