మన నిత్యజీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరల ద్వారానే అంటే అతిశయోక్తి కాదు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే , పెద్దవారికి రోజుకు కనీసం 85 గ్రా. పండ్లు , 300 గ్రా. కూరగాయలు అవసరం. కానీ , మన దేశంలో ప్రస్తుతం కాయగూరల ఉత్పత్తి అవుతున్నదాని ప్రకారం చూస్తే , దినానికి సగటున ఒకరికి కేవలం 120 గ్రా. కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
పైన చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొంటే , మనకోసం మనం , ఇంట్లోనే కాయగూరలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికై ఇంట్లోని వంటగది , స్నానాలగదులలో వృధాఅయ్యే నీటిని వాడుకోవచ్చు. దీనివల్ల మన ప్రాణానికి హాని కలిగించే కలిగించే నిలవ నీరు , మరుగు నీరు ఏర్పడకుండా ఉంటుంది. అంతే కాక మన కూరగాయల అవసరాలనూ తీరుస్తుంది కూడా. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడను రాకుండా , ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకొనేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాలను వాడం కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా. ఎందుకంటే , ఇలా ఉత్పత్తి అయ్యే కూరగాయల్లో మన ఆరోగ్యానికి భంగం కల్గించే ఎరువుల అవశేషాలు ఈ కాయగూరల్లో ఉండవు.
గార్డెన్ ఎక్కడ ఆరంభించాలంటే.. .. ..
వంటింటి తోట లేదూ కిచెన్ గార్డెన్‌ను ఎక్కడ పెంచాలనే దానికి స్థలం ఎంపిక విషయంలో మనకు పరిమితమైన అవకాశం ఉంది. ఇంటి పెరటి స్థలమే అందరికీ చివరగా అందుబాటులో ఉండే స్థలంగా చెప్పాలి. ఎందుకంటే, ఇంటిలోని వారంతా తమ ఖాళీ సమయాల్లో కూరగాయలపై తగినంత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. పైగా, వంటింటిలోనించి, స్నానాలగదిలోనించీ వృథాగా పోయే నీటిని ఈ తోటలకు సులభంగా మళ్లించవచ్చు. ఈ కిచెన్ గార్డెన్ ఎంత పరిమాణంలో ఉండాలీ అనేదానికెలాంటి నియమాలూ లేవు. ఐతే, మనం ఎంత స్థలం కేటాయించగలం, ఎంతమందికి సరిపడా కూరలు ఉత్పత్తి చేసుకోవాలి అనేదానిపైన వాటి సైజును నిర్ణయించుకోవాలి. దీనికెలాటి నిర్ణీత ఆకార నియమాలు కూడా లేవు. ఐతే, చదరంగా ఉండే దానికన్నా దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. పంట కోతల ఆధారంగా ఒక 5 సెంట్ల భూమిలో కిచన్ గార్డెన్‌ను ఆరంభిస్తే, కనీసం 4 నుంచి 5 మంది ఉండే కుటుంబానికి సరిపడా కూరలు పండించవచ్చు.
ముందుగా ఒక పార తీసుకొని 30-40 సెం.మీ. లోతుగా భూమిని తవ్వుకోవాలి. రాళ్లు, పొదలు, ముళ్ళు వగైరాలు తొలగించాలి. 100 కిలోల మంచి పొలంనించి తెచ్చుకొన్న సేంద్రీయ ఎరువులు లేదా వర్మికంపోస్ట్ ఎరువును వేసి మట్టిలో కలపాలి. గట్లు కట్టి, అవసరాన్నిబట్టి మధ్యన 45 సెంమీ నించి 60 సెంమీ ఎడం ఉండేలా చూడాలి. నేల చదునుగా కూడా ఉండొచ్చు.
భారతీయ పరిస్థితులలో ఏడాది పొడవునా ఏఏ మొక్కలు ఎపుడెపుడు వేసుకోవాలో (కొండ ప్రాంతాలను మినహాయించి) కింద సూచనప్రాయంగా ఇవ్వడం జరుగుతోంది.
ప్లాటు నం. | కాయగూర మొక్క పేరు | సీజను |
01. |
టమేటో, ఉల్లి ముల్లంగి బీన్సు బెండ(ఓక్రా) |
జూన్ - సెప్టెంబర్ అక్టోబర్ - నవంబర్ డిశంబర్ - ఫిబ్రవరి మార్చి - మే
|
02 |
వంకాయ బీన్సు టమేటో తోటకూర
|
జూన్ - సెప్టెంబర్ అక్టోబర్ - నవంబర్ జూన్ - సెప్టంబర్ మే
|
03. |
మిరప, ముల్లంగి అలసందలు ఉల్లి(బళ్లారి) |
జూన్ - సెప్టెంబర్ డిశంబర్ - ఫిబ్రవరి మార్చి - మే
|
04. |
బెండ, ముల్లంగి క్యాబేజీ గోరు చిక్కుడు |
జూన్ - ఆగస్ట్ సెప్టంబర్ - డిశంబర్ జనవరి - మార్చి
|
05. |
ఉల్లి(బళ్లారి) బీటురూట్ టొమేటో ఉల్లి |
జూన్ - ఆగస్ట్ సెప్టంబర్ - నవంబర్ డిశంబర్ - మార్చి ఏప్రిల్ - మే
|
06. |
గోరు చిక్కుడు వంకాయ, బీటురూట్
|
జూన్ - సెప్టెంబర్ అక్టోబర్ - జనవరి
|
07. |
ఉల్లి(బళ్లారి) క్యారెట్ గుమ్మడి(చిన్నది) పొదచిక్కుడు
|
జూలై- ఆగస్ట్ సెప్టంబర్ - డిశంబర్ జనవరి - మే
|
08. |
లబ్-లబ్(పొద) ఉల్లి బెండ కొత్తి మీర |
జూన్ - ఆగస్ట్ సెప్టంబర్ - డిశంబర్ జూన్ - మార్చి ఏప్రిల్ - మే
|
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023
భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమ...
తేనెటీగల,పట్టు,పుట్టగొడుగుల,పెరటి తోటల,వర్మి కంపోస...
వ్యవసాయములో నుతనసాంకేతికపరిజ్ఞానము
కూరగాయలు