పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం

సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం.

 • భారతదేశంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం.
 • వ్యవసాయంలో అన్ని పంట పొలాల్లో నేల, నీరు మరియు గాలి ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా, శిలీముద్ర మరియు వైరస్ తెగుళ్ళు వలన కలిగే నష్టాలన్నీ అధిగమించడం రైతులకు పెనుసవాలుగా మారింది.
 • అంతేకాకుండా చిన్న, సన్నకారు రైతులు రసాయన ఎరువులు, మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు.
 • ఈ రసాయన ఎరువులు, మందులు వాడటం వలన మనకు తెలియకుండానే భూమిలో ఉన్న ఉపయెగకరమైన సుష్మజీవుల పై ప్రభావం చూపి వాటి సంఖ్య రోజు రోజుకు తగిపోతుంది.
 • ఇలాంటి పరిస్ధితులను అధిగంచడానికి పంటపొలాల్లో భూమి యెక్క భూతిక లక్షణాలను ఆధారంగా చేసుకొని సేంద్రియ ఎరువులను వాడటం తప్పనిసరి.
 • సేంద్రియ ఎరువులతో పాటు కొన్ని ఉపయెగకరమైన బ్యాక్టీరియా, శిలీముద్రాలను జీవన ఎరువులుగా మరియు జీవ నియంత్రకాలుగా పంటలలో వాడి పంటలకు లాభం చేకూర్చవచ్చ.
 • వ్యవసాయంలో సుష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నత్రజనిని స్ధిరీకరిస్తాయి మరియు పోషకాలను కరిగించే మరియు పోషకాలను విచ్చిన్నం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి.
 • ఈ సుష్మజీవుల సహజంగానే భమిలో ఉంటాయి. కానీ వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది.
 • పంటల యెక్క దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండే ఈ సుష్మాజీవాలను గ్రహించి, కృత్రిమంగా పెంచి, ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి వాటికీ తగిన ఘన పదార్ధాలతో కలిపి మరల భమిలో వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు.
 • సెంద్రయ విధానంలో జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరాన్ని భూమిలోని వివిధ సుష్మజీవుల ద్వారా పంటలను అందుబాటులోనికి తీసుకురావచ్చు.

జీవన ఎరువులు

 • జీవన ఎరువులు వీటినే మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అంటారు.
 • జీవన ఎరువులు అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయెగకరమైన సుష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపే లేదా నెలలో వేసే ఎరువులు, వీటిలో ముఖ్యమైనవి రైజోబియం, అజటోబీయాక్టర్, సుడాయెనస్.
 • ఈ జవన ఎరువులతో ఉండే ఎపయేగకరమైన సుష్మజీవులు మొక్క వేరు బుడి పేలలోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.

జీవన  ఎరువులను వాడుకునే పద్ధతులు

ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు పద్ధతుల్లో ఉపయెగించవచ్చు.

 1. విత్తనశుద్ధి,
 2. నారును ముంచే పద్ధతి
 3. నేల ద్వారా / భూమిలో చల్లుట
 4. డ్రిప్ పద్ధతి

విత్తనశుద్ధి

 • ముఖ్యంగా నూనె గింజ పంటలైన వేరుశనగ, కుసుమ, ప్రొద్దు తిరుగుడు మరియు పప్పుదినుసు పంటలైన అలసంద, పెసర, మినిము, సోయాచిక్కుడు మెదలైన పంటలలో జీవన ఎరువులను విత్తనశుద్ధి ద్వారా వాడవచ్చును.
 • 200 గ్రా. జీవన ఎరువు ప్యాకెట్ ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవాలి. విత్తనం యెక్క సైజును బట్టి మేతదును నిర్ణయంచుకోవచ్చు.
 • విత్తనానికి పట్టించిన తర్వాత ఒక గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

వాడే పద్ధతి

 • ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీసుకొని కుప్పగా వేసుకొనవలెను (శుభ్రమైన సిమెంట్ నేల లేదా జనపనార బస్తా సంచిని ఉపయెగించవలెను).
 • ఒక ప్యాకెట్ జీవన ఎరువును (200 గ్రా.) బెల్లం ద్రావణం (100 మీ.లి.నీటిలో 1 గ్రా. బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తరువాత వరువలెను) లేదా గంజితో కలపవచ్చు.
 • ఒక ఎకరాకు అవసరమైన నారును తీసుకొని కట్టలుగా కట్టవలెను.
 • ఈ కలిపిన ద్రావణంను కుప్పగా వేసి ఉన్న విత్థనాల పై చిలకరించవలెను. చిలకరించి తర్వాత బాగా చేతులతో కలిపి విత్తనం పొరల ఏర్పడేలాగా చేయవలెను.

నారును ముంచి వాడే పద్ధతి / నారుమడి పంటలలో

 • ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పొగాకు, టమాటా, మిరప, ఉల్లి, క్యాబేజి, కలిపిల్లవర్ పంటలలో వాడవచ్చును.

నేల ద్వారా / భూమిలో చల్లుట ద్వారా

 • ఈ పద్ధతి పంటను, పంట కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
 • తక్కువ కాల వ్యవ్యాధి పంటలలో 1 నుంచి 1.5 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చునా.
 • ఎక్కువ కాల వ్యవధి ఉన్న పంటలలో 2-3 కిలోల  ప్యాకెట్  జీవన  ఎరువును  80-120 కిలోల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో వాడవచ్చును.
 • ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తర్వాత నెలలో వేసి నీటి తడి ఇచ్చుకోవచ్చునా లేదా దుక్కిలో వేసుకొనవచ్చునా లేదా ముందుగా పొలంలో చల్లుకోవచ్చును.

పండ్ల తోటలలో

 • ప్రూనింగ్ (ఆకులూ కత్తిరించిన చెట్లు) చేసిన చెట్ల వేర్ల దగ్గర మట్టిని పాదులుగా చేసి (వేర్లను గాయపరచకుండా) జీవన ఎరువును మరియు కుళ్ళిన ఎరువుల మిశ్రమాన్ని వేసుకొని నీటిని పెట్టుకుంటే సరిపోతుంది.

డ్రిప్ పద్దతిలో

 • సుమారు 300 మి.లి. నీటిలో 500 మి.లి. జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యంక్ లో కలిపి మొక్కలు నాటిన వారం రోజులలో డ్రిప్ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకొనవలెను.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.01694915254
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు