অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ ఉత్పత్తలు - అదనపు విలువలు

వ్యవసాయ ఉత్పత్తలు - అదనపు విలువలు

మన దేశం వ్యవసాయపు ఉత్పతులలో స్వయంసమృద్ధి సాధిస్తున్నప్పటకీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అదనపు విలువలను జోడించడం, వ్యర్ధాలను తగ్గించడం ఎంతో అవసరం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోషకవిలువలు పెంపొందించడం, ఉత్పత్తుల ఉపయోగాల్ని పెంచడం చేయవచ్చు.

ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులు వంటి ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాల వలన ముఖ్యంగా గ్రామీణ మహిళలు పరిశ్రమలుగా ఏర్పరుచుకొని ఆహారభద్రత మరియు ఆదాయము పెంపొందిచుకోవచ్చు.

ఇందులో భాగంగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటిగా ఎన్నోరకాల అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాలపైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసారు.

వరి

బియ్యంతో అన్నం వండుకోవడం మాత్రమే కాకుండా బొరుగులు, అటుకులు, మురుకులు మరియు చకినాలు వంటివి చేస్తారు.

వరద ముంపుకు గురైన వరి ధాన్యం

వరద ముంపుకు గురైన వరి ( రంగు, రుచి, వాసనల మార్పుల వల్ల రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. అలాంటి వరి ధాన్యంతో అదనపు విలువలు ఉన్న సేమియా, రైస్ మిల్క్ ఎక్స్‌ట్రూడెడ్ స్నాక్స్ మొదలైన ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు.

చిరుధాన్యాలు

చిరుధాన్యాలు శరీరానికి అవసరమయిన ముఖ్యమైన ఖనిజ లవణాలు, పీచుపదార్ధాలు మరియు పోషక్షేతర వదారాలు కలిగి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉన్న పోషక లోపాన్ని ఈ పదార్ధాలను తీసుకోవడం వలన నివారించవచ్చు. చిరుధాన్యాలతో అనేక ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. జొన్నలు, కొర్రలు మరియు సజ్జల నుండి పొట్టు తీసిన పిండి, రవ్వను తయారు చేసుకోవడం వలన ఎన్నో విలువైన ఆహార పదార్థాల తయారీకి అనువుగా ఉంటుంది.

చిరుధాన్యాలతో అల్పాహారాలు

సాధారణంగా బియ్యంతో చేసే అన్ని రకాల అల్పాహారాలైన మురుకులు, చెక్కలు మరియు ఇంకా కొన్ని అల్పాహార పదార్థాలు పొట్టు తీసిన జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి వాటితో తయారు చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎలాంటి వసువులు అవసరం లేదు. ఇంటి దగ్గర సాధారణంగా వాడుకునే గిన్నెలు, మురుకుల చట్రం మరియు మూకుడు లాంటివి సరిపోతాయి.

జొన్నలు

జొన్నలను పండించే ప్రాంతాలలో జొన్న అన్నము, జొన్న సంగటి, జొన్న రొట్టెల రూపంలో తింటారు. జొన్న అన్నము తినేవారు పొట్ట దంచి వాడుకుంటారు. పొట్టు దంచడం కష్టతరమయిన పని. ఈ శ్రమ లేకుండా ఉండటానికి పొట్టు దంచే మరను గృహవిజ్ఞాన కళాశాల వారు ప్రవేశపెట్టడం జరిగింది. పొట్టు తీసిన గింజలు ముత్యాల్లా నాణ్యంగా ఉంటాయి. ఒకటిన్నర గంటలో ఒక క్వింటాలు జొన్నల పొట్టు తీయవచ్చు.

పొట్టు తీసిన జొన్నలతో చేసిన పిండి గోధుమ పిండికి, మైదాపిండికి ఏ విధంగా తీసిపోదు. పొట్టు తీయడం వలన జొన్న పిండిలో చేదు రుచి కూడా పోతుంది. ఈ పొట్టు తీసిన పిండితో సాంప్రదాయక వంటలే కాకుండా మరెన్నో కొత్త రకాల వంటలు, పిండివంటలు కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకునే బిస్మెట్ల, కేకులు, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు.

జొన్నలు - పొట్టు తీసే గిర్ని

జొన్నల పొట్టు తీయడం అన్నది శ్రమతో కూడిన పని. ఈ శ్రమను గుర్తించి పొట్టు తీసే మరను రూపొందించారు. సుమారు 35 వేల రూపాయలు ఖరీదు చేస్తుంది. జొన్నలే కాక ఇతర చిరు ధాన్యాలు, ముడి పప్పలను కూడా ఈ గిర్ని సహాయంతో పొట్టు తీయవచ్చు. పొటు తీసిన జొన్న పిండితోనూ, రవ్వతోనూ రకరకాలయిన వంటలు చేసుకోవచ్చు. బేకరీ పదార్థాలు కూడా తయారు చేయవచ్చు. ఒకరే కాకుండా కొంతమంది మహిళలు గ్రూపులుగా ఏర్పడి ఈ పొట్టుతీసే గిర్ని. సహాయంతో స్వయం ఉపాధి పధకాలను చేపట్టవచ్చు.

జొన్నలతో అటుకులు

జొన్నలతో బియ్యం మాదిరిగానే అటుకలు తయారు చేసుకోవచ్చు.

రాగులు

ఆరోగ్యానికి అమైలేజ్ ఆహారం

రాగులతో రాగి మాల్డ్ తయారు చేయవచ్చు. మాల్డ్ చేయడం వలన 'అమైలేజ్ అను పిండి పదార్ధాలు త్వరగా జీర్ణం అవటానికి ఉపయోగపడే "ఎంజైము" ఉత్పత్తి అవుతుంది.

రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను 18 గంటలు నీటిలో నానబెట్టి నీటిని వంపి గుడ్డలో వదులుగా మూటకట్టాలి. దీనికి గాలి తగిలేటటు వ్రేలాడదీయాలి. అప్పడప్పుడు రాగుల మూటపై నీరు చిలకరించాలి. ఒకటి నుంచి మూడు రోజులలో మొలకలు వస్తాయి. వీటిని నీరెండలో ఎండబెట్టాలి.

తరువాత సువాసన వచ్చే వరకు వేయించి పొడి కొట్టుకోవాలి. పాడి కొట్టేటప్పుడు, సువాసన కొరకు కొద్దిగా ఏలకుల పొడిని నీటిలో కాని, పాలలో కాని కలిపి ఉడికించి పంచదార లేదా ఉప్ప కలిపి జావలాగా త్రాగించవచ్చు. మాల్డ్ చేయడం వలన పోషకాలు వృద్ధి చెందుతాయి.

ఇన్స్టెంట్ రాగి ముద్ద మిశ్రమము

జీవనశైలిలో మార్పుల వలన వచ్చే వ్యాధుల నుంచి కాపాడే ఆహార పదార్ధాలలో ఒకటి రాగి ముద్ద. ఈ రాగి ముద్దలో అనేక పోషక విలువలు ఉంటాయి. కానీ రాగి ముద్ద తయారు చేయడానికి కొంత సమయం కేటాయించవలసి ఉంటుంది. అందుకు గాను ఇన్స్టెంట్ రాగి ముద్ద మిశ్రమము తయారు చేయబడినది. ఇన్స్టెంట్ రాగి ముద్ద మిశ్రమంతో తయారుచేసిన రాగి ముద్దలో మామూలు రాగి మద్దతో పోలిస్తే అన్ని విధాలుగా పోషక విలువలలో కానీ, రుచిలో కాని ఏ తేడా ఉండదు.

క్వినోవా

చినోపొడియం క్వినోవా అనేది అమరీంతమేసి కుటుంబానికి చెందిన సూడో తృణ ధాన్యం. మొదటగా దశినా అమెరికా నుండి విస్తరించింది. ఈ క్వినోవాను అతి తక్కువ ప్రోసెసింగ్ తో వండుకోవడం ద్వారా అత్యంత పోషక విలువలను పొందవచ్చు. దీని తృణ ధాన్యంగా పిండి, ఆకుకూర, అన్నం మరియు పోగులుగా వాడుకోవచ్చు. దీనిలో ముడి ధాన్యాలలో లోపించి లైసిన్ మరియు మిదియెనిన్ తో పటు ఇరవై ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

క్వినోవాలోని మాంసకృత్తులు పాలలోని కెసిన్ వాలే తేలికగా జీర్ణం అవడంతో పాటు, అధిక కాల్షియం, పాస్పరస్, ఇనుము బి-కాంప్లెక్సు విటమిన్లు మరియు పీచును కలిగి ఉంటాయి. సిలియాక్ వ్యాధితో బాధపడే వారికీ దీని ద్వారా గ్లూటెన్ లేని పదార్ధాలను రూపొందించడం క్వినోవా ప్రత్యేకత. మాములు ఉదయ అల్పాహారాన్ని, చిన్న పిల్లల అనుబంధ ఆహారాన్ని కూడా తాయారు చేసుకోవచ్చు.

క్వినోవాతో నూడిల్స్, బ్రేడ్స్, జావా, సూపులు, పేలాలు మొలకెత్తిన గింజలుగా ఉపయెగించుకోవచ్చు. వివిధ పదార్ధాలలో క్వినోవాని చేర్చడం ద్వారా అమైనో బ్యుటిరిక్ యాసిడ్ లు రాస్తపోటుని తగ్గించడం మరియు నియంతరించడం, కాన్సర్ ని నియంతరించవచ్చు.  క్వినోవాలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, గుండె జబ్బులు, కాన్సర్, మధుమేహ వ్హాది మరియు అల్జీమర్స్ ని నియంత్రిస్తాయి. క్వినోవా పాలు తినుకోవడం ద్వారా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఈ పాలను లాక్టోజ్ మరియు కెసిన్ పాడనీ వారు తీసుకోవచ్చు. క్వినోవా పాలు తక్కువ చక్కర సూచి కలిగి ఉంది, మెల్లిగా జీర్ణం కావడం వలన మధుమేహం మరియు అధిక బరువు కలిగిన వారికీ ఉపయెగపడతాయి.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, ఎలాంటి పరిస్ధితులలో అయినా ఎదిగే క్వినోవా వంటను ప్రత్సాహించవలసిన ఆవశ్యకత ఉంది. ఆహార భద్రతను పెంపొందిచడానికి వరి మరియు గోధుమ వంటలు మాత్రమే కాకుండా క్వినోవాను కూడా పెంచడం అవసరం.

పప్పుదినుసులు

పెసలు, శనగలు, గుగ్గిళ్ళు మొదలగు పప్ప దినుసులు మొలకెత్తించి మాల్డ్ మిశ్రమాలతో కలిపి అనుబంధాహార పదార్ధాలు తయారు చేసుకోవచ్చు.

సోయాచిక్కుడు

సోయాచిక్కుడులో మామూలు పప్పుదినుసుల కన్నా పోషకాలు ఎక్కువ. ముఖ్యంగా మాంసకృత్తులు 40-45 శాతంగా కలిగి ఉండటం సొయా ప్రత్యేకత సోయాచిక్కుళ్ళను వందే ముందు 12 గంటలు నీటిలో నానబెట్టి, పైన ఉన్న పొట్టు తీసివేసి మరిగే నీటిలో 15 నిమిషాలు ఉంచి, ఎండబెట్టి వాడుకుంటే వాటిలో చిరు చేదును, చిక్కుడు వాసనను తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా లభ్యమవుతాయి. ఇతర పప్పదినుసులతో చేసే వంటలన్నింటిని అనగా బజ్జీలు, పకోడిలు, ఇడ్లీ, దోస, చపాతి, మురుకులు మొదలగు వాటిని తయారుచేసే ముందు ఆయా పిండికి 10–20% సోయూపిండి కలిపి చేసుకోవచ్చు. సోయా గింజలతో పాలు, పన్నీర్, లడు, టోప, ఎక్స్ ట్రూడెడ్ స్నాక్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. మాంసాహారం మానేయలేని వారు మాంసాహారానికి బదులుగా సోయాతో చేసిన 'మీల్మేకర్" “చంక్స్" వంటి వాటిని తినడం వల్ల మాంసాహారం తిన్న సంతృప్తి కలుతుంది.

నూనె గింజలు

వేరుశనగతో బర్చి వేరుశనగ లడు, సలిపిండి, హల్వా చిక్కి మొదలగునవి తయారు చేసుకోవచ్చు. పండించే వేరుశనగ పంటలో దాదాపు 80% వరకు నూనె కోసం వినియోగిస్తున్నారు. నూనె తీయగా, మిగిలిన చెక్కను ఎరువుగాను మరియు పశువుల దాణాగా వాడుతారు. అన్ని నూనెల కన్నా వేరుశనగ నూనె చాలా రుచికరమైనది మరియు శ్రేష్టమైనది. వేరుశనగను నూనె కోసమే కాకుండా వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేసుకొనిన యెడల ఇందులో ఉండే విలువైన పోషక పదార్థాలను నష్టపోకుండా సక్రమముగా సద్వినియోగం చేసుకొనవచ్చును.

వేరుశనగతో పాలు

కావలసిన పదార్ధాలు ఏమనగా వేరుశనగ విత్తనాలు 100గ్రా., చక్కెర-15గ్రా., నీరు ఒక లీటరు, ఏలకులు-5, కొన్ని చుక్కల ఎసెన్స్,

తయారు చేయు విధానము:

వేరుశనగ విత్తనాలను దోరగా వేయించి పొట్టు తీసివేయాలి. బద్దల మధ్య వుండే మొలకలను తొలగించాలి. వేరుశనగ పప్పకు కొద్దిగా నీరు చేర్చి మెత్తగా రుబ్బాలి. దీనిని ఒక లీటరు నీటిలో కలిపితే పాలు తయారవుతాయి. తరువాత చక్కెర, ఏలకుల పొడి, ఎస్సెన్స్ కలపాలి. ఈ పాలు వున్నప్పడు తాగితే రుచిగా వుంటాయి. ఈ పాలతో టీ, కాఫీ, పెరుగు తయారు చేయవచ్చు. మజ్జగ చిలికితే వెన్నకూడా వస్తుంది.

వేరుశనగ ప్లేక్స్

కావలసిన పదార్ధాలు ఏవనగా వేరుశనగలు-300 గ్రా, ఉప్ప-10గ్రా,

తయారు చేయు విధానం

ఉప్ప నీటిలో వేరుశనగలను ఒక రాత్రంతా నానబెట్టవలెను. నీరు వడబోసి, మరల నీరు పోయవలెను. వేరుశనగలను 10 నిమిషాలు ఉడకబెట్టవలెను. నీరు తీసివేసి వేరుశనగలను మంద పాటి పేపరు మధ్య వేసి పప్పు గుత్తితో గట్టిగా అధమవలెను. అవి ప్లేక్స్ మాదిరిగా వచ్చు వరకు అదిమి తరువాత ప్లేక్స్ను వేయించవలెను. ప్లేక్స్ను ఒక కవరులో భద్రపరుచు కొనవలెను. ఇంకా వేరుశనగతో వెన్న, వివిధ రకాల వేయంచిన వల్లిలు, చాలా వాణిజ్య విలువ కలిగిన ఉత్తత్పులు తయారుచేయవచ్చును.

అవిసలు మరియు ఆదిత్యాలు

అవిసలను ఫాక్స్ సీడ్స్ లేక లిన్సీడ్స్ అని కూడా అంటారు. పోషకరీత్యా ఇవి చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇందులో 20-24% మాంసకృత్తులు, 37-42% నూనె ఉన్నాయి. ఈ నూనెలో మిగతా నూనెలలో లేని మరియు చేప నూనెలో ఉండే క్రొవ్వు ఆమాలు (ఒమెగా-3 మరియు ఒమెగా-6) రెట్టింపు ఉన్నాయి. శాఖాహారులకు ఈ నూనె ప్రకృతి అందించిన వరం.

ఆదిత్యాలు అత్యధిక ఇనుము (100 మి.గ్రా.), సున్నము (377 మి.గ్రా.) కలిగి ఉన్నాయి. ఆరోగ్యరీత్యా అవిస గింజలు, నూనె వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కొద్దిగా వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో 10-15% మేరకు కలిపి వాడుకుంటే వాటి పోషకవిలువలు పెంపొందించుకొనవచ్చు.

పండ్లు మరియు కూరగాయల ప్రోసెసింగ్

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి పక్క కార్యాచరణతో పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖలు కృషి చేస్తున్నాయి. దేశంలో ప్రతి రైతు ఆదాయాన్ని 2022 కాళ్ళ రెంట్టింపు చేయడానికి కేంద్ర అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ వేపధ్యంలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తాయారు చేసిన ఆహార పదార్ధాలకు డిమాండు బాగా పెరిగింది. దీనికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధర ఏడాది పొడవుగా ఉంటుంది. అందువలన ఈ ప్రోసెసింగ్ యూనిట్ల శదపనతో వాటి నుంచి ఉప ఉత్పత్తులు తాయారు చేసి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వీటిని ఏర్పాటు చేసుకునే సాంకేతిక పరిజ్ఙానం మరియు కావలసిన యంత్రాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సమాచారం పొందవచ్చు.

ప్రపంచ పండ్ల ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం అగ్రస్ధానంలో ఉంది. భారతదేశంలో సగటున 30-35% పండ్లు మరియు కూరగాయలు వివిధ దశలలో నష్టానికి గురి అవుతున్నాయి. మన రాష్ట్రంలో మామిడి, అరటి, జమ, దానిమ్మ, ద్రాక్ష, నిమ్మ, పనస, జీడీ మామిడి వంటి పండ్ల విస్తారంగా పండుతాయి.

టమాట

కూరగాయలలో టమాటలు అతి ముఖ్యమైనవి. టమాట ఉపయోగించని వంటకాలు చాలా తక్కువని చెప్పవచ్చును. టమాటాలు ఎరుపు రంగును, పులుపును కలిపి వంటకాలకు రంగును, రుచిని కలుగచేస్తాయి.

టమాటాలను వచ్చి, వండు రూపాల్లో ఉపయోగించవచ్చు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎక్కువగా కోతకు రావడం వలన చాలా తక్కువ ధరకు అమ్ముడు పోతాయి. అలాంటి సమయంలో టమాటాలను కూరల్లోనే కాకుండా కొన్ని నిల్వ పదార్థాలను తయారు చేసి కొన్ని నెలల వరకు ఉపయోగించవచ్చు. ఈ టమాట ఉత్పత్తులను టమాట అధికంగా పండించే ప్రాంతాలలో మహిళలకు కుటీర పరిశ్రమలుగా స్థాపించే అవకాశముంది. టమాటలతో జామ్, కెచప్, పచ్చడి, గుజు, టాఫీ వంటి విలువాధారిత పదార్థాలను తయారుచేయవచ్చు. ఎండబెట్టి ఒరుగులు చేయడం కూడా పరిశ్రమలకు అనుగుణమే.

చింతపండు

చింతపండుతో గుజ్ఞ, ఇతర పండ్లతో కలిపి శీతల పానీయాలు మరియు టాఫీలు చేయడమైనది.

బొప్పాయి

నెక్టరు, తాంద్ర, భీజ్, టాఫీలు, ఎండబెట్టిన పొడి తయారు చేయడమైనది. బొప్పాయి పొడిని వివిధ రకాల ఆహార పదార్ధాలతో ఉదాహరణకు చపాతీలు, రొట్టెలు, ఉప్మా పొంగలి మొదలగు వాటిలో వండేటప్పుడు కలిపినచో పోషక విలువలను పెంపొందించవచ్చు. బొప్పాయిలో 'పపెయిన్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ పపెయిన్ ఎంజైమ్ మాంసము త్వరగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయితో టూటీఫ్రూటీ చేసి బేకరీలకు అందించవచ్చును.

పుచ్చకాయ

పచ్చకాయ తొక్కతో, నిల్వపచ్చడి, క్యాండీలు, టాఫీలు, చీజ్, టూటీ, ఫ్రుటీ, వడియాలు తయారు చేసుకోవచ్చును.

ద్రాక్ష

ద్రాక్ష పండుతో ఎండు ద్రాక్ష (కిస్మిస్లు) తక్కువ ఖర్చుతో, సులభతరంగా తయారు చేయు పద్ధతిని కనుగొనడమైనది. దీని ద్వారా నల్ల ద్రాక్ష మరియు విత్తనాలతో ఉన్న ద్రాక్షలతో కూడా కిస్మిస్లు తయారు చేయడమైనది. దీనిని ఒక చిన్న కుటీర పరిశ్రమగా నెలకొల్పుకొనవచ్చును.

రసాయనిక ప్రిజర్వేటివులు

సల్ఫర్‌డైయాక్సైడ్, బెంజాయిక్ ఆమ్లము లేదా సోడియం బెంజాంుక్ ఆవుము లేదా సోడియం బెంజోయేట్ వంటి రసాయనిక ప్రిజర్వేటివులు ఉ పయోగించి పండ్లు, కూరగాయలతో తయారు చేసిన శీతల పానీయాలు, స్క్వాష్‌లు నిల్వ చేయవచ్చు. ముదురు రంగు పండ్ల రసాలకు ఉదా : నీలిద్రాక్ష పుచ్చకాయ రసాలకు వాడకూడదు, ఎందుకంటే వాటి రంగు పోతుంది. కనుక అలాంటి రసాలలో సోడియం బెంజోయేటిని వాడటం మంచిది.

నిర్జలీకరణ

పండ్లు, కూరగాయలలోని తేమను నిర్దిష్టస్థాయికి తగ్గించడం ద్వారా నిల్వ చేయవచ్చు. వివిధ పద్ధతుల ద్వారా తేమను తొలగించడాన్ని "నిర్జలీకరణ" అంటారు. ఉదాహరణకు సూర్యరశ్మికి ఎండబెట్టడము, డీహైడ్రేటర్లు, ఫీజ్ డైయర్లు వంటి ఆధునిక పరికరాల ద్వారా తేమను తగ్గించవచ్చు. వేడి చేయడము : తగిన ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి నిల్వ చేయవచ్చు.

వేడి చేయడము: తగిన ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి నిల్వ చేయవచ్చు

ఉప్పు: 15% ఉప్పను ఉత్పతులలో వాడిన అది ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది.

చక్కెర: పంచదార పండ్లలోని నీటిని పీల్చివేయటము ద్వారా ప్రిజర్వేటివ్‌గా పని చేస్తుంది. ఆహార ఉత్పత్తులలో చక్కెర శాతం 68% ని దాటితే సూక్ష్మజీవులు పెరగవు.

వెనిగరు: వెనిగరు అసిటిక్ ఆమ్లము (2%) వాడి పండ్లు కూరగాయలను నిల్వ ఉంచవచ్చు.

వృద్ధులకు అనువైన ఆహార పదార్ధలు

వృద్దులకు సులువుగా జీర్ణం అవటానికి పోషకాలు వృద్ధిగా గల "ఎక్స్‌ట్రూడెడ్ పదార్థాలు, స్నాక్స్ సేమనలు, పాస్తా, గంజి మిశ్రమము తయారు చేయడమైనది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ మొక్క ఆకులతో ఛాయ్ (తేనీరు)

ఇన్సులిన్ అనే ఔషధ మొక్క ఆకులు ఇన్సులిన్‌ను తగ్గించి రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆకులను ఉపయోగించి 'టీ బ్యాగ్స్' తయారు చేయటం జరిగింది.

పర్యావరణ అనుకూల ఆహార పదార్ధాలు

ఆహార పదార్ధాలను చాల రోజుల వరకు నిల్వ ఉంచడానికి సాధారణంగా రసాయనిక నిల్వ పదార్ధాలను ఉపయేగిస్తున్నారు. సహజంగా లభ్యమయ్యే ఆహార పదార్ధాలు రసాయానికి నిల్వ పదార్ధాలు ఉపయేగించి తయారుచేసిన ఆహార పదార్ధాల కంటే ఆరోగ్యం విషయంలో మేలైనవి, అనుకూలమైనవి. సహజసిద్ధమైన ఆహార నిల్వ పదార్ధాలు, సహజ సిద్దమైన రంగులు, సహజ సిద్దమైన సువాసనలు మెదలైనవి, పర్యావరణ అనుకూల ఆహార పదార్ధాలుగా పరిగణిస్తారు. ఆ పర్యావరణ అనుకూల ఆహార పదార్ధాలు అన్ని వయసుల వారికీ మరియు అన్ని ఆరోగ్య పరిస్థితుల వారికీ ఎంతో మేలు చేస్తాయి.

ప్రకృతి సహజ వర్ణకాములను ఉపయెగించడం చాల పథకాలము నుండే వాడుకలో ఉన్నది. అనేక ప్రకృతి సహజ రంగులు, పండ్లు మరియు కాయగూరల నుండే ఉత్పత్తి అవుచున్నవి. ఇవి రసాయన రంగులను ఉపయేగించి చేసిన పదార్ధాలు కలుగజేసే ఆరోగ్య సమస్యలను కలిగించకపోగా, ఆరోగ్యాన్ని పెంపొంది స్తాయి. అందుకనే ప్రపంచమంతా వివిధ ఆహార పదార్ధాల తయారీలో సహజ రంగుల ఉపయెగం పై దృష్రిని సారించింది.

సహజ సిద్దమైన రంగులను తయారుచేయుటకు బొప్పాయి, నేరేడు పండు, గుమ్మడి పండు, మునగాకు బృంగరాజు ఆకులూ చాల అనువైనవి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి, మర పట్టించి, జల్లెడ పట్టడం వలన మెత్తటి పొడిగా తాయారు అవుతుంది. ఈ విధంగా తయారుచేసిన పొడులను సహజ రంగుల  వివిధ ఆహార ఉత్పత్తుల తయారీలో వాడుకొనవచ్చును. వీటి ద్వారా ఆహార ఉత్పత్తులలో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలగు పోషకాల విలువలు పెరుగుతాయి. అంతేకాకుండా ఆహార పదార్ధాలు బాక్టీరియాలు వలన త్వరగా పాడవకుండా ఉంటాయి. కాలేయానికి సంబంధించిన వ్యాధులు నపుంసక మెదలయిన ఆరోగ్య సామాన్యలు రసాయన రంగులను కలిగిన ఆహార సామాన్యలు రసాయన రంగులను కలిగిన ఆహార పదార్ధాలను ఎక్కువ సార్లు. అధిక మేతదులలో తీసుకొనుట వలన వస్తున్నాయని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపితమైనవి.

వ్యర్ధ పదార్ధాలతో విలువదారిత పదార్ధాలు

బియ్యం పాలిష్ పెట్టేటప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్ధ పదర్థం తవుడు. ఈ తవుడులో అనేక విలువైన పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పీచు పదార్ధాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తవుడునుగోధుమ పిండితో కలిపి విలువదారిత బిస్కెట్లు, కేకులు తాయారు చేయడం అయినది మరియు కొన్ని కూరగాయలు (బిట్ రూట్, టమాటా, క్యాలీప్లవర్) కథలు, తొక్కలు వంటి వ్యర్ధ పదార్ధాలను ఎండబెట్టి పొడి చేసి గోధుమ పిండి, బియ్యం పిండి మరియు తప్పుడు కలిపి సేమియా, పాస్తా లాంటి విలువు అర్ధరాత పదార్ధాలు తాయారు చేయబడటం జరిగింది.

ఆహార పదార్ధాల తయారీలో "నానో కణాల" వినియోగం

ప్రతి రంగములో ఇటీవల కాలంలో క్రొత్తగా నానో టెక్నాలజి వాడుచున్నారు. నానో టెక్నాలజి ఉపయోగించి ఆహార పదార్ధాలలోని పోషకాల సామర్థ్యాన్ని పెంచవచ్చు. నానో టెక్నాలజి ఉపయోగించి ప్రకృతి సహజమయిన (రంగులను) తయారు చేయవచ్చు. సహజ సిద్ధమయిన రంగులను బొప్పాయి, నేరేడుపండు, గుమ్మడిపండు, మునగాకు మరియు బృంగరాజు ఆకులు ఉపయోగించి తయారు చేయడమైనది. నానో టెక్నాలజి ద్వారా తయారు చేసిన కాకరకాయ రసం మధుమేహ వ్యాధిగ్రసులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది.

ఇంతేకాక వివిధ ప్రాంతాలలో దొరికే తక్కువ వాడకంలో ఉండే ఎక్కువ పోషకాలు కలిగి ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో రకాల గుమ్మడి, తామరకాడలు, గార్డెన్ క్రెస్ గింజలు, వివిధ రకాల ఆకుకూరలు మరియు అశ్వగంధ, అలోవెర, క్వినోవా ఆకులు, బృంగరాజు వంటి ఔషధ గుణాలున్న ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను పెంపొందించవచ్చును.

'ప్యాకింగ్' మరియు 'లేబ్లింగు’:

ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు వాటికి సరైన ప్యాకింగ్ చేసుకోవడం, ప్యాకింగ్ పైన వాటిలో వాడిన పదార్థాలు, వాటిలోని ముఖ్యమైన పోషకాలు అవి తయారు చేసిన తేది, ఖరీదు తదితర వివరాలు తెలిపినచో వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువలు పెంపొందించుకోవచ్చు.

ఆధారం : వ్యవసాయ పంచాంగం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate