హోమ్ / వ్యవసాయం / పశు సంపద / దేశీయ ఆవుల సంరక్షణ మనందరి కర్తవ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దేశీయ ఆవుల సంరక్షణ మనందరి కర్తవ్యం

దేశీయ పాడి పశుజాతుల వివరాలు

మన దేశంలో దేశీయజాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు, ఎఫ్.ఎ.ఒ సుమారు 61 జాతులను అంచనా వేయగా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెన్టిక్ రిసోరెన్స్ సంస్థ 40 పశుజాతులను గుర్తించింది. దేశీయజాతి పశువులు మనకు తరతరాలనుండి సంక్రమించిన జన్యుసంపద. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి, తక్కువ ఖర్చుతో పోషించగలిగే, దేశీయ జాతి ఆవులు సేంద్రియు వ్యవసాయానికి వెన్నుముకలాంటివి. అందువల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యం మనందరిపై ఉంది. పాడికి ప్రసిద్ధి చెందిన వివిధ దేశీయ పశుజాతుల గురించి తెలుసుకుందాం.

గిర్

daoneమన దేశంలోని దేశీయ ఆవుల్లో పాడికి ప్రసిద్ధి చెందిన ఆవులు గిర్జాతి ఆవులు. గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ కథియావార్ గిర్ అడవులు ఈ జాతి పశువుల పుట్టినిల్ల, మహారాష్ట్ర రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోకూడా ఈ ఆవులు కనబడతాయి. గిర్జాతి పశువులను బదావరి, గుజరాతి, కతియవర్, దేసన్, సోర్తి, సురతి మొదలగు పేర్లతో కూడా వ్యవహరిస్తారు.

గిర్ జాతి పశువులు ముదురు ఎరుపు లేదా చాకోలేట్ గోధు మచ్చలు, కొన్నిసార్లు నలుపు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. చర్మం సున్నితంగా ఉంటుంది. వెంట్రుకలు మెరుసూ, పొట్టిగా ఉంటాయి. కొమ్మలు వంగి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. గంగడోలు అభివృద్ధి చెంది ఉంటుంది. తోక పొడవుగా, కొరడాలాగా ఉంటుంది. గిట్టలు మధ్యస్త సైజులో ఉండి, నల్లగా ఉంటాయి. పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.

గిర్ జాతి ఆవులు 45-54 మాసాల్లో మొదటి ఈత ఈనుతాయి. ఈతల మధ్య వ్యవధి 515-600 రోజులుంటుంది. పాడికాలంలో పాల దిగుబడి 1200-1800 కిలోలు ఉంటుంది. ఈ జాతి ఆవులు జూలై నుండి సెప్టెంబర్ మధ్య ఈనుతుంటాయి.

రెడ్ సింధి

datwoమన దేశంలో పాడికి ప్రసిద్ధి చెందిన ఆవుల్లో "రెడ్సింధి జాతి ఆవులుకూడా ముఖ్యమైనవి. పాకిస్థాన్లోని కరాచి, హైదరాబాద్ పుట్టినిల్లు అయినప్పటికీ, ఈ ఆవజాతి దేశమంతా, ఆసియాలోని 33 దేశాలకు విస్తరించింది. ఆ ఆవులను రెడ్కరాచి, సింధి, మహి మొదలగు పేర్లతో పిలుస్తారు.

రెడ్ సింధి ఆవులు ఆకారంలో చిన్నగా ఉంటాయి. రంగు ఎరుపుగా ఉంటుంది. మగ పశువులు, ఆడవాటికంటే ఎక్కువ ఎరుపుగా ఉంటాయి. శరీరంపై ముదురు ఎరుపు నుండి తెలుపు చారల గుర్తులుంటాయి. ఈజాతి ఆవులు యుక్త వయస్సుకు చేరేప్పటికి తోక, పాదాలు, తలవంటి చివరి భాగాలు నలుపుగా మారతాయి. తల ముందు భాగం లావుగా ఉబ్బెత్తుగా ఉంటుంది. కొమ్మలు పైవైపు, వెనుకవైపు తిరిగి ఉంటాయి. మగ పశువులు 134సెం.మీ. ఎత్తు, 420 కిలోల శరీరబరువు, ఆడపశువులు 116 సెం.మీ. ఎత్తు 840 కిలోల శరీర బరువు కలిగి ఉంటూయి.

రెడ్ సింధి ఆవులు 89-50 మాసాల్లో మొదటి ఈత ఈనుతాయి. ఈతల మధ్య వ్యవధి 452-540 రోజులుంటుంది. పాడికాలంలో పాల దిగుబడి 3000 కిలోలకు పైగా ఉంటుంది. పాలలో 9 శాతం ఎసే.ఎన్.ఎఫ్, 5 శాతం వెన్న ఉంటుంది.

సహివాల్

సహివాల్ ఆవులు పాడికి పేరొందిన మంచి దేశీయ జాతి ఆవులు. పాకిస్థాన్ దేశంలోని సహివాల్ జిల్లా (మాంటొగొమెరి) ఈ జాతి ఆవులకు పుట్టినిల్ల, ఉత్తరప్రదేశ్, హర్యానా రాఫ్రాల్లో కూడా కనబడతాయి. ఆఫ్రికా, ఆసియూ, ఆస్టేలియా మొదలగు దేశాలకు ఈ ఆవులు ఎగుమతి చేయబడ్డాయి. లొలా, లాంబిబాల్, మోంటోగొమెరి, ముల్తాని, తెలి మొదలగు పేర్లతో పిలుస్తారు.

మన ఉపఖండంలో శ్రేష్టమైన ఈ జాతి ఆవులు, కండ పుష్టితో భారీగా ఉంటాయి. శరీరం పొందికగా ఉంటుంది. రంగు ఎరుపు గోధుమ లేదా పాలిపోయిన ఎరుపు రంగులో ఉంటాయి. అప్పుడప్పుడు తెల్లటి మచ్చలుంటాయి. చర్మం వదులుగా ఉన్నందున లోలా అని వ్యవహరిస్తారు. పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.

సహివాల్ ఆవులు 37-48 మాసాల్లో మొదటి ఈత ఈనుతాయి. ఈతల మధ్య వ్యవధి 430-580 రోజులుంటుంది. పునరుత్పత్తి సామర్థ్యం 20 సంవత్సరాల వరకు ఉంటుంది. 300 రోజుల పాడికాలంలో సుమారు 3000 కిలోల పాల దిగుబడి ఉంటుంది.

ధియోని

dathreeమహారాష్ట్రలోని మారట్వాడ ప్రాంతానికి చెందిన ధియోని ఆవులు పాడికి ఉపయోగపడతాయి. ఈ జాతి పశువుల్ని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో పెంచుతుంటారు. దొంగర్పట్టి, దొంగరి, వన్నెర, వాగ్హైడ్, బాలనక్య, షెవెర మొదలగు పేర్లతో పిలుస్తారు.

ఈ జాతి ఆవుల తల, చెవులు, కొమ్మలు గిర్ జాతి ఆవులలాగా ఉంటాయి. మధ్యస్థ సైజులో ఉండే ఈ ఆవుల శరీరం రంగు నలుపు, తెలుపు మచ్చలతో కూడి ఉంటుంది. తల ముందు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. కొమ్ములు f,5 పశువులకున్నట్లు ఉంటాయి. చెవులు పొడవుగా ఉంటాయి. చర్మం వెంట్రుకలు పొట్టిగా, సున్నితంగా ఉంటాయి. గిట్టలు నలుపు రంగులో ఉంటాయి. శేరు వేలాడుతుంటుంది.

ధియోనిజాతి ఆవులు మొదటిసారి 30-51 మాసాల్లో సగటున 46 మాసాలకు ఈనుతాయి. ఈతల మధ్య వ్యవధి 447 రోజులుంటుంది. పాల దిగుబడి సగటున 1200-1500 కిలోల వరకు ఒక పాడి కాలంలో ఉంటుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.01204819277
B sampathboddu9908@gmail.com Dec 03, 2019 03:54 AM

తెలంగాణ లొ సహివాల్ ఆవులు ఉన్నాయ , ఎక్కుడ దొరుకుతాయి.మాది వరంగల్ రూరల్, మండలం నెక్కొండ

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు