హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పచ్చిక బయళ్ళకు అనువైన పశుగ్రాస పంటలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పచ్చిక బయళ్ళకు అనువైన పశుగ్రాస పంటలు

పచ్చిక బయళ్ళకు అనువైన పశుగ్రాస పంటలు.

వ్యవసాయానుబంధరంగమైన  పాడి  పరిశ్రమ, మేకల మరియు గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే చెకగా లభ్యమయ్యే పచ్చిమేతను ఇవ్వాలి. పచ్చిమేతను చాప్ కట్టర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు మేపడం వలన సులభంగా  జీర్ణమౌతుంది. తెలంగాణ రాష్ట్రంలో 50.3 లక్షల ఆవులు,, ఎద్దులు, 41.9 లక్షల గేదెలు, 46.7 లక్షల  మేకలు మరియు 128.7 లక్షల గొర్రెలు ఉన్నాయి. తెలంగాణలో పశుగ్రాస పంటలు 1.1 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్నాయి. పెరుగుతున్న జనాభా రోజువారీ పాల అవసరాలను తీర్చడానికి పాల ఉత్పత్తి మరింత వృద్ధి చేయాల్సిన అవసరం ఎత్తన ఉంది. పశుగ్రాసాలను పుష్కలంగా మేపడం వలన 25% పాల దిగుబడులు పెరుగుతాయి. ప్రతిదినం శరీర పోషణకు 15 కిలోల పచ్చిమేత, 4-5 కిలోల ఎండుమిత, ఒక కిలో దాణా ఇవ్వాలి. కేవలం పచ్చిమేత మీదనే ఆధారపడితే ఇంకా ఎక్కువ అనగా సుమారు 40 కిలోలు అవసరమౌతుంది. పశుగ్రాసాన్ని కోసి మేపడం బదులు పచ్చిక బయళ్ళలో, బంజరు భూముల్లో పనికిరాని భూముల్లో కొన్ని రకాల పశుగ్రాసాల విత్తనాలు వెదజల్లి అందులోనే పశువులను మేయుటకు వాడవచ్చు. పప్పుజాతి పంటలు మరియు ధాన్యపు / గడ్డి జాతి పశుగ్రాసాలను 1:3 నిష్పత్తిలో పెంచాలి. అప్పుడే శరీర పోషణకు, పాల ఉత్పత్తికి సరిపడా మాంసకృత్తులు, పిండి పదార్ధాలు అందుతాయి.

స్టైలోశంతన్ గడ్డి

స్టైలో హెమటా, స్టైలో స్కాబ్రా, గ్వానేం షీస్, స్టైలో స్కాబ్రియానా జాతులు ఉన్నాయి. వెరనో అన్నది స్టైలో హెమటా కన్నా ఎత్తు పెరిగి ముదురు ఆకులూ కలిగి ఉంటుంది. ఇందులో 14-18% ముడి మాంసకృత్తులో ఉన్నాయి. స్టైలో గడ్డిని ఇసుక నేలలు,  తేలిక నెలల్లో పెంచవచ్చు. అధిక తేమ మరియు బెట్ట పరిస్ధితులను, నీడను తట్టుకుంటుంది. విత్తనాన్ని రోకళ్ళతో దంచి పైపొట్టు తీసి విత్తుటకు ఒక రోజు ముందు నానబెట్టి వీలైతే రైబోబీయం కల్చర్ తో విత్తనశుద్ధి చేసి విత్తుకున్నచో ఎకరాకు సరిపడా మొక్కల సాంద్రత ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ - జులై) విత్తుకోవాలి. ఎకరాకు 4-5 కిలోల విత్తనాన్ని15-20 సెం.మీ. ఎడం సాళ్లలో విత్తాలి. 12-24-12 కిలోల నత్రజని, భాస్వరం పోటాష్ నిచ్చు ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తిన 60-70 రోజులకు లేదా పూత దశలో కోయాలి. సంవత్సరానికి 2-3 కోతలనిస్తుంది. నీటి వసతి క్రైందా ఎకరానికి 25 టన్నులు, వర్షాధారంగా 12-14 టన్నుల దిగుబడి వస్తుంది. వరుసలలో కాకుండా విత్తనం వెదజల్లడానికైతే 10-12 కిలోల విత్తనం కావాలి.

అంజన్ గడ్డి

నీడను, బెట్టను తట్టుకుంటుంది. పండ్ల తోటల్లో చెట్ల మధ్య పెంచుటకు అనువైనది. ముడి మాంసకృత్తులు 5-6% ఎకరానికి 3-4 కిలోల విత్తనాన్ని తడి మట్టి లేదా పేద మిశ్రమంతో కలిపి జూన్-జులై నెలల్లో ఇసుక / ఎర్రగారప / బంజరు నెలల్లో సి.ఎ.జెడ్.ఆర్.ఐ-75,76, బండిల్ అంజన్ రకాలను వెదజల్లుకోవచ్చు. దుక్కిలో 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరమునిచ్చు ఎరువులను వేయాలి. కాండం ముక్కలైతే 60 సెం.మీ. దూరంలోని సాళ్ళలో 30 సెం.మీ. ఎడంతో నాటాలి. విధానాన్ని నారు పోసుకొని నాటిన యెడల ఎకరానికి 22,222 మొక్కల సాంద్రత ఉంటుంది. విత్తిన 80-90 రోజులకు మొదటి కోత కోసి తదుపరి కోతలు 50 రోజుల అంతరంతో సూసుకోవచ్చు. ఎకరానికి సంవత్సరానికి 4-6 కొత్తల్లో  14-16 టన్నుల దిగుబడినిస్తుంది. ఒకసారి నాటుకుంటే 10-15 సంవత్సరాలుంటుంది.

గినీ గడ్డి

అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న లోత్తెన నల్లరేగడి / ఒండ్రు మట్టి భూములు అనుకూలమైనవి. చెట్ల నీడలో, తోటల్లో కూడా సాగుచేయవచ్చు. ఒకసారి నాటితే 15-20 సంవత్సరాలుంటుంది. ఖరీఫ్ (వానాకాలం) మరియు వేసవిలో పండించవచ్చు. హామిల్, మాకుని, రివర్స్ డేల్, గ్రాస్ పానిక్, పి.జి.జి. - 13 , పి.జి.జి.- 14 , కో.జి.జి.- 3 , రకాలు ఎంచుకోదగ్గవి.

ఎకరాకు  2-2.5 కిలోల విత్తనాన్ని వారుపోసి 30 రోజుల తర్వాత 60 సెం.మీ. దూరంలో 30 సెం.మీ. ఎడంతో నాటాలి లేదా ఎకరాకు 16000 వేరు పిలకలు నాటాలి. ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 12 కిలోల పోటాష్ నిచ్చు  ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం నాటే సమయంలో మరో సగం నెల రోజుల తర్వాత వేయాలి. మొదటి కోత 50 రోజులకు తదుపరి కోతలు 40 రోజుల వ్యవధిలో చేపట్టాలి. ప్రతి కోత అనంతరం నత్రజని వేయాలి. సంవత్సరానికి 6-8 కొత్తల్లో ఎకరాకు 80 టన్నుల దిగుబడి వస్తుంది.

దీనానాధ్ గడ్డి

ఈ గడ్డిని సైలెజ్ గా గాని ఎండుగడ్డిగా గాని నిలువ చేయడానికి పనికిరాదు. దీంట్లో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువ కాబట్టి ఏదైనా పప్పుజాతి పశుగ్రాసంతో కలిపి మేపాలి. ఒండ్రుమట్టి నేలలు, చల్క భూములలో వర్షాకాలంలో ఐ.జి.యాప్.ఆర్.ఐ - 3808 , టి.ఎన్.డి.ఎన్-1 రకాలు 2-3 కిలోలు నారు పోసుకోవాలి. నెల రోజుల నారును 30 సెం.మీ. ఎడం సాలీళ్లలో మొక్కల మధ్య 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును నాటేటప్పుడు, నాటిన 30 రోజులకు వేయాలి. నాటిన 60-70 రోజులకు (పూత దశ) కోయాలి. వర్షాధారంగా ఎకరాకు 8-10 టన్నులు, నీటి వసతి క్రైందా 16-20 టన్నుల దిగుబడినిస్తుంది.

రాడ్స్ గడ్డి

చౌడు భూములలో కూడా సాగుచేయవచ్చు. అటువంటి పరిస్ధితిలో ఎకరాకు 5 టన్నుల జిప్సంను ఆఖరి దుక్కిలో వేస్తే చౌడు తగ్గుతుంది. నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. 1.5 నుండి 2 కిలోల విత్తనాన్ని నారుపోసి వేల రోజుల నారును 50 సెంటీమీటర్లు ఎడంగా ఉన్న సాళ్ళలో నాటుకోవాలి. వర్షాధారంగా ఎకరాకు 6-8 టన్నులు, నీటి సౌకర్యం క్రైందా 10-12 టన్నుల దిగుబడి వస్తుంది.

దశరథగడ్డి - హెడ్జ్ లూసర్న్

మేకలకు అనువైన గ్రాసము. నేపియర్ గడ్డితో మిశ్రమ పంటగా పండించవచ్చు. చెవుడు భూములు అనుకూలమే. నీటి ముంపుకు గురి కానీ అని రకాల నేలలు కూడా అనుకూలం. ఇది పప్పుజాతి పంట. 2 నుండి 2.5 కిలోల విత్తనాన్ని ఎకరాలో 50 సెం.మీ. ఎడంగా వేసుకున్న సాళ్లలో విత్తుకోవాలి లేదా నారు పోసుకుని నాటుకోవాలి. 8 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను ఎకరాకు వేయాలి. 60-70 రోజులకు కొత్తకొస్తుంది. 4-5 కొత్తల్లో సంవత్సరానికి 50 టన్నుల దిగుబడి వస్తుంది. ఇవేకాకుండా సుబాబుల్, ఆశ, దిరిసెన, మునగ, మల్బరీ, రావి, మర్రి, గోరింటాకు, నల్లతుమ్మ, దూసేరా తీగ, దేవకాంచనం మొదలగు చెట్ల ఆకులు, కొమ్మలను కోసి ఒక పూత వాడనిచ్చి గాని లేదా కడిగిన తరువాత గాని మేపాలి. ఇలా చేయడం వలన ఏమైనా విష ప్రభావం ఉంటే పోతుంది.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.83333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు