హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / సుస్థిర వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు ప్రాధాన్యత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సుస్థిర వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు ప్రాధాన్యత

సుస్థిర వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు ప్రాధాన్యత

విజయనగరం జిల్లాలో 95 % భూములలో సేంద్రియ పదార్ధం తక్కువగావుంది. భూమిలో సేంద్రియ పదార్ధం తక్కువగా వుంది. భూమిలో సేంద్రియ పదార్ధం పుష్మలముగా ఉంటేనే సుష్మ జీవుల అభివృద్ధి. మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాల లభ్యత, నీటిని నిల్వయుంచే గుణము, బెట్టాను తట్టుకునే గుణము, భూమికి సుస్ధిరంగా దిగుబడినిచ్చే గుణము ఉంటాయి. అలాగే మొక్కకు కావాల్సిన 18 రకాల మూలకాలలో రైతాంగము కేవలం 3 రకాలు పోషకాలు (ఎరువులు) మాత్రమే వాడుతున్నారు. మిగితా 15 రకాల మూలకాలు మొక్కకు భూమే సమకూరుస్తుంది. భూమిలో సేంద్రియ పదార్ధము లేకుండా,నత్రజని, భాస్వరం, పోటాష్ ఎవులను మోతాదు మించి వేసినట్లయితే, భూమికి సుస్దిరముగా దిగుబడినిచ్చే శక్తి కోల్పోయి, ముందు తరాలకు పంటలు పండించడానికి ముబులు పనికిరాకుండా పోతాయి.

కావున ముములలో స్నేద్రియ పదార్ధము తగినంత ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పదార్ధము ఎక్కువ యుండె పశువుల ఎరువులు రైతులకు దొరకక వేయలేక  పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయముగా, ప్రతి 2 సం||లకు ఒకసారి పచ్చిరొట్ట ఎరువులను వేసుకుంటే, గాలిలోయున్న నత్రజని, చెట్టు వెళ్లాలో స్ధిరీకరించి మొక్కలకు సేంద్రియ నత్రజనిని. అందిస్తాయి.

నత్రజని ఎరువుతోపాటు అన్ని రకాల ఎరువులను అందిచడమే కాకుండా, భూ, బోతిక, రసాయనిక స్ధితులను సమతుల్యన్గా ఉంచుతూ, అధిక దిగుబడినిచ్చే శక్తిని భూమికి అందిస్తుంది. భూమికి జీవాన్ని ఇస్తుంది.

పచ్చిరొట్ట పైర్లను పంటకుముందు వేసిగాని, పంట వరుసల మధ్యనవేసి గాని, 45 రోజులు పెంచి, నెలలో కలియదున్నాలి, వారిముందు, చోడు భూముల్లో అయితే జీలుగ వేసుకోవడం మంచిది. మిగితా పంటలకు కొట్టేజనుము, పిల్లిపెసర , పెసర, ఉలవలను వేసుకోవాలి. వారికీ ముందు జీలుగ వేసినపుడు దమ్ము పట్టడానికి నీరు తగినంత లేకపోయినప్పటికీ, 45 రోజులు దాటకుండానే నెలలో కలపాలి. నత్రజని వృధాగా పోకుండా, కనీసం 15-22 సేం|| లోతులో కలియందున్నాలి. కలియదున్న 10-15 రోజులకు నాట్లు వేసుకోవాలి. అలాగే గట్లపై గెరిసిదియ మొక్కలను పెంచుకుంటే ప్రతి సం|| ఒక్క చెట్టు 100-125 కిలో పచ్చిరొట్ట ఆకులను ఇస్తుంది. వీటిని కూడా పొలములో వేసి కలియదున్నుకోవచ్చు.

రకము

కావాల్సిన విత్తనం (ఎ/కిలోలు)

అందు బాటు లోకి వచ్చు పచ్చిరొట్ట

లభ్యమయ్యా పోషక శాతాలు

P         K        N

సరఫరా అయ్యే నత్రజని (ఎ/కిలోలు)

సమానమైన యూరియా పరిమాణం (కిలోలు)

ప్రత్కేక లక్షణాలు

1.జీలుగ

12-14

8-10

0.37,1.25,2.62

30-40

65-87

చేడు భూములకు అనుకూలం  పరికి వేసుకోవాలి.

2.జనుము

8-10

10-15

0.34,1.27,2.86

16-24

35-52

పూతదశలో కలియదున్నాలి. అన్ని మెట్టపంటలకు ముందు వేసుకోవచ్చును. ముంపు నెలకు అనుకూలం

3.పిల్లిపెసర

6-8

4-5

0.28,1.25,2.50

10-14

21-31

పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు.

4.అలసంద

14-16

4-6

0.28,1.25,1.70

14-20

30-43

నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తేలిక నెలలు అనుకూలం.

5. పెసర

12-16

4-5

0.26,1.26,2.21

10-14

21-31

పూతదశలో కలియదున్నాలి.పచ్చ రొట్ట పైరు వేయడం వలన ప్రయోజనాలు
  • పచ్చిరొట్ట పైరులుగా లెగ్యమ్ జాతి పంటలనే వేయాలి. కావున గాలిలో నత్రజని వేరు బుడిపలో స్ధిరీకరించి, సేంద్రియ నత్రజని పంటలకు అందిస్తాయి.
  • పాంచ్చిరొట్ట పైరు భూమిలో కుళ్లినపుడు రసాయనిక ప్రక్రియ జరిగి భూమిలోని పోషక పదార్ధాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. అలాగే లోతు పొరల్లోనున్న పోషకాలు గ్రహించి, పైపొరలో కుళ్లడంవలన, తరువాత పంటకు తేలికగా పోషకాలు లబిస్తాయి.
  • సేంద్రియ పదార్ధము ఉన్నందున సూక్ల్మజీవులు, వశపములు విస్తారంగా అభివృద్ధిచెంది, భూసారాన్ని పెంచుతాయి. దీనివలన వేసిన ఎరువుల వినియెగం పెరగడమే కాకుండా పంట బెట్ట నుంచి తట్టుకోవడం, రోగనిరోధక శక్తి పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా వేళ్ల ధ్వారా వ్యాపించే తెగులు నివారించబడుతుంది.
  • చెడును తగ్గిస్తుంది న్తరజినితోపాటు అన్ని సుల మరియు సూక్ష్మపోషక పదార్ధాలను సక్రమముగా అందిస్తుంది. వరికి ముందు జీలుగ వేసి కలియ దున్నడం వలన, 5-6 బస్తాల దిగుబడి పెరగడమే కాకుండా, ఎరువుల పై ఖర్చు తాగుతుంది కలుపు సమస్య తగ్గుతుంది. గింజల బరువు పెరుగుతుంది.
  • నేలను గుల్లబారేటట్లు చేసి, మురుగునీటి వ్యవస్థ మెరుగవుతుంది.
  • వీటి వలన 15-20% దిగుబడి పెరగడమే కాకుండా, నాణ్యత పెరుగుతుంది.

ఆధారము : భూసార పరీక్షా కేంద్రం

3.04081632653
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు