హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / రైతుస్థాయిలో విత్తనోత్పత్తికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రైతుస్థాయిలో విత్తనోత్పత్తికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

వ్యవసాయరంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం.పంట దిగుబడి, మార్కెట్ లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్ని మనం విత్తిన విత్తన నాణ్యత మీద ఆధారపడి ఉంటాయి.

వ్యవసాయరంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం. పంట దిగుబడి, మార్కెట్ లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్ని మనం విత్తిన విత్తన నాణ్యత మీద ఆధారపడి ఉంటాయి.కావున పంట ఉత్పాదకత పెంపుదలలో నాణ్యమైన విత్తనం కీలకమైనది. వివిధ పంటలలో, ఇతర ఉత్పాదకత అంశాలను పరిశీలించినట్లయితే, కేవలం నాణ్యమైన విత్తనం వాడకం ద్వారానే 15-20 శాతం అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనల ద్వారా రుజువైనది. విత్తన నాణ్యత ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ జన్యుపరమైన, యాజమాన్యపరమైన కారణాలు విత్తన నాణ్యతను కాపాడటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.

యాజమాన్య పద్ధతులు

 • వ్యవసాయ వాతావరణం, పంట వేసే ప్రదేశం
 • మనం వేయదలచుకున్న విత్తన పంట అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనదిగా ఉండాలి.
 • కొన్ని పంటలకు నిర్దేశిత వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాలనే ఎంపిక చేసుకోవాలి.
 • తగినంత వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత పంటల పెరుగుదలకు అనుకూలం
 • మరుగు నీరు సదుపాయం గల తేలికపాటి నేలలు అనుకూలం
 • నేల నుండి సంక్రమించే తెగుళ్ళు, కీటకాలు, క్రితం పంట నుండి వచ్చిన కలుపు, ఇతర పంట మొక్కలు భూమిలో లేకుండా చూసుకోవాలి.
 • అదే పంట / రకం ఇంతకు ముందు సీజన్ లో విత్తనోత్పత్తి నిమిత్తం ఎంపిక చేసిన పొలంలో పండించి ఉండకూడదు.

వేర్పాటు దూరం

 • విత్తన ధృవీకరణ నిర్దేశాలను అనుసరించి విత్తన పంట పొలాలు సమీప పొలాల నుండి తగినంత దూరం పాటించాలి.
 • పంట కోత తర్వాత కూడా వివిధ రకాల మధ్య వేర్పాటు పాటించడం వల్ల కలీ జరగకుండా కాపాడవచ్చు.

రకం

 • ఎంపిక చేసుకున్న విత్తనం అధీకృత సంస్థల నుండి సేకరించి, ఆ ప్రాంతానికి అనువైనదిగా, చీడపీడలను తట్టుకునే శక్తి, మంచి మొలకశాతంతో కూడిన త్వరగా పక్వానికి వచ్చేదిగా ఉండాలి.

విత్తడం

 • విత్తన పంటను యాంత్రిక గొర్రులతో వరుసలలో విత్తుతారు. ఇలా చేయడం వల్ల అవసరమైనంత విత్తన మోతాదు, సరైన లోతులో పడుతుంది.
 • మంచి మొలక రావడానికి చిన్న పరిమాణం గల విత్తనాలను లోతు తక్కువ లోనూ, పెద్దగా ఉన్న విత్తనాలను కాస్త లోతులో విత్తుకోవాలి.
 • వరుసలలో విత్తడం వలన ససయరక్షణ, కల్తిల ఏరివేత, క్షేత్ర తనిఖీలు సులభంగా చేయవచ్చు.

కల్లీల ఏరివేత

 • సమయానుకూలం కల్తిల ఏరివేత అనేది విత్తనోత్పత్తిలో అత్యంత కీలక ప్రక్రియ. సాధారణంగా ఉండవలసిన లక్షణాలకు భిన్నంగా ఉన్నటువంటి మొక్కలను పుష్పించడానికి ముందే తీసివేయాలి.
 • ఈ కలీల ఏరివేతను మొక్క పెరుగుదల ప్రథమ దశలో, పూత దశలో, పక్వదశలో, కోత సమయంలో, కోత తర్వాత నిల్వ సమయంలో కూడా చేపట్టి పంట నాణ్యత కాపాడుకోవాలి.

పరాగసంపర్కం

 • పరపరాగ సంపర్కపు పంటలలో పరాగ సంపర్క వాహకాలను పెట్టడం వలన విత్తన దిగుబడి పెరుగుతుంది.

కలుపుతీత

 • మంచి నాణ్యమైన విత్తనాలు పండించడానికి కలుపు రహిత పంట పొలాలు అవసరం.
 • ఇవి పంట దిగుబడులను తగ్గించటమే కాక పంట కోత సమయంలో జరిగే కల్తిలకు ముఖ్య ఆధారం ఈ కలుపు మొక్కలు కావున వీటిని విత్తనోత్పత్తి పొలంలో సమూలంగా నిర్మూలిద్దాం.

నీటి యాజమాన్యం

 • పంట వివిధ కీలక దశలలో నాణ్యమైన నీటిని ఇచ్చినట్లయితే మంచి నాణ్యమైన రోగ రహిత విత్తనాన్ని పొందవచ్చు.
 • విత్తనం సమంగా మొలకెత్తడానికి, నిర్ణీత మొక్కల సంఖ్య ఉండేందుకు నేలలో తేమ సరిపడా ఉండాలి.
 • నీటి తడులను పంటకోతకు 2-3 వారాల ముందుగా ఆపివేయడం వలన పంటకోతకు అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

మొక్కల పోషకాలు

 • మొక్కల ఎదుగుదల, వృద్ధికి సరిపడినంత నత్రజని, భాస్వరం, పొటాషియం, ఆవశ్యక పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. అందువలన పంట పోషకాల అవసరాలను తెలుసుకొని మొక్కలను వాటిని సరైన మోతాదులో అందించాలి.

సస్యరక్షణ

 • సమర్థవంతంగా కీటకాలను, తెగుళ్ళను నియంత్రించినప్పుడు నాణ్యతతో కూడిన ఆరోగ్యమైన పంటను పండించవచ్చు.
 • విత్తనశుద్ధి వలన నేల నుండి సంక్రమించే తెగుళ్ళను అదుపు చేయవచ్చు.
 • సమయానుకూలంగా తగిన మోతాదులో నన్యరక్షణ వుందులు వాడినప్పుడు సమర్థవంతంగా కీటకాలు తెగుళ్ళ నుండి రక్షణ పొందవచ్చు.

పంటకోత

 • త్వరిత గతిన పంటకోతలు చేపట్టినట్లయితే నూర్పిడి, శుభ్రపరచడంలో ఎక్కువ నష్టాలు, కోతలు ఆలస్యం చేస్తే వాతావరణ సంబంధమైన పంట పడిపోవడం, విత్తనాలు రాలిపోవడం, మొక్కమీదే మొలకెత్తడం, కీటకాలు - తెగుళ్ళ వలన నష్టాలు వస్తాయి.
 • పంటకోత సమయాన్ని తెలపడానికి విత్తనంలోని తేమశాతం మంచి గుర్తు, సాధారణంగా విత్తన తేమ శాతం 20 శాతం కంటే తక్కువ ఉంటే యాంత్రిక నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఆరబెట్టడం

 • మంచి విత్తన నాణ్యత పొందడానికి పంట నూర్పిడి కల్లాలు సిమెంట్ పూత పూసినవి / టార్పాలిన్ అయి ఉండాలి.
 • కళ్భాల్లో విత్తనాలను పలుచని వరుసలలో ఆరబెట్టడం వలన తేమను తగ్గించి, నాణ్యత, నిల్వ శక్తి పెంపొందించవచ్చు.

విత్తన నిల్వ

 • విత్తనాన్ని స్వల్పకాలిక నిల్వకు సంచులలో నిల్వ చేయాలి.
 • విత్తనం నిల్వ చేసే గది శుభ్రమైనదిగా ఉండాలి. క్రిమి సంహారిణిలను పిచికారీ చేయాలి.
 • విత్తన సంచులలో చీటీలు వేసి చెక్క బల్లలు / ప్లాస్టిక్ బల్లలపై పేర్చాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.99209486166
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు