অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటి ప్రాముఖ్యత - సాగునీటి పరీక్ష ఆవశ్యకత పంటమొక్కలు - పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష

నీటి ప్రాముఖ్యత - సాగునీటి పరీక్ష ఆవశ్యకత పంటమొక్కలు - పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష

మానవునికి నీరే ప్రాణాధారం. మనం చేసే పనిలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువలన నీరు 'విశ్వద్రావణి' అని కూడా పిలవబడుతుంది.

నీరు ప్రాణాధారం ఎందుకు ?

మానవుని నిత్యజీవితంలో నీరు ప్రధానపాత్ర పోషిస్తున్నప్పటికీ నీటికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. భారతదేశం త్వరితగతిన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశంగా మారబోతోంది. అందుకే మన నీటి రక్షణకు ప్రాధాన్యం పెంచే పనులను చేపట్టవలసి ఉంది.

 • కొన్ని సులభతరమైన పద్ధతులను పాటించడం వలన నీటి దుర్వినియోగాన్ని అరికట్టి తెలివిగా ఉపయోగించవచ్చు.
 • ఇప్పటికే చాలా దేశాలు, రాప్తాల మధ్య నీటి యుద్దాలు జరిగాయి. పెరుగుట విరుగుట కొరకే అని మన పెద్దలు చెప్పిన సామెత ఊరికే పోలేదు.
 • సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులను సవరిస్తూ దూసుకుపోతున్న ఇప్పటి తరం నిత్యజీవితానికి అవసరమయ్యే నీటిని మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. కానీ దానికి తగినట్టుగా నీటి వనరులు పెరగటం లేదు. భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతున్నాయి.
 • అందుకే పర్యావరణం ప్రగతి అంశంపై 1992లో ప్రత్యేక మహాసభ నిర్వహించింది. యు.ఎన్.ఒ. (ఐక్యరాజ్య సమితి) నీటి వనరులను రక్షించేందుకు ప్రతిఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.

రాలేగావ్ సిద్ధిని ఆదర్శగ్రామంగా మార్చడం : (అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర)

 • 1975కి ముందు రాలేగావ్ సిద్ధి అత్యంత ఘోరమైన గ్రామంగా ఉంటూ, నిస్సహాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితిని, బాధ్యతారహిత గ్రామీణ నాయకత్వాన్ని కలిగి ఉండేది.
 • భారతీయ సైన్యంలో సేవచేసూ అన్నా హజారే అని అభిమానంగా పిలుచుకున్న కిసాన్ బాబురావ్ హజారే 1975లో స్వచ్ఛంద విరమణ చేసినంత వరకే ఇది కొనసాగింది.
 • 1965లో జరిగిన యుద్ధంలో చావుతో చేసిన సావాసం అతడి జీవిత గమ్యాన్ని మార్చివేసింది.
 • ఇతరుల శ్రేయస్సు కోసం తనను తాను అంకితం చేసుకోవాలని నిర్ణయించుకొని తన స్వంత గ్రామ ఉన్నతి కోసం తిరిగి వచ్చి ఊరిలో ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు.

జల వనరుల నిర్వహణ - ఆర్థిక పురోగతికి కీలకం

ఆకలిగొన్న వ్యక్తి నుంచి సూత్రబద్ధ జీవితాన్ని ఆశించలేరని అన్నా హజారే చెప్పేవారు. తనకు తన కుటుంబానికి తిండి సమకూర్చుకోవడమే అతడి తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. ప్రభుత్వం, సైన్యంలో ఉద్యోగాల ద్వారా, జనాభాలో కొద్దిమందికి ఆర్థిక బలాన్ని కల్పించినప్పటికీ, రాలేగాన్ సిద్ధిలోని జనాభాలో అత్యధిక భాగం ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటోంది. మంచి సాగునీటి వ్యవస్థను నిర్మించడం ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వీలవుతుందని అన్నా హజారే గుర్తించాడు. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న రాలేగావ్ భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్న అన్నా హజారే నీటిని అడ్డగించి మళ్ళీ ప్రవహించేలా చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం నీటి గట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించారు. స్వచ్ఛంద కృషి ద్వారా నిర్మించిన తొలి నీటి గట్టుకు చిల్లు పడగా దానిని ప్రభుత్వ నిధితో పునర్నిర్మించాడు.

రెండవ పెద్ద సమస్య అయిన నేలకోతను నివారించడంకోసం కూడా అన్నా హజారే చర్యలు చేపట్టాడు. వృథాగా వెళ్తున్న నీటిని తనిఖీ చేయడం ద్వారా నేల, నీటిని ఆదా చేయడానికి కొండవాలు పొడవున పచ్చిక పొదలు, 3 లక్షల చెట్లను నాటించాడు. ఈ ప్రక్రియకు అనుబంధంగా అటవీకరణ నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యాంలు, సిమెంట్ కట్టడాలు కీలక ప్రాంతాల్లో నిర్మించారు. జలవనరుల అభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి. గ్రామంలోని అనేక మంది రైతులకు నీరు ప్రస్తుతం నమ్మకమైన వనరుగా ఉండటంలో చాలామంది అవకాశాలు పెరిగాయి. రాలేగావ్ గ్రామం బిందు, బైవాల్స్ సాగులో కూడా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసింది. బిందుసేద్య పద్ధతిలో ਹੇ జరిగే మొత్తం ప్రాంతంలో బొప్పాయి, నిమ్మ, మిరప మొక్కలు నాటించారు. తృణ ధాన్యాలు, నూనెగింజలు, నీటిని తక్కువగా ఉపయోగించే కొన్ని వాణిజ్య పంటలను పెంచారు. గ్రామస్తులు అధిక దిగుబడి పంటలను పెంచడం ప్రారంభించారు. గ్రామంలో పంటల పద్ధతిలో కూడా మార్పు వచ్చింది.

ఖరీఫ్

1975-76లో 240 ఎకరాలలో వాన నీటి ఆధారంగా సజ్జలను పండించగా 20 ఎకరాలలో మాత్రమే సాగునీటి ద్వారా సజ్జలు పండించారు. 1985-86లో వర్షపు నీటిలో పండించే సజ్జ సాగు అరవై ఎకరాల్లో మాత్రమే సాగగా, ఖచ్చితమైన సాగునీటి కారణంగా 150 హెక్టార్లలో అధిక దిగుబడినిచ్చే సజ్జలను పండించారు. 1975–76లో కేవలం 2 హెక్టార్లలో మాత్రమే ఆకుకూరలు పండించేవారు. అదీ 1985-86 కాలంలో అరవై హెక్నార్లలో ఆకుకూరలు పెంచడానికి ఉపయోగించారు. ఆకుకూరలకు పూణె, ముంబై మార్కెట్లు సిద్ధంగా ఉండేవి.

రబీ

1975-76లో వర్షం ఆధారంగా పండే రాగిని 320 హెక్టార్లలో సాగుచేయగా, 50 హెక్టార్లలో రాగిని సాగునీటి సేద్యం ద్వారా పండించారు.

1985-86లో సాగునీటితో పండే రాగి సాగు 250 హెక్టార్లకు పెరగగా, వాన నీటితో పండే రాగి కేవలం 90 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. ఇటీవల కాలంలో వర్షపు నీటి ద్వారా గోధుమ సాగు 12 హెక్టార్ల నుండి 7 హెక్టార్లకు తగ్గగా, సాగునీటి ద్వారా గోధుమ సాగు ఒకటి నుండి ఇరవై మూడు హెక్టార్లకు పెరిగింది. నూనెగింజలకు సంబంధించి సాగునీటి ప్రాంతం సున్నానుండి పదిహేను హెక్టార్లకు పెరింగింది.

రాలేగావ్ సిద్ధి గ్రామం ఈ రోజున రూ.80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. ఈ మార్పుల ఫలితంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 1975-76లో 294.3 టన్నులు నుండి 1985-86లో 1386.2 టన్నులకు పెరిగింది. ప్రస్తుత ధరలలో ఇది రూ. 3.46 లక్షల నుంచి 31.73 లక్షలకు పెరిగినట్లు లెక్క అంటే పరిమాణంలో 4.7 రెట్లు పెరుగుదల, విలువ పరంగా 9 రెట్లు పెరిగింది.

ఇజ్రాయిల్ నీటి మిరాకిల్ సీక్రెట్

ఒక్క శుష్క వాతావరణం, తగినంతగా సహజ నీటి నిల్వల సవాళ్ళను అధిగమించి ఎల్లప్పుడూ రాష్ట్ర స్థాపన నుండి ఇజ్రాయెల్ జనాభాకు, ఆర్థిక వృద్ధికోసం ఒక కీలక అవసరం ఉంది.

 • ఈ సాంకేతిక పద్ధతులు, దీర్ఘకాలిక ప్రణాళికలు, ఆవిష్కరణల ద్వారా ఇజ్రాయెల్ యొక్క నీటి విభాగానికి నిరంతర పెరుగుదల దారితీసింది.
 • ప్రస్తుతం ఇజ్రాయెల్కు సంవత్సరానికి దాదాపు ఒక బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. అయితే విస్తృతమైన ఇంజనీరింగ్, జీవ, లాజిస్టిక్ సవాళ్ళను అధిగమించారు. ఆవిష్కరణలు ద్వారా దేశం నీటి అవసరాల కోసం ఈ కల్పనలు చేశారు.
 • దేశవ్యాప్తంగా నీటి సరఫరా ఖర్చులకోసం ఒక అద్భుతమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ నీటి సరఫరా వ్యవస్థ 1955–64 నుంచి దేశం అంతటా విస్తరించింది.
 • మొత్తంలోని నీటితో 10 రెట్లు ఎక్కువ దిగుబడి అందించే కొత్త పంట వంగడాలు.
 • లోతైన బావులు 1500 మీటర్ల 500 మీటర్ల అధిక పంపు సెట్టింగులకు చేరే అగ్రగామిగా పని.
 • సముద్రజలం, ఉప్ప భూగర్భజలం పెద్ద స్థాయి లవణ నిర్మూలన (దీపాలినేషన్).
 • వినూత్న బహుళ అంతస్తుల నీటి భద్రత పదతులు, ముందసు హెచ్చరిక వ్యవస్థలు, ఇతర సాంకేతికతలు. ఆదాయ రహిత నీటి నష్టాన్ని తగ్గించే వినూత్నమైన పద్దతులు.
 • ఆటోమేటెడ్ బిందుసేద్యం ద్వారా నేరుగా మొక్క మూలాలకు నీరు అందించే అత్యంత ఆధునిక నీటి పారుదల పద్ధతులు.
 • వ్యవసాయ రంగంలో వ్యర్థ నీటిని పునర్వినియోగించడం.

ప్రణాళికలో ఆవిష్కరణలు, విధానాలు

 • అనేక ప్రభుత్వ వ్యూహాలు, విధానాల ద్వారా పౌరులకు తాగునీటి నిరంతర సరఫరా నిర్ధారించడానికి, స్థిరమైన జాతీయ నీటి వినియోగం ప్రోత్సహించడానికి రూపొందించారు.
 • లవణ నిర్మూలన (డీసాలినేషన్) ఇజ్రాయిల్ నీటి వినియోగం మరొక ఆవిష్కరణ.
 • జాతీయ నీటి వినియోగంలో ఇజ్రాయెల్ నీటి అవసరాలకు సహజ సరఫరా అధిగమించకూడదు.
 • ఈ లోటును పరిష్కరించడానికి ఇజ్రాయిల్ లవణ నిర్మూలన సామర్థ్యం వేగంగా 560 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది.
 • ప్రపంచంలో అతిపెద్ద సముద్ర నీటి రివర్స్ ఓస్మోసిస్ తక్కువ కాలంలోనే అనేక సదుపాయాలు, అత్యల్ప ఖర్చులు, అనేక ఆవిష్కరాలు చేరుకుంది.

సాగునీటి పరీక్ష

ఇంతకు పూర్వం సాగునీటి నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేక రైతులు నిర్భయంగా వాడుతుండేవారు. కానీ పెరుగుతున్న నీటి కొరత వలన భూమిలోని ఎక్కువ లోతుల్లోని పొరల నుండి నీటిని తోడుట వలన ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హాని కారకమవుతున్నాయి. దీనివలన పంటలు సరిగా ఎదగకపోవటమే కాకుండా, నేలలు కూడా బాగుచేసేందుకు వీలుపడని రీతిలో చెడిపోయేందుకు ఆస్కార వున్నది. ఇటువంటి వ్ర తికూల పరిస్థితులేర్పడకుండా, కొత్తగా తవ్విన బోరు బావుల నీరును, నర్సరీల కొరకు వేరే ప్రాంతం నుండి రప్పించి వాడే నీటిని మొదటి పరీక్ష చేసి ఆ తరువాత వాడుకోవడం మంచిది.

 • సాగునీటిని పరీక్ష కొరకు పొలంలోని బోరు బావి నీటిని పంపులో సుమారు 20-30 నిమిషాలు బయటకు వదిలిపెట్టిన తరువాత మంచి ప్లాస్టిక్ సీసాలో సుమారు 500 మి.లీ. (అర లీటరు) తీసి సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.
 • వీలైనంతవరకు గాజు సీసా బదులు ప్లాస్టిక్ సీసాను వాడుటయే శ్రేయస్కరం. మందు సీసాలను, టానిక్ సీసాలను వాడరాదు.
 • నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో 3-4 సార్లు కడిగి, ఆ తరువాత నీటి నమూనాతో నింపుకోవాలి. సీసా మూతలో గాలి లేకుండా నీటిలో పూర్తిగా నింపాలి.
 • కాలువలు లేదా చెరువుల నుండి నమూనా నీటిని తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలి. ఆ నీటిలో సీసాను 2-3 సార్లు కడిగి, ఆ తరువాత నమూనా నీటితో నింపాలి.
 • ఒక్కోసారి పరిశ్రమల నుండి వదిలి పెట్టబడిన నీటిని కూడా పరీక్ష చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే స్థలం వద్ద నీటి నమూనాను తీయాలి.
 • అలాగే వీలైతే అదే నీరు పరిశ్రమ ఆవరణ నుండి బయటకు వచ్చిన ప్రాంతం నుండి కూడా నమూనాను తీసి పరీక్ష కోసం పంపితే, రెండింటి నీటి నాణ్యత పోలిక లేక వ్యత్యాసాన్ని గమనించవచ్చు.
 • నమూనాతో పాటు రైతు పేరు, సర్వేనంబరు, బోరు లేక కాలువ వివరాలు గ్రామం, మండలం తదితర విషయాలు తెలియజేయాలి.

పంటమొక్కలు/పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష

కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా పండ్ల తోటల్లో చెట్లు కొన్ని సంవత్సరాల తరువాత భూమి అడుగు పొరల్లోని ప్రతికూల పరిస్థితుల వలన గానీ, భూమి నిస్సారమవటం వలన గానీ పోషక పదార్ధాల లోప లక్షణాలు కన్పిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో నేల ఉపరితలం పొరల మట్టికన్నా చెట్ల భాగాలను, ముఖ్యంగా ఆకులను పరీక్ష చేసి పోషక పదార్ధాల లోపాలను సవరించుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో సాధారణ వార్షిక పంటలలో కూడా పంట నాటిన తర్వాత పోషక పదార్థాలు ముఖ్యంగా సూక్ష్మపోషక పదార్థాల లోపాలు కన్పిస్తాయి.

ఈ పరిస్థితుల్లో పంట భాగాలకు పరీక్ష చేయించి తదనుగుణంగా చర్యలు తీసుకుని పంట దిగుబడి, నాణ్యత తగ్గకుండా చేసుకోవచ్చు.

 • పంట ఆకులు, పండ్ల చెట్ల ఆకులలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సందేహం కలిగినప్పుడు ముఖ్యంగా అవి పెరగకుండా, చిన్నవిగా పసుపు రంగుగా లేదా ఎర్రగా మారుతున్నట్లయితే వెంటనే పరీక్ష చేయించాలి.
 • అయితే ఈ చిహ్నాలు కీటకాలు లేదా రోగం వలన వచ్చినవి కావని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మొక్క/చెట్ల ఆకులను పోషక పదార్థాల లోపాల కొరకు పరీక్ష చేయించాలి. ఇటువంటి పరీక్ష కొరకు, ఏ పంటలో ఏ భాగాన్ని పరీక్షకు పంపాలో పట్టికలో ఇవ్వడం జరిగింది. ఒక ఎకరానికి 8-10 చోట్ల ఆకులను సేకరించి నమూనాగా పంపాలి.

నమూనా కొరకు తీయాల్సి పంట ఆకులను శుభ్రమైన చేతులతో తుంచి/తీసి మంచి నీటిలో బాగా కడిగి ఆరబెట్టి మంచి కాగితపు సంచుల్లో వేసి కావాల్సిన సమాచారాన్ని (రైతు పేరు, పంట పేరు, గ్రామం, మండలం తదితర వివరాలు పొందుపరచి) ప్రయోగశాలకు పంపాలి.

ఈ పరీక్షలను 4-5 రోజుల్లో పూర్తి చేయించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఈ పరీక్షలను ద్రాక్ష అరటి, ఎగుమతికి అనువైన పండ్లతోటల్లో పాటిస్తున్నారు. ఈ పరీక్షల కొరకు ప్రత్యేక సదుపాయాలు కలిగిన ప్రయోగశాలలు కావాల్సి ఉన్నందున ఇప్పుడిప్పుడే ఇవి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

పరీక్ష కొరకు సేకరించాల్సిన ఆకుభాగం

మామిడి - పూర్తిగా తయారైన కొత్త ఆకు

చీని, నిమ్మ - పూర్తిగా తయారైన కొత్త ఆకు (కొమ్మ చివరన)

అరటి - పైనుండి 3వ ఆకు (ఈనె తీసివేసి)

ద్రాక్ష - 5వ ఆకు తొడిమ

వరి – పై నుండి 3వ ఆకు

చెరకు - పైనుండి 3 నుండి 5వ ఆకు

పత్తి - పైనుండి 3వ ఆకు

పరీక్ష ఫలితాల విశ్లేషణ

భూసార, సాగునీటి, పంట ఆకుల పరీక్ష ఫలితాలను విశ్లేషించేందుకు పరీక్షలు జరిపిన చోట ఉన్న అధికారుల సహాయం తీసుకోవాలి. ఫలితాలు పోస్టు ద్వారా వస్తే సమీపంలో ಡಿನ್ನಿ వ్యవసాయ శాఖ అధికారులను గానీ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోని సంబంధిత శాస్రవేత్తలను సంప్రదించాలి. తదనుగుణంగా చర్యలు తక్షణం తీసుకోవాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate