పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసయంగా వర్ణింపవచ్చు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసయంగా వర్ణింపవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సుక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

సేంద్రియ వ్యవసాయం అనగా సహజ సిద్ద కర్బనం కలిగియున్న మొక్కల, జంతు, నీటి వ్యర్ధాలు మరియు ఇతర జివపదార్ధాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందే విధంగా సుస్ధిర వ్యవసాయం దిగుబడులను సాధిస్తూ నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుతూ నేల సజీవంగా ఉండే విధంగా పంటలను పండించడం. ప్రపంచ వ్యాప్తంగా 43.7 విలియన్ హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తున్నారు. దీని విలువ 31.2 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుంది.

సేంద్రియ వ్యవసాయంలోని ముఖ్యమైన అంశాలు

 1. క్షేత్ర మౌళిక సదుపాయాలు, జీవ ఆవాస మరియు వైవిధ్య అభివృద్ధి
 2. సేంద్రియ నేలగా మార్చుట –
  • నేలను సంరక్షించుట
  • అవసరం మేరకే దుక్కి దున్నట
  • మిశ్రమ వ్యవసాయం పాటించుట
  • పలు మిశ్రమ పంటలను సాగు చేయుట
  • పంట మార్పిడి చేయుట
  • సేంద్రియ పదార్దాల పునరుత్పత్తి
  • సేంద్రియ ఎరువుల వినియోగం
  • జీవన ఎరువులను ఉపయోగించుట
 3. కలుపు యాజమాన్యం
 4. చీడపీడల యాజమాన్యం
 5. విచక్షణతో సాగునీరు వాడకం
 6. సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ

క్షేత్ర మౌళిక సదుపాయాలు, జీవ ఆవాస మరియు వైవిధ్య అభివృద్ధి

మౌళిక సదుపాయాలు

సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 3 నుండి 5 శాతం భూమిని పశువుల శాల, వర్మి కంపోస్టు షేడ్, కంపోస్టు హిట్, వానపాముల నీరు, కంపోస్టు టీ వంటివి ఏర్పాటు చేయుటకు ఉపయోగించుకోవాలి. రెండున్నర ఎకరాలలో పడిన వర్షాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేల వాలు మరియు నీటి వేగమును అనుసరించి 7 x 3 x 3 మీటర్ల సైజు గల నీటి నిలువ కుంటలు తప్పనిసారిగా ఏర్పాటు చేసుకోవాలి. ఐదు ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి ఒకటి నుంచి రెండు వర్మి కంపోస్ట్ షెడ్లు, ఒక నాడెపు కంపోస్టు ట్యాంకు, రెండు పశువుల వ్యర్ధాలను నిలువ చేసుకునే షేడ్స్ రెండు నుంచి మూడు కంపోస్టు టీ లేదా వానపాముల వాష్ ట్యాంకులు, ఐదు ద్రవ ఎరువుల ట్యాంకులు, ఐదు పశువుల షేడ్ గుంతలు ఒక పశువుల మూత్రము సేకరించు గుంతను ఏర్పాటు చేసుకోవాలి.

జీవ ఆవాస మరియు వైవిధ్య అభివృద్ధి

సేంద్రియ వ్యవసాయములో అతి ముఖ్యమైన విధానం వివిధ రకాల జీవులు సహకార జీవనం కలిగి ఉండే విధంగా క్షేత్రాన్ని నియంత్రించాలి. దీనికోసం వివిధ పంటల సాగు, వివిధ రకాల మొక్కల పెంపకం, వాతావరణానికి అనుగుణంగా పెంచాలి. ఈ విధమైన వృక్షాలు మరియు చెట్లు భూమి లోపలి పొరల నుండి మరియు వాతావరణం నుండి పోషకాలను సంగ్రహించడమే కాకుండా పక్షులకు, పరాన్న భుక్కులకు, మిత్రపురుగులకు ఆహారాన్ని, నీడను ఇస్తాయి. నీటి నీడ వలన కొంత పంట ఉత్పత్తి తగినప్పటికి సహజ ప్రక్రియ ద్వారా కీటకాలను అదుపుచేయడం ద్వారా పంట దిగుబడి నష్టాన్ని పురిస్తుంది.

సేంద్రియ నేలగా మార్చుట

నేలను సంరక్షించుట

నేలపై పైరు వ్యర్ధ పదార్ధాలను కప్పడం వలన నేలను సూర్యరశ్మి, గాలి మరియు వర్షపు నీటి కోత నుండి ఎటువంటి ఆర్ధిక నష్టం లేకుండా, మట్టిని ఎంతమాత్రం నష్టపోకుండా సంరక్షింప వచ్చును.

అవసరం మేరకే దుక్కి దున్నట

ఎక్కువగా మరియు లోతుగా దుక్కి చేయుట వలన నేల కోతకు గురి కావడమే కాక నేలలోని సుక్ష్మజీవులు, ప్లనకాల (ఫ్లోర ఫానా) సంఖ్య బాగా తగ్గిపోతుంది. కనుక నేలను అవసరమైనంత మేరకు (2 సార్లు) మాత్రమే తక్కువ లోతు (15 సెం.మీ. మించకుండా) దుక్కి చేయవలెను.

మిశ్రమ వ్యవసాయం పాటించుట

వ్యవసాయ మరియు పశుపోషణ పరస్పరం అన్ని విధాల సహకారం చేసుకొంటు తప్పనిసరిగా వృద్ధి అయ్యేలా చూడవలెను.

పలు మిశ్రమ పంటలు సాగుచేయుట

సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంట విధానం చాలా ముఖ్యమైనది. ఇందులో ఎక్కువ రకాల పంటలు ఒకేసారి ఒకే నేలలో సాగు పంట ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి వాతావరణంలోని నత్రజనిని సంగ్రహించి మిగతా పంట మొక్కలకు అందిస్తాయి. ఇందులో లోతు వేరు వ్యవస్ధ కలిగిన పంట మొక్కలు నేల లోపలి నుండి పోషకాలను సంగ్రహించి తక్కువ లోతు వేరు వ్యవస్ధ కలిగిన పంట మొక్కలను ఆకు రాల్చడం ద్వారా అందిస్తాయి. కావున మిశ్రమ పంట మొక్కల మధ్య పోషకాల కోసం అంతగా పోటి ఉండదు. పోషకాలు క్రింది పోరలలోనికి తీసుకోని రాబడుతాయి మరియు నేల కోతకు గురి కాకుండా రక్షిస్తాయి. రైతులు పంట ఎంపికను వాతావరణం మరియు అవసరాలకు అనుగుణంగా వేసుకోవాలి. మిశ్రమ పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు వాటి యొక్క ఇష్టాలు అయిష్టాలను పరిగాణలోనికి తీసుకోవాలి. ఉదా: మొక్కజొన్న, చిక్కుడు, మరియు దోస ఇష్టపడతాయి. టమాట, ఉల్లి, మరియు బంతి ఇష్టపడతాయి కాని చిక్కుడు మరియు ఉల్లి ఇష్టపడువు.

సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో అన్ని సందర్బాలలో 8-10 రకాల పంటలు సాగు చేస్తూ ఉండాలి. క్షేత్రములోని ప్రతి భాగము కనీసం 2-4 రకాల పంటలతో ఒక లెగ్యుమ్ జాతి పంట ఉండే విధంగా జాగ్రత్తపడాలి. ఒకవేళ క్షేత్రములోని ఒక బాగము ఒక పంటతో ఉంటె మిగతా భాగము వేరోకో పంటతో సాగు చేస్తూ ఉండాలి. సహజ జీవ వైవిధ్యం మరియు క్రిమి కీటకాల నియంత్రణ కోసం ఒక ఎకరానికి 50-150 కూరగాయల మొక్కలు మరియు 100 బంతి మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కవు పోషకాలు అవసరమున్న చెఱకు పంటను కూడా లేగ్యుం జాతి కూరగాయల పంటలతో కలిపి వేసుకోవచ్చును.

పంట మార్పిడి చేయుట

సేంద్రియ వ్యవసాయంలో పంట మార్పిడి అతి ముఖ్యమైన ప్రక్రియ. నేలను ఆరోగ్యంగా ఉంచాలన్నా, నేలలోని సుక్ష్మజివ వ్యవస్ధ సక్రమంగా పనిచేయాలన్నా పంట మార్పిడి తప్పనిసరి. ఒకే నేలలో ఒక పంట తరువాత మరొక పంట సాగు చేయడాన్ని పంట మార్పిడి ఉంటాము. 3-4 సం.లకు గాను పంట మార్పిడి క్రమము ఉండాలి. మొదటి సం.ఎక్కువ పోషకాలు అవసరమున్న పంటను వేసుకోవాలి తరువాత లెగ్యుమ్ జాతి పంటను వేసుకోవాలి. క్రిముల ఆవాస పంట మరియు ఆవాస రహిత పంటలను సాగు చేసినపుడు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు మరియు క్రిములు నిరోధించబడుతాయి. ఇది నేల ఉత్పాదకత నేల సారము మరియు పంటలలో గడ్డిజాతిని కూడా నిరోధిస్తుంది. వివిధ రకాల వేరు వ్యవస్ధ ద్వారా నేల అల్లిక మెరుగౌతుంది. లెగ్యుమ్ జాతి మొక్కలు ధాన్యపు పంటలు మరియు కూరగాయలతో పండించాలి. పచ్చిరోట్ట ఎరువులను కూడా ఈ విధానంలో భాగంగా వేయాలి.

సేంద్రియ పదార్ధాల పునరుత్పత్తి

సేంద్రియ పదార్దాలను తిరిగి నేలలో మోతాదులో ఉంచుటకు గాను పొలం లేక గ్రామం నుండి ఉత్పత్తి అయిన జీవ పదార్దాములను పునరుత్పత్తి చేసి తిరిగి పొలంలో కలుపవలెను.

సేంద్రియ ఎరువుల వినియోగం

సేంద్రియ సాగులోకి మరే ముందు నేల సారాన్ని సేంద్రియ ఉత్పాదకాలు అయిన మాగిన పెంట/వానపాముల ఎరువు, పచ్సిరోట్ట ద్వారా నేల సారాన్ని పెంచుతూ యాజమాన్యం చేయాలి. ఈ సేంద్రియ ఎరువులు నెలకు ఆహారంగా పనిచేస్తాయి. ఆరోగ్యవంతమైన నేల, తనలోని వృక్ష, జంతు, సుక్ష్మజివులకు ఆశ్రయమిస్తూ మొక్కలకు పోషకాలను అందిస్తుంది. మొక్కల వ్యర్ధాలు, పెంట పోగు, వానపాముల ఎరువు, పోషకాలను పెంచిన ఎరువు వ్యవసాయ క్షేత్రంలో లభించే ముఖ్యమైన సేంద్రియ ఉత్పాదకాలలో ముఖ్యమైనవి నూనె పిండి, కోళ్ళ ఎరువు, ఖనిజ రాక్ పాస్పేట్ మరియు సున్నము మొదలైనవి నేలలో వేసుకోవాలి. ఉదా : 1. మల్చింగ్, 2. పచ్చిరొట్ట పైర్లు లేక ఎరువులు 3. కంపోస్టు – వానపాములఎరువు, నడేప్ కంపోస్టు, బయోడైనమిక్ కంపోస్టు, కౌపాట్ హిట్ కొంపోస్టు, ద్రవ రూప సేంద్రియ ఎరువులు.

జీవన ఎరువులను ఉపయోగించుట

రైజోబియం, అజోస్పై రిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బాక్టీరియా (పి.యస్.బి), నీలి ఆకుపచ్చ నాచు (బి.జి.ఎ), వేసికులార్ అర్బిస్కులార్ మైకోరైజ (వి.ఎ.ఎమ్) వంటి జీవన ఎరువులను వాడుకోవాలి.

కలుపు యాజమాన్యం

తగిన పంట మార్పిడి, అంతర పంటలు మరియు మిశ్రమ పంటలు వేయుట వలన కలుపు యాజమాన్యం సమర్ధవంతముగా చేయవచ్చును. మనుషులతో తీయించు కలుపును పొలంలో కప్పడం ద్వారా నేల సారాన్ని సంరక్షించవచ్చు మరియు క్రొత్తగా కలుపు పెరుగుటను నివారించవచ్చును.

చీడపీడల యాజమాన్యం

సేంద్రియ పద్ధతిలో పంటల వారిగా పురుగులను, తెగుళ్ళును సాగు పద్ధతుల ద్వారా మరియు జివనియంత్రణ పద్ధతుల ద్వారా అరికట్టవలెను.

సాగు పద్ధతులు : పంట మార్పిడి, ఎర పంటలు, అంతర పంటలు, వ్యాధి లేక పురుగు నిరోధక రకాల సాగు మరియు కిటక ఎరలను అమర్చడం.

జీవ నియంత్రణ పద్ధతులు : సస్యరక్షణలో వృక్ష సంబంధిత పురుగు మందులు, ద్రవ రూప సేంద్రియు ఎరువులు, సుక్ష్మజీవులతో తయారు చేసిన పురుగు మందులు వాడడం, మిత్ర పురుగులను సంరక్షించడం, ఖనిజ ఆధారిత మందులతో పురుగు మరియు తెగుళ్ళు యాజమాన్యం.

విచక్షణతో సాగు నీరు వాడకం

నీరు అనేది వ్యవసాయంలో అధిక దిగుబడికి అత్యంత అవసరమైన ఒక వనరు. దీనిని తగిన విధంగా ఉపయోగించినపుడు పంట అధికోత్పత్తికి సహాయం చేస్తుంది. పంటకు నీరు అధికంగా పెట్టడం వలన నీరు పొలంలో నిలువ ఉండి చౌడు పెరగడం, మొక్కలకు అవసరమైన పోషకాలు నీటితో పాటు భూమి లోపల పొరల్లోనికి ఇంకిపోవడం వంటివి జరిగి మేలుకన్నా కీడు అధికంగా జరుగుతుంది. కావున సేంద్రియ వ్యవసాయంలో నీటిని అవసరమైనప్పుడు మాత్రమే తగిన పరిమాణంలో ఉపయోగించవలేను.

సేంద్రియ వ్యసాయం ధృవీకరణ

 1. సేంద్రియ ధృవీకరణ పత్రం కొరకు ఉత్పత్తిదారుడు ముందుగా అన్ని వివరములతో కూడిన నమూనా దరఖాస్తుతో ధృవీకరణ సంస్ధకు దరఖాస్తు చేసుకోవాలి.
 2. ధృవీకరణ సంస్ధ ఆ దరఖాస్తుని పరిశీలించి, ఏమైనా సందేహాలు ఉంటె అడిగి నివృత్తి చేసుకొంటుంది.
 3. ధృవీకరణకు అగు ధృవీకరణ ఖర్చు, ప్రమాణ ఖర్చు, తనిఖి ఖర్చు, ప్రయోగశాల ఖర్చుల వివరములను తగు అంగీకార నిమిత్తం పంపుతారు.
 4. దీనిపై ఉత్పత్తి దారుడు తగు అంగీకారం తెలుపవలసి ఉంటుంది.
 5. ఉత్పత్తిదారుడు, ధృవికరణ సంస్ధల మధ్య వ్రాతపూర్వక అంగీకారం జరుగుతుంది.
 6. పంటను ఏ విధంగా పండించాలి, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను ఉత్పత్తిదారుడు ధృవీకరణ కు పాటించాలని సంస్ధ తెలుపుతుంది.
 7. ఉత్పత్తిదారుడు ధృవీకరణకు అగు ఖర్చులో 50 శాతం పైకమును ముందుగానే చేలించాలి.
 8. తనిఖీ తేదీలు నిర్ణయి౦పబడుతాయి.
 9. ధృవీకరణ అధికారులు కనీసం రెండుసార్లు పంటను పరిశీలిస్తారు. మొదటగా పంట పెరుగుదల దశలో, రెండవది కోత దశలో పరిశీలీస్తారు.
 10. అనుమానం ఉన్న ఎడల ఆకస్మిక తనిఖీలను జరిపి పైరు లేక పంట, నేల, వాడిన ఉపకరణములు మరియు ఉత్పత్తుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపి విశ్లేషిస్తారు.
 11. పూర్తి తనిఖీ వివరములను ధృవీకరణ కమిటికి నివేదిస్తారు.
 12. తరువాత ధృవీకరణ సంస్ధకు మిగిలిన 50శాతం పైకంను చెల్లించాలి.
 13. ధృవీకరణ మంజూరు చేయబడుతుంది.
 14. ఉత్పత్తిదారుడు ధృవీకరణ ముద్రతో ఉత్పత్తులను విడుదల చేసి మార్కెటింగ్ చేయవచ్చును.

ఆధారం: వయసాయ పంచాంగం

3.01716738197
లక్ష్మి Aug 28, 2019 11:41 AM

సహజ సిద్ధ వ్యవసాయ నేల ఏది?

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు