హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / గాఢ/సాంద్రీకృత సేంద్రియ ఎరువులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గాఢ/సాంద్రీకృత సేంద్రియ ఎరువులు

మొక్కల,జంతు సంబంధిత సాంద్రీకృతసేంద్రియఎరువులు

సేంద్రియ స్వభావము కలిగి యుండి ఎక్కువ శాతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి స్థూల పోషకాలు మరియు ఇతర పోషకాలు సరఫరా చేసే ఎరువులను “ సాంద్రీకృత / గాఢ సేంద్రియ ఎరువులు “ అంటారు.

సాంద్రీకృత సేంద్రియ ఎరువులు మెత్తగా పొడి చేసి పంట విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.

ఈ ఎరువులు స్థూల సేంద్రియ ఎరువుల కన్నా త్వరగా విచ్చిన్నమై పోషకాలు నేలలోకి విడుదల చేస్తాయి.

మొక్కల సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులు

తినదగినవి (edible cakes)

మానవ , పశు ఆహారం గా ఉపయోగ పడతాయి. ఉదా: కొబ్బరి పిండి, నువ్వుల పిండి , వేరుసెనగ పిండి

తినదగనివి (non edible)

ఉదా: ఆముదపు పిండి, ఆవ పిండి, కానుగ పిండి, కుసుమ పిండి, ప్రత్తి గింజల పిండి, వేప పిండి – ఎరువు గా ఉపయోగించెదరు.

ప్రస్తుతం వేప పిండి ఎక్కువ గా వ్యవసాయం లో వాడుతున్నారు. దీనివల్ల ముఖ్యం గా మొక్కలకు హాని కలిగించే “ నెమటోడ్స్” ను నివారించ వచ్చు.

పంటలకు పిండి వేసినప్పుడు అడవి పందులు వాసన పసిగట్టి పంటలను నాశనము చేయును.

జంతు సంబంధ సాంద్రీకృత సేంద్రియ ఎరువులు

రక్తాహారము(blood meal)

జంతు వధశాలల్లోసేకరించబడిన రక్తాన్ని పూర్తిగా ఎండబెట్టి చూర్ణం గా చేసి అన్ని రకాల నేలల్లో వాడవచ్చు. ఈ ఎరువు నేలలో తొందరగా చివికి మొక్కలకు పోషకాలను అందిస్తుంది.

ఎముకల పొడి (Bone meal):

వివిధ జంతువుల ఎముకలను పొడిగా చేసి నేలలో కలుపు తారు. ఎముకలను నీటి ఆవిరిలో ఉడక బెట్టినచో త్వరగా చూర్ణము చేసుకొనవచ్చును. అంతేగాక ఇలా తయారు చేసిన ఎముకల పొడి నేలలో త్వరగా విచ్చిన్నమగును.ఆమ్ల గుణము గల నేలలకు ఈ ఎముకల పొడిని వాడిన పి. హెచ్( pH) ఎక్కువయి తటస్థ pH కి చేరును.ఎముకల పొడిలో ఎక్కువగా కాల్షియం ఉండటం వలన మొక్కలకు తగినంత కాల్షియం అందించ బడుతుంది.

చేపల ఎరువు: (Fish meal)

తినడానికి పనికి రాని చేపలు, చచ్చిన, క్రుళ్ళిన చేపలను ఎండబెట్టి చూర్ణము చేసి ఎరువు గా వాడుతారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఎరువుల లభ్యత ఎక్కువ.
కొన్ని చేపలనుండి నూనె తీసి ఆ తరువాత కళేబరాలను ఎండబెట్టి చూర్ణము గా చేసి ఎరువుగా వాడుతారు.

కొమ్ములు మరియు గిట్టల ఆహారము (Horn meal)

కొమ్ములు, గిట్టలు ఎండబెట్టి చూర్ణము గా వాడుతారు. ఇది నెమ్మదిగా నత్రజని ని విడుదల చేస్తుంది.

గ్వానో: (Guano)

అత్యంత శీతల ప్రాంతాలయిన ఉత్తర ధృవ సముద్ర తీరాల్లో ఉన్న సముద్ర పక్షులు (pelicans, seals) సముద్ర తాబేళ్ళు విశేషం గా లభ్యమయ్యే చేపలను ఆహారం గా తీసుకొంటాయి. ఆ పక్షుల విసర్జనలు గుట్టలుగా ఏర్పడతాయి. చలి వాతావరణం లో త్వరగా చివక డానికి వీలు లేక గుట్టలు గా ఏర్పడే ఈ పదార్ధాన్ని “గ్వానో” (guano) అంటారు. దీనిని గాఢ గంధకికామ్లము (sulphuric acid) తో కలిపి గ్వానో ఎరువు గా వాడుతారు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు