অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేసవి కూరగాయల సాగులో చేపట్టవలసిన ప్రత్యేక యాజమాన్య పద్దతులు.

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతి బంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలు సాగుచేసి అధిక లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి.

తెలంగాణలో వేసవిలో పండించడానికి అనువైన కూరగాయ రకాలు

పంట

సాధారణ రకాలు

సంకర రకాలు

టమాట

పూసా ఎర్లీడ్వార్ఫ్, మారుతమ్ , అర్క్వికాస్ , పూసా-120

రష్మి, నవీన, అవినాష్ – 2, లక్ష్మి బి.యస్ . యస్ .-20, అన్నపూర్ణ

బెండ

అర్కానాఅమిక, అర్కాభయ్ ,పర్భని క్రాంతి

వర్ష, మహికో -10, ప్రియ,సుప్రియ

క్యాబేజి

పూసా సింథటిక్

శ్రీ గణేష్ గోల్ ,నాథ్ 401, క్విస్టో మీనాక్షి

కాలిఫ్లవర్

పూసా ఎర్లీ సింథటిక్

పూసాహైబిడ్ -2, పూసాశుభ్ర, అర్కకోమల్ ,

ఫ్రెంచిబీన్

 

ప్రీమియర్ ,బొంటిపుల్ ,నాంటిస్ , పూసాకేసర్

క్యారట్

 

 

ఉల్లి

ఎన్ -53(ఖరీఫ్ ,రబీ), అగ్రి ఫౌండ్ లైడ్ రెడ్

 

గోరు చిక్కుడు

గౌరి, పూసానవబహార్ ,పూసా సదా బహార్

 

తోటకూర

ఆర్.ఎన్.ఎ-1, అర్కఅరుణ (ఎరుపు)

 

పాలకూర:

ఆల్ గ్రీన్

 

మెంతి

పూసా ఎర్లీ బంచింగ్

 

కొత్తిమీర

స్వాతి, సాధన

 

గోంగూర

ఎర్ర గోంగూర,

 

బీర

పూసానస్ దర్ జైపూర్ లాంగ్

ఎన్ ఎస్ -3, ఎన్ ఎన్ 401, 403, సురేఖ, సంజీవని, మహిమ

సొర

పూసాసమ్మర్ ప్రొలిఫిక్ లాంగ్

వరద్ , కావేరీ, ఇండమ్ 104, స్వాతి

కాకర

కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ , అర్క హరిత

ఎం.బి.టి.హెచ్ 101,102,ఎన్ .ఎస్ .431,432, మహికో 10,13

 • వేసవిలో నారు నీడ క్రింద పెంచాలి. తప్పనిసరిగా రసం పురుగుల నివారణకు ఇమిడక్లోప్రిడ్ తో (5గ్రా/కిలో విత్తనానికి విత్తనశుద్ది చేయాలి. నారుమళ్ళ పై నైలాన్ వల ఏర్పాటు చేసుకుంటే కూడా రసం పీల్చే పురుగులు మరియు వైరస్ తెగుళ్ళ సమస్యను అధిగమించ వచ్చు.
 • వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాలు అంతరపంట  గా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరు చిక్కుడు వంటి కూరగాయపంటలను సాగుచేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియపు ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియపు ఎరువులు ఎక్కువగా వాడటం వలన నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టివుంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
 • ఉన్నకొద్దిపాటి నీరు బిందు (డ్రిప్ )లేదా తుంపర్(స్ప్రిక్లర్) పద్ధతిలో ఇవ్వటం వలన కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలు పండించవచ్చు.
 • ఒక ఎకరాకు సరిపడ నీరుతో  డ్రిప్పు ద్వారా 2 ½  ఎకరాలలో తుంపర్ల పద్ధతిలో 1 ½ -2 ఎకరాలలో సాగుచేయవచ్చు. అంతేగాక నీరు సక్రమంగా ఇవ్వటం వలన తుంపర్ల ద్వారా కలిపి పూతదశలో ఎండవేడి తగ్గి మంచి  దిగుబడులు పొందవచ్చు.సాదారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటలలో ఎండతీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళలో నీటిని పిచికారి చేయాలి.
 • టమాట, పుచ్చలో నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయపగుళ్ళు కనబడతాయి. నీటి యాజమాన్యం సక్రమం గా ఉండేటట్లు చూడాలి. ఆ తర్వాత కాయపగుళ్ళ నివార ణకు బోరాక్స్ లేదా అల్ బోర్ 3గ్రా/లీ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
 • తీగ జాతి కూరగాయలలో అధిక ఉష్ణోగ్రతకు మగ పూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు పూత దశలో సైకోసిల్ (సిసిసి) 2.5 గ్రా. లేదా 0.5గ్రా మాలిక్ హైడ్రజైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.లేదా గింజ విత్తిన 15 రోజులకు, 2-4 ఆకులదశలోనే 3-4గ్రా బోరాక్స్ /లీ. నీటికి లేదా ఇథరిల్ 2.5 మి.లీ/10లీ. నీటికి కలిపి వారం వ్యవధితో రెండు సార్లు పిచికారి చేసే తర్వాత దశలో ఆడపూల సంఖ్య పెరిగి అధిక  దిగు బడులు వస్తాయి.
 • ఆకు కూరల పంటలలో ఆకు దిగుబడి పెంచటానికి 2 శాతం యూరియా (20గ్రా/లీ. నీటికి)+ 50పి.పి.యం జిబ్బరిల్లిక్ ఆసిడ్ (50 మి. గ్రా, బి.ఎ-3/లీ. నీటికి) ద్రావణాన్ని పంటపై పిచికారి చేయాలి.
 • యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండేలా9 కిలోల యూరియాకు ఒక కిలో వేపపిండి కలిపి వేయాలి. లేదా ప్రతి 25 కిలోల యూరియాకు కిలో వేపనూనె కలిపి అరగంట సేపు ఆరబెట్టి పంటలకు వేయాలి.
 • పూత, పిందె రాలకుండా పిందె బాగా పట్టడానికి టమాట, వంగ లాంటి పంటకు ఒక మి.లీ ప్లానోఫిక్స్  అంతేగాక(ఎన్ ఎ.ఎ) 4.5 లీటర్ల నీటిలో కలిపి పూతదశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
 • మిరపలో పూతదశలో ట్రైకాంటినాల్ 2.0మి.గ్రా లేదా 2.5 మి.లీ ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే పిందె నిలిచి కాత బాగా ఉంటుంది.
 • కాయగూరలను, ఆకుకూరలను, చల్లటిపూటకోసి, తడిగోనె సంచి కప్పి మార్కెట్ కి పంపాలి.

కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ

నారుమడి

 • నారును ఎత్లైన నారుమళ్ళలో, వరుసలలో విత్తితే గాలి, వెలుతురు సోకి ఒకే రకంగా, మొక్కలు దృఢంగా వుంటాయి.
 • విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే విత్తాలి. కిలో విత్తనానికి5గ్రా. కాప్టాన్ /8గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేస్తే రసం పీల్చే పురుగులు మరియు ఆకు మచ్చ తెగుళ్ళ నివారించవచ్చు.
 • నారుకుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ 2గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణంతో మళ్ళను తడపాలి.
 • నారు మొలకెత్తిన 15-20 రోజులకు ఎకరానికి సరిపడే నారుమడికి 80-100 గ్రా. కార్బోఫూరాన్ /ఫిప్రోనిల్ గుళికలను ఇసుకతో కలిపి చల్లి నారుమడిని తడపాలి.

ప్రధాన పొలం

 • వేసవిలో దిక్కిదున్నుట వలన నెలలోని నిద్రావస్థ దశలోని పురుగులు, నులిపురుగులు మరియు మొండి జాతి కలుపు మొక్కల ఉధృతి తగ్గుతుంది.
 • ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండి వేయాలి.
 • ప్రారంభ దశలో ఆశించే చీడపీడల నివారణకు నారును నాటే ముందు 20మి.లీ డైమిథోయేట్ + 100గ్రా. కార్బండి జిమ్ 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 20-30 నిమిషా సార్లు లు ముంచి నాటుకోవాలి.
 • టమాట, వంగ, మిరప మొ. పంటలకు ప్రతి 16 వరుసలకు ఒక వరుస బంతి, క్యాబేజి మరియు క్యాలిఫ్లవర్ పంటలకు ప్రతి 25 వరుసలకు రెండు వరుసల ఆవాలు 15 రోజుల వ్యవధిలో ఎర పంటలుగా నాటాలి.
 • 5 శాతం వేప గింజల కషాయాన్ని 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. పసుపు రంగు అట్టలకు గ్రీజు కాని ఆముదంకాని పూసి పొలంలో అక్కడక్కడ పెట్టి తెల్ల దోమ ఉనికి గమనించాలి.
 • రసం పీల్చు పురుగుల నివారణ అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో అంతర్వాహిక క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి.
 • క్యాబేజి, కాలిఫ్లవర్ లో డైమండ్ రెక్కల పురుగు ఉదృతిని బట్టి నోవాల్యురాన్ 1 మి.లీ . లేదా స్పైనో సాడ్ 0.3 మి.లీ/ లీ. చొప్పున నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • రసం పీల్చు పురుగుల వ్యాప్తిని అరికట్టడానికి పొలంలో చుట్టూ ఎత్తుగా పెరిగే జొన్న లేదా మొక్క జొన్న పంటలను 4-5 వరుసల్లో రక్షక పంటలుగా వేయాలి.

లద్దె పురుగుల యాజమాన్యం

 • పొలంలో అక్కడక్కడ ఆముదం మొక్కలు వేయాలి.
 • గుడ్ల సముదాయలను, జల్లెడాకులను గమనించి ఏరి నాశనం చేయాలి.
 • పురుగుల ఉనికిని గమనించిడానికి ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టాలి.
 • ట్రైకో గ్రామ గ్రుడ్లు పరాన్నజీవులను ఎకరాకు20,000 చొప్పున 10 రోజుల వ్యవధిలో 4-5 వదలాలి.
 • వారానికి ఒకసారి చొప్పున 4 సార్లు యన్ పి.వి. వైరస్  ద్రావణం 250 ఎల్ ఇ. 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.
 • ఎకరానికి 2 చొప్పున పక్షిస్థావరాలు ఏర్పాటు చేయాలి.
 • నాటిన 30 మరియు 45 రొజులకు బి.టి సంబంధి త మందులను 1గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు క్లోరాన్ట్రా నిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ఇండాక్స్ కార్బ్0.5 మి.లీ లేదా  ప్రొఫెనో ఫాస్ 2 మి.లీ/లీ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
 • బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం30.గ్రా/లీ లేదా ట్రైడిమార్ఫ్ లేదా డైనోక్యాప్ 1.0 మి,లీ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
 • వైరస్ తెగుళ్ళ నివారణకు తెగులు ను పీకి నాశనం చేయడంతో పాటు తెగుళ్ళ వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణకు సిఫార్సు చేసిన క్రిమి సంహారక మందులను పిచికారీచేయాలి.
 • త్రుప్పు తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా/లీ లేదా కార్బండిజ+మ్యాంకోజెబ్ 23 గ్రా లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
 • బ్యాక్టీరియా తెగుళ్ళ నివారణకు ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని ఆఖరి దుక్కిలో వేయాలి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30గ్రా+స్రైప్టోసైక్లిన్ 1గ్రా10 లీటర్ల నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలి.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate