పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సందర్శకుల బోర్డు ప్రాముఖ్యత

ఈ విభాగంలో సందర్శకుల బోర్డు (Board of Visitors) ప్రాముఖ్యత గురించి వివరించబడింది.

వివిధ రంగాలలోని అధికారులపై ;అవసరమైన మార్పులు చేపట్టేలా ఒత్తిడి తేవడానికి తమకు ఎటువంటి అధికారం లేదని అనధికార సందర్శకులు తరచూ భావిస్తారు. విచారణలో ఉన్న ఖైదీల కేసులలో ఆలస్యం డాక్టర్ల నియామకం సమస్యలు పూర్తిగా అధికార సందర్శకుల పరిధిలోకి వస్తాయి. పై పెచ్చు ఈ విషయాలలో సంబంధిత అధికార సందర్శకుల నుండి ఖచ్చితమైన స్పష్టమైన ఆదేశాలు జిల్లా యంత్రాంగంలోని క్రింది స్థాయి అధికారులపై ఒత్తిడిని పెట్టి సరియైన చర్యలు తీసుకునేలా చేయగలవు.

కాని, అధికార సందర్శకులకు ఉండే ఇతర బాధ్యతల వల్ల వారు తరచూ జైలును సందర్శించి, సమస్యలను కూలంకుషంగా తెలుసుకొనే పరిస్థితుల్లో ఉండరు. అందువల్ల అధికార సందర్శకులకు కళ్ళుగాను, చెవులుగాను వ్యవహరించగలవారిగా అనధికార సందర్శకుల పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. అధికార, అనధికార సందర్శకుల మధ్య నెలక్కొనే అర్ధవంతమైన సహాకారంలోనే జైళ్ళ వ్యవస్థను మార్చ గల గొప్ప శక్తిఉంది.

ఈ రెండు రకాల సందర్శకుల మధ్య సమన్వయం సాధించడానికి జిల్లా కలెక్టరు ప్రతి జైలుకు సందర్శకుల బోర్డునొకదాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ జైళ్ళ రూల్ 28(1) చెపుతోంది.

సందర్శకుల బోర్డు (Board of Visitors)ఏర్పాటు

 • అన్ని కేంద్ర కారాగారాలకు, జిల్లా జైళ్ళకు సందర్శకుల బోర్డు ఉంటుంది. ప్రతి జైలుకు చెందిన ప్రతి అధికార, అనధికార సందర్శకుడే కాక, ఎక్స్ అఫిషియో నాన్ అఫిషియల్ విజిటర్స్ అయిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా సందర్శకుల బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఈ బోర్డుకు జిల్లా కలెక్టరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

సందర్శకుల బోర్డు విధులు

 1. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావడం
 2. జైలు పరిస్థితులను పరిశీలించడం
 3. ఈ బోర్డు జైలులో సమావేశం కావాలి. ఖైదీలతో మాట్లాడి ఫిర్యాదులను, మహాజర్లను స్వీకరించాలి. ఖైదీలకు భోజనం సరిగా వండారా లేదా అని, మంచి ఆహారం ఇస్తున్నారా లేదా అని పరిశీలించాలి .
 4. మహిళా ఖైదీలను ఉంచే వార్డులోకి  సందర్శకుల బోర్డు సామూహికంగా ప్రవేశించి పరిస్థితులను పరిశీలించవచ్చు.
 5. ఖైదీల సమస్యలకు, ఫిర్యాదుల పరిష్కారానికి సూచనలు, సిఫారసులు
 6. సరికొత్త సంస్కరణల కార్యక్రమాలను రూపొందించడంలో జైళ్ళ యంత్రాంగానికి తోడ్పడడం

అనధికార సందర్శకులకు సి హెచ్ ఆర్ ఐ (CHRI) సూచనలు

 • సందర్శకుల బోర్డు సమావేశాలు తరచుగా జరగకపోతే అనధికార సందర్శకులు తామే ఒక సంఘంగా ఏర్పడి, జిల్లా కలెక్టరును కలిసి బోర్డు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరాలి. ఆంధ్రప్రదేశ్ జైళ్ళ రూల్ 28 (1) ప్రకారం ఇది కలెక్టరు బాధ్యతే కాక, ఇలాంటి సమావేశాలు అన్ని రకాల సందర్శకుల  మధ్య మెరుగైన సహాకారాన్ని, సమన్వయాన్ని, సంభాషణను పెంపొందించగలదనేది వారి దృష్టికి తేవాలి.
 • జైలులోని సమస్యలను అక్కడికక్కడే పరిశీలించడానికి, జిల్లా కలెక్టరు, లేక సంయుక్త జిల్లా కలెక్టరు లాంటి వారిని మీతో పాటు జైలును సందర్శించవలసిందిగా కోరండి. జైలు అధికారులతో మాట్లాడి జైలు సమస్యల జాబితాను, వాటికి గల కారణాలను, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను ముందస్తుగా తయారు చేయండి.  ఈ పద్ధతి, సమస్యలను సరిగ్గా గుర్తించడానికే కాక, పరిష్కారాలను సులభతరం చేస్తాయి.
 • సమర్ధవంతంగా పని జరగాలంటే, అనధికార సందర్శకులు సహాకార దృక్పధంతో పని చేయాలి. సభ్యులకున్న నేపధ్యం, నైపుణ్యం, శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జైళ్ళ సమస్యలపై పని విభజన చేసుకోవాలి.ఉదాహరణకు.
 • మీలో న్యాయవాది ఉంటే,విచారణలో ఉన్న ఖైదీల కేసులలో జరుగుతున్న ఆలస్యం, శిక్షపడిన ఖైదీల ముందస్తు విడుదల (premature release), చేసిన పనికి రెమిషన, పేరోల్ , ప్రొబేషన్ పై విడుదల లాంటి చట్టపరమైన విషయాల పై దృష్టి పెట్టవచ్చు.
 • మీ బృందంలో వైద్యులు ఉంటే, వాళ్ళు ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత లాంటి విషయాలపై పనిచేయవచ్చు.
 • మీలో మహిళా సామాజిక కార్యకర్త ఉంటే, స్త్రీల పునరావాస సమస్యల పై దృష్టి పెట్టవచ్చు.
 • మీలో ఉపాధ్యాయులు ఉంటే నిరక్షరాస్య ఖైదీల చదువు, ఖైదీల పిల్లల చదువు విషయాలలో చొరవ చూపవచ్చు.
 • జైళ్ళ ప్రధాన ద్వారం వద్ద సందర్శకుల పేర్లు, చిరునామా, టెలిఫోను నెంబర్లను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలి. ఖైదీల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మిమ్మల్ని సంప్రదించడానికి వీలుగా వాటిని స్థానిక పత్రికలలో ముద్రించేలా చూడండి.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

3.00504201681
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు