పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గోరుచిక్కుడు

ఈ కొన్ని రకాల గోరుచిక్కుడు గింజలు నుండి విలువైన జిగురు తాయారు చేస్తారు.

గోరుచిక్కుడు చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క ఈ మొక్క  తీవ్ర కరువు పరిస్ధితులను, అధిక వేడిమిని తట్టుకొని మనగలుగుతోంది.

ఉపయెగాలు

  • ఎక్కువగా దశినా భారతదేశంలో లెహ్తకాయలను కూరగాయగా వాడుతారు.
  • కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల  నుండి విలువైన జిగురు తాయారు చేస్తారు. ఈ జిగురును బట్టల, పేపరు, స్తోందర్య సాధనాల పరిశ్రమలలో మరియు నూనె పరిశ్రమలలో ప్రపంచ వ్యాప్తంగా వాడుతారు.
  • ఈ జిగురును పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేసే పదార్ధాలలో అబ్సర్ బెంట్ గా వాడుతారు.
  • బాగా కొమ్మలుగా పెరిగే గోరుచిక్కుడు రకాలను, గింజలను, పశువుల దాణాగా వచ్చిమేతగా వాడుతారు.
  • ఈ పంటను నెల బతికా, రసాయానికి లక్షణాలు పెంపొందించడానికి పచ్చిరొట్ట ఎరువుగా కూడా వాడుతారు.
  • ఓషది తయారీలలో కూడా వాడుతారు.

వాతావరణం : గోరుచిక్కుడు ఉష్ణమండలపు పంట. తక్కువ వర్షపాతం, అధిక ఎష్ణోగ్రత గల ప్రాంతాలలో పెంచటానికి అనువైనది మంచును తట్టుకొలేదు.

నేలలు : మురుగు నీరు పోయే సోకార్యం గల అన్ని నెలలో ఈ పంట పండించవచ్చు. ఉదజని సూచిక 7.5-8.0 వరకు ఉన్న నేలలు కూడా అనువైనవి. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికి రావు.

పంటకాలం : ఖరీఫ్ : జూన్ - జులై, వేసవి : జనవరి - ఫిబ్రవరి

రకాలు

పూసా మౌసమి : వర్షాకాలపు పంటకు అనువైనది. గుంజు విత్తిన 70-80 రోజులకు మొదటి కోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ పొడవుతో ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్క కొమ్మలతో పెరుగుతుంది.

పూసా సాదబాహర్ : అధిక దిగుబడినిచ్చే రకం. ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకు మొదటి కోతకు వస్తుంది. మొక్క ప్రక్క కొమ్మలు లేకుండా పెరుగుతుంది. కాయలు 12-13 సెం.మీ. పొడవుతో ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

పూసా నవాబహార్ : కయ పూసా మెసమి వాలే ఉంది, మొక్క పెరుగుదల పూసా సదాబాహర్ వాలే ఉంటుంది. ఈ రకం కూడా ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనది.

గౌరి : ప్రెవేట్ కంపెనీ రకం. ఖరీఫ్ వేసవి పంటలకు అనువైనది.

నేల తయారీ : భూమిని బాగా కిలియదున్ని, ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఖరీఫ్ పంటకాయతే 45 సెం.మీ దూరంలో బోదెలు వేసుకోవాలి.

విత్తనం : ఎకరాకు 12-16 కిలోల విత్తనము అవసరం అవుతుంది. మొదటి సారి గోరుచిక్కుడు పొలంలో వేసేటప్పుడు,  విత్తడానికి ముందు నత్రజనిని స్ధాపించే రైజోబియా బ్యాక్టీరియాను (200 గ్రా) విత్తనానికి పట్టించి విత్తకూవాలి.

ఎరువులు : ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పోటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన నత్రజని గింజలు విత్తిన 30-40 రోజులకు వేసి నీరు ఇవ్వాలి.

విత్తనశుద్ధి : ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా 1 కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత దీనికి ట్రెకోడెర్మా వీరిది 4 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

విత్తే దూరం : ఖరీఫ్ పంట : 60*15 సెం.మీ., వేసవి పంట : 45*15 సెం.మీ

వేసవి  పంటలో ఎకరాకు మొక్కల సాంద్రత ఎక్కవగా ఉండేటట్లు చూడాలి.

నీటి యాజమాన్యం : సింహాలు విత్తగానే నీరు పారించాలి. 3 వ రోజు మరల ఇవ్వాలి. ఆ తర్వాత నీటి తడులు 7 - 10 రోజుల వ్యవధితో ఇవ్వల్ని ఉంటుంది.

అంతరకృషి : గింజలు విత్తరానికి ముందే బెస్లీన్ కలుపు మందును 800 గ్రా. మూలా పదార్ధ / ఎకరాకు (200 లి. నీటిలో) తడినేల పై పిచికారి చేసే 30 రోజుల వరకు కలుపు నివారించబడుతుంది. 35 రోజులకు ఒకసారి దంతి నడిపితే సరిపోతుంది.

సస్యరక్షణ : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పేనుబంక : పెద్ద, చిన్ని పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి.

నివారణ : డైమిదోయేట్ 2 మీ.లి. లేదా మెరసిస్తక్స్ 2 మీ,లి, లేదా పసలోన్ 2 మీ.లి. లేదా పిప్రాణి 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల వ్యవధిలో ఈ మందులను మర్చి మర్చి పిచికారి చేయాలి.

బూడిద తెగులు : ఆకులపై తెల్లని పొడి పదార్ధం ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే, పసుపు రంగుకు మరి రాలిపోతాయి.

నివారణ : దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లేదా కేటదేం 1 మీ.లి. లేదా అఙాక్సిస్ర్టోబిన్ 23% ఎస్.సి. 1 మీ.లి. లేదా హెక్సాకోనజోల్ 1 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరం రోజుల వ్యవధితో మరోసారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు : ఆకుల మీద నల్లని మచ్చలు వచ్చి, తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు, మచ్చలన్నీ, కలిసిపోయి, ఆకులూ మాడిపోయి, రాలిపోతాయి.

నివారణ : దీని నివారణకు  మాంకోజెబ్ 2.5 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎండు తెగులు : మొక్కలు నిలువునా ఎండి చనిపోతాయి.

నివారణ : ట్రెకోడెర్మావిరిడి 4 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 కిలో ట్రెకోడెర్మా విరిడి 100 కిలోల వేప పిండికి కలిపి ఆఖిరి దుక్కిలో వేయాలి. అలాగే ఈ క్రంది జాగ్రత్తలు పాటించాలి.

  • పొలంలో నీరు నిలబడకుండా జాగ్రత్త పడాలి.
  • తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ / లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నెలంతా తడిచేలా పోయాలి.
  • పంట మార్పిడి పాటించాలి.

కోత : లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్ కి పంపాలి. ముదిరిన కాయలలో నారా (పీచు) శాతం ఎక్కువై కయ నాణ్యత తగ్గి మార్కెట్ లో పలుకాదు.

దిగుబడి : 20-25 క్వింటాళ్ళు / ఎకరాకు

వరుగుల తయారీ : గోరు చిక్కుడు కాయలను చిన్న ముక్కలుగా చేసి, 1% ఉప్పు ద్రావణంలో ముంచి, తీసి ఆరబెట్టాలి. ఎండిన వరుగులను గాలి తాగాలని డబ్బాలలో లేదా పాలిథిన్ సంచులలో నిలువ చేయాలి.

దిగుబడి

పొద రకాలు : కూరగాయ దిగుబడి : 3.6-4.0 ట/ఎ

గింజ దిగుబడి : 0.6-0.8 ట/ఎ

తీగ రకాలు : కూరగాయ దిగుబడి : 4.8-6.0 ట/ఎ.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు