పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

విద్యుత్ ఉపకరణాల వినియోగం

ఈ విభాగంలో విద్యుత్ ఉపకరణాల వినియోగంలో ఇంధన ఆదా చిట్కాల గురించి వివరించడం జరిగింది.

ప్రస్తుతం, 25 కోట్ల గృహాలు ఉన్న దేశంలో, 31% పట్టణీకరణ (సెన్సస్, 2011) మరియు తలసరి ఆదాయం. రూ 39,143 (సిఎస్ఒ, 2013) ఉంది. సుమారుగా 1274 TWh 1 శక్తి గృహావసరాలకోసం అందులో ఎక్కువగా విద్యుత్తు మరియు వంటకు ఉపయోగిస్తున్నారు. ఆదాయ స్థాయిలు మరియు నమ్మకమైన యాక్సెస్ క్రమేపి మెరుగుపడటం వల్ల గ్రామీణ మరియు పట్టణ గృహాల్లో ఎలక్ట్రిక్ ఉపకరణాల ఉపయోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఉపకరణాల ఉత్పత్తి జీవితం 10-15 సంవత్సరాలు ఉంటుంది. అందువలన, ఈ ఉత్పత్తుల సామర్థ్యం (లేదా అసమర్థత) లాక్ అవుతుంది - ఒకసారి వారు కొనగానే. అందుకే, క్రొత్త ఉపకరణాల స్టాక్స్ సమర్థవంతమైనవిగా ఉండటం చాలా ముఖ్యం.

శక్తి సామర్థ్య ఉపకరణాలను వినియోగించటం మరియు ఇంధన పొదుపు సంభావ్యత అన్ని వర్గాల ఉపకరణాలకు ముఖ్యమైనది. పూర్తిగా మెరుగైన ఉపకరణాల సామర్థ్యాన్ని పెంచి ఇందన పొదుపును గణనీయంగా మరియు తక్షణం పెంచే ప్రయత్నాలు చేయటం అవసరం. ఇంటిగ్రేటెడ్ శక్తి విధానం నివేదిక (IEP, 2006) మరియు ప్రణాళికా సంఘపు తక్కువ కార్బన్ కమిటీ (LCC, 2011) తాత్కాలిక నివేదికలో మొత్తం విద్యుత్తు వాడకం తగ్గింపు సంభావ్యత 15%-20% ఉంటుందని అంచనా వేసాయి.

సీలింగు ప్యానులు తక్కువ బరువున్న బ్రష్ లెస్ DC (BLDC) మోటార్లు వాడవచ్చు. దీనివలన రోటర్ నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. దీని నలన ఇండక్షన్ అయాను మోటారులు వాడుతున్న ప్యానుల కంటే తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే (LCD) టీవీలలో ప్రకాశ ఉద్గార డయోడ్ (LED) బ్యాక్ లైటు సాంకేతికత మరియు స్వయం చాలిత కాంతి నియంత్రణ వాడేవి క్యాథోడ్ రే ట్యూబ్ ఉపయోగించే టీవీల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా మరియు చాలా శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రిఫ్రిజిరేటర్ల లోని రబ్బరు పట్టీల ద్వారా వేడి లీకేజీని తగ్గించడం ద్వారా, ఎక్కువ సామర్థ్యం గల కంప్రెసర్ల వాడకం ద్వారా, మరియు ఎవాపరేటరు మరియు కండెన్సర్ యొక్క సామర్థ్యం పెంచే చర్యల ద్వారా రిఫ్రిజిరేటర్ల సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఎయిర్ కండీషన్లలో శీతలీకరణ అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రానిక్ నియంత్రిత వేరియబుల్ వేగాన్ని మిషను కంప్రెసర్ వేగంతో సరిపోయేలా చేసే సాంకేతికత వంటివి గణనీయంగా గది ఎయిరు కండీషన్ల శక్తి వినియోగాన్ని తగ్గిస్తాయి.

ఇంధన సామర్థ్య గృహోపకరణాల పరివర్తనంలో అడ్డంకులు

 • శక్తి సామర్థ్య గృహోపకరణాలు తక్కువ సామర్థ్యం గల గృహోపకరణాల కంటే ఎక్కువ ఖరీదు కలిగి ఉంటాయి. అయినప్పటికీ భవిష్యత్ లో వాటిపై పెట్టే ఖర్చు తక్కువగా ఉంటుంది. చాలా మంది ఇప్పటి ఖరీదు చూసి కొనడానికి వెనకాడతారు కాని భవిషత్తులో వాటీని వాడినందునల్ల అయ్యె పొదుపును గుర్తించరు.
 • ఇంధన సామర్థ్య ఉత్పత్తుల ప్రయోజనాలను తెలుసుకోవడానికి వీలైన సమాచారం సరైన విధంగా లభించకపోవటం.
 • వినియోగదారుడి శక్తి సామర్థ ఉత్పత్తి పై ఉన్న సందేహము కూడా ఈ ఉత్పత్తులను కొనుగోలు అయిష్టతకు ఒక సాధారణ కారణం.
 • మార్కెట్లో ఎక్కువ కొత్త ఉత్పత్తులు వల్ల, సమర్థ గృహోపకరణాలు నమ్మకాన్నిపొందలేక పోతున్నాయి. పరిమిత ఉత్పత్తి వారెంట్ Y లేదా వారంటీపై విశ్వసనీయత లేకపోవడం దీనికి కారణం.
 • స్ప్లిట్ ప్రోత్సాహకాలు ఉంటాయి ప్రత్యేకంగా కొత్త భవనాలలో. ఒక బిల్డర్ ఎక్కున లాభాలను గడించడానికి సమర్థ గృహోపకరణాలను కొనుగోలు చెయకపోవచ్చు మరియు తక్కున సమర్థ నమూనాలను వాడవచ్చు.

వంటింటి ఉపకరణాలు ఉపయోగించే టప్పుడు శక్తి పొదుపు

 • ఎండిన వాటిని రుబ్బేందుకు తీసుకొనే సమయం కన్నా పచ్చివి రుబ్బటానికి తీసుకొనే సమయం ఎక్కువ.
 • మైక్రోవేవ్ ఓవెన్లు సంప్రదాయ విద్యుత్/గ్యాస్ స్టవ్వులకంటే 50% తక్కువ శక్తి తీసుకుంటాయి.
 • ఎలక్ట్రిక్ పొయ్యిని అవసరమైన వంట సమయం కంటే అనేక నిమిషాల ముందు ఆపివేయ వచ్చు.
 • చదునైన అడుగు గల పెంక పూర్తిగా వంట కాయల్ కు తగిలి ఉండటం వలన వేడి నష్టం తగ్గుతుంది.
 • ప్రెజర్ కుక్కర్లు వీలైనంత ఎక్కువగా వాడాలి.
 • కూరగాయలు, పాలు, మాంసం వంటి రిఫ్రిజరేటెడ్ పదార్థాలను వండటానికి ముందు గది ఉష్ణోగ్రత తీసుకు తీసుకురావాలి.
 • విద్యుత్ వాటర్ హీటర్లు/ఇంధన ఆధారితమైన వేడి నీటి వ్యవస్థల స్థానంలో సోలార్ వాటర్ హీటర్లు ఉపయోగించవచ్చు.

గృహ ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం సమయంలో శక్తి ఆదా చిట్కాలు

 • టీవీ, కంప్యూటర్లు మరియు ఆడియో సిస్టమ్స్ వంటి పరికరాలను ఉపయోగించక పోతే, పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి.
 • కంప్యూటర్లను వదిలి వెళ్లేప్పుడు, మానిటరును ఆపి వేయండి.
 • కంప్యూటర్ తెరపైన స్క్రీన్ సేవర్స్ శక్తిని పొదుపు చేయవు. కంప్యూటర్లను ఉపయోగించ నప్పుడు ఆపివేయటం శక్తిని సేవ్ చేస్తుంది.
 • రిఫ్రిజిరేటర్లను మరియు ఫ్రీడర్లను రోజూ మాన్యువలుగా డీప్రోస్టింగు చేయటం వాటిని మరింత శక్తి సమర్థవంతంగా చేస్తుంది.
 • రిఫ్రిజిరేటర్ మరియు గోడల మధ్య గాలి సులభంగా వీసేలా చాలినంత ఖాళీ ఉండాలి.
 • రిఫ్రిజిరేటర్ తలుపులు గాలి చొరబడనివిగా ఉండాలి.
 • వింత కానీ నిజమైన వాస్తవం ఏమిటంటే పూర్తిగా నిండిన ఫ్రీజరు ఒక ఖాళీ ఫ్రీజరు కంటే తక్కువ శక్తి ఉపయోగించుకుంటుంది. మీరు తలుపు తెరిచిన ప్రతిసారీ, ఖాళీ ఫ్రీజరులో, చల్లని గాలి బయటకు వెళ్ళిపోయి వేడి గాలి రావటానికి అవకాశం ఉంటుంది. ఫ్రిజ్ మళ్ళీ ఇది చల్లబరటానికి దాదాపు రెట్టింపు సమయం పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల, నీరు నింపిన జిప్ లాక్ సంచులను ఫ్రీజర్ లో ఉంచాలి. గట్టిపడ్డ ఐసు చల్ల గాలి తప్పించుకో నివ్వదు - ఫ్రిజ్ అదనపు సమయం మరియు శక్తి ఆదా అవుతుంది. అంతేకాక, ఐసు నిండిన సంచులు విద్యుత్ సరఫరాలో అంతరాయంలో కూడా ఫ్రిజ్జును చల్లగా ఉంచుతాయి.
 • రిఫ్రిజిరేటరులో నేరుగా వెచ్చని ఆహారాన్ని పెట్టటం మానుకోండి.
 • వాషింగ్ మిషన్లను పూర్తి లోడ్లలో మాత్రమే వాడాలి.
 • స్వయంచాలకంగా ఉష్ణోగ్రతను నిలిపివేసే ఎయిర్ కండీషనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • గది అంతటా మరింత సమర్థవంతంగా ఎయిర్ కండీషనర్ గాలి వ్యాపించేటందుకు పైకప్పు ఫ్యానును కలిసి వాడాలి. అప్పుడు ఎయిర్ కండీషనరును అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా బాగా వాడవచ్చు.
 • తలుపులు మరియు విండోలను సరిగా సీలు చేయాలి.
 • చెట్లు లేదా పొదల నీడలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు ఉపయోగించే విద్యుత్ కంటే ఎండలో ఉన్నవి వాడే విద్యుత్ ఎక్కువ.

మూలం : పోర్టల్ కంటెంట్ టీమ్

సంబంధిత వనరులు

 1. గైడ్ ఆన్ ఎనర్జీ- శక్తి సామర్థ్య రూమ్ ఎయిర్ కండీషనర్
 2. శక్తి సమర్థ గృహోపకరణాలు: శక్తి లేబుల్ చూడండి
 3. భారతదేశ శక్తి పరిరక్షణ పరిస్థితులు 2047
2.98657718121
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు