హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / నేల ఆరోగ్య కార్డు, నేల పరిరక్షణ, సూక్ష్మ పోషకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నేల ఆరోగ్య కార్డు, నేల పరిరక్షణ, సూక్ష్మ పోషకాలు

నేల గురించి తెలుసుకుందాం

ఏం చేయాలి?

  • ఎల్లప్పుడూ భూసార పరీక్షల మీద ఆధారపడి సరియైన మోతాదులో ఎరువులను వినియోగించాలి. .
  • భూసారాన్ని పరిరక్షించడానికి సేంద్రియ ఎరువులను వాడాలి.
  • చల్లడానికి బదులు ఎరువులను ఎప్పుడూ మొక్కల మొదళ్ళకు కాస్త దూరంలో వేయాలి. దీని వలన అధిక ప్రయోజనం పొందవచ్చు.
  • భాస్వరం ఎరువులను సమపాళ్ళలో, సమర్ధవంతంగా వినియోగించాలి. భాస్వరం తగు పద్దతిలో వాడడం వలన పంటలు సకాలంలో పండడమే గాక మొక్కల వేళ్ళూ కొమ్మలూ ఏపుగా పెరుగుతాయి. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో నత్రజని స్థిరీకరణ సక్రమంగా జరిగి నేల సారవంతం అవుతుంది.
  • భాగస్వామ్య సేంద్రియ వ్యవసాయ హామీ విధానం (పి.జి.ఎస్. - ఇండియా) ధృవీకరణ పత్రం పొందాలనుకునే రైతులు కనీసం ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి దగ్గరలోని ప్రాంతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవాలి.

నేల ఆరోగ్య కార్డు: నేల ఆరోగ్య కార్డును 2015 ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశం లోని అన్ని భూ కమతాలకు ప్రతి రెండేళ్ళకొకసారి నేల ఆరోగ్య కార్డును ఇస్తారు. దీని సాయంతో రైతులు పంట దిగుబడి కోసం అవసరమైన మోతాదులో పోషకాలను వాడగలగటమే కాకుండా నేల ఆరోగ్యాన్నీ, సారాన్ని మెరుగు పరచకోగలుగుతారు.

మీకేం లభిస్తుంది ?

నేల మెరుగుదల కోసం సహాయం

క్ర.సం

సహాయ వివరాలు

సహాయానికి ప్రతిపదిక/గరిష్ట పరిమితి

పధకం / విభాగం

1.

సూక్ష్మ పోషకాల పంపిణీ, సమస్యాత్మక భూములను సరిచేసే రసాయనాలు

హెక్టారుకు రూ.2500/-

నేల ఆరోగ్య కార్డు పధకం

1.a

జిప్సం/ఫైరైట్/సున్నం/ డోలమైట్ ల సరఫరా

సరుకు ధరలో 50% + రవాణా కోసం గరిష్టంగా హెక్టారుకు రూ. 750/-చొప్పున.

నూనె గింజల నూనె పామ్ ల జాతీయ పధకం.(ఎన్.ఎం.ఒ.ఒ.పి).

2.

సస్యరక్షణ మందులు

క్రిమిసంహారక మందులు, శిలీంధ్ర నాశినులు,

సేంద్రియక్రిమిసంహారక మందులు, జీవ-ప్రేరకాలు, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు వగైరాల కోసం వాటి ధరలో 50% రాయిత - గరిష్టంగా హెక్టారుకు  రూ.500./-

ఎన్.ఎం.ఒ.ఒ.పి

3.

సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించటం కోసం

హెక్టారుకు రూ. 10,000/-

జాతీయ ఉద్యాన పధకం (నేషనల్ హార్టికల్చరల్ మిషన్-ఎన్.హెచ్‌.ఎం)ఈశాన్య మరియు హిమాలయ రాస్ట్రాల ఉద్యాన పధకం (హార్టికల్చర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్- హెచ్‌.ఎం.ఎన్.ఇ. హెచ్‌)-ఉద్యాన సమగ్రాభివృద్ధి పధకం (మిషన్ ఫర్ ఇంటేజి‌ఆర్‌ఈటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్-ఎం.ఐ.డి. హెచ్‌)కింద ఉపపధకాలు.

4.

వర్మి కంపోస్ట్ యూనిట్  నిర్మించుకోవడానికి

(30 అడుగులు*8 అడుగులు ఎక్స్ 2.5 అడుగులు లేదా 600 ఘనపు అడుగుల కొలతలు కల) ప్రతి యూనిట్ కు దామాషాప్రకారం రూ. 50000/-

ఎన్.హెచ్‌.ఎం/హెచ్‌.ఎం.ఎన్.ఇ.హెచ్‌.-ఎం.ఐ.డి.హెచ్‌.కింద ఉపపధకాలు

5.

హై డెన్సిటీ పాళీ ఇధిలిన్ (హెచ్‌.డి.పి.ఈ) వర్మి బెడ్ ల కొరకు

(12 అడుగులు *4 అడుగులు ఎక్స్ 2 అడుగులు లేదా 96 ఘనపు అడుగుల కొలతలు కల) ప్రతి యూనిట్ కు దామాషా ప్రకారం రూ. 8000/-

ఎన్.హెచ్‌.ఎం/హెచ్‌.ఎం.ఎన్.ఇ.హెచ్‌.-ఎం.ఐ.డి.హెచ్‌.కింద ఉపపధకాలు

6.

పోషక పదార్ధాల సమగ్ర యజమాన్యాన్ని  ప్రోత్సహించడం కోసం

హెక్టారుకు రూ.1200/- (నాలుగు హెక్టర్లు మేరకు)

ఎన్. హెచ్‌.ఎం/ హెచ్‌.ఎం.ఎన్.ఇ. హెచ్‌.-ఎం.ఐ.డి. హెచ్‌.కింద ఉపపధకాలు.

7.

జిప్సం, ఫాస్ఫోజిప్సం/బెంటోనైట్ గంధకం సరఫరా

హెక్టారుకు రూ.750/- కి మించకుండా పదార్ధాల ధరలో 50% రాయితీ

జాతీయ అహ్రా భద్రతా పధకం (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) బి.జి.ఆర్.ఇ.ఐ.

8.

సూక్ష్మ పోషకాలు

హెక్టారుకు రూ 500/- కి మించకుండా పదార్ధాల ధరలో 50% రాయితీ

ఎన్.ఎఫ్.ఎస్.ఎం& బి.జి.ఆర్.ఇ.ఐ.

9.

సున్నం/సున్నం వంటి పదార్థాలు

హెక్టారుకు రూ.1000/- కి మించకుండా పదార్థాల ధరలో 50% రాయితీ

ఎన్.ఎఫ్.ఎస్.ఎం.&బి.జి.ఆర్.ఇ.ఐ

10.

జీవ ఎరువులు

(రైజోబియం /పి.ఎస్.బి.)

హెక్టారుకు రూ.300/- కి మించకుండా పదార్థాల ధరలో 50% రాయితీ

ఎన్.ఎఫ్.ఎస్.ఎం.&బి.జి.ఆర్.ఐ

11.

కొత్తగా చలన/స్థిర భూసార పరీక్షా కేంద్రాలను నిర్మించడానికి

ఏడాదికి పదివేల నమూనాలను పరీక్షించగలిగే సామర్థ్యంతో ఉండే ల్యాబ్ ను నిర్మించడానికి పెట్టుబడి కోసం నాబార్డ్ ద్వారా వ్యక్తులకు/ప్రైవేట్ ఏజెన్సీలకు ల్యాబ్ కు రూ. 25 లక్షలకు మించకుండా నిర్మాణ వ్యయంలో 33%

 

జాతీయ సుస్ధీర వ్యవసాయ పధకం (నేషనల్ మిషన్ ఫోర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్.ఏం.ఎస్.ఎ)

12.

సూక్ష్మ పోషకాల వాడుక ప్రోత్సాహం వాటి పంపిణీ

హెక్టారుకు రూ.500/- కు మించకుండా ధరలో 50% రాయితీ/లేదా ప్రతి లబ్ద్దిదారుకు రూ. 1000/-

ఎన్.ఎం.ఎస్.ఎ

13.

ద్రవ ఆధారిత/వాహక ఆధారిత జీవ-ఎరువు/జీవ-క్రిమిసంహారక మందుల అత్యంత ఆధునిక యూనిట్లను నెలకొల్పడం

ఏడాదికి 200 తన్నుల ఉత్పధక సామర్ధ్యంతో ఉండే యూనిట్ ను నిర్మంచడానికి పెట్టుబడి కోసం నాబార్డ్ ద్వారా వ్యక్తులకు రూ.40 లక్షలకు మించకుండా నిర్మాణ వ్యయంలో 25% రాయితీ

 

ఎన్.ఎం.ఎస్.ఎ

14.

పళ్ళు/కూరగాయల మార్కెట్లు వ్యర్ధ పదార్ధాలతో వ్యవసాయ వ్యర్ధలతో కంపోస్ట్ ను ఉత్పత్తి చేసే యూనిట్ నిర్మాణానికి

ఏడాదికి 3000 టన్నుల ఉత్పధక సామర్ధ్యంతో ఉండే యూనిట్ ను నిర్మించడానికి పెట్టుబడి కోసం నాబార్డ్ ద్వారా వ్యక్తులకు/ప్రైవేట్ ఏజెన్సీలకు యూనిట్ కు రూ.63 లక్షలకు మించకుండా నిర్మాణ వ్యయంలో 33% రాయితీ

ఎన్.ఎం.ఎస్.ఎ

15.

రైతుల పొలాల్లో సేంద్రీయ పదార్ధాలా వాడకానికి ప్రోత్సాహం కోసం (సేంద్రీయ ఎరువు వర్మి కంపోస్టు, జీవ ఎరువులు ద్రవ/ఘన వ్యర్ధాల కంపోస్టు చెట్ల నుండి తీసిన రసాయనాలు).

హెక్టారుకు రూ.5000/- కు మించకుండా లబ్ధిదారుకు రూ.10000/- కు లోబడి  50% రాయితీ

ఎన్.ఎం.ఎస్.ఎ

16.

భాగస్వామ్య హామీ వ్యవస్ధ (పీ.జీ.ఎస్) ధృవీకరణ కింద బృందాలవారిగా సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించడం కోసం

హెక్టారుకు రూ.20000/- కు మించకుండా లబ్ధిదారుకు రూ.40000/- కు లోబడి మూడేళ్ళ పాటు

ఎన్.ఎం.ఎస్.ఎ

17.

పీ.జీ.ఎస్ వ్యవస్ధ కు మద్ధతుగా ఆన్ లైన్ డాటా నిర్వహణ కోసం మిగులు రసాయనాల పరీక్ష కోసం

రైతుకు రూ.200 చొప్పున ప్రతి బృందానికి సంవత్సరానికి రూ.5000/- మేరకు; ప్రాంతీయ మండలి రూ.100000/- కు మించకుండా మిగులు రసాయనాల పరీక్ష కోసం ప్రతి నమూనాకు రూ.10000/- చొప్పున (పరీక్షలు ఎన్.ఏ.బి.ఎల్. ల్యాబ్ లలోనే జరుగుతాయి)

ఎన్.ఎం.ఎస్.ఎ

18.

ఎరువుల నిర్వహణ జీవ నత్రజని సమీకరణల కోసం సేంద్రీయ గ్రామ దత్తత

బృందాల వారీగా/స్వయం సహాయక బృందాల (SHGల) వారీగా సమగ్ర ఎరువుల నిర్వహణ పొలాల గట్ల మీద ఎరువునందించే చెట్ల పెంపకం లెగ్యూమినస్ మొక్కలతో అంతర పంటల ప్రోత్సాహం కోసం ప్రతి గ్రామానికి రూ.10 లక్షల చొప్పున (సంవత్సరానికి రాష్ట్రానికి 10 గ్రామాల చొప్పున)

ఎన్.ఎం.ఎస్.ఎ

19.

సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శన కోసం

50 లేదా అంతకు మించి భాగస్వాములున్న ప్రతి ప్రదర్శనకు రూ. 20000/-

ఎన్.ఎం.ఎస్.ఎ

20.

సమస్యాత్మక నేలల పునరుద్ధరణ

చవుడు నేలలు హెక్టారుకు రూ.25000/- కు మించకుండా లబ్ధిదారుకు రూ.50000/- కు లోబడి ఖర్చులో 50% ఆమ్ల నేలలు హెక్టారుకు రూ.3000/- కు మించకుండా లేదా లబ్ధిదారుకు రూ.6000/- కు లోబడి ఖర్చులో 50%

ఎన్.ఎం.ఎస్.ఎ

21.

ICAR సాంకేతికతతో అభివృద్ధి పరచిన సూక్ష్మ స్ధాయి భూసార పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పడం కోసం

ఏడాదికి మూడు వేల నమూనాలను పరిక్ధించగలిగే సామర్ధ్యంతో ఉండే ల్యాబ్ ను నిర్మించడానికి పెట్టుబడి కోసం నాబార్డ్ ద్వారా వ్యక్తులకు/ప్రైవేట్ ఏజెన్సీలక్ ల్యాబ్ కు రూ.44000/- మించకుండా నిర్మాణ వ్యయంలో 44%

ఎన్.ఎం.ఎస్.ఎ

22.

గ్రామ స్ధాయిలో భూసార పరీక్ష ప్రాజెక్టును నెలకొల్పడం కోసం

ఖర్చులో 40% కానీ లేదా రూ.400000/- లలో ఏది తక్కువైతే అది.

ఎన్.ఎం.ఎస్.ఎ

ఎవరినిసంప్రదించాలి ?

జిల్లా వ్యవసాయాధికారి/జిల్లా ఉద్యాన అధికారి/ఆత్మ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఎజేన్సీ - ఎ..టి.ఎం.ఎ) ప్రాజెక్టు సంచాలకులు

2.96739130435
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు