హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / అంతర్జాలంతో కొత్త మానసిక సమస్యలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర్జాలంతో కొత్త మానసిక సమస్యలు

ఈ విభాగంలోనెట్‌తో కొత్త మానసిక సమస్యలు మరియు ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ యుగవు నూతన వ్యసనం గురించి వివరించబడింది

బెరగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్యర, నాడీ శాస్త్ర సంస్థ ఇటీవల వట్టణాల్లో యువతవై ఒక అధ్యయనం నిర్వహించగా అంతర్జాలాన్ని, గ్యాడ్జెట్స్‌ను అతిగా వినియోగించిన వారిలో 73 శాతం మంది కుర్రకారు అనారోగ్య సమస్యల పాలవుతున్నారని తేలింది.

వ్రస్తుతం దేశంలో అయిదు శాతం మంది దాకా యువత అంతర్జాలానికి బానిస అయి ఉంటుందని అంచనా.

ఇరటర్నెట్‌..! కొందరికి ఇప్పుడో పేద్ద సమస్య.

కంవ్యూటర్లు, మొబైళ్లు, కార్లు, ఇళ్లు, చేతులు, కళ్లు దాటేసి ఇవ్పుడు మొదళ్లలోకి చొరబడింది. దేశంలోని వట్టణాల్లో నూతన యవ్వనులు (టీనేజర్స్‌) నెట్‌ లేకుండా క్షణం గడపలేకున్నారు. వారి మొదడు నిండా.. పేస్‌బుక్‌..వాట్సప్.. గూగుల్‌.. యూట్యూబ్‌.. నెట్‌.. ఫోన్లే. అంతర్జాలంలో చిక్కుకొని మానసిక ఒత్తిడి, వెన్నునొప్పులు, కళ్ల సమస్యలు, నిద్రలేమి, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. చదువూ దారి తవ్పుతోంది. అతి అంతర్జాల వినియోగం వద్దని ఎంత చెప్పినా వినడం లేదంటూ వట్టణాల్లో పిల్లలవై తల్లిదండ్రుల పిర్యాదులు. దీంతో అంతర్జాల వినియోగం ఎక్కువై.. దాని నుంచి బయట పడేందుకు మానసిక నివుణులను సంవ్రదిస్తున్న కుర్రకారు సంఖ్య వెరుగుతోంది. ఇలాంటి సమస్య ఇవ్పటి వరకూ అపెురికా, బ్రిటన్లలో ఎక్కువగా ఉండగా ఇవ్పుడు భారత్‌లోనూ ఎక్కువ అవుతోంది. పాశ్చాత్యదేశాల్లోలాగా ఇక్కడి యువతకూ ఇవ్పుడు 'ఇరటర్నెట్‌ డీ అడిక్షన్‌' కేంద్రాలు అవసరమవుతున్నాయి. అసలు అంతర్జాలానికి ఎందుకు బానిసలవుతున్నారు? ఈ వ్యసనవరులను గుర్తించేదెలా? ఈ వ్యసనంతో వచ్చే సమస్యలేంటి? అసలు వ్యసనాన్ని మాన్పించేదెలా? ఈ వ్రశ్నలకు నివుణులు, పలు అధ్యయనాలు అందిస్తున్న సమాధానాలు.

ఆరోగ్యపరంగా ఏమైనా తేడాలు వచ్చినా.. సమస్యలు వచ్చినా గతంలో వెంటనే వైద్యులను సంప్రదించేవారు. ఇది మంచి అలవాటు. కాని ఇప్పుడు ఇది కూడా మారిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చినా దాని తాలూకు సమాచారం, చికిత్స కోసం నెట్‌లో వెదుకుతున్న వారి సంఖ్య వెరుగుతోంది. దీని వల్ల చిన్న సమస్యను కూడా పేద్దగా ఊహించుకుని.. అనవసరంగా మానసిక ఒత్తిడులకు, ఆందోళనకు గురయ్యే వారి సంఖ్య పేరుగుతోంది. నెట్‌లో లభించే సమాచారం అంతా కరెక్టే అనుకోవడానికీ లేదు. గతంలో ఈ అంశం పై  ఒక అధ్యయనం జరుగగా ఆరోగ్యానికి సంబంధించి నెట్‌లో లభిస్తున్న సగం సమాచారం కూడా సరైంది కాదని తేలింది. ఆరోగ్య పరమైన విషయాలు, వ్యక్తి, వయసు, సమాజం, ఆహారవు అలవాట్లు తదితరాలను ఆధారం చేసుకొని ఉంటాయని.. వీటిని సరిగ్గా నిర్దారించాలంటే స్థానిక వైద్యులను సంప్రదించడమే సరైన మార్గమని ఆ అధ్యయన కర్తలు సూచించారు. ప్రతి చిన్న ఆనారోగ్య సమస్యనూ గూగుల్‌ చేయడం  సరికాదని చెబుతున్నారు. ఒకప్పుడు ఏదైనా కొత్తది కొంటే చుట్టుపక్కల వాళ్లకు మాత్రమే  చెప్పేవాళ్లు. సామాజిక అనుసంధాన వేదికలు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తది ఏది కొన్నా ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇలా అతిగా పోస్ట్‌ చేయడం అనర్థమేనంటున్నారు నిపుణులు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లను ఎక్కువగా ఫాలో అవడం. ఎక్కువ పోస్ట్‌లు పెట్టడం చేయడం, తమ పోస్ట్‌లకు ఎక్కువ లైక్‌లు ఆశించడం వంటి తీరు వల్ల 'టూ మచ్‌ ఇన్ఫర్మేషన్‌ సిండ్రోమ్ అనే మానసిక రుగ్మత బారినవడే అవకాశముందని నివుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్‌ అడిక్షన్‌ అంటే!

అంతర్జాలంలో ఎక్కువగా విహరించడాన్ని ఇరటర్నెట్‌ అడిక్షన్‌ అని అనుకుంటారు. వాస్తవానికి అది కాదు. ఇంటర్నెట్‌ పై అతిగా ఆధారపడటం, అది లేకుంటే ఉండలేకపోవడమే అంతర్జాల వ్యసనం. ఈ రోజుల్లో ఫోన్‌, ఇతర వరికరాల ద్వారా అన్ని వేళలా అంతర్జాలం అందుబాటులో ఉంది. అవసరం కొద్దీ ఎక్కువ మంది ఇరటర్నెట్‌ చూస్తుంటారు. ఇది సాధారణరము. కానీ కొందరు అవసరం లేకున్నా.. అసలు ఏం చూడాలో తెలియకున్నా నెట్‌లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఇది క్రమంగా వ్యసనంగా తయారవుతుంది.

అంతర్జాల వ్యసనం తెచ్చిపేట్టే సమస్యలు

 • ఏకాగ్రత లేమి
 • పనిలో నాణ్యతాలోపం
 • పని చేసే శక్తి సన్నగించడం
 • వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తగ్గడం
 • ఒంటరితనం, ఆందోళన, మానసిక ఒత్తిడి
 • నిద్రలేమి, ఊబకాయం
 • సమయానికి తిండి తినకపోవడం
 • వ్యాయామం లేకపోవడం
 • అధిక ధూమపానం, మద్యపానం
 • వ్యక్తి జీవగడియారం వ్రభావితమవడం
 • జీవక్రియలో మార్పులు
 • ఆన్‌లైన్‌ సంబంధాల వల్ల కొత్త సమస్యలు
 • నేరపూరిత ప్రవర్తన
 • వ్యాధినిరోధక శక్తి తగ్గడం

వ్యసనానికి గురిచేసేవి

 • గేమింగ్‌
 • జూదం
 • అశ్లీల సైట్లు
 • సైబర్‌ వేధింపులు
 • సైబర్‌ సంబంధాలు

అన్నింటికన్నా గేమింగ్‌, సైబర్‌ వేధింపులు, సంబంధాలు వ్రమాదకరంగా మారుతున్నాయి. ఈ వలలో చిక్కుకొని చాలా మంది ప్రాణాల మీదకూ తెచ్చుకొంటున్నారు. పదే పదే వెబ్‌ విహారం, అశ్లీల సైట్లను చూడటం, అసభ్యకర ఛాటింగ్‌ తదితరాల వల్ల కూడా ఎక్కువ మంది అంతర్జాలానికి వ్యసన పరులవుతున్నారు.

వ్యసనపరుడిని గుర్తించేదెలా!

 • నెట్‌ సమయంపై నియంత్రణ లేకపోవడం
 • నెట్‌ను తొలగించినవుడు వ్యవహారశైలిలో మార్పులు
 • ఆందోళన, మానసిక ఒత్తిడి వెరగడం
 • వ్రతి చిన్న విషయానీకీ నెట్‌పై ఆధారపడటం
 • నెట్‌ చూడటాన్ని మాన్పిస్తే చికాకు, ఒత్తిడి
 • వ్యక్తి దిన చర్యలో తేడాలు
 • నిద్రలేమితో బాధపడటం

ఈ సమస్యలున్న వారు అంతర్జాలానికి బానిస అయినట్టే. ఇలాంటి వారిని వీలైనంత త్వరగా ఆ వ్యసనం నుంచి బయటకు తీసుకురావాలి. ఇందుకు నిపుణులతో కౌన్సెలింగ్‌, వారికి ఉత్తేజం కలిగించే ఇతర ఆటలు, చర్యలపై దృష్టిని మళ్లించడం తదితరాలు చేయాలి. లేకుంటే క్రమంగా వారు అనారోగ్య సమస్యలు తెచ్చుకొనే వ్రమాదముంటుంది.

 • అమెరికా, ఐరోపా దేశాల్లో వ్రస్తుతం 18.25 శాతం మంది నెటిజన్లు అంతర్జాల వ్యసనంతో సతమతమవుతున్నారు. ఒక్క చైనాలోనే 2.5 కోట్ల మంది గేమింగ్‌ అడిక్షన్‌తో బాధపడుతున్నారు.
 • దక్షిణ కొరియాలో 24 శాతం మంది గేమ్స్ ను ఆడేవారు ఆటే వ్యసనంగా మారి ఆసుపత్రి పాలవుతున్నారు.
 • మాస్కోలో 17 ఏళ్ల యువకుడు 22 రోజులపాటు ఏకధాటిగా గేమ్స్ ఆడి చివరకు మృతి చెందాడు.
 • పది మందిలో ముగ్గురు ఫోన్‌ వినియోగదారులు నిద్రలేచింది మొదలు పడుకొనేదాకా ఫోన్‌ వదలడం లేదు.
 • సగం మందికివైగా రోజూ 50 సార్లు తమ చరపాణులను చెక్‌ చేస్తున్నారు.
 • వ్రయాణంలో, విధుల్లో, ఎదురుగా స్నేహితులున్నా 60% మరది చరవాణులను వాడుతున్నారు.

వ్రభావితమయ్యేవారు - నియంత్రణ మార్గం

 • వ్యసనాల చరిత్ర ఉన్న కుటుంబాలు.
 • మద్యపానం, డ్రగ్స్‌, పొగతాగేవారున్న కుటుంబాల్లో పిల్లలు
 • ఇవ్పటికే మానసిక సమస్యలున్న వారు
 • ఆందోళన, ఒత్తిడి ఎక్కువున్నవారు.
 • వ్యక్తిత్వలోవం ఉన్నవారు
 • భావవ్యక్తీకరణ లోపం, నలుగురిలో కలవలేకపోవడం తదితర సమస్యలతో బాధపడేపారు.
 • అంతర్జాలాన్ని చూసే వారందరూ దానికి బానిసలు కారు. కాకుంటే పైన వేర్కొన్న సమస్యలున్న వారు వ్యసనపరులయ్యే వ్రమాదం ఎక్కువ. ఆందోళన, ఒత్తిడి, వ్యక్తిత్వ సమస్యలున్నవారు ఇతరులతో మేరుగైన సంబంధాలు నిర్వహించలేరు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇలాంటి వారు ఎక్కువగా నెట్‌ పై ఆధారవడి వర్చువల్‌ రిలేషన్స్‌ని కోరుకుంటారు. ఇందులో భాగంగా క్రమంగా నెట్‌కి బానిసలవుతారు.
 • పిల్లలు నెట్‌లో ఏమి చేస్తున్నారు.. ఏమి చూస్తున్నారో తప్పకుండా నిఘా ఉంచాలి. పరిమితి మించినా.. నెట్‌లేకున్నా ఉన్నా.. ఉండలేకున్నా వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి
 • గేమింగ్‌ సమస్యగా మారుతోంది. గంటల తరబడి ఈ ఆటలు ఆడుతూ చనిపోతున్నారు కూడా. ఎవరికైనా సరే ఆన్‌లైన్‌లో గేమింగ్‌ను పరిమితం చేయాలి. బయట ఆడుకోమని చెప్పాలి
 • అసలు నెట్‌లో ఏం చేయాలనుకున్నారు.. ఎందుకు వినియోగించాలో స్పష్టత ఉంటేనే బ్రౌజర్‌ ఓవెన్‌ చేయడం మంచిది.
 • ఇంట్లో పిల్లలు నెట్‌ను పరిమితికి మించి వినియోగిస్తుంటే వారిని ఆటలు, వ్యాయామం, ఇతర అంశాల వైపు  మళ్లించాలి. ఇంట్లో కంప్యూటర్‌ను హాల్లోనే అందరికీ కనిపించేలా ఉంచాలి.
 • బ్రౌజింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తుంటే.. మాన్పించాలి.
 • చిన్నారులను గ్యాడ్జెట్స్‌కి, ఆన్‌లైన్‌ గేమ్స్ కి అలవాటు చేయవద్దు.

''మానసిక ఒత్తిడి, ఆందోళన, భావవ్యక్తీరణ లేమి తదితర సమస్యలతో బాధపడుతున్న వారు నెట్‌ వల్ల కాస్త రిలీప్ గా భావిస్తారు. కాని తర్వాత ఇదే వారిని క్రమంగా మరింత వ్రమాదంలోకి నెట్టేస్తుంది. వర్చువల్‌ ప్రపంచంలో (నెట్‌) నుంచి బయటపడలేక మానసిక సమస్యలు మరింత పెరుగుతాయి. దీంతో వారు బయట కంటే వర్చువల్‌ ప్రపంచమే  బాగుందనుకుని క్రమంగా దానికి బానిసలైపోతారు. ప్రస్తుతం మా వద్దకు కౌన్సెలింగ్‌ కోసం నిత్యం కొంత మంది నెట్‌ వ్యసనపరులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది టీనేజర్లే ఉంటున్నారు. మద్యపానం, ఇతర మత్తువదార్థాలకు బానిసలైతే తలెత్తే సమస్యలే నెట్‌ వ్యసనవరులకూ వచ్చే వీలుంది. అందువల్ల నెట్‌ను అవసరం మెరకే వినియోగించుకోవాలి. అతిగా ఆధారపడటం తగ్గించుకుని.. భౌతిక చర్యలవట్ల ఆసక్తి పెంచుకోవాలి.''

వ్యాసకర్త :అసిస్టెంట్‌ ప్రొపెసర్‌ ఆప్ సైక్రియాట్రి సెంటర్‌ ఫర్‌ అడిక్షన్‌ మెడిసిన్‌, బెంగళూరు.

ఆధారము: ఈనాడు

3.09333333333
సయ్యద్ బాషా Jul 29, 2018 10:59 AM

మీరు రాసిన విషయాలు చాల ఉపయోగకరంగా ఉన్నాయ్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు