హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / పాలకూరను ఆశించే ముఖ్యమైన చీడపురుగులు – వాటి నివారణ పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పాలకూరను ఆశించే ముఖ్యమైన చీడపురుగులు – వాటి నివారణ పద్ధతులు

పాలకూరను ఆశించే చీడపురుగుల వల్ల కలిగే నష్టం వాటి నివారణ పద్దతులు.

మన రాష్ట్రంలో వివిధ రకాల ఆకుకూర పంటలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. క్రమ క్రమంగా మనుషుల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన వలన ఆకు కూరలకి మంచి డిమాండ్ ఉంది. ఆకు కూరలలో అందరికి ఇష్టమైనది మంచి విషక విలువలు కలిగిన అకుకూర ఈ పాలకూర. విటి లేత అకులను కాండంతో సహ కూరగా వాడుతారు. ఈ పంట సాగుకి సారవంతమైన, మురుగు నీరు పోవు సౌకర్యం గల నేలలు అనుకూలం. ఈ పాలకూరను ఆరించే పురుగులలో పేనుబంక, అకుతినే గొంగళి పురుగులు ముఖ్యమైనవి. వాటి వల్ల కలిగే నష్టం వాటి నివారణ పద్దతులు.

పేనుబంక

ఇవి రసం పీల్చి నష్టం చేసే పురుగులు. పలు పంటలను ముఖ్యంగా క్యాబేజీ జాతి కూరగాయలను ఆరించే ఈ పేనుబంక పురుగులు పాలకూరను కూడా అశించి నష్టం చేస్తాయి. శీతాకాలం మొదటి నుంచి ఈ పురుగును గమనించవచ్చు. లేత ఆకు పచ్చ రంగులో మెత్తటి శరీరంతో ఉండే ఈ చిన్న పురుగులు రెక్కలు ఉన్నవి, రెక్కలు లేని పురుగులు గుంపులు గుంపులుగా మొక్కలని ఆశిస్తాయి. ఇవి సాధారణంగా లేత కొమ్మలు, చిగుర్లను ఎక్కువగా అందిస్తాయి. పేనుబంక పిల్లలు పెద్ద పురుగులు లేత కొమ్మలు, చిగురు నుంచి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. అందువలన ఆకులు పసుపు పచ్చగా మారతాయి. మొక్కలు సరిగా పెరగక వృద్ధి ఆగిపోతుంది. ఈ పేనుబంక పురుగులు తేనెలాంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. దానిమీద మసిలాంటి శిలీంధ్రం వృద్ధి చెందుతుంది. అందువలన మొగుల భాగాలు సలటి మసితో కప్పబడినట్లు కనిపిసాయి. వీటి వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగక ఆకులు సరిగా పెరగవు.

వీటి నివారణకు పేనుబంక అగించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ 1 మి.లీ. లేదా మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దె పురుగు

తల్లి రెక్కల పురుగు ఆకులమీద సమూహాలుగా గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు మొదట ఆకుపచ్చ అంగులో ఉండి, పెరిగే కొద్ది ముదురు గోధుమ రంగుకు మారుతాయి. లార్వాలు ఆకుల పై తింటూ రంద్రాలు చేస్తాయి. తీవ్రత అధికమైనప్పుడు ఆకులలోని పచ్చటి పదార్ధాన్ని మొత్తం తినివేసి కేవలం ఈనెలు మాత్రమే మిగుల్చతాయి. ఇవి ముఖ్యంగా పగలు  భూమిలోగానీ, చెట్ల మొదళ్ళలో భూమిలో దాగి ఉంది రాత్రిపూట అకులమీద తింటూ నష్టాన్ని కలిగిస్తాయి.

వీటి నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా మలాథియాన్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గుడను, గుంపులుగా ఉండే చిన్న లార్వాలను ఏరి నాశనం చేయాలి. విషపు ఎరని (10 కిలోల తవుడుకి 1 కిలో బెల్లం, 1 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బరిల్) తగు నీటితో చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్ళ దగ్గర చల్లి పెద్ద లార్వాలను సమర్థవంతంగా నివారించవచ్చు.

శనగపచ్చ పురుగు

తల్లి కుల పురుగు గుడ్లను ఒక్కొక్కటిగా లేత ఆకుల మీద పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు లేత ఆకుపచ్చ రంగునుండి ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉండి అకుల మీద తింటూ నష్టాన్ని కలిగిస్తాయి. ఆకుల మీద గుండ్రంగా ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. రంద్రాలు ఉండడం వలన ఈ ఆకులున్న పాలకూరను ఎవ్వరూ కొనడానికి ఇష్టపడక రాబడి తగ్గిపోతుంది.

వీటి నివారణకి క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. మలాథియాన్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత 10 రోజుల - వరకు పాలకూర ఆకుని కోసి ఉపయోగించరాదు. కనీసం 10 రోజులు వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.

3.02013422819
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు