పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అసెస్ మెంట్ మరియు ఆడిట్

ఒక పన్ను వ్యవధిలో ఎంత పన్ను చెల్లించాలో చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తనకు తానే అంచనా వేసుకుని, సదరు అంచనాపై సెకన్ 27 ప్రకారం రిటర్న్ సమర్పించాలి.

కింద చెల్లించాల్సిన పన్నును ఎవరు అసెస్ చేస్తారు.?

ఒక పన్ను వ్యవధిలో ఎంత పన్ను చెల్లించాలో చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తనకు తానే అంచనా వేసుకుని, సదరు అంచనాపై సెకన్ 27 ప్రకారం రిటర్న్ సమర్పించాలి.

గ్రహీత వాపసు చేసిన సరుకులపై నమూనా జీఎస్టీ చట్టంలో ఏదైనా నిబంధన ఉన్నదా..?

అవును. నమూనా జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 44 వివరణలో అందుకు ఏర్పాటు ఉన్నది. ఇన్వాయిస్ జారీ అయన ఆరు నెలల లోపల సరఫరాదారుకు గ్రహీత సరుకులను వాపసు చేస్తే సదరు సరఫరాలపై చెల్లించాల్సిన పన్ను అంతకుముందు వాటిపై తీసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో సమానంగా ఉంటుంది. అంటే మాలికంగా సరఫరా జరిగిన తేదీ నుంచి ఆరు మాసాల లోపల గ్రహీత కనుక సరుకులను వాపసు చేస్తే మౌలిక సరఫరా సమయంలో ఎంత లయబిలిటీ ఉండేదో ఆమేరకే పన్ను చెల్లించేలా ఈ నిబంధన ప్రత్యేకించి అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ మౌలిక ఇన్వాయిస్ తేదీకి ఆరు మాసాల తర్వాత సరుకులు వాపసు చేస్తే ఆ రోజు అమల్లో పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

ఏ అనే వ్యక్తి బీ అనే వ్యక్తికి 2017 ఏప్రిల్లో సరుకులు సరఫరా చేశాడు. ఈ సరుకులు బీ ఏకి 2017 జూస్ లో వాపసు చేశాడు. ఆ సరుకులపై ఏ 18 శాతం పన్ను రేటు ప్రకారం చార్జి చేశాడు. 2017 మేలో పన్ను రేటు 18.5 శాతానికి సవరించబడింది. బీ ఏకి వాపసు చేసిన సరఫరాపై ఏ పన్ను రేటు వర్తిస్తుంది.?

18 శాతం.

పన్ను చెల్లింపుదారు తాత్కాలిక ప్రాతిపదికపై ఎప్పుడు పన్ను చెల్లిస్తాడు.?

పన్ను చెల్లింపుదారు స్వీయ అసెస్మెంట్ మేరకు పన్ను చెల్లిస్తాడు. కనుక తాత్కాలిక ప్రాతిపదికపై పన్ను చెల్లించేందుకు అతడు విజ్ఞప్తి చేస్తే సంబంధింత అధికారి నుంచి అందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది. వేరే విదంగా చెప్పాలంటే ఏ పన్ను అధికారి కూడా తనంతట తానుగా తాత్కాలిక పన్ను చెల్లింపునకు ఆదేశించడు. ఈ వ్యవహారం నమూనా జీఎస్టీ చట్టం సెకన్ 44ఏ పరిధిలోకి వస్తుంది. నిర్దిష్టమైన ఆర్డరు ద్వారా తగిన స్థాయి అధికారి అనుమతించిన తర్వాతనే తాత్కాలిక పన్ను చెల్లింపు జరుపవచ్చు. ఇందుకగానూ పన్ను చెల్లింపుదారు లిఖిత పూర్వకంగా తగినస్థాయి అదికారికి తాత్కాలిక ప్రాతిపదికన ఎందుకు చెల్లించాల్సి వస్తుందో వివరిస్తూ, విజ్ఞప్తి చేసుకోవాలి. ఇలాంటి విజ్ఞప్తిని పన్ను చెల్లింపుదారు ఈ దిగువ అంశాలను నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పెట్టుకోవాలి. అవి ఏవంటే,

  • తాను జరపబోయే సరుకులు లేదా సేవల విలువ, లేక
  • తాను జరపబోయే సరుకులు లేదా సేవలకు వర్తించే పన్ను రేటు నిర్దారించడం.

అలాంటి సందర్భాల్లో నిర్దేశిత రూపంలో పన్ను చెల్లింపుదారు బాండ్ మరియు షూరిటీ లేదా సెక్యూరిటీ, సంబంధిత అధికారి నిర్ణయం మేరకు సమర్పించాలి.

అంతిమ అసెస్మెంట్ జరిపేందుకు చివరి గడువు ఏది?

అంతిమ అసెస్మెంట్ ఆర్డరుకు సంబంధిత అధికారి తాత్కాలిక అసెస్మెంట్ పై ఆర్డరు జారీ చేసిన ఆరుమాసాల లోపల ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. అయితే తగిన కారణాలు చూపిన పక్షంలో, వాటిని లిఖిత రూపంలో నమెూదు చేసినట్టయితే, వాటిని తెలిపిన ఆరుమాసాల గడువును,

  1. మరో ఆరుమాసాల వరకు జాయింట్ / అదనపు కమిషనర్ పొడిగించవచ్చు, మరియు
  2. కమిషనర్ తన నిర్ణయం మేరకు పొడిగించవచ్చు.

తాత్కాలిక అసెస్మెంట్ కన్నా అంతిమ అసెస్మెంట్ లో పన్ను లయబిలిటీ అధికంగా ఉంటే పన్ను చెల్లింపుదారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందా..?

అవును. వాస్తవికంగా పన్ను చెల్లించాల్సిన తేదీ నుంచి పన్ను చెల్లించిన తేదీ వరకు అతడు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

నమూనా జీఎస్టీ చట్టం సెక్సస్ 45 ప్రకారం దాఖలు చేసిన రిటర్న్ లో ఏదైనా తేడా వస్తే దానికి తగిన కారణం చూపని పక్షంలో అధికారి ఏరకం చర్య తీసుకుంటారు.?

పన్ను చెల్లింపుదారు తేడాలు ఆమోదించిన తర్వాత 30 రోజుల లోపల (సంబంధింత అధికారి ఈ గడువును పొడిగించవచ్చు) సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదా సబబైన గడువులో దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరుగని పక్షంలో సంబంధింత అధికారి ఈ దిగువ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టవచ్చు.

  1. చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం ఆడిట్ జరిపించవచ్చు
  2. సెక్షన్ 50 ప్రకారం కమిషనర్ ఇందుకు నామినేట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ద్వారా ప్రత్యేక ఆడిట్  జరిపించవచ్చు. లేదా
  3. చట్టంలోని సెక్షన్ 60 ప్రకారం తనిఖీ, సోదా మరియు స్వాధీనతలకు   చర్యలు చేపట్టవచ్చు. లేదా
  4. చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం పన్ను మొత్తం నిర్ధారణకు చర్యలు   చేపట్టవచ్చు.

సెక్షస్ 46 కింద ఆడిట్ జరిపే సందర్భంలో తగినస్థాయి అధికారి పన్ను చెల్లింపుదారుకు ఏదైనా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందా..?

ఈ నిబంధన ఉత్తమతీర్పు అసెస్మెంట్ కిందకు వస్తుంది కనుక పన్ను చెల్లింపుదారుకు ఎలాంటి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

పన్ను చెల్లింపుదారు చట్టం ప్రకారం (సెక్షస్ 27 లేదా 31 కింద) సమర్పించాల్సిన రిటర్న్ ఫైల్ చేయకపోతే సంబంధిత అధికారి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.?

తగినస్థాయి అధికారి ముందుగా ఉల్లంఘనకు పాల్పడిన పన్ను చెల్లింపుదారుకు నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 32 ప్రకారం నిర్ణీత గడువులో, నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 46 ప్రకారం ఇది కనీసం 15 రోజులు, రిటర్న్ ఫైల్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ముందుగా నోటీసు జారీచేస్తారు. ఇచ్చినగడువులో రిటర్న్ ఫైలు చేయడంలో పన్ను చెల్లింపుదారు విఫలమైతే సంబంధింత అధికారి రిటర్న్ సమర్పించని వ్యక్తి యొక్క పన్ను అసెస్ మెంట్ కు, తనకు అందుబాటులో సంబంధిత యావత్తు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం, తన అత్యుత్తమ నిర్ణయం మేరకు చర్యలు చేపట్టవచ్చు. నమూనా జీఎస్టీ చట్టం సెకన్ 46 ప్రకారం ఇందుకు సదరు అధికారికి అధికారాలు కల్పించడమైంది.

అత్యుత్తమ తీర్పు అసెస్మెంట్ ఆర్డరును ఏ పరిస్థితిల్లో ఉపసంపూరించుకుంటారు.?

నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 46 ప్రకారం జారీ చేసిన ఉత్తమ నిర్ణయ ఆదేశాలు సదరు డిఫాల్ట్ గడువుకు సంబంధించి చెల్లుబడి అయ్యే రీతిలో పన్ను చెల్లింపుదారు, ఉత్తమ నిర్ణయ ఆదేశాలు వెలువడిన 30 రోజుల లోపల రిటర్న్ సమర్పించినట్టయితే (అంటే రిటర్న్ దాఖలు చేసి ఆయన అసెస్ చేసిన పన్ను చెల్లించినట్టయితే) సదరు ఆదేశాలు వాటంతట అవే ఉపసంహరించబడతాయి. ప్రశ్న11. సెక్షస్ 46 మరియు 47 కింద ఆర్డరు జారీకి ఉండే కాలపరిమితి ఏమిటి.? జవాబు: సెక్షన్ 46 మరియు 47 కింద ఆర్డరు జారీకి వార్షిక రిటర్న్ ఫైల్ చేయాల్సిన గడువు తేదీకి మూడు లేదా ఐదు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది.

పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోని వ్యక్తి ముందుండే చట్టపరమైన మార్గాలేమిటి.?

నమూనా జీఎస్టీ చట్టం సెకన్ 47 ప్రకారం నిర్ణీత పన్ను గడువులపై తన అత్యుత్తమ నిర్ణయం మేరకు పన్ను లయబిలిటీ అసెస్ చేసి ఆర్డరు జారీ చేయవచ్చు. అయితే పన్ను ఎగవేతకు సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో వార్షిక రిటర్ ఫైల్ చేయాల్సిన గడువు తేదీకి ఐదు సంవత్సరాల లోపల అలాంటి ఆర్డరు జారీ చేయాల్సి ఉంటుంది.

ఏ పరిస్థితుల్లో పన్ను అధికారి తక్షణ అసెస్మెంట్లు చేపట్టవచ్చు?

రెవెన్యూ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ దిగువ సందర్భాల్లో నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 48 ప్రకారం తక్షణ అసెస్మెంట్ కు ఆదేశించవచ్చు.

  • పన్ను చెల్లించాల్సిన ఆవశ్యకతకు సంబంధించిన ఆధారం తగినస్థాయి   అధికారి వద్ద ఉన్నప్పుడు, మరియు
  • తగినస్థాయి అధికారి అసెస్మెంట్ ఆర్డరు జారీలో జాప్యం వల్ల రెవెన్యూ  ప్రయోజనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావించినప్పుడు. సదరు ఆర్డరును అదనపు కమిషనర్ / జాయింట్ కమిషనర్ అనుమతి పొందిన అనంతరం జారీ చేస్తారు.

పన్ను చెల్లింపుదారుకు తక్షణ అసెస్మెంట్ ఆర్డరు విషయంలో అపెలేట్ కు వెల్లడం కాకుండా మరేదైనా పరిష్కార మార్గం ఉందా..?

తక్షణ అసెస్ మెంట్ ఆర్థరు జారీచేయబడిన పన్ను చెల్లింపుదారు సదరు ఆర్డరు అందుకున్న 30 రోజుల లోపల దాని ఉపసంహరణకు ఆ పరిధికి చెందిన అదనపు/జాయింట్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ అధికారి సదరు ఆర్డరు పొరపాటుగా జారీ అయిందని భావిస్తే నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 51 ప్రకారం పన్ను లయబిలిటీని నిర్ధారించాల్సిందిగా తగినస్థాయి అధికారిని ఆదేశించవచ్చు. తక్షణ ఎసెస్మెంట్ ఆర్థరు తప్పుడుగా ఉందని భావించినపక్షంలో స్వయంగా కూడా ఆయన ఈ దిశగా చర్యలు చేపట్టవచ్చు. (నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 48 ప్రకారం).

పన్ను చెల్లింపుదారుపై తక్షణ అసెస్ మెంట్ ఆర్డరు జారీ చేయడం తప్పనిసరిగా అవసరమా..?

లేదు. సరుకులు రవాణాలో ఉండడం లేదా గోదాంలో నిల్వచేసి ఉండడం మరియు సరుకులకు సంబంధించి పన్ను చెల్లింపుదారు గురించి నిర్ధారించుకునే వీలు లేకపోవడం వంటి సందర్భాల్లో అలాంటి సరుకులను తన ఆధీనంలో కలిగి ఉన్న వ్యక్తిని పన్ను చెల్లించాల్సిన వ్యక్తిగా పరిగణించి అసెస్ చేయబడుతుంది. (నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 48 ప్రకారం).

పన్నుచెల్లింపుదార్లపై ఆడిట్ ఎవరు జరుపుతారు.?

నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 49 ప్రకారం తన కమిషనర్ ద్వారా సాధారణమైన రీతిలో లేదా ప్రత్యేకమైన రీతిలో జారీ చేసిన ఆర్డరు మేరకు నియమితుడైన సీజీఎస్టీ లేదా ఎస్జీఎస్టీ అధికారి పన్ను చెల్లింపుదారుపై ఆడిట్ జరుపవచ్చు. ఆడిట్ ఎన్నిసార్లు ఏవిధంగా జరపాలనేది తదనంతర కాలంలో సూచించబడుతుంది.

ఆడిట్ జరిపేందుకు ముందుగా సమాచారం తెలియజేయాల్సి ఉంటుందా..?

అవును. ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. ఆడిట్ నిర్వహించేందుకు కనీసం 15 రోజుల ముందుగా పన్ను చెల్లింపుదారుకు సమాచారం ఇవ్వాలి.

ఆడిట్ ఎప్పటిలోగా పూర్తిచేయాలి..?

ఆడిట్ ను మొదలుపెట్టిన 3 నెలల లోగా లేదా తదుపరి కమిషనర్ అనుమతి మేరకు మరో 6 మాసాల లోగా, పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆడిట్ ప్రారంభ తేదీ అంటే ఏమిటి.?

ఆడిట్ ప్రారంభ తేదీ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మొదలు పెట్టిన తర్వాత నిర్ణీత గడువు లోగా దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆడిట్ మొదలు పెట్టిన తేదీ అనేది ఈ దిగువ తెలిపిన వాటిలో ఏది తర్వాత జరిగితే అది.

  1. ఆడిట్ అధికారులు అడిగినట్టి రికార్డులు / అకౌంట్లు వారికి ఏ తేదీన అందజేస్తే ఆ తేదీ, లేదా
  2. పన్ను చెల్లింపుదారు వ్యాపారస్థలంలో వాస్తవిక ఆడిట్ మొదలైన తేదీ.

ఆడిట్ నోటీసు అందుకున్న పన్ను చెల్లింపుదారు ఏమి చేయాలి..?

పన్ను చెల్లింపుదారు చేయాల్సినవి.

  1. అందుబాటులో ఉన్న లేదా అధికారులు కోరిన అకౌంట్లు / రికార్డులు వారికి అందుబాటులో ఉంచడం,
  2. ఆడిట్ నిర్వహణకు అధికారులు అడిగిన సమాచారాన్ని వారికి సమకూర్చడం,
  3. సకాలంలో ఆడిట్ పూర్తికి వారికి సహకారం అందించడం.

ఆడిట్ పూర్తయన తర్వాత తగినస్థాయి అధికారి చేపట్టే చర్యలేమిటి..?

తగిన స్థాయి అధికారి ఆడిట్ పూర్తయిన వెంటనే తాను నిర్ధారణకు వచ్చిన విషయాల గురించి, వాటికి గల కారణాల గురించి, పన్ను చెల్లింపుదారుకు సదరు నిర్ధారణలకు సంబంధించి ఉండే హక్కుల గురించి,బాధ్యతల గురించి పన్ను చెల్లింపుదారుకు తెలియపర్చాలి.

ప్రత్యేక ఆడిట్ను ఏ సందర్భంలో జరుపుతారు.?

తనిఖీ, దర్యాప్తు మొదలైనవి జరిపే సందర్భంగా కేసు చాలా సంక్లిష్టమైందిగా లేదా రాబట్టాల్సిన రెవెన్యూ మరీ భారీమొత్తంలో ఉండడం వంటి పరిమిత పరిస్థితుల్లో ప్రత్యేక ఆడిట్ జరిపించవచ్చు. నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 5O ప్రకారం ఇందుకు సంబంధించిన అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది.

ప్రత్యేక ఆడిట్ కు  నోటీసు ఎవరు జారీచేస్తారు.?

కమిషనర్ ముందస్తు అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రత్యేక ఆడిట్ నోటీసు జారీ చేస్తారు.

ప్రత్యేక ఆడిట్ ఎవరు జరుపుతారు.?

కమిషనర్ ద్వారా నామినేట్ చేయబడిన చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఈ ఆడిట్ జరుపుతారు.

స్పెషల్ ఆడిట్ నివేదిక సమర్పించేందుకు ఎప్పటివరకు గడువు ఉంటుంది.?

90 రోజుల గడువు లోపల ఆడిటర్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీనిని మరో 90 రోజుల వరకు పొడిగించవచ్చు.

ప్రత్యేక ఆడిట్ ఖర్చు ఎవరు భరిస్తారు.?

రికార్డుల పరిశీలన, ఆడిట్ వ్యయం, ఆడిటర్ కు చెల్లించాల్సిన రుసుముతో సహా, అన్ని ఖర్చులను కమిషనర్ నిర్ణయించి చెల్లిస్తారు.

ప్రత్యేక ఆడిట్ తర్వాత పన్ను అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు.?

ప్రత్యేక ఆడిట్ ఫలితాలు/పరిశీలనల ఆధారంగా, నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 51 ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

3.01769911504
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు