హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / సోయచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సోయచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు

సోయచిక్కుడు సాగు మరియు సస్యరక్షణ చర్యలు

తెలంగాణలో ఖరిఫ్ లో పండించే వర్షాధార పంటల్లో సోయచిక్కుడు ప్రధానమైనది ఉత్తర తెలంగాణలో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 7.2 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుచేస్తూన్నారు. soyachiku.jpgపంట వేరు బుడిపెల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్ధిరీకరించి భుసారాన్ని పెంచగలడం, తక్కువ పెట్టుబడి, స్వల్పకాలికత అంనే కారణాలవల్ల రైతులు ఈ పంటలు సాగుచేస్తున్నారు.

రైతులు సోయాపంటను ఆశించే చీడపిడల గురించి అవగాహన ఏర్పరచుకొని సరైనా సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పాందే అవకాశం ఉంది. రైతులు చీడపీడలను సరైనా సమయంలో గుర్తించకపోవడం, చీడ పిడలను ఆలస్యంగా గుర్తించడం వలన తక్కువ దిగుబడి పొందుతున్నారు.

సోయాచిక్కుడును ఆశించే ముఖ్యమైన పురుగులు

కాండం తొలిచే ఈగ : సోయపంటను ఆశించే ముఖ్యమైన పురుగు ఇది. ఈగ లేత ఆకుల పై చిన్న గుంతలు చేసి గుడ్లు పెడుతుంది. గుడ్లనుండి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తిండం వలన కాండం భాగాలు వడలి పోతాయి. రైతులు సరైన సమయంలో ఈగను గుర్తించలేకపొతే పంటను పురుగు అధికంగా నష్టపరుస్తుంది. ఈ పురుగు నివారణకు అసిఫేట్ 1.0 గ్రా. లేదా క్లోరంధ్రానిప్రొల్ 0.3 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం తొలిచే పెంకు పురుగు : ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో రంధ్రం చేసి లోపలికి పొయి ప్రధాన కాండాన్ని, పక్క కొమ్మల లోపలి పదార్దాన్ని తినడం వలన కొమ్మలను భాగాలు ఎండిపోతాయి. ఈ పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ లేదా ప్రొపినోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

రసం పిల్చే పురుగులు – (పచ్చపురుగు, పెనుబంక, పచ్చదోమ, తామర పురుగు) : రసం పిల్చే పురుగులు ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి ముడుచుకుపోతాయి. తామర పురుగు నివారణకు ఫిప్రొనిల్ 2 మి.లీ ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ధయోమిధాక్సామ్ 0.3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పిండి పురుగు : పిండి పురుగు పిల్ల, తల్లి పురుగులు కొమ్మ, మొగ్గలు, కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వాడి ఎండిపోతాయి. ఈ పురుగు నివారణకు 3 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 గ్రా. ఎసిఫెట్ తో పాటుగా 1 మి.లీ జిగురు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు : ఈ పురుగు లార్వాలు ఆకులలోని పత్ర హరితాన్ని గీకి తినడం వలన తొలుత ఆకులు తెల్లగా కనిపిస్తాయి. తరువాత దశలో ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను జల్లేడగా మారుస్తాయి.

సెమీ లూపర్ : ఈ పురుగు పంట అన్ని దశలలో ఆశిస్తుంది. కానీ పూత, కోత దశలో ఇది ఎకువ నష్టాన్ని కల్గిస్తుంది. ఈ పురుగు నివారణకు ట్రైజోఫాస్ 2 మి.లీ. లేదా 3 మి. లీ. ప్రొఫెనోపాస్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ళు

పైటోఫైరా వేరు కాడం కుళ్ళు తెగులు : ఉత్తర తెలంగాణ జిలాల్లో ఈ తెగుళ్ళు అధికంగా కనిపిస్తుంది. నల్లరేగడి మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఈ తెగులు ఎకువగా సోకుతుంది. ఈ శిలింధ్రం వల్ల వేసిన విత్తనాలు భూమిలోనే కుళ్ళిపోవడం గానీ లేదా మొలకెత్తిన వెంటనే గానీ లేదా మొలకెత్తిన 10-20 రోజుల తర్వత మొక్కలు అక్కడక్కడ చనిపోతాయి. మొక్కలు ఎదిగే దశలో ఆకులు పసుపు పచ్చగా మారి కండానికి అతుక్కొని ఉంటాయి. అలాంటి మొక్కల వెళ్ళు గమనించినట్లయితె గోధుమ రంగు మచ్చలతో కుళ్ళి ఉంటాయి. పంట మార్పిడి ఎండాకాలంలో లోతైన దుక్కులు చేసుకోవడం, ఉధృతి ఎక్కువగా ఉన్న నెలల్లో 3 గ్రామెటలాక్సిల్ లేదా కాప్టాన్ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుదద్ధి చేసుకోవాలి.

అంత్రక్నోస్ తెగులు : ఆకుల పై గుండ్రని వలయాకారపు మచ్చలు కాండం, కాయలు, ఆకుల పై ఏర్పడతాయి. ప్రధానంగా కాయలు పై వలయాకారపు మచ్చలు ఏర్పడి కాయలు చిన్నవిగా మారి వంకర్లు తిరుగుతాయి. ఈ తెగులు వల్ల గింజలో మారి వంకర్లు తిరుగుతాయి. ఈ తెగులు వల్ల గింజలో నునేశాతం. దిగుబడి తగ్గుతుంది.

నివారణ : గింజలు విత్తే ముందు ఒక కిలో విత్తనానికి 3గ్రా. కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు తొలి దశలో గుర్తించినట్లయితే కార్బొండిజమ్ మాంకోజేబ్ కలిగి ఉన్న మందు 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.03536977492
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు