పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ మార్కెటింగ్

వ్యవసాయ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.

ఏం చేయాలి?

 • రైతులు తమ ఉత్పత్తుల ధరను AGMARKNET వెబ్ సైట్ (www.agmarknet.nic.in) నుండి కానీ, కిసాన్ కాల్ సెంటర్ల నుండి కానీ,ఎస్.ఎం. ఎస్. ద్వారా కానీ తెలుసుకోవచ్చు.
 • ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి పూల్ ఎస్ఎంఎస్ కూడా అందుబాటులో ఉంది.
 • అమ్మకందారుల కొనుగోలుదారుల పోర్టల్ WWW.farmer.gov.in/buysell.htmలో అందుబాటులో ఉంది.
 • పంట కోత, నూర్పిడి సరియైన సమయంలో చేసుకోవాలి.
 • సరియైన ధర లభించాలంటే పంట దిగుబడులను అమ్మకానికి పెట్టే ముందు గ్రేడింగ్, ప్యాకింగ్, లేబులింగ్ సరిగా చేయాలి.
 • గిట్టుబాటు ధర లభించాలంటే ఉత్పత్తిని సరియైన మార్కెట్ కు/ మండీకి తీసుకెళ్ళాలి.
 • అధిక లాభాలు గడించడానికి పంటేతర కాలంలో (ఆఫ్ సీజన్ లో) అమ్మడం కోసం ఉత్పత్తులను నిలువ చేసుకోవాలి.
 • తప్పనిసరై నష్టానికి అమ్ముకోకూడదు.
 • మంచి మార్కెట్ సదుపాయాల కోసం రైతులు బృందాలుగా ఏర్పడి మార్కెటింగ్ సహకార సంస్థలను, ఎఫ్.పి.ఒ.లను ఏర్పరుచుకోవచ్చు.
 • మార్కెటింగ్ సహకార సంస్థలు రిటైల్ దుకాణాలను కానీ టోకు దుకాణాలను కానీ తెరవచ్చు.
 • నష్టానికి అమ్ముకోకుండా ఉండటం కోసం రైతులు తమ ఉత్పత్తులను నిలువ చేయటం కోసం శీతల గిడ్డంగులను, గోదాములను ఏర్పరుచుకోవచ్చు.

వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు (అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫా-ఎ.ఎం.ఐ.)

ప్రస్తుతం ఎ.ఎం.ఐ.పధకాన్ని ఆపివేశారు. గతంలో చేసిన పనుల గురించి కానీ, పనుల ప్రగతి గురించి కానీ తెలుసుకోవడానికి సహాయ వ్యవసాయ మార్కెటింగ్ సలహాదారులు, మార్కెటింగ్ మరియు తనిఖీ సంచాలక కార్యాలయం, ఫరీదాబాద్ ను సంప్రదించాలి (Email ID: rgs-agri@nic.in).

జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-ఎస్.ఏ.ఎం.)

వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో సంస్కరణలు తేవడానికీ, వ్యవసాయ సరుకులను దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ లో అమ్ముకోవటానికీ వెసులుబాటు కల్పించి రైతులకు అత్యధిక లాభాలు సమకూరేలా చేయటానికి ప్రభుత్వం 01.07.2015న జాతీయ వ్యవసాయ మార్కెట్ ను అమలు చేయటానికి ఒక పధకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద,ఆన్ లైన్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం 250 నియంత్రిత మార్కెట్లన్నింటా వెబ్ ఆధారిత ప్లాట్ ఫాం నొకదానిని ఏర్పరచారు. మార్కెట్ల పనితీరునంతటినీ డిజిటైజేషన్ చేసి, ఔట్ లైన్ గేటు ఎంట్రీని, లాట్ మేకింగ్ నూ, ఆన్ లైన్ బిడ్డింగ్ నూ, e-అమ్మకపు ఒప్పందాలనూ, e-చెల్లింపులనూ సుసాధ్యం చెయ్యటమే కాక సమాచారం లోని అపసవ్యతను తొలగించటం, లావాదేవీలలో పారదర్శకతను తేవటం, దేశవ్యాపితంగా ఉన్న మార్కెట్లను అందుబాటులోకి తేవటం దీని వల్ల సాధ్యమైంది. దీని వల్ల రైతులకు ఎంతో లాభం కలుగుతుంది. ప్రభుత్వం 8 రాష్ట్రాల్లోని 20 మండీల్లో ఎన్.ఏ.ఎం. పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ-ఎన్.ఏ.ఎం. పోర్టల్ తో 10 రాష్ట్రాల్లోని 250 మార్కెట్లను- ఆంద్రప్రదేశ్ (12), ఛత్తీస్ గఢ్ (5), గుజరాత్ (40), హర్యానా (37), హిమాచల్ ప్రదేశ్ (20), రాజస్తాన్ (11),తెలంగాణా (44), ఉత్తర్ ప్రదేశ్ (66)-అనుసంధానించారు. మరిన్ని వివరాలకు దయచేసి శ్రీ సుభాష్ శర్మ, ఎన్.ఏ.ఎం. కు PMU, చిన్నకారు రైతుల వ్యవసాయ వ్యాపార బృందాన్ని (స్మాల్డ్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్టియమ్ (SFAC), న్యూఢిల్లీ ని సంప్రదించగలరు (e-mail ID: nam@sfac.in). ఈ పథకపు వివరాలు www.enam.gov.in వద్ద కూడా లభిస్తాయి.

రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.పి.ఒ.)

రైతులు ఈ ఎఫ్.పి.ఒ. లో చేరటమేలా?

వ్యవసాయ వాణిజ్యంలో ఉమ్మడిగా ఆసక్తి ఉండి, వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులు ఒక గ్రామంలోనో, గ్రామాల సముదాయంలోనో కలిసి ఒక బృందంగా ఏర్పడి సంబంధిత కంపెనీ చట్టం కింద ఒక రైతు ఉత్పత్తిదారుల కంపెనీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రైతు ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పడితే రైతులకు వచ్చే లాభం ఏమిటి?

 1. రైతులు సరుకుల అమ్మకాలనూ, కొనుగోళ్ళనూ చేసేటప్పుడు మెరుగైన ధరల కోసం బేరసారాలు చేయడానికి ఎఫ్.పి.ఒ. సభ్యులుగా ఒక సముదాయంగా ఉండటం ఉపకరిస్తుంది.
 2. మెరుగైన మార్కెటింగ్ అవకాశాల కోసం వ్యవసాయ ఉత్పత్తిని ఒక చోట పోగు చేయటం, పెద్ద మొత్తాల్లో అమ్మకాలూకొనుగోళ్ళూ చేయటం వల్ల రైతులకు ప్రాసెసింగ్ లో, నిలువ చేయటంలో, రవాణాలో ఖర్చులు మిగులుతాయి.
 3. రైతుల ఉత్పాదనలను సార్టింగ్/గ్రేడింగ్, ప్యాకేజింగ్, కనీస ప్రాసెసింగ్ చేసి వాటికి అధిక విలువను సమకూర్చటం వంటి పనులను ఎఫ్.పి.ఒ. చేపట్టగలుగుతుంది.
 4. పంట కోతలకు ముందూ, తర్వాతా వ్యవసాయంలో యంత్రాలను వినియోగించటం, గ్రీన్ హౌజ్ లు, శీతల గిడ్డంగులు, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకోవటానికి ఎఫ్.పి.ఒ.లు తోడ్పడతాయి.
 5. ఎఫ్.పి.ఒ.లు ఉత్పాదకాల దుకాణాలను, సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాపార కార్యకలాపాలను పెంచుకోవటం ద్వారా రైతులకు ఉత్పాదకాలనూ, సేవలనూ తక్కువ ధరలకు అందించగలుగుతుంది.

ఎఫ్.పి.ఒ. ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవటానికి ఎవరిని సంప్రదించాలి?

సాధారణంగా రాష్ట్రాలలోని వ్యవసాయ, సహకార, కుటుంబ సంక్షేమ విభాగాలు విభిన్న కేంద్ర పథకాల కింద ఎఫ్.పి.ఒ.లను ప్రోత్సహిస్తాయి. ఎఫ్.పి.ఒ.లను ఏర్పాటు చేసుకోవటంలో ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం సంబంధిత విభాగపు సంచాలకులను లేదా చిన్నకారు రైతుల వ్యవసాయ-వాణిజ్య కన్సార్టియమ్ ను సంప్రదించవచ్చు (Email ID: sfac@nic.in).

మీకేం లభిస్తుంది?

క్ర.సం.

వసతుల రకం

కేటగిరీ

సబ్సిడీ పరిమితి

పెట్టుబడి మీద సబ్సిడీ రేటు

1000 మెట్రిక్ టన్నుల వరకు (రూ./మెట)

1000 నుండి 30000 మె.ట వరకు (రూ./మె.ట)

 

 

పధకం

II. ఇతర లబ్ధిదారులందరికి

25%

875.00

750.00

 

 

ii. మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ఇతర ప్రాజెక్టులు

 

ఐ.ఎస్.ఏ.ఎం

ఉపపధకమైన వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక (ఎ.ఎం.ఐ)

 

గతంలోని వ్యవసాయ మార్కెటింగ్ మౌలికా సదుపాయాల అభివృద్ధి/ బలోపేతం. గ్రేడింగ్ స్ధిరికరణ (ఎ.ఎం.ఐ.జి.ఎస్)

 

ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, ఉత్త్రాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్ము – కాశ్మీర్ అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు పర్వత ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాలు

 

b. ఇతర ప్రాంతాల్లో

i. రిజిస్టరు చేయబడిన ఎఫ్.పి.ఒ. లు, మహిళా రైతులు/ఔత్సాహిక వ్యాపారులు షెడ్యూలు కులాలూ, తెగలౌ చెందిన ఔత్సాహిక వ్యాపారులు లేదా వారి సహకార సంస్ధలు

 

ii. ఇతర లబ్ధిదారులందరికి

33.3%

500

వ్యవసాయ మార్కెటింగ్ కై సమగ్ర పధకం (ఇంటెగ్రేటెడ్ స్కీమ్ ఫర్ మార్కెటింగ్ – ఐ.ఎస్.ఏ.ఎం)

 

 1. పర్వత ప్రాంతమంటే సగటు సముద్ర మట్టం కంటే 1000 మీటర్లు ఎత్తున
 2. ఎస్ సి/ ఎస్ టి సహకార సంస్ధలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారి ధ్రువీకరించాలీ.
 3. ఈ పధకం ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఎప్ సి/ఎస్ టి లకు మాత్రమే అందుబాటులో ఉంది. 5.8.2014 నుండి జనరల్ కేటగిరికి రాయితీ నిలిపివేయబడింది.

ఏ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు ఈ సహాయానికి అర్థం?

 • పంటకోతల అనంతర నిర్వహణ కు అవసరమైన మార్కెటింగ్ మౌలికసదుపాయాలన్నీ.
 • మార్కెట్ యార్డ్ ల వంటి మార్కెట్ వినియోగదారుల ఉమ్మడి సదుపాయాలు.
 • గ్రేడింగ్ కు, స్థిరీకరణకు, నాణ్యత ధృవీకరణకు, లేబులింగ్ కు, ప్యాకేజింగ్ కు, (ఉత్పాదన రూపం మార్చకుండా) విలువను జోడించే సదుపాయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు
 • ఉత్పత్తిదారుల నుండి నేరుగా వినియోగదారులకు/టోకు కొనుగోలుదారులకు/ప్రాసెసింగ్ యూనిట్లకు మార్కెటింగ్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు
 • శీతల సప్లై శృంఖలను నిర్వహించేందుకు వ్యవసాయ ఉత్పాదనలను రవాణా చేయడానికి అవసరమైన రీఫర్ వ్యాన్ లు.
 • ఆహార ధాన్యాలను నిలువ చేయడానికి అవసరమైన గోదాముల వంటి మౌలిక సదుపాయాలు.

ఎవరిని సంప్రదించాలి?

 • వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు.
 • సహకార సంస్థలు చేపట్టే ప్రాజెక్టుల కోసం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్.సి.డి.సి.)
 • వ్యవసాయ మార్కెటింగ్ కై సమగ్ర పథకం (ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ -ఐ.ఎస్.ఏ.ఎం.) ఆపరేషనల్ నిర్దేశక సూత్రాలలో (www.agmarknet.nic.in) వివరమైన సమాచారం ఉంది.
3.01075268817
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు