హోమ్ / శక్తి వనరులు / డేటాబేస్ / బడ్జెట్ కేటాయింపులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బడ్జెట్ కేటాయింపులు

ఈ విభాగం లో శక్తి రంగానికి సంబంధించిన వివిధ పథకాలకు బడ్జెట్ కేటాయింపు వివరాలు అందుబాటులో ఉంటాయి.

2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు :

  • 2014-15 సంవత్సరం కేటాయింపులు రూ.9,543.90 కోట్లు కాగా 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5,410.86 కోట్లు.
  • దేశాభివృద్థిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమని భావిస్తున్న మోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో పునరుత్పాదక, పర్యావరణహిత విద్యుదుత్పత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. భారీ స్థాయిలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, పార్కులు నెలకొల్పడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా పదేళ్లపాటు పన్ను మినహాయింపులనూ ప్రకటించారు.
  • సూర్యరశ్మి బాగా ఉండే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, జమ్ము కాశ్మీర్‌లోని లడక్‌లలో అత్యధిక సామర్థ్యం ఉన్న (అల్ట్రా మెగా) సౌర విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు.
  • వ్యవసాయానికి, తాగునీటి పంపింగ్‌కు వినియోగిస్తున్న సాధారణ మోటార్ల స్థానంలో సౌరవిద్యుత్‌తో నడిచే మోటార్లను వినియోగించడం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లక్ష మోటార్లను మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు రూ.400 కోట్లు కేటాయింపు.
  • కాలువ గట్లపై మెగావాట్ సామర్థ్యంగల సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు.
  • గుజరాత్ తరహాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లను వ్యవసాయ, గృహ వినియోగ రకాలుగా విభజించనున్నారు. 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన'గా పిలిచే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు.
  • విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఢిల్లీలో విద్యుత్ సంస్కరణల కోసం రూ.200 కోట్లు కేటాయింపు.
  • 2017, మార్చి 31 నాటికి విద్యుదుత్పత్తి పంపిణీ, సరఫరా ప్రారంభించే సంస్థలకు ఏడాది ప్రాతిపదికన కాకుండా పదేళ్లపాటు పన్ను విరామాన్ని (ట్యాక్స్ హాలిడే) విస్తరించడానికి ప్రతిపాదన.
  • సంప్రదాయ, పునరుత్పాదక విద్యుత్‌ల అనుసంధానానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం. తద్వారా పవన, సౌర విద్యుత్‌ను ఎక్కడ ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావొచ్చన్నది ప్రభుత్వ యోచన.
  • సౌర విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే ఫొటోవోల్టాయిక్ సెల్స్ దిగుమతుల ప్రోత్సాహక విధానంలో మార్పులు తీసుకురానున్నారు.
  • ఫొటోవోల్టాయిక్ రిబ్బన్లలో వాడే రాగి తీగ తయారీదారులకు దిగుమతి సుంకాల్లో మినహాయింపులు.
  • సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే యంత్రాలు, యంత్ర పరికరాలపై విధించే దిగుమతి సుంకాల తగ్గింపు 5 శాతం వరకూ విస్తరణ.
  • 2015 మార్చి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటికీ బొగ్గు సరఫరా సమస్య లేకుండా చూడటం.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

3.02455357143
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు