హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్

జ్ఞానము మరియు నైపుణ్యాలు ఒక దేశ ఆర్థిక వృద్ధిని మరియు సామాజిక అభివృద్ధిని నడిపించే శక్తులు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మొత్తం శ్రామిక బలంలో అక్కడ నైపుణ్యం ఉన్న కార్మికుల శాతం 60% నుంచి 90% మధ్య ఉంటుంది.

జ్ఞానము మరియు నైపుణ్యాలు ఒక దేశ ఆర్థిక వృద్ధిని మరియు సామాజిక అభివృద్ధిని నడిపించే శక్తులు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మొత్తం శ్రామిక బలంలో అక్కడ నైపుణ్యం ఉన్న కార్మికుల శాతం 60% నుంచి 90% మధ్య ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా భారతదేశం అధికారిక రికార్డుల ప్రకారం 5%. వృత్తి నైపుణ్యాల శ్రామిక (20-24 సంవత్సరాలు) బలం ఉంది.

ప్రాముఖ్యతను తెలుసుకోవడంతో, 20 మంత్రిత్వశాఖలు/విభాగాలు దేశంలో నైపుణ్యాల అభివృద్ధికి 70 కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తున్నాయి. నైపుణ్య అభివృద్ధి మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ జూలై 15, 2015 న జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ను ప్రారంభించింది. నైపుణ్య శిక్షణ కార్యకలాపాల పరంగా వివిధ రంగాలను మరియు రాష్ట్రాలను కలపడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నైపుణ్య ప్రయత్నాలను ఏకీకృతం మరియు సమన్వయం చేయటమే కాకుండా అన్ని రంగాల్లో ప్రమాణాలతో నైపుణ్యాలను వేగవంతం చేయటం లక్ష్యం.

మిషన్ ప్రకటన

ఎండ్ టు ఎండ్, ఫలితాలపై దృష్టి పెట్టిన అమలు విధానాన్ని భారత దేశంలో సుశిక్షితులైన వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం దీని ఉద్ధేశం. దీని వలన ఉద్యోగాలకు నైపుణ్యం గల పనివారి ఆవశ్యకతను పూర్తిచేయవచ్చు మరియు భారతదేశ ప్రజలు సరైన జీవనాన్ని గడిపేలా చర్యలు తీసుకోవచ్చు.

మిషన్ లక్ష్యాలు

మిషన్ కోరు కొనేది

 1. నైపుణ్యం అభివృద్ధి చేయటం కోసం ఒక ఎండ్ టు ఎండ్ అమలు ఫ్రేమ్ వర్కును సృష్టించండి, ఇది జీవితకాల అభ్యాసానికి అవకాశాలను అందిస్తుంది. ఇందులోని ముఖ్యాంశాలు: పాఠశాల పాఠ్య ప్రణాళికలో నైపుణ్యాలను చేర్చటం, శిక్షణార్థులకు వృత్తిలో పురోగతి భరోసా ద్వారా నాణ్యమైన దీర్ఘ మరియు స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కల్పించటం మరియు లాభకరమైన ఉపాధి కల్పించడం.
 2. యజమాని/పరిశ్రమ డిమాండ్ మరియు శ్రామిక ఉత్పాదకత ప్రణాళికను సృష్టించడం ద్వారా శిక్షణార్థుల స్థిరమైన జీవన ఆకాంక్షలు నెరవేరేలాగా చూడటం.
 3. జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలతో దేశంలో నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయాలి. దీనిని అన్ని మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలు మరియు ప్రైవేట్ శిక్షణ ప్రొవైడర్లకు వర్తించే నైపుణ్య నాణ్యత హామీ ఫ్రేమ్ వర్కులో చేయాలి.
 4. క్లిష్టమైన అవ్యవస్థీకృత రంగాల్లో (నిర్మాణ రంగం లాంటివి, ఎక్కడైతే తక్కువ నైపుణ్య శిక్షణ అవకాశాలు ఉంటాయో) నైపుణ్యాల అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు మరియు పరివర్తన గుర్తించిన రంగాల్లో తిరిగి నైపుణ్యాలపెంపు చేయటం ద్వారా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన.
 5. తగినంత, అధిక నాణ్యత ఎంపికలతో దీర్ఘకాలిక నైపుణ్యాలను నిర్ధారించండి, ఇది అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన అర్హతల ప్రామాణికతలకు సమానంగా ఒక అత్యంత నైపుణ్య కార్మికుల సృష్టికి దోహదం చేస్తుంది.
 6. అధిక నాణ్యత ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా నైపుణ్య అభివృద్ధి పర్యావరణ వ్యవస్థలో నాణ్యమైన బోధనా/శిక్షకుల ఒక నెట్వర్క్ అభివృద్ధి చేయాలి.
 7. ఇప్పటికే ఉన్న ప్రజా మౌలిక మరియు పరిశ్రమ సౌకర్యాలలో నైపుణ్య శిక్షణ మరియు సామర్థ్యాల నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలి.
 8. ప్రపంచ ఉద్యోగ అవసరాలకు సరిపోయే బెంచ్ మ్యాప్ నిర్దిష్ట కార్యక్రమాల ద్వారా విదేశీ ఉపాధికి ఉపయోగపడే కార్యక్రమాలను పెంపొందిచాలి.
 9. క్రెడిట్ బదిలీ వ్యవస్థ ద్వారా, వృత్తి శిక్షణ వ్యవస్థ మరియు నియత విద్యా వ్యవస్థల మధ్య పరివర్తన కోసం దారులను ప్రారంభించాలి.
 10. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/స్టేట్స్/అమలు ఏజన్సీల నైపుణ్య అభివృద్ధి ప్రయత్నాల మధ్య సహ సమన్వయ ప్రచారం జరగాలి.
 11. లక్ష్యిత నైపుణ్య అభివృద్ధి కార్యకలాపాల ద్వారా సమాజంలో బలహీన మరియు వెనుకబడిన వారికి సహాయం చేయాలి.
 12. ప్రచారాల ద్వారా నైపుణ్య శిక్షణ విలువ గురించిన సామాజిక అవగాహన కల్పించటం ద్వారా యువతను ప్రేరేపించాలి.
 13. లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (LMIS) గా పిలవబడే ఒక జాతీయ డేటాబేస్, నిర్వహించండి. దేశంలో డిమాండ్ మరియు నైపుణ్యం ఉన్న కార్మికుల సరఫరా పెంచడం కోసం ఒక పోర్టల్ వలె ఇది పని చేస్తుంది. LMIS ఒకవైపు దేశ వ్యాప్తంగా నైపుణ్య కార్యక్రమాల ముఖ్య సమాచారాన్ని పౌరులు అందిస్తుంది. ఇంకోవైపు, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల పనితీరు పర్యవేక్షణ అమలు కోసం ఒక వేదికగా వ్యవహరిస్తుంది./li>

మిషన్ వ్యూహం

 • జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ ప్రారంభంలో దాని పరిధిలోకి ఏడు ఉప మిషన్లను కలిగి ఉంటుంది. ప్రతి ఉప-మిషన్ మొత్తం లక్ష్యాలను సాధించడానికి ఒక నిర్మాణ బ్లాకుగా పనిచేస్తుంది. ఉప మిషన్ ముఖ్య మైన పనులు:
  • దీర్ఘ కాల మరియు స్వల్పకాలిక నైపుణ్య అవసరాలకు ఇప్పటికే ఉన్న సంస్థాగత శిక్షణ ముసాయిదా పునరుద్ధరించడం మరియు కొత్త సంస్థలను స్థాపించటం.
  • క్ష్యేత్ర నిర్దిష్ట నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం
  • ఇప్పటికే ఉన్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ఒకటిగా ఉపయోగించటం
  • శిక్షకుల శిక్షణపై దృష్టి పెట్టడం
  • విదేశీ ఉపాధి సులభతరం చేయటం, మరియు
  • స్థిరమైన జీవనోపాధి ప్రచారం.

  సబ్ మిషన్స్

  నైపుణ్య సబ్ మిషన్: సంస్థాగత శిక్షణ

  లక్ష్యాలు
 • పరిమాణం, నాణ్యత మరియు శిక్షణ సదుపాయం ఫలితాల అందుబాటు నడపటం.
 • విద్యా అర్హతలు మార్కెట్ జాబ్ లకు సమాంతర ఉండేలా చూడటం.
 • డిమాండుకు తగిన, ఫలిత ఆధారిత అధిక ఉద్యోగ రేట్లు పొందే లక్ష్యంతో శిక్షణ.
 • ఐటిఐ, ఏటిఐ వంటి ఇప్పటికే ఉన్న శిక్షణ సంస్థలను ఆధునీకరించటం. DDG (శిక్షణ) కింద పరిశ్రమ డిమాండుకు తగిన విధంగా మరింత బాధ్యతాయుతంగా చేయడం.
 • ప్రత్యేకంగా ఉన్న సంస్థలకు సంబంధించిన ఐదు కీలక ప్రాంతాల్లో సంస్కరణలపై దృష్టి,
  • కర్రిక్యులం వశ్యత,
  • శిక్షణ పరికరాలు మరియు కార్ఖానాలు,
  • బోధన,
  • ఇండస్ట్రీ ఇంటర్ఫేస్, మరియు
  • ఆర్థిక నమూనా.
 • అప్రంటిస్షిప్ ద్వారా శిక్షణతో పాటు సంపాదన అవకాశాలు కల్పన.
 • వృత్తి శిక్షణ గురించి ప్రజలు దృష్టికోణాన్ని మార్చడానికి మరియు దీర్ఘకాల కెరీర్ పురోగతి అవకాశాలు తో నైపుణ్యం అభివృద్ధి చేయడం.

నైపుణ్యం సబ్ మిషన్: ప్రాథమిక సౌకర్యాలు

లక్ష్యాలు
 • మౌలిక సదుపాయాల రంగంలో సామర్థ్యాన్ని, నిర్మాణ రంగంతో సహా, అధిక నాణ్యత నైపుణ్య అభివృద్ధి నిర్ధారించటం. దీని వలన ఈ రంగంలోని కార్మికుల ఉత్పాదకత పెరుగుతుంది.
 • వచ్చే ఐదేళ్లలో నిర్మాణ రంగం లో పనికి అదనంగా 31 మిలియన్ శ్రామికుల అవసరం అంచనాను చేరుకోయటం.
 • ఈ రంగం లో RPL మరియు అప్-స్కిల్లింగ్ ద్వారా దీర్ఘకాల స్థిరమైన జీవనోపాధి అవకాశాన్ని ఇప్పటికే ఉన్న కార్మికులకు అందించటం.

నైపుణ్యము సబ్ మిషన్: అభిసరణ (కన్వర్జెన్స్)

లక్ష్యాలు
 • దేశంలోని వివిధ వాటాదారుల నైపుణ్య అభివృద్ధి ప్రయత్నాల ఏకీకరణ మరియు సమన్వయం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభాగాలు, ప్రైవేటు శిక్షణ అందించేవారు, అంచనా ఏజెన్సీలు, పరిశ్రమ సంస్థలు, మరియు కార్మికులు.

నైపుణ్యము సబ్ మిషన్: శిక్షకులకు

లక్ష్యాలు
 • దేశవ్యాప్తంగా సంస్థల శిక్షణ బోధన మొత్తం నాణ్యతను మెరుగుపరచడం.
 • భారతదేశం అంతటా ప్రతి రంగం మరియు భౌగోళిక ప్రాంతంలో శిక్షకుడికి అవసరమైన శిక్షణ అవసరాలు తీర్చడం.
 • నైపుణ్యాలలో శిక్షకులకు తగిన లభ్యత నిర్ధారించడం.
 • దీర్ఘకాల కెరీర్ పురోగతి మార్గాల శిక్షకులను అందించడం.

నైపుణ్యము సబ్ మిషన్: విదేశీ ఉపాధి

లక్ష్యాలు
 • భారతదేశంలోని యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడానికి, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ నిర్ధారించాలి.
 • విదేశాల్లో ఉపాధి అవకాశాల గురించిన సమాచారాన్ని అందించడం మరియు వాటిని కావలసిన వారికి అందుబాటులో ఉంచటం.
 • దేశంలో నైపుణ్యం గల పనివారి విదేశాలకు పంపటం

నైపుణ్యము సబ్ మిషన్: స్థిర జీవనం

లక్ష్యాలు
 • నైపుణ్య శిక్షణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా శిక్షణార్థుల దీర్ఘ -కాల స్థిర జీవనోపాధి మార్గాన్ని అందించడం.

నైపుణ్యము సబ్ మిషన్: ప్రజా మౌలిక పరపతి

లక్ష్యాలు
 • భారతదేశం అంతటా నైపుణ్య అభివృద్ధి ప్రయత్నాలు పెంచడానికి ఉన్న ప్రజా మౌలిక సదుపాయాలను వాడుకను పెంచటం

ఫైనాన్సింగ్

మిషన్ కింద నైపుణ్య కార్యకలాపాల అమలు వివిధ పథకాల బడ్జెట్ నిబంధనల ప్రకారం ఉంటుంది. మిషన్ పరిపాలనా ఖర్చులు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ బడ్జెట్ నుండి తీసుకుంటారు.

మిషన్ పూర్తి వివరాలు పొందడానికి, ఇక్కడ క్లిక్కు చేయండి.

మూలం: స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వశాఖ

3.03389830508
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు