పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పుట్టగొడుగుల పెంపకం

పుట్టగొడుగుల ఉత్పత్తి,జాగ్రత్తలు,రకాలు మరియు మార్కెటింగ్

పుట్టగొడుగుల ఉత్పత్తి

పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

పుట్టగొడుగుల పెంపకం

పుట్ట గొడుగులు అంటే ఏమిటి?

పుట్ట గొడుగులు అంటే ఏమిటో మరియు దీని గురించి వ్యవహారిక భాష లో తెలుసుకుందాం.

పుట్ట గొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ మాత్రమే. అయితే కొన్ని రకములైన ఫంగస్ లు మాత్రమే తినదగ్గవి. ఇందులోని చాలా రకాలు విషపూరితాలు. ఈ తినదగ్గ పుట్ట గొడుగులలో రెండు రకాలు ఉన్నాయి. అవి:

 1. అడవులలో (సహజంగా) పెరిగేవి.
 2. కృత్రిమ వాతావరణంలో పెంచేవి.
 3. అడవులలో (సహజంగా) పెరిగేవాటిలో తినదగ్గరకాలు చాలా తక్కువ వాటిలో Guchhi, Dhingri, Shittakke, Paddy Straw వంటివి ముఖ్యమైనవి.
 4. కృత్రిమ వాతావరణంలో పెంచే వాటిలొ Button Mushroom, Oyster Mushroom వంటివి ముఖ్యమైనవి.

మన దేశం లో Oyster Mushroom యొక్క ఉత్పత్తి, Button Mushroom కంటే తక్కువ. ఈ Oyster Mushroom కి డిమాండ్ విదేశాలలో ఎక్కువ.

చేపగుల్ల పుట్టగొడుగు ఉత్పత్తి

సీజను, రకాలు

 • ఏడాది పొడవునా వస్తాయి
 • ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం.
 • తెల్ల చేపగుల్ల(Co-1), బూడిద రంగు చేపగుల్ల(M-2) రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.

పుట్టగొడుగుల గృహాలు

 • 16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్ అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.
 • విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 300 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.
 • పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో 75 - 80% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే డిజిటల్ థర్మామీటర్లు, హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. స్పాన్(పుట్టగొడగులను విత్తడం)
 • సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న, గోధుమ ధాన్యాలు
 • స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.
 • వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి. ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం
 • సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి, పైపొట్టుతీసిన మొక్కజొన్న
 • ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).

సంచులు తయారుచేయడం :

 • 60X30 సెం.మీ. పాలిథిన్ సంచులు(రెండువేపులా తెరచి ఉండేవి) వాడాలి.
 • సంచులకు ఒకవేపు మూతికట్టి, మధ్యలో ఒక సెం.మీ. వ్యాసంతో రెండు రంధ్రాలు చేయాలి.
 • వండిన ఆ గడ్డిని చేతినుండ్గా తీసుకొని 5 సెం.మీ.ఎత్తు వరకు ఆసంచిలో వేసి నింపాలి. దానిపై 25 గ్రా.ల స్పాన్ను చల్లాలి.
 • గడ్డిని 25 సెం.మీ. ఎత్తుకు ఉంచాలి. ఇలా 4 పొరల స్పాన్, 4 పొరల గడ్డి వచ్చేదాకా చేయాలి.
 • ఇపుడు మూతి కట్టేసి పాదులను దొంతరలుగా పేర్చి స్పానింగ్ రూంలో ఉంచాలి.
 • 15-20 రోజుల తర్వాత పాలిథిన్ సంచులను కత్తిరించి తీసి వేయాలి, తరువాత ఆ పాదులను పెంపకానికై కేటాయించిన గదిలో ఉంచాలి.
 • ఇక వాటిని తరచూ నీటితో స్ప్రే చేస్తూండాలి.

పుట్టగొడుగుల పంటకోత

 • పుట్టగొడుగుల తలలు పాదులను తెరచిన మూడో రోజుకు పొడచూపుతాయి. ఆ తర్వాత 3 రోజులకు పరిణతి చెందుతాయి.
 • అలా పరిణతి చెందిన పుట్టగొడుగులను రోజూ కానీ, రోజు మార్చి రోజు కానీ కోసుకోవాలి.
 • మొదటి పంటకోత అయ్యాక ఆ పాదుల పైభాగాలను చదునుచేసి తిరిగి మరో పంటకు సిద్ధం చేసుకోవచ్చు. ఇలా రెండు, మూడు పంటలు పొందవచ్చు.
వీటి పెంపకము, మార్కెటింగ్ వంటి వివరములు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పుట్ట గొడుగుల కు ప్రత్యేకమైన సీజన్ అంటూ ఎమీ లేదు. ఇవి సంవత్సరం పొడవునా వస్తాయి. పైగా వీటికి పెద్దగా infrastructure కూడా అవసరం లేదు. ఇవి పెద్దగా స్థలంను కూడా అక్రమించవు.రవాణా ఖర్చు కూడా పెద్దగా ఉండదు.వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కూడా బాగా ఉంది. ( Non voluminous with high value product). వీటికి ఇంత డిమాండ్ రావడానికి కారణాలు:

 1. ఇందులో క్రొవ్వు బాగా తక్కువ
 2. ఫొలిక్ ఆసిడ్, విటమిన్లు, మినరల్స్, అమినో ఆసిడ్లు ఎక్కువ.
 3. తేలిక గా అరుగుతుంది.
 4. డయాబిటిక్ పేషంట్ లు కూడా వీటిని తినవచ్చును. ఈ కారాణాల వలన దీనికి డిమాండ్ పెరుగుతోంది.

పుట్టగొడుగుల పెంపకం ఎలా ?

ప్రారంభంలో ఒక 20-25 చదరపు అడుగుల షెడ్ అవసరం. వీటి పెంపకం ఎంత తేలికంటే వీటిని ఒక పూరి పాక లో కూడా పెంచవచ్చు. ఇదే షెడ్ లేదా పాక ను రెండు గదులుగా విభజించుకొని ఒక దానిని విత్తుకోవడానికి మరొకదానిని పెంపకానికి వాడుకోవచ్చు. ఈ విత్తుకొనే గదిలో 25 నుంచి 300 సె ఉష్ణొగ్రత ఉండాలి. పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, చూసుకోవాలి. ఈ గదిలో మాత్రం గాలిలో తేమ 75 - 80% కన్నా ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. రెండు గదులకూ కూడా గాలి, వెలుతురూ ఉండేలాగా చూసుకోవాలి.

వీటికి కావలసినవి :

 1. జొన్న/ గోధుమ ధాన్యాలు / ముడిశనగలు/ సజ్జ మొదలైనవి.
 2. శిలీంద్రము (దీనిని మంచి వ్యవసాయ పరిశొధనా శాల నుంచి తెచ్చుకోవాలి. ఇందులో రాజీ పడకూడదు.)
 3. పై పొట్టుతీసిన మొక్కజొన్న/ గడ్డి ( వరి గడ్డి / చెరకు పిప్పి)
 4. పాలిథిన్ సంచులు
 5. ఉష్ణోగ్రత, తేమలను కొలిచే థర్మామీటర్, హ్యుమిడిటీ మీటర్.
  1. గడ్డి ని 5-7 సె.మీ. ముక్కలు గా కత్తిరించుకుని వాటిని 5-7 గం. నానబెట్టిన తర్వాత వేడి చెయాలి. ఈ నీటి ని పారబోసి 65-75 % తేమ ఉండేలా ఆరబెట్టాలి.
  2. ముందుగా ఈ ధాన్యాలను సగం ఉడకబెట్టి గాలికి ఎండ బెట్టాలి. దీనికి కాషియం కార్బొనేట్ పొడి 2 % కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ సీసాల లో నింపుకోవాలి.ఈ సీసాలను వేడి నీటిలో ఉడకబెట్టాలి. ఇప్పుడు తెచ్చుకున్న శిలీంద్రాన్ని 12-15 రోజులు పొదిగిన తర్వాత ఇంతకు ముందు మనం ఉడికించి పెట్టుకున్న సీసాలలోని దానితో కలిపి విత్తుకోవాలి.

ఇప్పుడు రెండువైపులా తెరిచి ఉండే పాలిధిన్ సంచులను తీసుకుని ఒక వైపు మూతి కట్టి మధ్యలో 2-3 రంద్రాలు చెయ్యాలి. ఆ గడ్డిని 5 సెం.మీఎత్తు లో ఈ సంచిలో వేసుకోవాలి. దాని పైన మనం పైన చెసుకున్న దానిని వేయాలి. ఇలా 4 పొరలు వెయాలి. ఇప్పుడు ఈ సంచి రెండొ మూతి ని కట్టివేసి వరసగా పెట్టాలి. 18-25 రోజుల తర్వాత ఈ సంచులను తీసివేసి పెంపకం కోసం కేటాయించుకున్న గదిలోకి మార్చి, వరసగా పేర్చుకోవాలి. ఇప్పుడు వీటి పైన నీటిని తరచుగా జల్లుతూ ఉండాలి. సాదారణంగా ఇవి 4-6 రోజులలొ కోతకొస్తాయి. ఇవి సాదారణంగా 2-3 పంటలను ఇస్తాయి. రోజూ కానీ, రోజు విడిచి రోజు కానీ కోత కొస్తాయి.

ఈ విధంగా కోసిన పంటను మార్కెట్ చేసుకోవచ్చు.

పైన వివరించిన విధానము సాధారణంగా ఉపయోగించే విధానము అయితే, ఈ వ్యాపారం / వ్యవసాయం ప్రారంభించే ముందు ఆ ప్రదేశం లేదా చుట్టు పక్కల ఊళ్ళలో ఉన్న మార్కెట్ ను అంచనా వేసుకొని ప్రారంభించుకోంటే మంచి లాభాలని పొందవచ్చు. అలాగే ఈ పుట్టగొడుగు లకు విదేశీ ఎగుమతి అవకాశములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఉపయోగించు కుంటే మంచి లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం కావాలంటే, వ్యవసాయశాఖను కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ శాఖలను కానీ సంప్రదించండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01018675722
నంద రెడ్డి May 03, 2020 01:42 AM

నమస్కారం నా పేరు నందశ్రీను నేను ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నా. కావున ఈ ఒక్క పుట్టగొడుగుల పెంపకం ని ఈమధ్యనే నేను తెలుసుకున్నాను .
నేను కూడా ఈ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే నాకు ఈ విశ్వవిద్యాలయ విద్యాలయాల యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గాని వాళ్ళ కంపెనీ పేరు గాని ఈ మెయిల్ కానీ మన దొరికితే నేను ఈ పంటను మరింత డెవలప్ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను

ప్రభుదాసు Jul 27, 2019 11:16 AM

ఉడకబెట్టిన గడ్డిని కవర్లలో నింపుకున్న క ఎన్ని రోజులకి కోసి మట్టి పోసుకోవాలి మేడం మేము కొత్తగ చేస్తునాము మేడం

విజయ్ కుమార్ NALLI Sep 08, 2018 03:45 PM

నాకు SPAWN కావాలి నాకు తెలియ జేయగలరు నా ఫోన్ 78*****73

Giddaiah Dec 06, 2017 07:37 AM

Please provide cultivation vedeos

Ramesh babu Mar 09, 2017 11:49 AM

నేను చిన్న మొత్తం లో muwhroom ఉత్పత్తి మరియు మార్కెట్ లో విస్తరించి అమ్మ దలచాను . ఐతే నాకు ఎలాంటి అనుభవం లేదు. నా వద్ద పెట్టుబడి తక్కువ గ నున్నది . కావున నాకు ఉచిత ట్రైనింగ్ ఇచ్చే వారి ఫోన్ నెంబర్ కావాలి . నేను L .బి.నగర్ దగ్గర లో ఉంటాను.

దయచేసి నాకు వివరములు చెప్పగలరు .

నా పేరు > రమేష్ బాబు
ఫోన్:96*****54

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు