హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / చెణకు మెడెం తోటల సాగులో యాజమాన్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చెణకు మెడెం తోటల సాగులో యాజమాన్యం

చెణకు మెడెం తోటల సాగులో యాజమాన్యం.

మన రాష్ట్రంలో సుమారు యాభై వేల హెక్టార్లలో చెణకు సాగులో ఉంది. చెణకు విస్తరిర్ణంలో 55-60 శాతం వరకు మొక్క తోటగాను, 40-45 శాతం మెడెం తోటలుగాను సాగులో ఉన్నాయి. మొక్క తోటను మెడెం చేయటం వలన విత్తనపు ఖర్చుతో పాటు పొలం తయారీ ఖర్చు తగ్గి చెణకు సాగులో ఎంతో లాభం చేకూరుతుంది. దిగుబడుల విషయంలో మొక్క తోటలో హెక్టారుకు 75-80 టన్నులు మరియు మెడెం తోటలలో 50-60 టన్నుల దిగుబడి సాధిస్తున్నాయి. సగటు చెణకు దిగుబడులు పెరగకపోవటానికి గల కారణాలలో కార్శి తోటల దిగుబడి తక్కువగా ఉండటం ప్రధాన కారణం. రైతులు మెడెం తోటల సాగులో తగిన శ్రద్ధ చూపక మేలైన యాజమాన్య పద్దతులను పాటించకపోవటం వలన తోటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అందువలన చెణకు సాగు చేసే రైతులు వివిధ రకాల ఎంపిక నుండి మొక్క తోటలను సకాలంలో నరకటం వరకు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మేడు చెక్కుట

పక్వ దశకు వచ్చిన మొక్క తోటను పదునైన కత్తితో భూమట్టానికి నరికి చెణకును కర్మాగారానికి సరఫరా చేయాలి. భూమి పైనున్న చెణకు చెత్తను గట్ల వరకు ఎగదోసి పొలంలో ఉన్న ఎండిన చెణకు కర్రలను ఏరివేయాలి. భూమి పై ఉన్న మెడులను కత్తితో నరకాలి. ఈ విధంగా చేయడం వలన భూమి లోపల ఉన్న మేడల కణుపులు నుండి పీలికలు పుట్టి ఈ పిలకలు వేర్లు నీరు, ఇతర పోషక పదార్ధాలను సమర్ధవంతంగా గ్రహించగల్గుతాయి.

మన ప్రాంతంలో మెడెం తోటలకు అనువైన చెణకు రకాలు

మన తల్లిగానా మండలాలలో స్వల్పకాలిక రకాలు నవంబర్ నుండి డిసెంబర్ మాసాలలోను, మధ్యకాలిక రకాలు జనవరి మాసంలోను, దీర్షకాలిక రకాలు ఫిబ్రవరి మాసంలోను పక్వానికి వచ్చి, చెణకు నరికి కర్మాగారానికి సరఫరా చేస్తుంటారు. నరికిన తరువాత ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరలో మెడెం చేయడం మంచిది. చెణకు రకాలలో స్వల్పకాలిక రకమైన 83 ఆర్  23 రకం  2 నుండి  3 మెడెం తోటల వరకు మంచి దిగుబడులు ఇస్తుంది. అదే విధంగా కో 7219, కో టి 8201 మరియు కో 7805 కూడా ఈ ప్రాంతానికి అనువైనవి.

కొన్ని సందర్భాలలో తోట నరికే సమయంలో ఎక్కువగా తొక్కుట వలన భూమి పై పొర బాగా గట్టిపడుతుంది. దీని వలన కార్శి తోట్ల వేర్లకు ప్రాణ వాయువు సక్రమంగా అందదు. అంతేకాకుండా తడులు పెఱినప్పుడు నీరు భూమిలోనికి సరిగా ఇంకాదు.  కార్శి పిలకాలకు నీరు, పోషకాలు సరిగా అందక పిలక పెట్టె సామర్థ్యం,  పిలకలు ఎదుగుదల తగ్గి చెణకు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి మెదు చెక్కిన 10-20 రోజుల లోపల భూమిలో తగినంత పదును ఉన్నప్పుడు రెండు సాళ్ల వరుసల మధ్య దుక్కి చేసి భూమి గుల్ల బరేటట్లు చేయాలి. దీని వలన మొక్క తోట వేర్లు నశించి ప్రతి పిలక నుండి కొత్త వేరు అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా లోత్తెన కాల్వలలో నాటి పెంచిన మొక్క తోటల నుండి మంచి మెడెం పంట వస్తుంది. నీటి ముంపుకు గురైన మొక్క తోటలలో వేర్లకు ప్రాణ వాయువు సరిగా అందక గుబ్బలు చనిపోతాయి. ఇటువంటి తోటలను నరికి మెడెం వేయునప్పుడు, తోటల్లో ఖాళీలు ఎక్కువగా ఏర్పడి మెడెం దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అదే విధంగా విపరీతమైన గాలులకు, అధిక వర్షాలకు, మట్టి ఎగద్రోయ కుండా పోయిన చెణకు తోటలు తరచు పడిపోయి దుబ్బులు ఎక్కువగా చినిపోతాయి. పడిపోయిన తోటలను నరకడం ఆలస్యమైన కొద్దీ దుబ్బలు చనిపోవడం ఎకువై వాటి నుండి మెడెం తోటలు పెంచినప్పుడు ఎక్కువగా ఖాళీలు ఏర్పడి, కార్శి, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. బాల్య దశలో నీటి ఏడాదికి గురైన తోటల్లో కూడా దుబ్బులు చనిపోయి ఖాళీలు ఏర్పడతాయి. కార్శి తోటల్లో ఖాళీలు నింపడం వలన హెక్టారుకు సుమారుగా 8 టన్నుల అదనపు దిగుబడి పొందవచ్చు. ఖాళీలు నింపుటకు అదే రకానికి చెందిన మూడు కళ్ల ముచ్చెలు గాని, పాలిథిన్ సంచలలో పెంచిన ఆరువారాల వయసు గల మొలకలను గాని, మొక్క తోటలోని దుబ్బలను గాని ఉపయెగించవచ్చు. మెదు చెక్కిన వారం - పది రోజులలోపు కార్శి తోటలలో ఖాళీలు నింపాలి. ఖాళీలు నింపిన మెలికలు లేదా దుబ్బులు బ్రతికే వరకు నీరు పోసి సంరశించుకోవాలి. లేత వయసులో రెండు, మూడు తడులు దగ్గర దగ్గరగా పెట్టడం వలన మొక్కలు బ్రతికి త్వరగా పిలకలు తొడుగుతాయి.

తెలంగాణ జిల్లాలకు సిఫార్సు చేయబడ్డ ఎరువుల మేతదు

ఉత్తర తెలంగాణ మండలంలో సాగు చేసే కార్శి చెణకు తోటకు హెక్టారుకు 375 కిలోల నత్రజని, 100 కిలోల భాస్వరం మరియు 100 కిలోల పోటాష్ ఎరువులను వేయాలి. అంటే ఒక ఎకరానికి 330 కిలోల నత్రజని రూపంలో ఉండే యూరియా మరియు 250 కిలోల భాస్వరం ఎరువు రూపంలో ఉండే సింగిల్ సూపర్ ఫాస్పెట్ మరియు 86 కిలోల పోటాష్ రూపంలో ఉండే మ్యురేట్ అఫ్ పోటాష్ ఎరువులను వేసుకోవాలి. సాధారణంగా రైతులు భాస్వరం మరియు పోటాష్ ఎరువులను వాడటం తక్కువ. కార్శి తోటలకు సిఫారసు మేరకు నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను వాడటం వలన 10 టన్నుల అదనపు దిగుబడి వస్తుంది. అయితే మేడు చెక్కి వెంటనే సగభాగం నత్రజని, పూర్తి భాగం పోటాష్ ఎరువులను వేయాలి. మిగిలిన సగభాగం నత్రజని మేడు చెక్కిన 45 రోజులకు పిలకలు మెదళ్లలో చిన్న గుంతలలో వేసి మట్టి నింపాలి. నత్రజని ఎరువులను గుంతలలో వేయడం వలన మొక్క ఎరువును బాగా సద్వినియెగపరుచుకుంటుంది. ఇక సుష ధాతువు లోపాలు తరుచు మన జిల్లాల్లో కనపడుతుంటాయి. ముఖ్యంగా ఇనుప ధాతువు మరియు జింక్ ధాతువు లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో జింక్ లోపే సవరణకు 2 గ్రా. జింక్ సల్పేట్ లీటరు నీటిలో కలిపి 45 రోజుల వయసులో ఒకసారి మరియు 60 రోజుల వయసులో ఒకసారి పిచికారీ చేయాలి. అదే విధంగా ఇనుప ధాతువు లోపం సవరణకు 20 గ్రా. అన్నభేది మరియు 2 గ్రా. నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.

కార్శి తోటల్లో కలుపు నివారణ చర్యలు

కార్శి తోటల్లో బాల్య దశలో దగ్గర దగ్గరగా తడులు పెట్టడం వలన కలుపు ఎక్కువగా వచ్చి చెణకు పిలకాలతో తేమ, పోషక పదార్ధాల కొరకు పోటీ ఏర్పడి కార్శి పిలకలు ఎదుగుదల కుంటుపడుతుంది. మేడు చెక్కిన తరువాత వరుసల మధ్య లోతు దుక్కి చేయడం, చెణకు చెత్తను కప్పడం వంటివి చేసినట్లయితే కలుపు ఉధృతిని కొంతవరకు నివారించుకోవచ్చు. అదే విధంగా రసాయన కలుపు మందులను ఎకరానికి 2.4 లి. 2,4 డి డైమిథైల్ అమైన్ సాల్ట్ 58% డబ్ల్యు.పి. లేదా 1.5 లి. 2,4 డి-ఇథైల్ ఈస్టర్ 38% ఇ.సి. పిచికారీ చేసుకోవాలి. తోట నాటిన 60 రోజుల వ్యవధిలో వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 1.3 కిలోల 2,4 డి-సోడియం సాల్ట్ 80% డబ్ల్యు.పి. పొడి లేదా ఎకరానికి 12 గ్రా. మెట్ సల్ఫ్యూరిన్ మిథైల్ 20% డబ్ల్యు.పి. మందును చెణకు ఆకుల పై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. తుంగ జాతి కలుపు అధికంగా ఉన్న సందర్భాలలో ఎకరానికి 36 గ్రా. హెలోసల్ఫ్యూరిన్ మిథైల్ మందును పిచికారీ చేసుకోవాలి.

చెణకు చెత్త కప్పడం

సాధారణంగా మొక్క తోట నరికినప్పుడు  ప్రతి 100 టన్నుల దిగుబడికి, 10 టన్నుల చెణకు చెత్త లభ్యమవుతుంది. మన రైతులు మొక్క తోట నరికిన తరువాత చెరకు చెత్తను కాల్చివేయటం పరిపాటి. పురుగులు, తెగుళ్ళు ఉధృతంగా సోకినా తోటల్లో తప్ప మిగిలిన తోటల్లో చెత్త కాల్చివేయటం మంచిది కాదు. చెత్త కాల్చడం వలన వచ్చే వేడికి దుబ్బులు చెణకు చెత్తను పొలమంతా సమానంగా కప్పడం మంచిది. మేడు చెక్కడం, వరసల మధ్య లోతు దుక్కి చేసి భూమిని గుల్ల పరచడం, ఖాళీలు నింపడం, ఎరువులు  వేయడం, తడి ఇవ్వడం పూర్తి అయిన పిదప హెక్టారుకు 3 టన్నుల చెణకు చెత్తను భూమిపై పలుచగా కప్పిన తరువాత చల్లడం వలన త్వరగా చివికి సేంద్రియ ఎరువుగా ఉపయెగపడుతుంది. చెత్త కప్పడం వలన తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు బెడద, పీక పురుకు ఉదృతి కూడా తగ్గుతుంది.

అదే విధంగా కార్శి తోటలను ఏపుగా ఎదగటానికి పిలకలు పెట్టె సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. కనుక కార్శి చేసిన వారం నుండి 15 రోజులకు ఒకసారి (బాల్య దశలో) నీటి తడులు సక్రమంగా ఇవ్వాలి. ఏపుగా  కార్శి తోటలలో ఏప్రిల్ నుండి మే మాసాల్లో నెలకొనే బెట్ట పరిస్ధితులను కొంత వరకు తట్టుకొనగలుగుతాయి.

కనుక చెణకు కార్శి తోటల దిగుబడి పెంచడానికి మొక్క తోట నుండి తగిన జాగ్రత్తలు తీసుకొని మెల్తైనా యాజమాన్య పద్దతులను అనుసరించి సాగు చేయడం వలన రైతులు కార్శి తోటలలో అధిక దిగుబడి సాధించడమే కాకుండా, చెణకు సగటు దిగుబడులు పెరుగుతాయి.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.5
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు