పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఐజీఎస్టీ చట్టం -స్థూల పరిశీలన

ఐజీఎస్టీ చట్టం -స్థూల పరిశీలన

ఐజీఎస్టీ (IGST) అంటే ఏమిటి?

“సమగ్ర వస్తుసేవల పన్ను” (Integrated Goods and Services Tax-IGST) అంటే- అంతరాష్ట్ర (రాష్ట్రాల మధ్య) వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను.

అంతర్రాష్ట్ర సరఫరాలంటే ఏమిటి?

అంతరాష్ట్ర వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరా అంటే- సరఫరాదారు ఉన్న ప్రదేశం, సరఫరాచేసే ప్రదేశం వేర్వేరు రాష్ట్రాల్లో ఉండటం (సెకన్లు 3(1), 3 (2) ఐజీఎస్టీ చట్టం).

అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాపై వస్తుసేవల పన్ను (GST) చట్టం కింద పన్నును ఎలా విధిస్తారు?

అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ విధించి వసూలు చేస్తుంది. రాష్ట్రాలమధ్య సరఫరా అయ్యే పన్ను విధించదగిన వస్తుసేవలపై సీజీఎస్టీ+ఎస్జీఎస్టీల విస్తృత రూపంగా ఐజీఎస్టీని విధిస్తారు. వస్తుసేవలకు తాను జోడించిన విలువపై అంతర్రాష్ట్ర అమ్మకందారు ఐజీఎస్టీని చెల్లిస్తాడు. దీనికి ముందు ఉత్పాదకాల కొనుగోళ్లపై ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల కింద తాను చెల్లించిన పన్నును సర్దుబాటు (TTC) చేసుకుంటాడు. ఐజీఎస్టీ చెల్లింపులో వర్తకుడు వినియోగించుకున్న ఎస్జీఎస్టీలోని ఐటీసీ జమను ఎగుమతి చేసే రాష్ట్రం కేంద్రానికి బదిలీ చేస్తుంది. దిగుమతి చేసుకున్నవర్తకుడు తన సొంత రాష్ట్రంలో ఉత్పత్తి పన్ను బాధ్యతను నెరవేర్చే సమయంలో ఐజీఎస్టీకి జమ అయిన ఐటీసీ మొత్తాన్ని కోరుతాడు. ఎస్జీఎస్టీ చెల్లింపులో వినియోగించిన ఐజీఎస్టీలోని ఐటీసీని దిగుమతి చేసుకునే రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేస్తుంది. సదరు వ్యవహారాలను పరిష్కరించే యంత్రాంగంగా పనిచేసే కేంద్రప్రభుత్వ సంస్థకు ఈ సమాచారాన్ని సమర్పిస్తారు. ఈ లావాదేవీలన్నిటిపై క్లెయిములను సదరు సంస్థ పరిశీలించి నిధులు బదిలీ చేయాల్సిందిగా సంబంధిత రాష్ట్రాలకు సమాచారం పంపుతుంది.

ఐజీఎస్టీ ముసాయిదా చట్టంలోని ప్రధానాంశాలేమిటి?

ఐజీఎస్టీ ముసాయిదా చట్టంలో 11 అధ్యాయాలు, 33 విభాగాలు ఉన్నాయి. ఇతర అంశాల్లో భాగంగా వస్తు సరఫరా స్థానాన్ని నిర్ధారించే నిబంధనలను ఈ ముసాయిదా నిర్ణయిస్తుంది. సరఫరా కోసం వస్తువులను రవాణా చేయాల్సినప్పుడు స్వీకరించే వ్యక్తికి అందజేసేందుకు వాటిని చేరవేసిన ప్రదేశమే సరఫరా స్థానం అవుతుంది. సరఫరా చేసే వస్తువులను రవాణా చేయాల్సిన అవసరం లేనప్పుడు స్వీకరించే వ్యక్తికి అందజేసేటప్పుడు అవి ఎక్కడుంటాయో ఆ ప్రదేశమే సరఫరా స్థానమవుతుంది. ఒక చోట వస్తువుల కూర్పు (assembly) లేదా స్థాపన (installation) అవసరమైన పక్షం లో ఆ ప్రదేశమే సదరు వస్తువులకు సరఫరా స్థానమవుతుంది. అంతిమంగా... రవాణాద్వారా సరఫరా చేసే వస్తువులకు వాటిని స్వీకరించే ప్రదేశమే సరఫరా స్థానమవుతుంది.

ఐజీఎస్టీ నమూనా ప్రయోజనాలేమిటి?

ఐజీఎస్టీ నమూనావల్ల ప్రధాన ప్రయోజనాలేమిటంటే:-

 • అంతర్రాష్ట్ర లావాదేవీలలో ఐటీసీ శృంఖలాన్ని  నిరంతరాయంగా నిర్వహించవచ్చు;
 • అంతర్రాష్ట్ర అమ్మకందారు లేదా కొనుగోలుదారుకు ముందస్తు పన్ను  చెల్లింపు,  గణనీయ నిధుల ప్రతిష్టంభన బెడద ఉండదు;
 • పన్ను చెల్లింపులో ఐటీసీ వినియోగంవల్ల ఎగుమతి రాష్ట్రంలో వాపసు కోరాల్సిన అవసరం ఉండదు;
 • స్వీయ పర్యవేకణ నమూనా;
 • సరళమైన పన్ను పాలన యంత్రాంగంతోపాటు తటస్థ పన్నుకు భరోసా;
 • పన్ను చెల్లింపుదారుపై అదనపు భారంలేని, సరళ ఖాతాల నిర్వహణ సామర్థ్యం
 • పన్ను విధానానికి ఉన్నతస్థాయిలో కట్టుబాటువల్ల అత్యధిక వసూళ్ల సామర్ధ్యం. వ్యాపారం-వ్యాపారం మధ్య, వ్యాపారం వినియోగదారు మధ్య లావాదేవీల నిర్వహణ సామర్ధ్యం.

జీఎస్టీ కింద దిగుమతి/ఎగుమతులపై పన్ను ఎలా విధిస్తారు?

జవాబు: జీఎస్టీ (ఐజీఎస్టీ) విధింపునకు అన్ని దిగుమతులు/ఎగుమతులను అంతర్రాష్ట్ర సరఫరాలుగా పరిగణిస్తారు. సంభావ్య పన్ను విధింపు నిమిత్తం గమ్యం సూత్రాన్ని అనుసరిస్తారు. అంటే ఎస్జీఎస్టీ విషయంలో దిగుమతి చేసుకున్నవస్తువులు వినియోగించే రాష్ట్ర ఖాతాలోకి పన్ను రాబడి వెళుతుంది. దిగుమతి చేసుకున్న వస్తుసేవలపై చెల్లించిన ఐజీఎస్టీలో ఐటీసీ సదుపాయం ఉంటుంది గనుక సంపూర్ణ లబ్ది చేకూరుతుంది (ఐజీఎస్టీ చట్టంలో సెక్షన్ 2 (సి)).

ఐజీఎస్టీ అతి తక్కువ నిర్వచనాలతో కూడిన చాలా చిన్న చట్టమేగాక ఇందులో అధికభాగం పరిష్కార కమిషనర్ పరిధికి పరిమితం. మరి సీజీఎస్టీ లేదా ఎస్జీఎస్టీ చట్టాల నిబంధనలు దీనికి వర్తిస్తాయా?

వర్తిస్తాయి. ఐజీఎస్టీలోని సెక్షన్ 27 ప్రకారం అందులోని నిబంధనలు సీజీఎస్టీ చట్టం కింద పన్ను విధింపునకు వర్తించే నిబంధనల తరహాలోనే ఐజీఎస్టీ చట్టానికీ వర్తిస్తాయి.

ఐజీఎస్టీ చెల్లించే విధానమేమిటి?

ఐటీసీని వినియోగించుకోవడం ద్వారా లేదా నగదు రూపేణా ఐజీఎస్టీని చెల్లించవచ్చు. అయితే, ఐజీఎస్టీ చెల్లింపు కోసం ఐటీసీ వినియోగ క్రమం కిందివిధంగా ఉంటుంది:-

 • ఐజీఎస్టీలో తొలుత అందుబాటులోకి వచ్చిన ఐటీసీని ఐజీఎస్టీ చెల్లింపులో వినియోగించుకోవాలి;
 • ఐజీఎస్టీలోని ఐటీసీని సరిపెట్టిన తర్వాత సీజీఎస్టీ కిందగల ఐటీసీని వినియోగించుకోవాలి;
 • ఈ రెండు ఐటీసీలను సర్దుబాటు చేసుకున్న అనంతరం మాత్రమే ఎస్జీఎస్టీ కిందగల ఐటీసీని వాడుకునే వెసులుబాటు వర్తకుడికి లభిస్తుంది.
 • అటుపైన కూడా ఐజీఎస్టీ చెల్లింపు బాధ్యత మిగిలి ఉంటే మాత్రమే నగదు రూపేణా చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. మినహాయింపు (ఐటీసీ)ల వినియోగంద్వారా ఐజీఎస్టీ చెల్లింపు నిర్వహణకు జీఎస్టీ వ్యవస్థ భరోసా ఇస్తుంది.

కేంద్రం, ఎగుమతి/దిగుమతి రాష్ట్రాల మధ్య పరిష్కారం ఏ విధంగా చేస్తారు?

కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిష్కారం కింద పేర్కొన్న రెండు పద్ధతులలో ఉంటుంది:-

 • కేంద్రం - ఎగుమతి రాష్టం: సరఫరాదారు వినియోగించుకున్న ఎస్టీఎస్టీలోని ఐటీసీకి సమానమైన మొత్తాన్ని ఎగుమతి రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తుంది.
 • కేంద్రం - దిగుమతి రాష్ట్రం: రాష్ట్రంలోపల సరఫరాలపై ఎస్టీఎస్టీ చెల్లింపు సందర్భంగా వర్తకుడు వాడుకున్న ఐజీఎస్టీలోని ఐటీసీకి సమానమైన మొత్తాన్ని కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది.

పరిష్కార వ్యవధిలో వర్తకులందరూ సమర్పించే వివరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత సంచిత ప్రాతిపదికన పరిష్కారం జరుగుతుంది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ ఖాతాల విషయంలోనూ పరిష్కారం ఇదే తరహాలో ఉంటుంది.

ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

2.97424892704
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు