హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / నెట్ వర్క్ ప్రాజెక్టు ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నెట్ వర్క్ ప్రాజెక్టు ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రము

వివిధ పంట ధరలవివరాలు,ధాన్యంతరలింపు జాగ్రత్తలు

మనదేశంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి గత 50 సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. వీటితో పాటు వాణిజ్య పంటల వాటా కూడా పెరిగింది. మొత్తం ఉత్పత్తిలో మార్కెట్ కు వచ్చే ఉత్పత్తుల వాటా కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో ధరలపై అవగాహన, మార్కట్ సమాచారం రైతులకు ఎంతో అవసరం, కానీ సమాచారం సక్రమంగా అవసర మైన సమయంలో రైతులకు వినియోగ దారులకు అందడంలేదు. మార్కెట్ సమాచారం రైతులు, వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, 2013 సం. లో రాజేంద్ర నగర్ , హైదరాబాద్ లోని వ్యవసాయ కళాశాలలో, భారథ వ్యవసాయ పరిశోధనా సంస్థ ద్వారా నెట్ వర్క్ ప్రాజెక్టు ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంను ప్రారంభించారు. ఈ కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్ భాగస్వామ్యం తో పనిచేస్తుంది. ఈ కేంద్రం మొక్కజొన్న, శనగ, వేరు శనగ, ఎండుమిర్చి, ప్రత్తి మొదలైన పంటల ధరలను సేకరించి విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని, మార్కెట్ పోకడలను మరియు ధరల అంచనాలను సూచిస్తుంది. ధరల అంచనా, ప్రధాన పంటలు విత్తే సమ యానికి ముందు మరియు కోత కోసే సమయానికి రెండు సీజనులలో (ఖరీఫ్ మరియు రబీ) రైతులకు అందిస్తారు. ధరల అంచనాలను ప్రాంతీయ పత్రికలు, ఆంగ్ల దినప్రత్రికలు, మాసపత్రికలు, టి.వి., రేడియోల ద్వారా చేరవేస్తుంది. ఈ సమాచారం అంతర్జాలంలోని వివిధ సంస్థల వెబ్ సైట్ల ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది. అంతేకాకుండా ఇఫ్ కో కిసాన్ సంచార్ లిమిటేడ్ సహకారంతో మొబైల్ ఫోన్ ల ద్వారా రైతులకు చేరవేస్తుంది. రైతులు సీజన్ కు ముందు తమ పంటల సరళిని నిర్ణయించుటకు, తాము కోసిన పంటను నిలువ ఉంచాలా లేదా అమ్మవలెనా మరియు ఏ సమయంలో విక్రయించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది.

విత్తు సమయము, కోయు సమయము మరియు ధర అంచనాలు వేయు నెలలు

పంట సీజన్ ధర అంచనాలు వేయు నెలలు
విత్తు సమయము కోయు సమయము విత్తేముందు కోయు ముందు
శనగ రబీ సెప్టెంబర్ డిసెంబర్
అక్టోబర్ –నవంబర్ డిసెంబర్ - జనవరి
మిరప ఖరీఫ్ మే అక్టోబర్
జూన్ - ఆగస్టు అక్టోబర్ – డిశంబర్
రబీ సెప్టెంబర్ జనవరి
అక్టోబర్ – డిసెంబర్ ఫిబ్రవరి – మే
ప్రత్తి రబీ ఖరీఫ్ మే అక్టోబర్
జూన్ - ఆగస్టు నవంబర్ - ఫిబ్రవరి
వేరు శనగ ఖరీఫ్ మే సెప్టెంబర్
జూన్ – జూలై అక్టోబర్ – డిసెంబర్
రబీ సెప్టెంబర్ డిసెంబర్
అక్టోబర్ – డిసెంబర్ జనవరి – ఏప్రిల్
మొక్కజొన్న ఖరీఫ్ మే సెప్టెంబర్
జూన్ – జూలై అక్టోబర్ – నవంబర్
రబీ సెప్టెంబర్ డిసెంబర్

రైతులు తమ ధాన్యంను మార్కెట్ కు తీసుకు వచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ముఖ్యమైన మార్కెట్లు

మొక్కజొన్న

 • తేమ శాతము 12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.25 – 0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1 శాతంలోపు ఉండవలెను.
ముఖ్యమైన మార్కెట్లు
 • బాదెపల్లి, చెర్ల, నిజామాబాద్ సిద్దిపేట, అచ్చంపేట. నాగర్ కర్నూల్

వరి

 • తేమ శాతము 14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1 -2 శాతం వరకు ఉండవలెను. దెబ్బతిన్న గింజలు 2-3 శాతంలోపు ఉండవలెను. ఎర్ర గింజలు 2 శాతంకు మించి ఉండకూడదు.
ముఖ్యమైనమార్కెట్లు
 • చెర్ల, మిర్యాలగూడ, ములుగు, మధిర, సూర్యపేట, కేసముద్రం, వేములవాడ, చొప్పదండి.

వేరుశనగ

 • తేమ శాతం 8 శాతము లోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1 - 3 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1- 5 శాతం వరకు ఉండవలెను.
ముఖ్యమైన మార్కెట్లు
 • గద్వాల, బాదెపల్లి, వరంగల్ , సూర్యపేట, తిరుమలగిరి

కంది

 • తేమ శాతము 10 - 14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10 – 0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 3 - 4 శాతంవరకు ఉండవలెను.
ముఖ్యమైన మార్కెట్లు
 • తాండూరు, సూర్యపేట, అదిలాబాద్ , బాదెపల్లి, నారయణ పేట, సిద్దిపేట,

శనగ

 • తేమ శాతము 12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1 – 4 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1- 4 శాతంవరకు ఉండవలెను.
ముఖ్యమైన మార్కెట్లు
 • నారయణ పేట, అలంపూర్ , అదిలాబాద్ ,

మిరప

 • తేమ శాతము 8 - 12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.25 – 0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 3 శాతంలోపు ఉండవలెను. మిరపకాయలు సమానరంగు ఆకారం కలిగి ఉండవలెను.
ముఖ్యమైనమార్కెట్లు
 • ఖమ్మం, వరంగల్ , చెర్ల, నిజామాబాద్.

పెసర

 • తేమ శాతము 10 -14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10 – 0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1 – 5 శాతం వరకు ఉండవలెను.
ముఖ్యమైనమార్కెట్లు
 • సూర్యపేట, ఖమ్మం, కేసముద్రం, తిరుమలగిరి,

పసుపు

 • తేమ శాతము 12 శాతంలోపు ఉండవలెను. విరిగిన పసుపు కొమ్ములు 3 శాతం వరకు ఉండవచ్చును. మరియు 75 శాతం పసుపుకొమ్మ్హులు 3 సెం.మీ కంటె ఎక్కువ పొడవు ఉండవలెను.
ముఖ్యమైన మార్కెట్లు
 • నిజామాబాద్ , మెట్ పల్లి, కరీంనగర్ , కేసముద్రం

మినుము

 • మొక్కజొన్న: తేమ శాతము 10-14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10 – 0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1 - 5 శాతంలోపు ఉండవలెను.
ముఖ్యమైనమార్కెట్లు
 • సూర్యపేట, చెర్ల, నిజామాబాద్.

ప్రత్తి

 • ప్రత్తిని పూర్తిగా విచ్చిన కాయలనుండి మాత్రమే తీయవలెను. ఎలాంటి చెత్త లేకుండా చూడవెలెను
ముఖ్యమైనమార్కెట్లు
 • వరంగల్ , అదిలాబాద్ , బైంసా, కరీంనగర్ , ఖమ్మం, పెద్దపల్లి.

మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన చిరునామా: వ్యవసాయ ఆర్ధిక విభాగము, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 9948780355

2.99419729207
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు