పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వంట చేయటం

ఈ విభాగంలో ఇంట్లో వంట సమయంలో శక్తి పరిరక్షణ చర్యలు గురించి వివరించడం జరిగింది.

సుమారు 45% భారతదేశ ప్రాధమిక శక్తి వినియోగం నివాస వినియోగాలకు ఉంటుంది. అందులో వంట ఒక ప్రధాన భాగం.

వంట సమయంలో శక్తి పరిరక్షణ కోసం సాధారణ చిట్కాలు

 • ఇంధన సామర్థ్య పొయ్యిని ఉపయోగించండి.
 • వంట సమయం మరియు ఇంధన వాడకం తగ్గించడానికి వంట చేసేటప్పుడు పాత్రలపై మూత మూసి ఉంచండి.
 • వంటచేసే ముందు ఆహారాన్ని నానబెట్టండి.
 • పొడి దినుసులను రుబ్బటం కంటే తడిపిన దినుసులను రుబ్బడానికి తక్కువ సమయం పడుతుంది.
 • మైక్రోవేవ్ ఓవెన్లు సంప్రదాయ విద్యుత్/గ్యాస్ స్టవ్ల కంటే 50% తక్కువ శక్తిని తీసుకుంటాయి.
 • విద్యుత్ స్టవులను అవసరమైన దానిని బట్టి వంట కంటే ముందు అనేక నిమిషాల ముందు ఆపి వేయవచ్చు.
 • కుకింగు కాయిలుపై పూర్తిగా ఆనే చదునైన అడుగు గిన్నెలు వేడి నష్టాన్ని తగ్గిస్తాయి.
 • ప్రెజర్ కుక్కర్లు సాధ్యమైనంతగా వాడాలి.
 • కూరగాయలు, పాలు , మాంసం మొదలైన ఫ్రిజ్జులలోని వస్తువులను వంటకు ముందు గది ఉష్ణోగ్రత తీసుకు తీసుకురావాలి.

ఎల్పిజి సిలిండర్ల వినియోగానికి సాధారణ కార్యాచరణ చిట్కాలు

ఖాళీగా సిలిండరును విడదీయండి

 • సుగంధ చెక్కలను, కొవ్వొత్తి, వంటగది లోని పూజా దీపం మరియు, పరిసర గదులతో సహా, అన్ని నిప్పులను మరియు మంటలు ఆర్పివేయండి.
 • పొయ్యి లోని అన్ని ట్యాపులను మూసివేయండి.
 • స్విచ్చును గుండ్రంగా తిప్పి ఆన్ స్థానం నుండి ఆఫ్ స్థానానికి మార్చండి.
 • నియంత్రకాన్ని పట్టుకొని బుషును (నల్లని ప్లాస్టిక్ లాకింగ్ రింగ్) బయటకు లాగండి. తర్వాత కొంచెం సున్నితంగా తిప్పి నియంత్రకాన్ని పైకి ఎత్తండి. ఆలా సిలిండర్ వాల్వ్ నుండి నియంత్రకాన్ని వేరు చేయాలి.
 • సిలిండర్ వాల్వుకు ప్లాస్టిక్ భద్రత మూతను పెట్టండి. ఒక ప్రత్యేకమైన క్లిక్కు వినిపించే వరకు మూతను కిందికి నొక్కండి. ఇప్పుడు ఖాళీ సిలిండర్ తొలగించవచ్చు.

నిండు సిలిండరును జోడించటం

 • భద్రత మూతను తొలగించండి, దానిని కిందకు నొక్కండి, తాడు లాగి అలాగే పట్టుకుని సిలిండరు వాల్వ్ ముత తీయండి.
 • సిలిండర్ వాల్వ్ లోపల సీలింగ్ రింగ్ సరైన స్థానంలో ఉందో లేదో మీ చిటికెన వేలు సహాయంతో పరిశీలించండి. రింగ్ లేకపోతే సిలిండర్లను వాడకండి, భద్రత క్యాప్ తిరిగి పెట్టేసి సిలండరును మార్చడానికి మీ పంపిణీదారును సంప్రదించండి.
 • నిండు సిలిండరుపై నియంత్రకాన్ని అమర్చడానికి, క్రింది విధంగా చేయండి:
  • నియంత్రకం స్విచ్ నాబ్ ఆఫ్ స్థానంలో ఉందని నిర్ధారించుకొండి
  • నియంత్రకాన్ని పట్టుకొని ప్లాస్టిక్ బ్లుష్ బయటకు లాగండి
  • వాల్వు మీద నియంత్రకాన్ని నిలువుగా ఉంచి దాని అంచు సిలిండర్ వాల్వ్ షడ్భుజి తాకే వరకు సున్నితంగా కిందికి నొక్కండి. నల్లని ప్లాస్టిక్ బుష్ ను వదిలివేసి ఆపై దానిని కిందకు నొక్కండి. (మీరు క్లిక్కు ధ్వని వింటారు)
  • పీడన నియంత్రకం ప్రస్తుతం సిలిండరుపై లాక్ చేయబడింది.

బర్నర్లను వెలిగించడానికి

 • నియంత్రక స్విచ్చి నాబును అన్ వరకు ఆంటీ క్లాకుగా తిప్పండి.
 • స్టవ్ బర్నర్ దగ్గర అగ్గిపుల్లను పట్టుకొండి మరియు పొయ్యి నాబును ఆన్ వరకు తిప్పండి.

ఇతరులు

 • వంట చేసేటప్పుడు నైలాన్ వస్త్రాలు లేదా అలాంటి బట్టలను ధరించవద్దు
 • వంట ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటిని వదిలి ఎప్పుడూ వెళ్లకూడదు.
 • గ్యాసు స్టవ్వు పరికరాలను ఎప్పుడు రిపేరు చేయడానికి లేదా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించకండి లేదా నకిలీ మెకానిక్కులను అలా చేయనివ్వకండి.
 • వంట తర్వాత లేదా రాత్రి సమయంలో నియంత్రకాన్ని అన్ లో వదిలకండి.
 • స్టవ్ వెలిగించే ముందు ఎల్లప్పుడూ ఎల్పిజి లీకేజ్ వాసన చూడండి.
 • ఎలుకలు, బొద్దింకలు మొదలైనవాటిని నివారించేందుకు వంటగదిని శుభ్రంగా ఉంచండి.

ఎల్పిజి వినియోగదారుల భద్రతకు సాధారణ చిట్కాలు

రబ్బరు గొట్టాలు మరియు పీడన నియంత్రకం గురించి గుర్తించుకోవలసినవి

 • ఇది ఆమోదించిన నాణ్యతను కలిగి ఉండాలి, (ఐఎస్ఐ/బిఐఎస్ గుర్తు).
 • బిఐఎస్ ఆమోదించిన రబ్బరు గొట్టాలను మరియు LPG నియంత్రకాలను ఆమోదం పొందిన పంపిణీదారుల నుండి మాత్రమే పొందండి.
 • ఇది సాధ్యమైనంత చిన్నదిగా ఉండాలి. గరిష్ట పొడవు 1.5 మీటర్లు ఉండాలి.
 • ఉపకరణం యొక్క గొట్టం కొలతలు, మీ నియంత్రకం మరియు రబ్బర్ గొట్టాల కొలతలు సరైన బోర్ గొట్టం ఉండేలా చూచుకోవాలి. మీ డీలర్ కొలతల గురించి తెలియ జేస్తాడు.
 • ఇది తనిఖీకిలకు సులభంగా అందుబాటులో ఉండాలి.
 • వేడి మరియు మంట నుండి దూరంగా ఉంచండి.
 • స్టవ్ మరియు నియంత్రక గొట్టం యొక్క పూర్తి పొడవు వచ్చేలా దానిని లాగండి.
 • ఇది బర్నర్ ద్వారా వేడి కాకుండా లేదా వంకరవటం/చిక్కు పడకుండా చూడండి.
 • దానిని తడి గుడ్డతో మాత్రమే తుడవండి. గొట్టాన్ని తొడిగించటానికి సబ్బును ఉపయోగించకండి.
 • పగుళ్ళు, రంధ్రాలు, మెత్తదనం, మరియు సాంధ్రతలను ముఖ్యంగా చివర్లలో క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
 • ప్రతి 2 సంవత్సరాలకు గొట్టాలు మార్చండి.
 • ఏ ఇతర వస్తువు లేదా స్లీవులతో రబ్బర్ గొట్టాలను కప్పకండి.

ప్రెజర్ రెగ్యులేటర్ చాలా ముఖ్యం. ఇది సిలిండర్ వాల్వ్ అవుట్లెటుతో అనుసంధానించబడుతుంది. సిలిండరు నుంచి వస్తున్న గ్యాస్ ఒత్తిడిని నియంత్రించటం దీని పని. వేడి ప్లేటుకు ఒక స్థిర పీడనం వద్ద గ్యాసును సరఫరా చేస్తుంది.

గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నప్పుడు గుర్తుంచుకోవలసినవి

సిలిండర్ కంపెనీ ముద్ర మరియు భద్రత క్యాప్ చెక్కుచెదరకుండా ఉందేమో చూడండి.

 • మీకు వాడుక గురించి సరిగా తెలియకపోతే, బట్వాడా వ్యక్తిని ఎలే వాడాలో చూపించమని అడగండి.
 • సిలిండర్లు ఒక కదలని ఉపరితలంపై భూమికి సమానంగా పెట్టాలి.

గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే ముందు గుర్తుంచుకోవలసినవి

 • సిలిండర్ వాల్వ్ లోని 'ఓ' రింగ్ ఉందో లేదో తనిఖీ చేయండి
 • లీకేజ్ ఏదైనా కనిపిస్తుందేమో చూడండి – సబ్బు నీరు ఉపయోగించి, లేదా వాసన ద్వారా.
 • లీకేజీ దోషాలను తనిఖీ చేసేటప్పుడు అగ్గి పుల్లలను ఉపయోగించకండి
 • ఎల్లప్పుడూ బాగా వెలుతురు వస్తున్న ప్రదేశంలో భూమిపై నిటారుగా సిలిండరును ఉంచండి
 • క్యాబినేటులలో వంటగ్యాస్ సిలిండరను అమర్చవద్దు
 • ఎల్పిజి స్టవ్ ఎల్లప్పుడూ వంటగది స్లాబుపై సిలిండరు కంటే ఎత్తులో అమర్చాలి
 • సిలిండరును ఇతర వేడికి కారణమయ్యే వాటినుంచి దూరంగా ఉంచాలి

గ్యాస్ సిలిండర్ల వాడిన తర్వాత చేయవలసివవి

 • సిలిండరు ఉపయోగంలో లేనప్పుడు 'ఆఫ్' స్థానానికి నియంత్రకం నాబును మార్చి ఆపివేయాలి
 • ఖాళీ సిలిండర్లను ఒక చల్లని మరియు బాగా వెలుతురు వస్తున్న స్థానంలో భద్రత క్యాపు ‘ఆన్’ ఉంచి నిల్వ చేయాలి

గ్యాస్ వాసన ఉంటే ఏ చర్యలు తీసుకోవాలి?

ఎల్పిజి వాయు రూపంలో ఉన్నప్పుడు రంగు మరియు వాసన లేకుండా ఉంటుంది. కాబట్టి లీకేజ్ జరిగినప్పుడు సులభం గుర్తించటానికి ఒక విలక్షణమైన వాసనను జోడిస్తారు. కింది ప్రేలుడు పరిమితి 1/5 వ సాంద్రత వద్ద గాలిలో దీని వాసనను గుర్తించవచ్చు.

గ్యాసు వాసన వచ్చినట్టు అనిపిస్తే,

 • భయపడవద్దు
 • విద్యుత్ స్విచ్చులను వేయవద్దు. ప్రధాన విద్యుత్ సరఫరా బయట నుంచి మాత్రమే వేరుచేయండి.
 • పొయ్యి నాబులు ఆఫ్ స్థానంలో ఉండేలా చూడండి
 • ఎల్పిజి లీకేజ్ గుర్తించడానికి కూడా అగ్గిపుల్లను వెలిగించవద్దు. అక్కడ ఉన్న మంటలను, దీపాలను, సుగంధ చెక్కలను ఆర్పివేయండి.
 • నాబ్ క్లాకు వైస్ తిప్పి ఒత్తిడి నియంత్రక స్విచ్చును ఆపివేయండి.
 • అన్ని తలుపులు మరియు తిటికీలను తెరవండి.
 • వాసన కొనసాగితే, ఆఫీసు సమయంలో మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరుకు కాల్ చేయండి. కార్యాలయం సమయం తర్వాత లేదా సెలవులు రోజులో అయితే సమీప అత్యవసర సేవకు కాల్ చేయండి.
 • ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నియంత్రకాన్ని వేరుచేయగలడు. వాల్వ్ పైన భద్రత క్యాపును పెట్టండి.

మూలం: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సైట్లు

2.98089171975
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు