অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పెసర

పెసర పైరు తొలకరిలో పండించే అపరాలలో ముఖ్యమైనది. తెలంగాణ జిలాల్లలో దీని సాగు విస్తీర్ణము ఎక్కువ. ఈ పైరును ముక్యంగా ఖమ్మం, నల్గొండ, మెదక్, గుంటూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, కరీంనగర, శ్రీకాకుళం, కృష్ణ, రంగారెడ్డి, అదిలాబాద్ మరియు వరంగల్ జిలాల్లలో పండిస్తారు. పెసర మన రాష్ట్రములో సుమారు 2 .78 లక్షల హెక్టారులో సాగుచేయబడుచునది దిగుబడి 1 .94 లక్షల టన్నులు, గోదావరి డెల్టా ప్రాంతంలో రబి వారి తరువాత వేసవి కాలములో ఈ పైరు విస్తీర్ణము గణవియంగా పెరుగుచున్నది.

పెసారు అన్ని కాలాలలోనూ అన్ని పంటల సరళిలోను, పంట మార్పిడిగా మరియు అంతర పంటగా పండించటానికి అనువైనది. పెసర తక్కువ కాలంలో కోతకు వస్తుంది కాబట్టి ఆయకట్టు ప్రాంతంలోనూ వారికీ ముందు పెసర సాగు లాభదాయకంగా ఉంటుంది.

తొలకరి పెసర లో సాగు సమస్యలు:

 • పైరు ఒకేసారి కోతకు రాకపోవటం, ఏదో ఒక కొత్త వర్షాలలోచిక్కుకు పోవటం, దాని వాళ్ళ కూలి ఖర్చులు పెరగటం.
 • కొత్త దశలో పైరు వర్షాలలో చిక్కుకుని  మొక్క పైనే కాయలో గింజలు మొలకెత్తి నాణ్యతను నష్టపరచటం.
 • వితిటపుడు కనీస ఎరువులు వాడకపోవడం, కలుపు తీయకుండా, సస్య రక్షణ చేయకుండా సాగుచేయటం.
 • తెగుళ్ళకు, పురుగులకు లొంగిపోవటం, పల్లాకు తెగులు, ఆకుముడత వైరస్ తెగులు, నల్ల ఆకుమచ్చ తెగులు ముఖ్య సమస్యలు.

ఖరీఫ్ కి అనువైన రకాలు

యల్.జి.జి 450, యల్.జి.జి 407, యల్.జి.జి 460, పూస 105, డబ్ల్యూ.జి.జి 2, యమ్.జి.జి. 295, డబ్ల్యూ.జి.జి 37, యమ్.జి.జి 348.

రబీకి అనువైన

ఎల్.జి.జి 407, ఎల్.జి.జి 460, ఎల్.జి.జి 410, ఎల్.జి.జి 295, ఎల్.జి.జి 348, డబ్ల్యూ.జి.జి. 37, టి.యమ్, 96-2.

వారి మాగాణాలలో అనువైన రకాలు

యల్.జి.జి 460, టి.యం 96-2, యల్.జి.జి 410, యల్.జి.జి 450

పెసర రకాలు:

 • ఎల్.జి.జి 46 : నిటారుగా పెరుగుతుంది. గుత్తులలో కాయలు ఎక్కువ, కాయలు పొడవుగా ఉంటాయి. అన్ని కాలాలకు అనువైన రకము. కావు పై భాగంలో ఎక్కువగా ఉంటుంది . పంట కాలము 65-70 రోజులు దిగుబడి 14-16 క్వింటాళ్లు/హే.
 • టి.యం. 96-2 : మొక్కలు నిటారుగా పెరుగుతాయి. బూడిద తెగులును తట్టుకొనే రకము. గింజలు లావుగా, పచ్చగా మెరుస్తుంటాయి. వారి మగనాలుకు అనువైన పెసర రకము. పంట కాలము 60-65 రోజులు, దిగుబడి 14-16 క్వి/హె
 • ఎల్.జి.జి 410 : మాగాణికీ అనువైన రకము నిటారుగా పెరుగుతుంది గింజలు పచ్చగా మెరుస్తూ  ఆకర్షణీయంగా ఉంటాయి. కాపు మొక్కల పై భాగంలో ఉంటుంది. పంట కాలము 65-70 రోజులు, దిగుబడి 14-16 క్వింటాళ్లు/హె
 • యల్.జి.జి 407 : మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్థు లావుగా ఉంటాయి. ఎల్లోమీజాయిక్ తెగులును కొంతవరకు, ఆకుపచ్చ తెగులును బాగా తట్టుకొంటుంది.
 • యల్.జి.జి 450 : మొక్కలు మధ్యస్థ ఎత్తులో వుండి గుబురుగా కనిపిస్తాయి. మొక్క పాతుకొచ్చే సమయంలో వర్షాలు కురి స్తే కాయలలోని జింజలు కొంత వరకు పాడవకుండా తట్టుకుంటాయి. నల్ల ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది.
 • యమ్.జి.జి 295 (మధిర 295) : మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కావు మొక్క పైబాగానే ఉండి. గింజ మధ్యస్థ లావుగా, సాదాగా ఉంటుంది. నల్ల మచ్చ తెగులును తట్టుకొంటుంది. బెట్టాను, అధిక తేమను తట్టుకుంటుంది.
 • ఏకశిల (డబ్ల్యూ.జి.జి. 37) : గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మొరుస్తుంటాయి. మన రాష్ట్రమంతటా సాగు చేసుకొనవచ్చును. అన్ని కాలాల్లో పండించటానికి అనుకూలమైనది. ఎల్లోమొజాయిక్ తెగులును తట్టుకొనగలదు. ఒకేసారి కోతకు వచ్చును.
 • పూసా 105 : అన్ని ప్రాంతాలకు అనువైనది. కావు మొక్క పైబాగానే కానీ, ఒకే సరి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ వంతుగా పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఎల్లోమీజాయిక్ మరియు ఆకామచ్ఛ తెగుళ్లును కొంతవరకు తట్టుకొంటుంది.

నెల తయారీ మరియు ఎరువులు:

మురుగు నీరు నిలవని, తేమను నిలువుకోగల చేదు లేని భూములు అనుకూలం, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రు తో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో 20 కోలోల నతజని, 50 కిలోల భాస్వరం ఎరువులను హెక్టారుకు వేసి కరియా దున్నాలి. (50 కిలోల డై ఆమెనియం ప్లాస్టీట్ లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ప్లాస్టీట్ + 25 కిలోల యూరియా/ఎకరాకు).
విత్తన శుద్ధి:

ఒక కిలో విత్తనానికి 3గ్రా ధైరామ్ లేదా 3గ్రా , కాఫ్టన్ లేదా 3గ్రా. మాంకోజాబ్ ముందుతో విత్తన శుద్ధి చేసిన తరువాత నీడలో ఒక ఆరా గంట ఆరనిచ్చి తరువాత 5గ్రా. దయమీదకిమ్స్ లేదా 5 మీ.లి ఇమిడాక్లోపిడి మధుతో విత్తన శుద్ధి చేసి నీడలో బాగా ఆరనివ్వాలి. విత్తడానికి 12 లేక 24 గంటల మందు విత్తన శుద్ధి చేసి విత్తతే తొలిదశలో ఆశించే రసం పీల్చే పరుగులు, తెగుళ్లు బారి నుండి కాపాడుకోవచ్చు . చివరగా వితకోనే ముందుగా 10 కిలోల విత్తనానికి 200గ్రా. రైజోబియం కల్చరును పట్టించి విత్తుకోవాలి.

పైరు విత్తడం :

జూన్ నుండి జులై 15 వరకు విత్తడం వలన సాధారణ దిగుబడుల నుండి అధిక దిగుబడులను సాధించవచ్చు. తొలకరి వర్షాలు పడిన తట్టారు చేసుకున్న పొలంలో గోర్తుతో ఏకురాకు సుమారు 6-7 కిలోల విధానాన్ని రొండు వరుసల మధ్య 30 సేం.మీ మరియు మొక్కల మధ్య 10 సేం.మీ ఉండేటట్లు విత్తితే చ మీ. కు సుమారు ౩౩ మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడులు సాధించడమే కాకుండా ఆంథ్ర కృషి చేసి కలుపు నివారించి తధ్వర 15-20 శాతం అధిక దిగుబడి సాధించడానికి అవకాశముంది. విత్తనాలు వెదజల్లే పద్దతిలో ఆయితే ఎకరాకు 8 కిలోలు విధానం అవసరం అవుతుంది.

అంతర కృషి మరియు కలుపు యజమాన్యము :

పెసర పైరును తొలి 30 రోజులు వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 రోజులు, 30  రోజులు దశలో గొఱు/దంతి ధ్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో బాటు తేమను గూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూములలో అయితే విత్తిన వెంటనే పెండిమెదలిన్ కలుపు నిషాని ఎకరాకు 1.0-1.25 లీటర్ల చొప్పున 200 నీటికి కలిపి విత్తన 24 గంటల లోపు పిచికారీ చేసినట్లయితే దాదాపు 80 శాతం కలుపును అరికట్టవచ్చు.

నీటి యాజమాన్యం :

పెసర వర్షధారపు పంట ఐనప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వసతి వున్నచోట ఒకటి లేక రెండు తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడులు సాదించవచ్చు. మొదటి తడి మొగ్గ దశలోనూ మరియు రెండవ తడి పిందె ఏర్పడిన తరువాత ఇవ్వాలి. నల్ల రేగడి భూముల విషయంలో మాత్రం తేలిక తడులు ఇవ్వాలి. ఒక వేళా పైరు బెట్టుకు వచ్చి, నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులలో యూరియా 1.5 నుండి 2.0 శాతం ధారణని వరం రోజులు వ్యవధిలో రెండు సార్లు పంట పై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.

పంట వేసిన తొలి దశల్లో (20 నుండి 30 రోజులు) ఒక వేళా అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మరి పళ్లకు తెగులును తొలి ఉంటుంది. ఈ స్ధితిని రైతులు ఇసుప ధాతు లోపంగా గుర్తించి అన్నభేది 50 గ్రా+ నిమ్మ ఉపు 5 గ్రా + యూరియాను 100 నుండి 150 గ్రాములు 10 లీటర్లు నీటికి కలిపి వరం వ్యవధిలోపు రెండు సార్లు పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించవచ్చు.

పురుగులు

తామర పురుగులు :

ఈ పురుగు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగ చేస్తుంది. తల్లి మరియు పిల్లపురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకులలో రసాన్నిపీల్చడం వలన ఆకులు ముడతలు పది వంకరలు తిరుగుతాయి. పైరు తొలి దశల్లో పరుగులు తీవ్రత అధికంగా వున్నట్లయితే మొక్కలు వారికి క్రమేపి ఎండిపోవడం కూడా జరుగుతుంది. తామర పురుగు ఆశించిన మొక్కలు పెరుగుదల ఆడిపోయి గిండసబారిపోతాయి. తామర పురుగులు ఆకుల నుండి రసం పీల్చడమే కాకా ఆకుముడత అనే వైరస్ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు మెనోక్రోటోపాస్ 1.6 మీ.లి. లేక ఎసి పేట్ 1గ్రాము లేదా పిప్రోనిల్ 1 మీ.లి.ను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెల్ల దోమ:

తెల్ల దోమ రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వలన ఆకులు ముడతలు పది క్రమేపి ఎండి రాలిపోతాయి. తెల్ల దోమ సోకినా మొక్కల అడుగు భాగంలో గల ఆకుల పై నల్లటి బూజు ఏర్పడి కిరానా జన్య సంయోగక్రియ సరిగా జరగకపోవడం వలన మొక్కలలో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు ఆకులలోను రసాన్ని పిచటమేగాక పల్లాకు తెలుగు అను వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. నీటి నివారణకు 1 గ్రాము ఎసి ఫైట్ లేదా 1.5 మీ.లి. ట్రైజోపాస్ లేక ఎసిటమాప్రిడ్ 0.2 గ్రా ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేయవలెను.

మారుకా మచ్చల పురుగు :

ఇటీవల కాలములో పెసర, మినుము మరియు కంది పైర్లలో మరుక మచ్చల పురుగు ఈదృతి ఎక్కువగా ఉండటం గమనిస్తున్నాము. మరుక ముచ్చ పురుగుని వాడుకలో పూత పురుగు లేక గూడా పురుగు అని కొన్ని ప్రాంతాలలో బూజు పురుగు అని కూడా అంటారు.

మారుకా మచ్చల పురుగు అపరాల పంటలో కలుగచేయు నష్టం :

గుడ్ల నుండి బయటికి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గలలోకి చొచ్చుకుపోయి లోపల లేక భాగాలను తీతు ఉంటాయి. మొదటి ఒకటి రెండు దశలలో పు మొగ్గలలోపాలే తింటూ తరువాతి దశలలో లేక ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గుడుగా చేసుకొని గూడు లోపలనే ఉంటూలోపలి పదార్ధాలను తినివేయటం వలన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది . కాయ అడుగు బహన చిన్న రంధ్రం చేసి లోపలి వెళ్లి కాయలలోని గింజలను తిని వేసి వాటిని డొల్ల చేస్తుంది. డొల్ల చేసిన కాయలలో పురుగు విసర్జన పదార్ధం మరియు మిగిలిన మొక్క భాగాలు అంత కలిపి బూజులాగా ఏర్పడుతుంది. మరుక పురుగు గుళ్ళలోనే ఉండి తింటూ ఉండటం వలన పురుగులను ఆశించే బాధనిక పురుగులు మరియు పరాన్న జీవుల బారి నుండి రక్షింపడటమే కాకా పురుగు ముందల ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశముంది. మరుక ముచ్చల పురుగు ఉదృతి ఆర్థికంగా ఉండి సరియేన సమయంలో నివారించలేక పోయినట్లయితే దాదాపు 80 శతం వరకు కూడా దిగుబడులకు నష్టం కలుగుతుంది. కావున పంటను ప్రతి రోజు గమనిస్తూ సకాలంలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.

మారుకా మచ్చల పురుగు నివారణ:

 • పొలం చుట్టూ గట్ల పై కలుపు మొక్కలు లేకుండా పరిసుబ్రాంగా ఉంచాలి.
 • పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశకు ముందే తప్పనిసరిగా పైరు పై 5% వేపగింజల కాషాయం లేదా వేపనూనె 5.0 మీ.లి ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కలు పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు ప్ర్రదానికి ఇష్టడవు, అంతేకాక అప్పటికే పంట మొక్కల పై వున్నా గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
 • మొగ్గ, పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు వున్నాయేమేనని పరిశీలించాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరి పైరిపాస్ 2.5 మీ.లి లేక ధాయేదికార్బ్ 1.0 గ్రా లేక ఎసి పెట్ 1.0 గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
 • పంటలో గుళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసి పెట్ 1.5 గ్రా లేక క్వినాల్ పాస్ 2.0 మీ.లి. లేక క్లోరి పైరీ పాస్ 2.5 మీ.లి లేక నో వేల్యూరాన్ 0.75 మి.లీ. లో ఏదో ఒక ముందుతోటాటూగా తప్పనిసరిగా ఉదర స్వభావం కలిగిన డైక్లోరివాస్ ముందు 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరల అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారీ చేయాలి.
 • పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోశాడ్ 0.4 మి.లీ లేక ఇమామేక్లిట్ బెంజోయెట్ 0.4 మి.లీ లేక రైనాక్సిపిర్ 0.3 గ్రా లేక ప్లుబెండీఏమైడ్ 0.2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పైరు పై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

కాండపు ఈగ :

గత రెండు మూడు సంవత్సరాలుగా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ పెసర మరియు పంటలో కాండం ఈగ ఆశించి నష్టం కలుగచేయుడం గమనించడమేనది. కాండం ఈగ పంట తొలి దశలోనే అనగా సుమారు 30 రోజుల లోపు మాత్రమే ఆశించి ఎక్కువగా నష్టం కలుగచేస్తుంది. కాండం ముదిరిన తరువాత ఈ పురుగు వలన నష్టం ఉండదు. తల్లి ఈగ మొక్కల భూమికి దగ్గరగా మొక్క మొదలు పై లోపలి చొప్పంచి గూద్లు పెడుతుంది. గుడ్ల నుండి వెలుడిన పిల్ల పురుగులు కాండం లోపలే వుంది కాండాన్నితొలుస్తూ లోపలి భాగాన్ని తినివేయడం వలన కాండం కోళ్లలా మరి మొక్కలు మొదలు దగ్గర విరిగి పడిపోతేయే లేత మొక్కలలో ఆకులు పసుపు రంగుకు మరి మొక్కలు వాడాలి ఎండిపోతాయి. వితైముందు కార్బొసల్పన్ 30 గ్రాము లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ ముందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే దీని ఉధృతి తగ్గుతుంది. పురుగు ఉనికిని గమనించిన వెంటనే మెలొక్రోటోపాస్ ను 1.6 మి.లీ. లేక క్లోరి పైరిపాస్ 2.5 మి.లీ. లేక ఎసి పెట్ 1 గ్రా లేక డైమిదోయేట్ 2.0 మి.లీ. కానీ పిచికారీ చేసుకోవాలి.

పొగాకు లద్దె పరుగు :

పొగాకు లద్దె పరుగు ఉధృతి సాధారణంగా పెసర పిణ్డలో ఎక్కువగా గమనించడం జరిగింది. లద్దె పురుగులు ఆకులలో పత్ర హరితాన్ని గీకి తినుట వలన ఆకులు తెల్లగా జల్లెడ ఆకులుగా మారిపోతాయి. ఈ లద్దె పురుగులు పెద్దవయ్యే కొద్దీ ఆకులను, పూత పెందేలను మరియు కాయలను పూర్తిగా తినివేస్తాయి. పెద్ద పురుగులు పగటి పూత నీడలో నెలలో పగుళ్లలోనూ, రాలిన ఆకుల క్రింద దాగి వుంది రాత్రి పూట పేరుకు నష్టం కలుగజేస్తాయి.

పైరులో ఎకరానికి పది లింగాకర్షణ బుట్టలు పెట్టి తల్లి పురుగు ఉధృతిని గమనించాలి. తల్లి పురుగులు ఆకు అడుగుభాగాన గుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ ఆకులను తుంచి గుడ్లను నాశనం చేయాలి. పురుగు తొలి దశలో మెనోక్రోటోపాస్ ను 1.6 మి.లీ. లీటరు నీటికి గని లేక ఎసి పాట్ 1 గ్రా ఒకలైతేరు నీటికి లేదా క్వినాల్ పాస్ 2.0 మి.లీ/లీటరు నీటికి లేదా క్లోరిపైరి పాస్ 2 .5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులు పెద్దవై ఉధృతి ఎక్కువగా వున్నపుడు సాయంత్రం వేళల్లో విషపు ఏరును (5 కిలోల తవుడు + అరకిలో బెల్లం కలిపి అరలీటరు మెనోక్రొట్ఫాస్ లేదా క్లోరిపైరిపాస్ లేదా అరకిలో కార్బరీల్ మరియు సరిపడు నీరుని కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకోవాలి) మొక్కకు మొదళ్ళు దగ్గర పడేలా సాయంత్రం వేళల్లో చలి పురుగును నివారించుకోవాలి.

తెగుళ్లు :

పల్లాకు తెగులు (ఎల్లో మేజాయిక్):

ఈ మధ్య కాలంలో పెసర పైర్లను పల్లాకు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజెస్తుంది. ఈ తెగులు తెల్లదోమ ధ్వారా వ్యాపి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రెండు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి పసుపు మచ్చలు పెరిగి ఆకుమీద పసుపు మరియు ఆకుపచ్చ చర్యలుగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. పిందెలు మరియు కాయల పసుపు రంగులోకి మరి వంకర్లు తిరిగిపోతాయి. కాయంతో విత్తనాలు ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలిదశలోనే ఆశించినట్లయితే మొక్కలు గిడసబారిపోయే ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లి పెసర పైన అధివృధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ధ్వారా ఈ తెగులు పైరుకు వ్యాపిస్తుంది.

పల్లాకు తెగులు యజమాన్యము :

 • పల్లాకు తెగులును తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. ఎల్.జి.జి. 407, ఎమ్.ఎల్.267 , పి.డి.యం-54 మరియు ఎల్.జి.జి. 460 రకాలు తెగులు తట్టుకుంటాయి.
 • ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. లేదా ధాయేమీదకిమ్స్ 5 గ్రా .కె.జి. విధానానికి కలిపి విత్తనశుద్ధి చేసినట్లైతే పైరును తొలి దశలో వైరస్ తెగులును వ్యాపించచేయు రసంపీల్చే తెల్లదోమ పురుగుల నుండి కాపాడొచ్చును.
 • పైరు చుట్టూ నాలుగు వరుసలు మొక్కజొన్న గని లేక జొన్న విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లును వ్యాపింప చేయు తెల్లదోమ, తమర పురుగులు మరియు పేనుబంక వంటి రసంపీల్చే పురుగులను నివారించవచ్చు.
 • పొలము గాట్లు మీద మరియు రోడ్డు పక్కన వైరస్ ఆశించిన కలుపు మొక్కలను పైకి నాశనం చేయవలెను.
 • తెగులు సోకినా మొక్కలను తొలి దశలోనే పైకి నాశనం చేయవలెను.
 • పొలములో పసుపు రెండు పూసిన ఎత్తులకు ఆముదము కానీ లేక గ్రీజు కానీ పూసి ఉంచిన తెల్ల దోమ అత్తలకు అంటుకొని నివారించబడును.
 • తెల్ల దోమ నివారణకు వేప జింజల కాషాయం (10 కె.జి/ ఎకరాకు) పిచికారీ చేయవలెను.
 • వేపనూనె 5 మి.లీ.లీటరు నీటికి కలపి పిచికారీ చేయవలెను ఎసిపెట్ 1 గ్రా . లేదా ట్రైజోపెస్  1.5 మి. లీ. లేదా మెనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా మేతసిస్ ట్రాక్స్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయవలెను.

ఆకుముడత తెగులు (తలముడు తెగులు):

ఇది వైరస్ జారీ తెగులు, దీని ఉధృతి వర్షాభావ పరిస్ధితులలో ఎక్కువగా ఉంటుంది . ఇది తామరపురుగు (తిప్స్) ధ్వారా ఒక మొక్క నుండివెరొక మొక్కకు వ్యాపి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంధులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు బాగములోని ఈనెలు రక్తవర్ణమును షోలో ఉంటాయి. లేత దశలో వ్యాధి పాకినట్లయితే తలలు మాడిపోయే మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాపి చెందడానికి కారణమైన త్రిప్స్ నివారణకు 1.0 గ్రా . ఎసి పెట్ లేదా 2.0 మి.లీ. డైమిదోయేట్ మందును లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సీతాఫలం తెగులు (బొబ్బరాకు తెగులు):

ఇది వైరస్ జాతి తెలుగు. ఇది పేనుబంక పురుగుల ధ్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవిగా అయి ఆకు పై ఉబ్బెత్తుగా అయ్యి సీతాఫలం కాయలాగా కనబడుతుంది. ఆకులు ముందురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులు వ్యాపి చెందడానికి కారణమైన పేనుబంక నివారణకు 1.0 గ్రా. ఎసి పెట్ లేదా 2.0 మి.లీ. డైమిదోయేట్ లేదా 1.6 మి.లీ. మెనోక్రోటోపాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు:

రాత్రివేళలో చలిగాను, పగటిపూట వేడిగాను ఉన్నపుడు బూడిద తెగులు పెరగటానికి అవకాశముంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఆకులమీద తెల్లని ముచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ ముచ్చలు నుంచి శిలింద్రబీజాలు ఉత్పత్తి అయి ఆకులమీద తెల్లటి పొరగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పోరా కాయలమీద, పిందెల మరియు కందము మీద వ్యాపి చెందుతాయి. ఆకులు ఎండి రాలి పోతాయి. ఆకుల మీద బూడిద పొరగా ఏర్పడటం వరణ కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయే తగినంత ఆహార పదార్ధములు తయారుకాక దిగుబడులు తగ్గటమేకాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ తెగలు ఉధృతిని గమనించిన వెంటనే కార్బండిజమ్ 1 గ్రా. లేదా డైనోకప్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి అవసరాన్నిబట్టి 10-15 రోజులు వ్యవధిలో మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.

తప్పు తెగులు :

పైరు 50 నుంచి 60 రోజుల దశలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకుల మీద గుండ్రని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. మొదట్లో ఈ మచ్చలు పసుపు రంగులో ఉంటాయి. తరువాత ఈ మచ్చలు మద్యలో తూపు రంగుకి మారుతాయి. ఈ మచ్చల నుండి శిలింద్రజిజాలు ఉత్పాతాయి ఆకు అంత తూపు రంగులోకి మారిపోయే ఆకులు ఎండి రాలి పోతాయి. అందువరల పంట దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది.

పైరు మీద తుపు తెగులును గమనించిన వెంటనే బెటర్నల్ 1 గ్రా. లేదా ట్రైడిమోర్ప్ 1 మి.లీ. లేదా డైనోకప్ 1 మి.లీ./ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆధారము : Krishi vasant central institution of cotton research, Nagpur© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate