హోమ్ / వార్తలు / హైదరాబాద్ లోని ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ లో అందం- ఆరోగ్యం అంశాలపై వర్క్ షాప్ ప్రారంభం
పంచుకోండి

హైదరాబాద్ లోని ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ లో అందం- ఆరోగ్యం అంశాలపై వర్క్ షాప్ ప్రారంభం

హైదరాబాద్ లోని ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ లో అందం- ఆరోగ్యం అంశాలపై వర్క్ షాప్ ప్రారంభం

ప్రభుత్వ ప్రాథమ్యాలలో నైపుణ్యాలఅభివృద్ధి కూడా ఒకటని సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ) మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.కె.జలాన్ తెలిపారు. ఆయన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్ ప్రైజెస్(ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ) లో ‘అందం- ఆరోగ్యం అంశాలపై వర్క్ షాప్’ ను ఈ రోజు ప్రారంభించారు. సూక్ష్మ సంస్థలలో ఉపాధి అవకాశాలు విస్తృత‌స్థాయిలో ఉన్నాయని శ్రీ జలాన్ అన్నారు. ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ డైరెక్టర్ జనరల్ డాక్టర్చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల నుంచి జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను ప్రతినిధులుగా వచ్చిన వారికి తమ సంస్థశిక్షణను ఇస్తోందని వివరించారు. ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ ఈ వెల్ నెస్కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోందని ఆయన తెలిపారు. వెల్ నెస్ రంగంలో సూక్ష్మసంస్థలకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందజేయగలదని చెప్పారు.

అందం- ఆరోగ్యం విషయాలలో నిపుణుడు, మాస్టర్ ట్రయినర్ అయిన శ్రీ జావేద్ హబీబ్ ఈ కార్యక్రమానికి హాజరైమాట్లాడుతూ, వృత్తిపరమైననైపుణ్యాలు ఈ రెండు రంగాలలోనూ చక్కని సొమ్మును సంపాదించేందుకు సహాయపడగలవనిచెప్పారు. ప్రతినిధులకు అవగాహన కలిగించేందుకు డెమాన్ స్ట్రేషన్ సెషన్ నునిర్వహించారు. సెలూన్ లను ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు చెందిన పలువురుప్రతినిధులు ఈ వర్క్ షాప్ లో పాలుపంచుకొన్నారు.                                         ***

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు