హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం మరియు సేంద్రియ ఎరువులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం మరియు సేంద్రియ ఎరువులు

సేంద్రియ ఎరువులు మరియు భూసారపరీక్షా

సేంద్రియ ఎరువులు వాడనందున జరుగు నష్టాలు/అరిష్టాలు

 1. పొలంలోని మట్టి జీవం కోల్పోయి, క్రమేణా పంట ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది.
 2. వాడుతున్న రసాయన ఎరువుల వినియోగం తగ్గి, క్రమే పిరసాయనిక ఎరువుల మోతాదు పెంచవలసి వస్తుంది.దీనితో ఖర్చు అధిక మవుతుంది.
 3. భూమిలో నీటి నిలువ సామర్ధ్యం తగ్గి, ఎక్కువ నీరు ఉపయోగించ వలసి వస్తుంది.
 4. కాలక్రమేణా, సూక్ష్మపోషకాల లోపాలు అధికమవుతాయి.తద్వారా పంట ఖర్చు ఎక్కువవుతుంది.
 5. ఏట వాలు భూములలో మట్టికోత అధికమై సారవంతమైన పై మట్టి కోల్పోవడానికి అధిక ఆస్కారముంది.

కంపోస్టు/పశువుల ఎరువులలో పోషక విలువలు ఎలా పోగొట్టుకుంటున్నాము.

 1. కంపోస్టు, పశువుల ఎరువులను తయారు చేయునప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొనని యెడల అందులోని పోషకాక విలువలను పొందలేక పోతాము.
 2. నిర్లక్ష్యంగా వీటిని తయారుచేస్తే, అవి బాగా చివకక పంటకు కావల్సిన సత్ఫలితాలను ఇవ్వవు.
 3. అప్పుడప్పుడు వీటి మీద నీరు చల్లాలి – బాగా చివకడంకోసం నీడ ఉన్న ప్రాంతాలలో వీటిని (గుంటలు) ఏర్పాటుచేయాలి.
 4. పొలంలో వాడేటప్పుడు రైతాంగం కుప్పలుగ పోసి చాలారోజులు అలాగే ఎండకు వదిలే పొలంలో వీటిని వెంటనే కలియ దున్నాలి.

కంపోస్టు/పశువుల ఎరువుల తయారీలో గట్టి కాండంకలిగిన ఆముదం, ప్రత్తి, కంది వంటి పంటల కాండములను వాడవచ్చునా?

 1. సేంద్రియ ఎరువులు తయారు చేయునప్పుడు ఇటువంటి పంటల కాండములు బాగా చివుకుటకు ఎక్కువసమయం తీసుకుంటుంది. కాబట్టి వీటిని వీలైతేముక్కలుగా చేసి లేక బాగా పశువుల పేడతో కలిపిగాని ప్రత్యేకంగా ఎరువుగా చేసుకుంటే మంచిది.

సేంద్రియ ఎరువులు దొరకనప్పుడు ఏమి చేయాలి?

 1. పొలాలకు సేంద్రియ ఎరువుల వాడకం ఎంతో అవసరం. అవి దొరకనప్పుడు, పంట అవశేషాలను కాల్చకుండా పొలంలో బాగా కలియ దున్నటం, చుట్టు ప్రక్కలలభ్యమయ్యే పచ్చిరొట్ట ఆకును వీలైనంతగా వాడటం అప్పుడప్పుడు ఆకు బాగా రాల్చే సోయాచిక్కుడు వంటి పంటలను పండీంచటం ద్వారా కొంత వరకు సేంద్రియ ఎరువుల లోటును తీర్చవచ్చును.

సేంద్రియఎరువులు, జీవనఎరువులను కలిపివాడొచ్చా?

 1. జీవన ఎరువులను, బాగా చివికిన తేమ కలిగిన సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చును. ఇంకా వీలైతే 200-300 కిలోల బాగా చివికిన పశువులఎరువు తో జీవెన ఎరువులను కలిపి 2-3 రోజులు నీడలోఉంచి కెలియ బెట్టి వాడితే ఇంకా శ్రేయస్కరం. కాని విత్తనానికి దట్టించవలసిన జీవన ఎరువులు వాటిని వాడవలసిన పద్దతి ప్రకారం విత్తనానికే దట్టించాలి.

రైతుకు తన దగ్గర లభించే సేంద్రియ ఎరువుల కన్నా బజారులో దొరికే సేంద్రియ ఎరువుల బస్తాల నాణ్యతఅధిక మైనదా?

 • రైతు దగ్గరున్న బాగా చివికిన సేంద్రియ ఎరువుకు మార్కెట్ లో ఉన్న సేంద్రియ ఎరువుకు పెద్దగా తేడావుండదు. కాక పోతే బజారులో దొరికే సేంద్రియ ఎరువులలో కొద్ది మోతాదులో పోషకాలను కలుపుతుంటారు. ఈ రైతాంగం ఎరువుల ద్వారా ఇస్తుంటారు. కాబట్టి అధిక ఖర్చుతో వీటిని వాడటం కన్నా, రైతాంగం, తమ వీలునుబట్టి తమ దగ్గరే కంపోస్టు/పశువుల ఎరువులను తయారు చేసుకుని వాడటం శ్రేయస్కరం మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.

నీరు మరియు భూసార పరీక్షలు భూసార పరీక్షలు చేయనందున కోల్పోతున్న లాభాలేంటి?

 • రైతులు తమ పొలంలో తక్కువగా ఉన్న పోషక పదార్ధాల గురించి తెలుసుకోలేక తద్వారా దానిని వాడకుండా అధికోత్పత్తి పొందలేక పోతున్నారు.
 • అదేవిధంగా రైతులు తమ పొలంలో సరిపోయినంతలేక ఎక్కువగా ఉన్న పోషకాల గురించి తెలియకుండా వాటిని అనవసరంగా ఎక్కువగా రసాయన ఎరువుల రూపంలో వాడి పంట ఖర్చును ఎక్కువ చేసుకుంటునారు.
 • తమ పొలంలో ఉన్న చౌడు మొదలగు పంట నిరోధక గుణాలను తెలుసుకుని వాటి గురించి చర్యలను తీసుకోకుండా నష్టపోతున్నారు.

భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా ఎలా తీయాలి? ఎన్ని తీయాలి?

భూసార పరీక్ష కొరకు 5 నుంచి 10 ఎకరాల పొలంలో 10 నుంచి 15 స్థలాలలో 15 సెం.మీ లోతులో మట్టిని తీసి భూసార పరీక్షకు పంపాలి. చిన్నరైతులు (1నుంచి 5 ఎకరాలు) 5 నుంచి 10 స్థలాలలో మట్టిని తీసి ఒక నమూనాగా చేసి దానిని ప్రయోగశాలకు పంపాలి.

భూసార పరీక్ష చేయిస్తే అన్ని ఎరువుల వాడకం తగ్గుతుందా?

ఫలితాల కనుగుణంగా, పొలాన్ని బట్టి సిఫార్సులు మారుతాయి. సాధారణంగా కొన్ని పోషకాలు ఎక్కువగా,మరికొన్నింటిని తక్కువగా వాడమని ఫలితాలు చూసిస్తాయి. కాబట్టి అన్ని ఎరువుల వాడకం ఎక్కువ కావటం లేకుండా తక్కువగా వాడామనే అపోహలు లేకుండా భూసార పరీక్ష కనుగుణంగా ఎరువులు సిఫార్సు చేయబడుతాయి.

భూసార పరీక్ష కనుగుణంగా ఎరువులు వాడితే పంట ఉత్పత్తి పెరుగుతుందా?

ఇంతకు మునుపు తెలియ చేసినట్లుగా, భూసార పరీక్షలో సిఫార్సు చేసిన ఎరువుల కన్నా రైతు తక్కువగా లేక అధికంగా వాడుతున్నట్లయితే. సమతుల్యత జరిగి పంట ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా ఏదైనా పోషక పదార్ధలోపం భూసార పరీక్షలో తేలితే దాని వాడకం వల్లగూడ పంట ఉత్పత్తి పెరుగుతుంది.

భూసార పరీక్షల ఫలితాలు పంట వేసిన తరువాతచేతికందితే దాని వలన ప్రయోజనముందా?

ఒకసారి చేసిన భూసార పరీక్షా ఫలితాలు రైతాంగానికి 2-3 సం. వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి భూసారపరీక్షా ఫలితం మొదటి సారిగా పంట వేసిన తరువాత చేతికి అందితే దానిని 2వ పంటకు కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మొదట వేసిన పంట మరియు రెండవదివేరయితే రెండవ పంటకు ఎరువుల సిఫార్సు దగ్గరిలోని వ్యవసాయ అధికారిని గాని, భూసార కేంద్రంలోగాని వ్యవసాయ శాస్త్రవేత్తను గాని సంప్రదించి ఎరువులు వాడాలి.

ఒక నమూనగ కొన్ని ప్రాంతాలలో బోరు బావుల నీరు వాడినప్పుడు పంటలు ఎందుకు ఎదగవు?

బోరు బావుల నీటి నాణ్యత పంట మీద ప్రభావం చూపిస్తుంది. లవణాలు అధికంగా ఉన్నప్పుడు క్రమంగా నేల దెబ్బతిని పంట ఏపుగా ఎదగదు. వర్షాకాలంలో, ఇటు వంటి నీటి ప్రభావము, లవణాల సాంద్రతను బట్టి ఎక్కువగా దుష్ఫరిణామాలు ఇవ్వకపోయినప్పటికీ, రబీలో బాగా నష్టం కలుగ చేస్తుంది. కాబట్టి ఇటువంటి నీటినిసమీపం లో భూసార కేంద్రము/కె.వి.కెలలో పరీక్ష చేయించుకుని వాడకాన్ని ;నియంత్రించాలి. లేనిచో కాల క్రమేణా భూమి దెబ్బ తినును.

పంట మధ్యకాలంలో భాస్వరము కలిగిన కాంప్లెక్సులను ఎందుకు వాడరాదు?

 

పంట తనకు కావలసిన భాస్వరాన్ని భూమి నుండి తన మొదట పెరుగుదల దశలోనే 70 నుంచి 80 శాతం వరకు గ్రహిస్తుంది.

 

పంట మధ్యకాలంలో ఆకులు పసుపుగా మారి, ఏ చీడపురుగులు, రోగాలు కనిపించక పోయినప్పుడు ఆ చిహ్నము ఏ ఉపపోషక పదార్ధ లోపము?

పంటలో సూక్ష్మ పోషక పదార్ధ లోప చిహ్నాలు చిన్న వయస్సులోనే కనిపిస్తాయి. సూక్ష్మ పోషక పదార్ధ లోపమున్నట్లయితే మొక్క సరిగ్గా పెరగదు. కాబట్టి బాగుగాపెరిగిన మొక్కలో నీటి ముంపు, హఠాత్తుగా వాతావరణ ఉష్ణోగ్రత తగ్గింపు, అకాల దీర్ఘకాలిక మబ్బుపట్టడం వంటి పరిస్థితుల వలన అంతరంగిక మార్పులు జరిగి ఆకులు పసుపుపచ్చగా మారుతుంది. సాధారణంగా బోరాన్ లోపములో మాత్రము తక్కువ పూత పూయటం,కాయలు చిన్నవిగా రావటం వంటి చిహ్నాలు పంట చివరి దశలో ప్రస్పుట మవుతాయి.

వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, వాటి లోపాలను గుర్తించటం, వాటి యాజమానం మరియు నివారణ ఎలా?

ఎలక్ట్రానిక్ వింగ్ లో 15 నిమిషాల సి.డి. అందుబాటులో వున్నది.

జింకు-చలామిన్ మరియు జింకు సల్ఫేటులో ఏది గొప్పది?

పంటకాలంలో జింకు లోప నివారణకు జింకు పిచికారిఅవసరము. దీని కోసం లోప నివారణకు జింకు ఉన్న నాణ్యతగల పైవాటిని ఏదైనా వాడవచ్చ. కాని పిచికారి కొరకు అయ్యే ఖర్చు ప్రకారం జింకు సల్ఫేట్ వాడితే లాభం. ఉదా: లీటరు నీటికి 2గ్రా. జింకు సల్ఫేట్ చొప్పున ఒక ఎకరాకు వాడవలసిన 200 లీ పిచికారి ఖర్చు: 500 గ్రా జింక్ సల్ఫేట్ = సుమారు 20-25 రూ. పిచికారి మనిషి కూలీ= ఒక రోజుకు 200-300రూ కాని చలామిన్ ఖర్చు జింక్ సల్ఫేట్ కన్నా ఎక్కువc జింక్ సల్ఫేట్ భూమిలో వేయుటకు ఎకరాకు 20 కిలోలు, ధర= 400 -500రూ.ఇది 3 పంటలకు సరిపోతుంది.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, సూక్ష్మపోషక పదార్ధాల పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

2.99440298507
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు