సాధారణం నామము : తులసి
శాస్త్రీయ నామము : ఓసిమమ్ సాంక్టమ్
కుటుంబము : లామియేసి
ప్రాంతీయ నామము : తులసి
వాణిజ్య నామము : కృష్ణ తులసి, లక్ష్మీ తులసి
ఉపయోగపడు భాగములు : అన్నిభాగములు, పూర్తి మొక్క
ఆసిమమ్ సాంక్టమ్ అనే శాస్త్రీయ నామం కల్గిన ఈ మొక్క లామియేసి కుటుంబానికి చెందినది. ఇది వార్షిక మొక్క ఇది 30-60 సెం.మీ.ల ఎత్తు పెరుగును, మరియు శాఖోపశాఖలుగా విస్తరించును. కాండము మరియు శాఖలు సాధారణంగా ఆకుపచ్చ, ఊదా రంగులలో ఉంటాయి . పత్రాలు 25-50 సెం.మీ. పొడవు 1.6-3.2 సెం.మీ. వెడల్పు కలిగి యుండును. పుష్ప విన్యాసము అనిశ్ఛితం.
భారతదేశామునంతటా విస్తరించి యున్నది.
తులసి సారవంతమైన బంకమన్ను నేలలు మొదులుకొని నిస్సారమైన గులక మరియు క్షార గుణం కలిగిన వివిధరకాల నేలలలో పెరుగును. నీరు నిలువని నేలలలో తులసి ఆకులు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
శీతోష్ణ, సమశీతోష్ణ పరిస్దితులు తులసి సాగుకు అనువైనవి.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ & ఆరోమేటిక్ ప్లాంట్స్, లక్నో వారు సిమ్ – ఆయు , సిమ్ – కాంచన్ మొదలగు రకాలను విడుదల చేసారు.
ఏడాది పొడవునా తులసి సాగు చేపట్టవచ్చును. తులసి నాటిన నుండి 90-95 రోజులలో మొదటిసారి కోతకు వచ్చును తదుపరి 3 నెలలకు ఒకసారి పంటను సేకరించవచ్చును.
ఒక ఎకరా విస్తిర్ణంలో నారు మొక్కలు పెంచుటకు 120-150 గ్రా. విత్తనములు సరిపోవును. తులసి మొక్కలు సాధారణంగా నర్సరీలో పెంచి పొలంలో నాటుకుంటారు. విత్తనము 8-12 రోజులలో మొలక్కెత్తును. ఆరు వారలలో పొలంలో నటుకోవడానికి సేదమగును. నారు వేసవి కాలంలో పొలంలో నటుకోవడానికి సిద్దమగును. నారు వేసవి కాలంలో పోయరాదు.
45*45 సెం.మీ. నుండి 60*60 సెం.మీ. వరకు మొక్కల మధ్య దూరంలో నటుకోవచ్చు.
ఎకరాకు 6 టన్నుల పశువుల ఎరువును నేలలో బాగుగా కలపవలెను.
తులసి నాటినవెంటనే నీరు పెట్టాలి. తులసి మొక్కలు రెండవ సారి నీరు పెట్టేసరికి ఏనుకుంటాయి. చనిపోయిన మొక్కలను ఈ సమయంలో తిరిగి నాటవచ్చును. తులసి సాగు మొదలుపెట్టిన నెల రోజులకు తొలిసారిగా కలుపు తీయాలి. పంట వేసిన రెండు నెలల తరువాత పొలంలో మొక్కల చుట్టూ త్రవ్వాలి. వేసవి కాలంలో నెలకు 3 నుండి 4 తడులు ఇవ్వాలీ. మిగతా కాలాలలో అవసరమైనపుడు తడులు ఇవ్వాలి. సంవత్సరంలో 20-25 తడులు అవసరం అవుతాయి.
తులసి మొక్కలకు సాధరణంగా వచ్చు త్రివ్రమైన తెగుళ్లు ఏమీ లేవు. నీరు నిలిచి వుండే ప్రదేశంలో వేరుకుళ్ళు తెగుళ్లు వస్తుంది, ఈ పరిస్దితులు త్రివమైనచో 3 % వేప నూనేను పిచికారి చేయవలెను.
తులసి ఆకులు సేకరించటానికి పూత మొదలయిన సమయంలో సేకరించాలి. చేట్టును భూమి నుండి 15-20 సెం.మీ. ఎత్తులో కత్తిరించాలి. వర్షం పడిన 2-3 రోజులు పంట కోయరాదు. తులసిని నీడలో 8-10 రోజులు పలుచగా ఆరబెట్టడం ద్వారా దానిలోని ఆక్టివ్ కాంపోనెంటు ను అధికంగా పొందవచ్చును. అరబెట్టే ప్రదేశం బాగా గాలి తాగిలే విధంగా ఉండాలి.
ఒక ఏడాదిలో ఒక ఎకరాలో చేసిన సాగు నుండి 2 లేక 3 పంటకోతల ద్వారా 1.2 టన్నుల (ఎండిన) పంట దిగుబడి లభించును. (8 టన్నుల పచ్చి ఆకులు లభించును)
నేల స్వభావం, వాసావరణ పరిస్థితులు, మిర్కెట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి.
దద్దుర్లు వచ్చినప్పుడు తులసి ఆకుల రాసాన్ని రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. రక్తపోటు నివారణ, దగ్గు మొదడువాపు వ్యాది నివారణలో, మానసిక ఒత్తిడిని అరికట్టుటకు శ్వాసకోశ వ్యాధులను ఆరికట్టుటలో ఉపయోగపడును.
ఆధారం:తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫో్న్: +21 40 66364096, 24764096 . website : ww.tsmpb.in E-mail: tsmapb@gmail.com