অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ భీమా

వ్యవసాయ భీమా

పాడి పశువుల భీమా పథకం

పాడి పశువుల (లైవ్ స్టాక్)  భీమా పథకం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలుజరుగుతున్న పథకం. 10 వ పంచవర్ష ప్రణాళికలోని 2005-06, 2006-07 సంవత్సరాలలో, 11వ పంచవర్ష ప్రణాళికలోని 2007-08 సంవత్సరంలో మనదేశంలో ఎంపికచేసిన 100 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు జరిపారు.  2010 సంవత్సరంనుంచి,  కొత్తగా ఎంపికచేసిన 300 జిల్లాలలో ఈ పథకాన్ని శాశ్వత స్థాయిలో అమలుజరుపుతున్నారు.

పాడి పశువుల భీమా పథకాన్ని రెండు  ఆశయాలను దృష్టిలోవుంచుకుని  చేపట్టారు. పాడిపశువులు చనిపోతే కలిగే నష్టంనుంచి రైతులకు , పాడి పశువుల పెంపకందార్లకు తగిన రక్షణ కల్పించడం ఒక ఆశయం కాగా ; పాడిపశువులను భీమాచేసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించి, తద్వారా  పాడిపశువులు, వాటి ఉత్పత్తులు నాణ్యంగా వుండేలా చూడాలనే అంతిమ లక్ష్య సాధనకు వీలుగా  ఆ భీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడం ఈ పథకం ఆశిస్తున్న మరో ఆశయం.

ఈ పథకం కింద, అధిక పాల దిగుబడి కలిగిన సంకరజాతి ఆవులు, గేదెలను మార్కెట్లో అప్పటికి వాటి గరిష్ఠ ధరకు భీమాచేసుకుంటారు. చెల్లించవలసిన భీమా ప్రీమియం మొత్తంలో, 50 % సబ్సిడీగా ఇస్తారు. సబ్సిడీరూపంలో అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ఒక్కొక్క లబ్ధిదారు, రెండు పాడి పశువులకు మించకుండా సబ్సిడీ సదుపాయాన్ని పొందవచ్చు. గరిష్ఠంగా మూడేళ్ళకు మించని భీమా పాలసీలకే సబ్సిడీ సదుపాయం వర్తిస్తుంది.

గోవా మినహా మిగతా అన్ని రాష్ట్రాలలో ఆయా  ' రాష్ట్ర పాడి పశువుల అభివృద్ధి బోర్డు ' ల ద్వారా ఈ పథకాన్ని అమలుజరుపుతున్నారు.

ఈ పథకం వర్తించే పశువులు - లబ్ధిదారుల ఎంపిక తీరు

 • ఈనిన తర్వాతనుంచి వట్టిపోయేవరకు , పాలిచ్చే కాలానికి (లాక్టేషన్), కనీసం 1,500 లీటర్ల పాలిచ్చే  గేదెలు, ఆవులనన్నిటినీ , అధిక దిగుబడి పాడి పశువులుగా పరిగణిస్తారు. ఈ పథకం కింద,  వీటిని మార్కెట్‌లో వాటి అప్పటి  గరిష్ఠ ధరకు భీమా చేయవచ్చు.
 • మరేదైనా భీమా పథకం / ప్రణాళికా పథకం కింద ప్రయోజనం పొందే పశువులు వేటికీ ఈ పథకం వర్తించదు.
 • సబ్సిడీ సదుపాయం ఒక లబ్ధిదారుకు, కేవలం రెండు పశువులకు మాత్రమే పరిమితం. ఒక్కొక్క పాడి పశువుకు ఒక్కసారి భీమాకు,  గరిష్ఠంగా మూడేళ్ళ  కాలానికి మించని పాలసీలకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
 • మూడేళ్ళ పాలసీ తీసుకునేలాగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల  ఖర్చు తగ్గుతుంది ; తుపానులు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలలో అసలైన ప్రయోజనం పొందడానికి వీలవుతుంది. అయితే, ఏవైనా సహేతుకమైన కారణాల దృష్ట్యా, పాడిపశువుల యజమానులైనవారైనా మూడేళ్ళకంటె తక్కువకాలానికి పాలసీ తీసుకోవాలనుకుంటే కూడా వారికి ఈ పథకం కింద సబ్సిడీ సదుపాయాన్ని వర్తింపజేయవచ్చు. కాని, ఆ తర్వాత పాలసీ కాలపరిమితి పొడిగింపునకు సబ్సిడీ పొందే అవకాశం వారికి వుండదు.

పాడి పశువుమార్కెట్ ధర నిర్ణయించడం

పాడిపశువులను మార్కెట్‌లో అప్పటి గరిష్ఠ ధరకు భీమా చేస్తారు. ఈ ధరను లబ్ధిదారు, గుర్తింపుపొందిన పశువైద్యుడు, ఇన్సూరెన్స్ ఏజంట్ కలిసి నిర్ణయిస్తారు.

భీమాచేసిన పాడి పశువును గుర్తుపట్టే తీరు

భీమా సొమ్ము చెల్లించాలంటే, భీమాచేసిన పాడిపశువు అదేనని సక్రమంగా, నిర్దిష్టంగా గుర్తించడం అవసరం. అందువల్ల, అలాంటి పశువు చెవికి ఒక గుర్తింపు పట్టీ (టాగ్) తగిలించడం వున్నంతలో ఆధారపడదగిన మంచి పద్ధతి. భీమా చేసే సమయంలో సాంప్రదాయికంగా చెవికి పట్టీ వేయడమో లేదా ఆధునిక పరిజ్ఞానంతో మైక్రో చిప్ అమర్చడమో అనుసరించవలసి వుంటుంది. గుర్తింపు పట్టీ లేదా చిప్‌కు అయ్యే ఖర్చును భీమా కంపెనీ  భరిస్తుంది; దానిని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మాత్రం లబ్ధిదారుదే. ఎలాంటి గుర్తింపు పద్ధతిని అనుసరించాలి, దాని నాణ్యత ఎలా వుండాలనేది లబ్ధిదారులు, భీమా కంపెనీ పరస్పర అంగీకారంతో నిర్ణయించుకోవలసి వుంటుంది.

భీమా పాలసీ అమలులో వుండగానే యజమాని మారితే…

భీమా పాలసీ అమలులో వుండగానే ఆ ఫాడి పశువును అమ్మడమో లేదా మరొకరికి అప్పగించడమో జరిగే సందర్భంలో , పాలసీ పూర్తయ్యే గడువులో మిగతా కాలానికి, లబ్ధిదారుకు వుండే అధికారాన్ని ఆ పాడి పశువు కొత్త యజమానికి బదలాయించవలసి (మార్చడం) వుంటుంది. అందువల్ల, భీమా పాలసీ ని మరొకరిపేర బదలాయించవలసివస్తే అనుసరించవలసిన పద్ధతులు, ఫీజు, విక్రయ పత్రం (సేల్ డీడ్) మొదలైన విషయాలను గురించి, భీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే ముందే, ఒక నిర్ణయానికి రావాలి.

క్లెయిముల పరిష్కారం

క్లెయిము చెల్లించవలసి వచ్చిన  సందర్భంలో, అవసరమైన పత్రాలను అందజేసిన 15 రోజులలోగా (వీలున్నంతవరకు) భీమా మొత్తాన్ని చెల్లించవలసివుంటుంది. పాడి పశువును భీమా చేసే సమయంలోనే, క్లెయిముల పరిష్కారానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులను స్పష్టంగా పేర్కొనడం, క్లెయిము కోసం అందజేయవలసిన  పత్రాల జాబితాను రూపొందించడం, పాలసీ పత్రంతోపాటు ఆ వివరాలను లబ్ధిదారుకు అందించడంలో సి.ఇ.ఓ.లు శ్రద్ధ వహించవలసి వుంటుంది.

ఆధారము: http://dahd.nic.in

జాతీయ వ్యవసాయ భీమా పథకం(ఎన్‌ఏఐఎస్‌) లేదా రాష్ట్రీయ కృషి భీమా యోజన (ఆర్‌కెబివై)

లక్ష్యాలు

ఆర్కెబివైలక్ష్యాలుఇలా ఉన్నాయి  :-

 • ప్రకృతి వైపరీత్యాలవల్ల, చీడ, రోగాలవల్ల ప్రకటిత పంటలు వైపల్యాన్ని  చవిచూసినపుడు రైతులకు వారి నష్టాన్ని భర్త్తీ చేసేలాగా ఆర్థిక సాయాన్ని , భీమా సౌకర్యాన్ని ఏర్పాటుచేయడం.
 • రైతులకు అభివృద్ధిదాయకమైన వ్యవసాయ పద్ధతులను వాడటానికి ప్రోత్సాహించడం, నాణ్యతగల ముడిసరుకులు, పరిజ్ఞానం వాడేలా చేయడం.
 • రైతులకు వారి పొలాలనుంచి వచ్చే ఆదాయం, ముఖ్యంగా వైపరీత్యాలు సంభవించిన కాలంలో,  స్థిరంగా ఉండేలా చూడటం.

పథకం ముఖ్య సౌకర్యాలు

1.పథకం కిందిపంటలు:

 • కింది వాటికి పంటలలో  i) కొన్ని ఏళ్ల పంటల రాబడి పంట కోతల ప్రయోగాల(క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ -సిసిఇ) సంబంధించిన సమాచారం లభిస్తూండాలి. ii) ఇపుడు ప్రతిపాదిస్తున్న సీజన్కు సంబంధించి తగినన్ని సిసిఇలు చేపట్టి ఉండాలి :
 • ఆహారపు పంటలు(తృణ, పప్పుధాన్యాలు, జొన్న)
 • నూనె విత్తనాలు
 • చెరకు, పత్తి, అలుగడ్డ(సాలుసరి వ్యాపార, ఉద్యాన పంటలు)
 • ఇతర సాలుసరి వ్యాపార, ఉద్యాన పంటలు - కొన్ని ఏళ్ల పంటల రాబడి పంట కోతలకు సంబంధించిన డేటా దొరికే పక్షంలో వాటికి 3ఏళ్లదాకా ఈ పథకం వర్తిస్తుంది. ఐతే, వచ్చే ఏడాది ఏఏ పంటలు ఈ పథకం కిందకొస్తాయో ఈ ఏడాది చెప్పడం  జరుగుతుంది.

2.పథకం కిందకొచ్చే రాష్ట్రాలు, ప్రదేశాలు

 • ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో, యుటిలలో వర్తిస్తుంది. ఒక ఏడాదిలో ఈ పథకం వర్తింపజేసే పంటలను ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సి ఉంటుంది.
 • బైట పడే అవకాశం : రాష్ట్రాలు, యుటిలు ఒకసారి ఈ పథకానికి అంగీకరించాక వద్దనుకొంటే, కనీసం 3ఏళ్లు ఈ పథకాన్ని భరించాల్సి ఉంటుంది .

3. పథకం కిందకొచ్చే రైతులు

 • ఈ పథకం కింద రైతులందరూ అర్హులే. రైతులు అంటే,  ప్రకటిత పంటలను పండించే భాగస్వామ్య రైతులు, కౌలుదారులంతా అని అర్థం.
 • ఈ పథకం కింద రైతులందరూ అర్హులు :
 • తప్పనిసరి పద్ధతి : ప్రకటిత పంటలను వేసే రైతులందరికీ, వారు తీసుకొన్న సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్(ఎస్ఏఓ) లోనులతోబాటు విధిగా తీసుకోవాలి.
 • స్వచ్ఛంధ పద్ధతి : ప్రకటిత పంటలను వేసే రైతులందరికీ, వారు ఎలాటి సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్(ఎస్ఏఓ) లోనూ తీసుకోక, ఈ పథకంకిందకొస్తే తీసుకోవచ్చు.

4. పథకం కిందకొచ్చే ప్రమాదాలు, మినహాయింపులు

 • ఈ పథకం కింద సమగ్ర భీమాని కింది వారింపలేని ప్రమాదాలనుంచి రక్షణగా ఇవ్వడం జరుగుతుంది.
  1. సహజమైన నిప్పు, పిడుగు
  2. గాలివాన, వడగళ్ల వాన, తుఫాను(టైఫూను, టెంపెస్ట్, హరికేన్, టొర్నాడో వగైరా)
  3. వరదలు, ముంపు, కొండచరియలు విరిగిపడటం.
  4. కరువు, కాటకాలు
  5. చీడ/ వ్యాధులు వగైరా
 • యుద్దం, అణు పరీక్షలు, ద్వాషాల వల్ల విధ్వంసం, ఇతర వారింపదగ్గ రిస్క్లు - వీటన్నిటికీ మినహాయింపు న్నాయి.

5. భీమా మొత్తం/ పరిమితి

 • భీమా మొత్తం(ఎస్ఐ)ని భీమా చేసిన పంట రాబడికి సమానంగా ఉండేలా రైతులు కోరుకోవచ్చు. ఐతే, ప్రకటిత సగటు రాబడికి 150% దాకా వాణిజ్య రేట్ల ప్రకారం భీమా చేసుకోవచ్చు.
 • అప్పు తీసుకొన్న రైతులకు భీమా మొత్తం అనేది అప్పటికే తీసుకొన్న పంట రుణానికి సమానంగా  ఉండేలా చూడొచ్చు.
 • ఇంకా, అప్పు తీసుకొన్న రైతులకు భీమా ఖర్చులు అప్పు అదనంగా ఎంత తీసుకొంటారనే దానిపై ఆధారపడుతుంది.
 • పంట రుణాల వితరణల విషయంలో ఆర్బిఐ /  నాబార్డులు నిర్ణయించిన  విధివిధానాలదే అంతిమ నిర్ణయం.

6. ప్రీమియం రేట్లు

వరసనెం.

సీజను

పంట

ప్రీమియం ధర

1

ఖరీఫ్

బాజ్రా & నూనెగింజలు

3.5% ఎస్ఐ లేదా అసలు రేటు - ఏది తక్కువైతే అది

 

 

ఇతర పంటలు(తృణ, పప్పు ధాన్యాలు, జొన్న వగైరా )

2.5% ఎస్ఐ లేదా అసలు రేటు - ఏది తక్కువైతే అది

2

రబి

గోధుమ

1.5% ఎస్ఐ లేదా అసలు రేటు - ఏది తక్కువైతే అది

 

 

ఇతర పంటలు(తృణ, పప్పు ధాన్యాలు, జొన్న, నూనెగింజలు)

2.0% ఎస్ఐ లేదా అసలు రేటు - ఏది తక్కువైతే అది

3

ఖరీఫ్& రబి

సంవత్సర వాణిజ్య/  ఉద్యాన పంటలు

అసలు రేటు

 • తృణ, పప్పు ధాన్యాలు, జొన్న, నూనెగింజలు- వీటి విషయాల్లో 5 ఏళ్లలో అసలైన పద్ధతికి రావడం జరుగుతుంది. అసలు రేట్లు జిల్లా / ప్రాంతం / రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం లేదా యూటి ఇష్టానుసారం  అమలు అవుతుంది.

7. ప్రీమియం సబ్సిడీ

 • చిన్న, సన్నకారు రైతులకుప్రీమియంలో 50% సబ్సిడీని అనుమతిస్తారు. ఆ సబ్సిడీని కేంద్రం, రాష్ట్రం లేదీ యూటి సమానంగా భరిస్తాయి. ప్రీమియం సబ్సిడీ ని 3-5 ఏళ్లలో ఆర్థిక ఫలితాలనుబట్టి, పథకం అమలైన తొలి సంవత్సరం చివరన రైతుల స్పందనబట్టి  తొలగిస్తారు.
 • చిన్న , సన్నకారు రైతులను ఇలా నిర్వచిస్తారు  :

చిన్నరైతులు:

 • చిన్న  రైతులంటే 2 హెక్టారులు(5ఎకరాలు) అంతకన్నా తక్కువ ఉన్నవారని అర్థం. ఆయా రాష్ట్రాల్లో, యుటిల్లో అమల్లో ఉన్న  భూపరిమితి చట్టం  ప్రకారం దీన్ని  లెక్కగడతారు.

సన్నకారు రైతులు:

సన్న కారు రైతులంటే 1 హెక్టారు (2.5ఎకరాలు) అంతకన్నా తక్కువ ఉన్నవారని అర్థం.

8.  పథకం వర్తింపు లక్షణం, హామీ

భీమా చేసిన పంట నిర్వచించిన వైశాల్యానికి హెక్టారుకు అసలు రాబడి(యాక్చువల్ ఈల్డ్ - ఏవై) గనక గరిష్ట రాబడి(థ్రెషోల్డ్ ఈల్డ్-టివై) కన్నా తక్కువైతే ఆ ప్రదేశంలో ఉండే రైతులందరూ అనుకొన్న రాబడికన్నా తక్కువ రాబడిని పొందినట్లు(సిసిఇ ఆధారంగా) నిశ్చయించడం జరుగుతుంది. ఈ పథకంలో అలాటి వాటిని కూడా గుర్తిస్తారు.

ఇండెమ్నిటిని కింది సూత్రంప్రకారం లెక్కగడతారు :

(రాబడిలో తగ్గుదల / గరిష్ట రాబడి) X రైతు చేసిన భీమా మొత్తం  { నిర్ణీత వైశాల్యానికి రాబడిలో తగ్గింపు = ‘గరిష్ట రాబడి - అసలు రాబడి’ }.

9. క్లెయింలను కోరడం, చెల్లింపు పద్ధతులు

 • రాబడి గురించిన డేటా రాష్ట్రాలనించి, యుటీలనించి నిర్ణీత గడువులోగా అందగానే ఐఏ క్లెయిమ్లను లెక్కగట్టడం, అందజేయడం  జరుగుతుంది.
 • క్లెయిమ్ చెక్లను లెక్కలతో సహా వివిధ బ్యాంకులకు  అందజేయడం జరుగుతుంది. గ్రామాల్లోని ఆ బ్యాంకులు ఆయా సంబంధిత రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది. లబ్దిదారుల పేర్లు బ్యాంకులోని నోటీసు బోర్డుపై  ప్రముఖంగా ప్రకటించడం జరుగుతుంది.
 • స్థానిక ఉపద్రవాల విషయంలో అంటే గాలివాన, కొండచరియలు విరిగిపడటం లాటివి ఐఏ ఒక పద్ధతి ప్రకారం అంచనాలను తయారుచేసి అలాటి రైతుల  నష్టాలను  డిఏసి, రాష్ట్ర, యుటిలతో సంప్రదించి పూడ్చే ఏర్పాట్లు చేస్తుంది. అలాటి క్లెయిమ్ల చెల్లింపులు పూర్తి వ్యక్తిగతంగా ఐఏకీ, భీమా చేసిన రైతుకీ మధ్య జరుగుతుంది.

10.పునర్-భీమా కవర్

 • అంతర్జాతీయ పునర్భీమా మార్కెట్లో ప్రతిపాదిత ఆర్కేబివై కవర్కై తగిన పునర్భీమా కోసం ఐఏ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది.

భీమా మొత్తం, ప్రీమియం లెక్కగట్టడం - ఒక ఉదాహరణ

ధాన్యం, వరి పంటలకు భీమా మొత్తం పరిమితిమొత్తం


రాష్ట్ర గరిష్ట రాబడి : 1930 కి. హెక్టారుకు

రాష్ట్ర  సగటు రాబడి : 2412 కి. హెక్టారుకు

బియ్యం కనీస మద్దతు ధర : రు. 7.35  కిలోకు

గరిష్ట రాబడి విలవ  రు.  14200 హెక్టారుకు

అసలు రాబడి విలవ  రు.  26600 హెక్టారుకు

సాధారణ ప్రీమియం రేటు  - 2.5%

అసలు ప్రీమియం రేటు - 3.55%

భీమా మొత్తం,ప్రీమియం పట్టిక :

రైతు“ఏ”(అప్పుదారు)

రైతు“బి”(అప్పుదారుకానివారు)

a.తప్పనిసరికవరేజి

అప్పు మొత్తం

రు.12000.00

-

మొత్తం ప్రీమియం @ 2.5%

రు. 300.00

-

ప్రీమియంలో 50% సబ్సిడీ

రు. 150.00

-

మొత్తం ప్రీమియం

రు. 150.00

-

b.ఐచ్ఛిక కవరేజి- గరిష్ట రాబడి విలవ వరకు

పూర్తి ప్రీమియం  12000 - 14200 = 2200 @ 2.5% (అప్పుదారు-రైతుకు)

రు. 55.00

 

సాధారణ రైతుకు ప్రీమియం  (అప్పుదారు కాని-రైతుకు)

 

రు. 355.00

ప్రీమియంలో 50% సబ్సిడీ

రు. 27.50

రు. 177.50

మొత్తం ప్రీమియం

రు. 27.50

రు. 177.50

c.ఐచ్ఛిక కవరేజి- సగటు రాబడి విలవ 150% వరకు

పూర్తి ప్రీమియం 14200 - 26600 = 12400 @ 3.55%

రు. 440.20

రు. 440.20

ప్రీమియంలో 50% సబ్సిడీ

రు. 220.10

రు. 220.10

మొత్తం ప్రీమియం

రు. 220.10

రు. 220.10

మొత్తం మీద  ప్రీమియం ( a + b + c )

రు. 397.60

రు. 397.60

ఉదాహరణ:
రైతు “ఏ”(అప్పుదారు, రైతు “బి”(అప్పుతీసుకోనివారు). ఇద్దరూ చెరో హెక్టారు ధాన్యం, వరి పంట పండిస్తున్నారు. 
(వీరు చిన్న, సన్న కారురైతులు కావడంవల్లప్రీమియంలో 50% సబ్సిడీ కి అర్హులు )..

 

రైతు “ఏ”(అప్పుదారు)

రైతు “బి”(అప్పుతీసుకోనివారు)

అప్పు మొత్తం

రు. 15,000

-

కవరేజి మొత్తం

రు. 20,000

రు. 16,000

చెల్లించాల్సిన  ప్రీమియం రేటు

2.5% (సాధారణ రేటు) రు. 15,000 వరకు

2.5%(సాధారణ రేటు) రు. 14,200 వరకు

3.55 % (అసలు రేటు) మిగిలిన రు.  5,000 మొత్తానికి

3.55% (actuarial rate) for balance రు. 1,800/-

పూర్తి ప్రీమియం మొత్తం

సాధారణ రేటులో  రు. 375.00 + అసలు రేటులొ రు. 177.50  అంటే మొత్తానికిరు. 552.50

సాధారణ రేటులొ  రు. 355.00+అసలు రేటులొ  రు. 64 అంటే,మొత్తానికి  రు. 419

సబ్సిడీ

ప్రీమియంలో 50%  రు. 276.25

ప్రీమియంలో  50%రు. 209.50

మొత్తం మీద చెల్లించాల్సిన  ప్రీమియం

రు. 276.25

రు. 209.50

అవసరమయ్యే ఫారమ్లు

వర్ష భీమా -2005

ఉపోద్ఘాతం

భారత దేశ వ్యవసాయంలో 65 శాతం సహజ కారణాలపైనే, ముఖ్యంగా వర్షపాతంపై ఆధారపడి ఉంది. వర్షపాతాలలొ తేడాలవల్ల పంట దిగుబడిలో 50% తేడా వస్తుంది. ఈ దిగుబడి రాన్రానూ అంచనాలకు దొరక్కుండా అనిశ్చితంగా మారిపోతోంది. వాతావరణ కారణాలను మనం నియంత్రించలేం. కానీ, వాటివల్ల కలిగే ఆర్థిక అనిశ్చితిని ముఖ్యంగా వ్యవసాయ రాబడులలోని అనిశ్చతులను కొంత వరకు నియంత్రించవచ్చు.

పరిధి
వర్ష భీమా అనేది అంచనా వేసిన వర్షాభావంవల్ల పంట దిగుబడిలో తగ్గుదలను కవర్‌ చేస్తుంది. ఇది వర్షాభావంవల్ల నష్టపోయే అన్ని రకాల రైతులకూ ఐచ్ఛికంగా లభిస్తుంది. తప్పనిసరేం కాదు. జాతీయ వ్యవసాయ భీమా పథకం(ఎన్‌ఏఐఎస్‌) ఎవరికైతే ఐచ్ఛికంగా వర్తిస్తోందో వారికే ఆరంభంగా దీన్ని వర్తింపజేస్తున్నారు.

భీమా వ్యవధి
వర్ష భీమా పథకం జూన్‌ నెలనుంచి సెప్టంబర్‌ నెల వరకు తక్కువ వ్యవధి పంటలకు, జూన్‌ నెలనుంచి అక్టోబర్‌ నెల వరకు ఒకమోస్తరు వ్యవధి పంటలకు, జూన్‌ నెలనుంచి నవంబర్‌ నెల వరకు దీర్ఘకాల వ్యవధి పంటలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కాల వ్యవధిని ఆయా రాష్ట్రాలనుబట్టి మార్చడం జరుగుతుంది. విత్తునాటడం విఫలమైతే దానికి జూన్‌ 15నుంచి ఆగస్ట్‌ 15 వరకు వర్తింపజేయవచ్చు.

వర్ష భీమా పొందడం ఎలా
ప్రతిపాదన పత్రాలు అన్ని ఋణ వితరణ కేంద్రాల్లోనూ అంటే సహకార, వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల పిఏసిల బ్రాంచీలలోనూ దొరుకుతాయి. వర్ష భీమా పథకం కింద మూలస్థాయిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎన్‌ఏఐఎస్‌లోని గ్రామీణ ఆర్థిక సంస్థలు(ఆర్‌ఎఫ్‌ఐ), ముఖ్యంగా సహకార సంస్థలు ఈ భీమా సౌకర్యాన్నిస్తాయి. ఏఐసిలు కూడా ప్రస్తుతం పనిచేస్తున్న తమ బ్రాంచీల ద్వారా నేరుగా ఈ భీమా సౌకర్యాన్నిస్తాయి. ఈ భీమా సౌకర్యాన్నివ్వడానికి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎన్‌జిఓలు, స్వయం సహాయక సమూహాలు, రైతు సమూహాలు వంటి వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను కూడా వాడుకోవచ్చు. భీమాను పొందాలనుకొనే రైతులు ఆర్‌ఎఫ్‌ఐలలో తమ భీమా లావాదేవీలకై ఖాతాను తెరుచుకోవాల్సి ఉంటుంది.

భీమాను కొనే సమయం
వర్షభీమాను పొందాలనుకొనే రైతులు విత్తునాటడం విఫలమైతే దానికి భీమా కావాలంటే, జూన్‌ 15లోగా, మిగిలిన వాటికి జూన్‌ 30లోగా భీమా చేయాలి.

కవరేజిఆప్షన్లు ఆప్షన్‌-I: సీజనల్‌వర్షభీమా
నిజ వర్షపాతం కన్నా 20% తక్కువ లేదా మొత్తం సీజన్‌లోని సాధారణ వర్షపాతం(మిమిలలో) కన్నా ఎక్కువైనా, ఈ పథకం వర్తిస్తుంది. నిజ వర్షపాతం అంటే, జూన్‌నించి నవంబర్‌ దాకా కురిసిన మొత్తం వర్షపాతం(తక్కువ వ్యవధి లేదా ఒక మోస్తరు వ్యవధిగల పంటలకు జూన్‌నించి సెప్టంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు). వర్షపాతంలో తీవ్రమైన తేడాలుంటే, వాటిని వివిధ స్థాయిల్లోని దిగుబడితో ముడిపెట్టేలా చెల్లింపు విధానాన్ని రూపొందించారు. హెక్టారుకు భీమా మొత్తం అనేది గరిష్టంగా ఎంత నష్టపోవచ్చో అనే అంచనాతో సమానంగా గరిష్టంగా చెల్లించేె మొత్తానికి సమానంగా ఉంటుంది. క్లెయిం చెల్లింపు నిజ వర్షపాతంలోని వివిధ తీవ్రతలను బట్టి శ్లాబ్‌ విధానంలో ఉంటుంది.
ఆప్షన్‌-II:వర్షపాత పంపిణీ సూచిక
నిజ వర్షపాతం కన్నా 20% తక్కువ లేదా మొత్తం సీజన్‌లోని సాధారణ వర్షపాత సూచిక కన్నా ఎక్కువైనా, ఈ పథకం వర్తిస్తుంది. సీజన్‌లో ఒక వారం మొత్తంలో వర్షపాతంతో ముడిపెట్టిన సూచికను వాడతారు. ఈ సూచిక ఐఎండి శాఖ శాఖకూ, పంటపంటకూ మారుతుంది. హెక్టారుకు భీమా మొత్తం అనేది గరిష్టంగా ఎంత నష్టపోవచ్చో అనే అంచనాతో సమానంగా గరిష్టంగా చెల్లించే మొత్తానికి సమానంగా ఉంటుంది. క్లెయిం చెల్లింపు నిజ వర్షపాత సూచికలోని వివిధ తీవ్రతలను బట్టి శ్లాబ్‌ విధానంలో ఉంటుంది.
ఆప్షన్‌-III:విత్తునాటడంలో వైఫల్యం
15 జూన్‌నించి, 15 ఆగస్ట్‌ మధ్య కాలంలోఅసలు వర్షపాతం కన్నా 40% తక్కువ లేదా మొత్తం సీజన్‌లోని సాధారణ వర్షపాతం(మిమిలలో) కన్నా ఎక్కువైనా, ఈ పథకం వర్తిస్తుంది. హెక్టారుకు భీమా మొత్తం అనేది గరిష్టంగా రైతు విత్తునాటడానికి చివరి క్షణం వరకు ఎంత ఖర్చు పెడతాడనే దాన్నిబట్టి నిశ్చియస్తారు. క్లెయిం చెల్లింపు నిజ వర్షపాత సూచికలోని వివిధ తీవ్రతలను బట్టి శ్లాబ్‌ విధానంలో ఉంటుంది. గరిష్టంగా, వర్షపాతంలో 80% లేదా అంతకుమించిన తేడా ఉన్నపుడు 100% క్లెయింను చెల్లిస్తారు.

ఆప్షన్‌-IV:పచ్చని దశ
16 ఆగస్ట్‌నుంచి, 30 సెప్టంబర్‌, లేదా 31 అక్టోబర్‌ నించి 30 నవంబర్‌ మధ్య కాలంలో నిజ వర్షపాతం కన్నా 20% తక్కువ లేదా మొత్తం సీజన్‌లోని సాధారణ వర్షపాతం(మిమిలలో) కన్నా ఎక్కువైనా, ఈ పథకం వర్తిస్తుంది. హెక్టారుకు భీమా మొత్తం అనేది గరిష్టంగా ఎంత నష్టం రావచ్చనే దాన్నిబట్టి నిశ్చియిస్తారు. క్లెయిం చెల్లింపు నిజ వర్షపాత సూచికలోని వివిధ తీవ్రతలను బట్టి శ్లాబ్‌ విధానంలో ఉంటుంది. గరిష్టంగా, వర్షపాతంలో 80% లేదా అంతకుమించిన తేడా ఉన్నపుడు 100% క్లెయిం భీమా మొత్తానికి సరిపడేలా చెల్లిస్తారు.

భీమామొత్తం
భీమా మొత్తం అనేది సాధారణంగా ఉత్పత్తి ఖర్చు, ఉత్పత్తి విలువల మధ్య ఉండేలా ముందే నిర్ణయిస్తారు. విత్తు విత్తడంలో వైఫల్యాన్ని చవిచూస్తే వచ్చే భీమాకు రైతు విత్తడానికి చివరి క్షణం వరకూ ఎంత ఖర్చు పెట్టాడనేదాన్ని లెక్కలోకి తీసుకొంటారు. దీన్ని కూడా ముందే నిర్ణయిస్తారు.

ప్రీమియం
ప్రీమియం అనేది ఆప్షన్‌కూ, పంటపంటకూ మారుతుంది. ప్రీమియం రేట్లు లాభాలను బట్టి ఉంటుంది. ఇది 1%నుంచి ఆరంభమౌతుంది.

సమయానుక్రమణిక, క్లెయిం చెల్లింపు విధానం

క్లెయిం చెల్లింపు విధానం పూర్తిగా కంప్యూటరీకరించడం జరిగింది. అంటే, క్లెయిం చెల్లింపుకు నష్టాల గురించిన సమాచారాన్ని అందించనక్కరలేదు. హామీ కాల వ్యవధిలో వర్షపాతాన్నిబట్టి నెలలోపల క్లెయిం చెల్లింపు జరుగుతుంది.

కాఫీ రైతులకు వర్షపాత భీమా పథకం (రిస్క్‌)

రిస్క్ ఫీచర్లు

అరబికా,రొబస్టా పంటలకై వర్షాకాలపు జల్లులు పడేసమయంలో హెక్టారుకు ప్రీమియం

రిస్క్ – ఫీచర్లు

 1. అగ్రికల్చరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసి) సంస్థ, కాఫీ దిగుబడిలో వర్షపాతంవల్ల వచ్చే నష్టాలను పూడ్చడానికి కాఫీ రైతులకోసం వర్షపాత భీమా పథకం (రిస్క్) అనేదాన్ని ప్రవేశ పెట్టింది.
 2. పూత పట్టే సమయంలో, బ్యాకింగ్ పీరియడ్లో వర్షపాతంలో కలిగే తక్కువనుబట్టీ, వర్షాకాలంలో (కర్నాటక, జూలై, ఆగస్ట్ నెలల్లో) ఎక్కువనుబట్టీ రిస్క్ కవర్ ఉంటుంది.
 3. రిస్క్-భీమా అరబికా రకం కాఫీకి 30వేల రూపాయలదాకా, రొబస్టా రకానికి 20వేల రూపాయలదాకా కవర్ చేస్తుంది.
 4. కాఫీ బోర్డ్ ప్రీమియంలో 50% సబ్సిడీనిస్తోంది. ఇది చిన్న రైతులకు(కాఫీ పంటలో 10 హెక్టార్కు మించనివారు) హెక్టారుకు గరిష్టంగా అరబికా రకానికి 2500 రూపాయలదాకా, రొబస్టా రకానికి 2వేల రూపాయల దాకా ఉంటుంది. రిస్క్ భీమా ద్వారా ఇతర కాఫీ రైతులకూ భీమా సౌకర్యాన్నిస్తున్నారు.
 5. తొలకరికి సరిగ్గా వర్తించేలా, ఈ భీమాని 30 జూన్ దాకా కొనుక్కోవచ్చు. దీన్ని అధీకృత ఏఐసి కాఫీబోర్డ్ జోనల్ కార్యాలయాల ద్వారా ప్రతినిధులనుంచి పొందవచ్చు.
 6. రిస్క్ భీమా అతివృష్టివల్లగానీ , కనీస వర్షపాతం 7 రోజులకు మించిన వ్యవధిలో జూలై, ఆగస్ట్ల మధ్య వరసగా రోజుకు కనీసం 35మిమి ఉన్నా గానీ, కింద చెప్పిన రీతిలో భీమా చెల్లింపు చేస్తారు: అరబికారొబస్టా
  8రోజులురు. 3000 రు. 2000
  9రోజులురు. 5000 రు. 4000
  10రోజులు ఆ పైన రు. 8000 రు. 6000
 7. జోనుకు జోనుకు ప్రీమియం విలవలు మారతాయి. జోను వారీ ప్రీమియంలు, వాటికి సంబంధించిన కర్ణాటకలోని వర్షపాత నమోదు కేంద్రాల జాబితాను చూడొచ్చు.
 8. రిస్క్ భీమా చేసిన రైతుల భీమా క్లెయింలు పూర్తిగా కంప్యూటరీకరించడం జరిగింది. ఐఎండి గేజ్ స్టేషన్నించి వర్షపాత సమాచారం అందాక సాధారణ వర్షపాతంతో దాన్ని పోల్చి నిబంధనల ప్రకారం క్లెయింలు చెల్లిస్తారు. అలాటపుడు ఒక ఐచ్చికం కింద భీమా చేసిన రైతులకంతా ఒకే రకమైన నష్టం సంభవించినట్టు లెక్కగట్టి క్లెయింలు 45 రోజుల్లోగా చెల్లిస్తారు. దీనికోసం రైతులు ఎలాటి రుజువులూ పోగుచేసి చూపాల్సిన పని లేదు.

ఈ సమాచారం కాఫీ బోర్డు వెబ్సైట్ లో(www.indiacoffee.org) కూడా లభ్యమౌతోంది. కాఫీ రైతులు సమీపంలో ఉండే అనుసంధాన కార్యాలయాలను గానీ, కాఫీ బోర్డు జేఎల్ఓలను లేదా ఎస్ఎల్ఓలను లేదా ఏఐసికి చెందిన వ్యవసాయ సంస్థలవారిని గానీ సంప్రదించవచ్చు.

వాతావరణ ఆధారిత పైరు భీమా రక్షణ పధకము (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్‌.) (వెదర్‌ బేస్డ్‌ క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌)

వాతవరణ ఆధారిత పైరు భీమా రక్షణ పధకం అంటే ఏమిటి ?

వాతావరణ ఆధారితపైరు భీమా రక్షణ పధకం యొక్క లక్ష్యం, భీమా కలిగిన రైతులకు వర్షం, ఉష్ణోగ్రత, మంచు, తేమ మొదలైన వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారి కలగజేసే పంట నష్టం వలన జరిగే ఆర్ధిక నష్టాల కష్టాలను తగ్గించడం.

వాతావరణ ఆధారిత భీమా, ఉత్పత్తి ఆధారిత భీమా కంటే ఏ విధంగా వ్యతిరేకమైనది?

పంట (ఉత్పత్తి) ఆధారిత భీమా, ముఖ్యం గా రైతుకు పంట ఉత్పతి తగ్గినపుడు చేసే హామి. అదే వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా, రైతు, మంచి పంట కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే పైరు ఉత్పత్తి పై పడే ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. పంట ఉత్పత్తి యొక్క చారిత్రక, వర్తమాన పరస్పర సంబంధమైన అధ్యయనాల ప్రకారం, వాతావరణ పరిస్థితులు ఎంతవరకూ అనుకూలంగా ఉంటాయి, ఏ పరిమితి దాటిన తరువాత పంట పై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయి అన్నది తెలుసుకోగలుగుతారు. చెల్లింపు విధానం, రైతులకు పరిహారం ఇచ్చేటప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన జరగగలిగే నష్టాన్ని అంచనా వేసి, చేయబడుతుంది. వేరే మాటల్లో చెప్పలంటే, “వాతవరణ ఆధారిత పైరు భీమా రక్షణ, వాతావారణ పరిస్థితుల ప్రాతిపదిక గా పంట ఉత్పత్తి కి జరగ గలిగే నష్టాని కి పరిహారం చెల్లించడం”.

వాతావరణ భీమా ఇంతకు ముందు ఎక్కడ ప్రయత్నించబడింది?

వాతావరణ భీమా 2003 ఖరీఫ్‌ కాలం నుండి ప్రారంభింపబడింది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌ మొదలైన రాష్ట్రాలలో ఇది ముందుగా ఆరంభింపబడింది.

జాతీయ వ్యవసాయ భీమా పధకం (నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌) (ఎన్‌.ఎ.ఐ.ఎస్‌.) కు దీనికి గల తేడా ఏమిటి?

వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా పధకం ఒక ప్రత్యేకమైన వాతావరణ ఆధారిత భీమా పధకం. ప్రతికూల పరిస్థితులలో పంట ఉత్పత్తి కి కలిగే నష్టాలకి రక్షణ కల్పించడం ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఖరీఫ్‌ కాలం లో ప్రతికూల వర్షపాతం, (అల్ప మరియు అధిక) రబీ కాలం లో మంచు, వేడి, తేమశాతం లో భేదాలు, అకాలవర్షాలు వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులకు రక్షణ గా ఈ చెల్లింపు విధానం ఉంటుంది. ఇది ఉత్పత్తి హామి భీమా రక్షణ పధకం కాదు.

జాతీయ వ్యవసాయ భీమా పధకం (ఎన్‌.ఎ.ఐ.ఎస్‌.), వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా పధకం (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్‌.) లను పోల్చుట.

క్రమ
సంఖ్య

జాతీయ వ్యవసాయ భీమా పధకం
(నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌) (ఎన్.ఎ.ఐ.ఎస్‌.)

వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా
పధకం (వెదర్‌ బేస్డ్‌ క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌) (డబ్ల్యు.బి.ఐ.ఎస్‌.)

1

దాదాపు అన్ని గండాలకు (రిస్క్స్‌) రక్షణ (కరువు, అధిక వర్షపాతం, వరదలు, వడగళ్ళు, చీడపీడలు మొదలైనవి).

ప్రతికూల వాతావరణ గండాలు. వర్షపాతం, మంచు, ఉష్ణోగ్రత, తేమ, మొదలైనవి. ఏమైనా, ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితులే చాలా వరకు పంట నష్టానికి కారణమవుతున్నాయి.

2

పది సంవత్సరాల పంట ఉత్పత్తి చరిత్ర సమాచారం అందుబాటు లో ఉంటే సులభంగా పధక రచన చేయవచ్చు.

వాతావరణ సూచనలు మరియు వాటి కి సంబంధించిన వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన జరిగే పంట నష్టాలు బేరీజు వెయ్యడంలో సాంకేతిక సవాళ్ళు. 25 ఏళ్ళ వాతావరణ చరిత్ర సమాచారం కావాలి.

3

ఎక్కువ గండం కలిగినవి (ఆ ప్రాంతంలో పంట (తహసీల్‌ లేక బ్లాకు) మరియు రైతుల వ్యక్తిగత పంట యొక్క తేడా).

ప్రధాన గండం, వాతావరణానికి సంబంధించి, వర్షపాతానికి ఎక్కువగాను, తేమ మొదలైన వాటికి కొంచెం తక్కువగాను ఉంటుంది.

4

వాస్తవికత, పారదర్శకత కొంచెం తక్కువ.

వాస్తవికత, పారదర్శకత కొంచెం ఎక్కువ.

5

నాణ్యతకు సంబంధించిన నష్టాలు
పరిగణ లోనికి రావు.

నాణ్యత నష్టాలు కొంతవరకు
వాతావరణ పట్టిక ద్వారా నిర్ధారించవచ్చు.

6

అధిక నష్టాల అంచనా ఖర్చులు.

నష్టాల అంచనా కు ఖర్చులు ఏమీ కావు.

7

అభ్యర్ధన(క్లెయిమ్‌) చెల్లింపు లో
ఆలస్యం.

అభ్యర్ధన (క్లెయిమ్‌) చెల్లింపు లో వేగం.

8

ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలు
వెసులుబాటు గా ఉంటాయి. ఎందుకంటే
అభ్యర్ధనలకు రాయితీ ఉండడం వలన.

ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీల ను నియత్రించ
వలసి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ, రాయితీ
వాయిదా చెల్లింపుల కు ఉండడం వలన.

వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా పధకం (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్‌.) ఎలా పనిచేస్తుంది?

వాతావరణ ఆధారిత పైరు రక్షణ పధకం (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్‌.) స్థలసామీప్యం అన్న అంశం ఆధారంగా పనిచేస్తుంది. అంటే హామీ చెల్లింపులో స్థల ప్రమాణ నివేదిక (రిఫరెన్స్‌ యూనిట్‌ ఏరియా) ప్రకారం భీమా రక్షణ ఉంటుంది. ఈ ‘ఆర్‌.యు.ఎ.’ భీమారంగం యొక్క ఒక సజాతీయ విభాగం. ఈ స్థల ప్రమాణ నివేదిక (ఆర్‌.యు.ఎ.) ప్రకటన పంట కాలమున కు ముందే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రత్యేకంగా భీమారక్షణ ఉన్న ఒక పైరుకు, భీమా రక్షణ పొందిన ఆ ప్రాంతపు రైతులందరూ, అభ్యర్ధనలను (క్లెయిమ్‌) అంచనా వేసినప్పుడు సమానంగా చూడబడతారు. ప్రతీ స్థల ప్రమాణ నివేదిక ఒక వాతావరణ విచారణ కేంద్రానికి అనుసంధానించబడి ఉండి, ఏ వాతావరణ సమాచారం అభ్య ర్ధనలకు వర్తించాలన్నది నిర్ణయిస్తారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, ఆ పంట కాలం లో ఉన్నట్లైతే, భీమా చేసుకున్నవారికి, ఆ పధకం లో ఉన్న చెల్లింపు విధానం లోని షరతులు, నిబంధనల ప్రకారం, ఏవైతే ప్రతికూల పరిస్థితులుగా నిర్వచింపబడ్దాయో వాటిని బట్టి చెల్లింపు ఉంటుంది. స్థల పద్ధతి (ద ఏరియా అప్రోచ్‌), వ్యక్తిగత పద్ధతి (ఇండివిడ్యువల్‌ అప్రోచ్‌) కు భిన్నమైనది. వ్యక్తిగత పద్ధతిలో ప్రతి ఒక్క భీమా చేసుకున్న రైతు నష్టం యొక్క అభ్యర్ధన (క్లెయిమ్‌) విడివిడి గా చూడబడుతుంది.
వాతావరణ విచారణ కేంద్రం (రిఫరెన్స్‌ వెదర్‌ స్టేషన్‌), ఎక్కడైతే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను నిర్ణయిస్తారో, అది నా పొలనికి ఎక్కవ దూరం లో లేదని ఎల తెలుసుకోవడం? ఒక వేళ ఆ కేంద్రం దూరంగా ఉన్నట్లైతే నాకు ఎలా ఉపయోగపడుతుంది?

ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలోనే, ఒక నిర్ణీతమైన రోజుకు, వాతావరణ అనుభవం (ముఖ్యం గా వర్షపాతం) వేరు వేరు గా ఉంటుంది. కాని ఒక పక్షం రోజులకి, నెలకి, ఋతువుకి ఒక సగటుకి వస్తుంది. వాతావరణ విచారణ కేంద్రం (ఆర్‌.డబ్ల్యు.ఎస్‌.) యొక్క తహసీల్‌ (బ్లాక్‌) స్థాయి నివేదిక లోని వాతావరణ అనుభవం, వ్యక్తిగత వ్యవసాయదారుల, స్థల సామీప్య నివేదిక (ఆర్‌.యు.ఎ.) తో ఎంతో కొంత ప్రతిబింబిస్తుంది.

వాతావరణ ఆధారిత పైరు రక్షణ భీమా పధకం (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్‌.) ను ఎవరు కొనగలరు?

భీమారక్షణ పధకం ఉన్న పంట పండించే అందరు వ్యవసాయదారులు (భాగస్వామ్య వ్యవసాయదారులు, కౌలు రైతులు), ఏదైనా మొట్టమొదట ఆరంభించిన స్థలప్రమాణ నివేదిక (ఆర్‌.యు.ఎ.) ప్రకారం అర్హులు. ఈ పధకం బ్యాంకులు, ఆర్ధిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్న రైతులకు తప్పనిసరి. ఆ సంస్థలు, రుణాల పరిమితి కలిగిన కొన్ని ప్రత్యేక పంటలకు ఇది తప్పనిసరిగాను, మిగిలిన పంటలకు రైతుల ఎంపికకు వదిలి వేస్తాయి.

భీమారక్షణ ధనం (ధనరక్షణ) ఏవిధంగా గణిస్తారు ?

పంట పండించడంలో భీమా చేసిన రైతు పెట్టబోయే పెట్టుబడి ఖర్చు మొత్తం ఈ భీమా రక్షణ పధకం క్రిందకు వస్తుంది. ప్రతీ పంట ఆరంభంలోనే, ఎగ్రికల్చర్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెని (ఎ.ఐ.సి.) రాష్ట్ర ప్రభుత్వంలోని నిపుణులతో చర్చించి యూనిట్‌ ఏరియా (హెక్టార్‌ ) కు ఇంత సొమ్ము భీమా అయిందని ప్రకటిస్తుంది. ఇది ఒక్కొక్క స్థల ప్రమాణ నివేదిక (ఆర్‌.యు.ఎ.) లోని ఒక్కొక్క పంట కు ఒక్కొక్క విధం గా ఉండవచ్చు. సాధారణ వాతావరణ పరిస్థితులకు, భీమా పధకం లో సూచించిన ముఖ్యమైన వాతావరణ పరిస్థితులకు గల నిష్పత్తి ప్రకారం భీమా చేసిన ధనం పంపకం అవుతుంది.

వాయిదా( ప్రీమియం) మదింపు ఖర్చు (రేట్‌) అంటే ఏమిటి?

వాయిదా రేట్లు ఒక పంటకు జరగగలిగే నష్టం మీద ఆధారపది ఉంటాయి. ఆ నష్టం తిరిగి, ఒక పంట కు కావలసిన అనుకూల వాతావరణ అంశాల 25 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వాతావరణ చరిత్ర ఆధారంగా ఏర్పడిన నమూనా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే వాయిదా రేటు ఒక్కొక్క స్థల ప్రమాణ నివేదిక (ఆర్‌.యు.ఎ.) కు ఒక్కొక్క పంట కూ మారుతుంది. ఎలాగైనా వాయిదారేట్లు కొంతవరకే రైతు కు వర్తిస్తాయి. పరిమితి దాటిన తరువాత వాయిదా రేట్లు కేంద్ర ప్రభుత్వం, రైతు కు చెందిన రాష్ట్ర ప్రభుత్వం 50 : 50 నిష్పత్తి లో భరిస్తాయి. వివిధ పంటలకు రైతు చెల్లంచే వాయిదా రేట్లు ఈ విధం గా ఉంటాయి.

జాతీయ వ్యవసాయ భీమా పధకం

జాతీయ వ్యవసాయ భీమా పధకం

జీవ ఇంధనం చెట్టు/మొక్క యొక్క భీమా

ప్రపంచ శక్తి అవసరాలు 80  శాతం వరకు భూగర్భ ఇంధనాలనుంచే తీరుతున్నాయి. కాని ఇంధన నిల్వలు అధిక ఆవశ్యకత వలన తరిగిపోతున్నాయి. ఇందువలన వేరే విధమైన శక్తి వనరుల గురించి అన్వేషించినప్పుడు, జీవ ఇంధనాలు ఎక్కువ ఆశాజనకమైనవిగా ఉన్నాయి. ఈ వాతావరణ పరిరక్షణ  ఇంధనాన్ని అభివృద్ధి చెందించడానికి, ప్రభుత్వం రకరకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఈ మొక్కలు పెంచే రైతులకు ఇచ్చి శక్తి భద్రతను సాధించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ పధకం లోని ముఖ్యమైన విషయాలు
 • ప్రత్యేకమైన భీమా, వివిధ జాతులకు చెందిన ఆరు మొక్కలు/చెట్లు, జట్రోపా తో సహా ఈ రక్షణ చట్రం లోనికి వస్తాయి.
 • కరువు గండంకు ఎంపిక చేయబడిన రక్షణ భీమా.
 • గరిష్ఠ చెల్లింపు, పంట సాగు పై పెట్టుబడి ఖర్చు మరియు చెట్ల /మొక్కల వయసు, రకాలు, జాతుల బట్టి మారుతుంది.
అర్హత

జీవఇంధన మొక్కలు/చెట్లు పెంచే రైతులకు, ఉత్పత్తిదారులకు, వారి పంట దిగుబడి పై నిర్ణయించబడ్డ పరిస్థితుల వలన హాని జరిగినట్లైతే, ఈ భీమా పధకం అమలుపరచబదుతుంది. ఈ భీమా పధకం క్రిందకు వచ్చే చెట్లు/మొక్కలు ఇవిః జట్రోపా కర్కస్‌ (జట్రోపా), పొంగామియా పిన్నాటా (కరంజా), అజాడిరాక్టా ఇండికా (వేప), బాసియా లేటిఫోలియా (మహువా), కేల్లోఫిలం ఇనోఫిలం (పొలంగా) మరియు సిమారౌబా గ్లాకా (ప్యారడైజ్‌  చెట్టు).

భీమా చేయగలిగే అవకాశం

భీమా చేసిన రైతు  పెట్టిన పెట్టుబడి ఖర్చుకి వచ్చే నష్టం, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, సైక్లోన్‌, తుఫాను, మంచు, చీడపీడలు, వ్యాధులు మొదలైనవి ఒకేసారిగాని, విడివిడిగా కాని ఏర్పడి మొత్తం చెట్లకు/మొక్కలకు హాని కలిగినప్పుడు కాని చనిపోయినప్పుడు కాని వచ్చే ఆర్ధిక నష్టాల నుంచి ఈ పధకం భీమాదారుడికి హామి ఇస్తుంది. మొత్తం నష్టం అంటే, జీవఇంధనం చెట్టు  ఒక్కటిగా కాని, మొత్తం క్షేత్రానికి కాని జరిగే హాని లేక అపాయం వలన చెట్టు చనిపోవడం వలన కాని  ఆర్ధికంగా చెట్టు ఉత్పాదకత నశించినప్పుడు వచ్చే పరిస్థితి.

ధన రక్షణ భీమా

ధనరక్షణ భీమా, భీమా రక్షణ పొందిన ప్రాంతం (యూనిట్‌ ఏరియా) లో యూనిట్‌ కు పెట్టే పెట్టుబడి ఖర్చు, మొక్క యొక్క సహజ గుణం/వయసు పై ఆధారపడి ఊంటుంది. ధన రక్షణ భీమా చాలా వరకు పెట్టుబడి ఖర్చుకు సమానంగా ఉంటుంది. 125 శాతం నుంచి 150 శాతం వరకు పెట్టుబడి కి మించి కూడా ఉండవచ్చు.

వాయిదా (ప్రీమియం)

వాయిదా రేటు క్రింద పేర్కొన్న విషయాలననుసరించి నిర్ణయింపబడుతుంది.
(ఎ) మొక్క/చెట్టు కు జరగగలిగే హానికారకాల సమగ్ర రూపం. (బి) అపాయాల లక్షణాలు భీమా పరిధి లోనికి వచ్చినవి. (సి) భౌగోళిక ప్రాంతం. (డి) భీమాచేయించే వేరేవారు, అవే ఆపదలకు వేసే రేట్లు. (ఇ) తీసివేతలు. (ఎఫ్‌) భీమాదారుడి రకరకాల ఖర్చులు, పెట్టుబడులని బట్టి భీమాహెచ్చింపులు.

భీమా అవధి :

ఈ పధకం వ్యవధి వార్షికం ; 3 లేక 5 సంవత్సరాల అవధి వరకు అవకాశం కలిగి ఉంటుంది.

నష్టాన్ని అంచనా వేసే విధానము

భీమా చేయబడిన గండాల వలన మొక్క/చెట్టు కు మొత్తం నష్టం లేక హాని జరిగినప్పుడు, భీమాదారుడు తన అభ్యర్ధనను , భారత భీమా సంస్థ (ఎగ్రికల్చర్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెని ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) (ఎ.ఐ.సి.) కు పంపించవలసి ఉంటుంది. ఎ.ఐ.సి. ఒక సర్వేయరును, వ్యవసాయ నిపుణుడిని (ఎగ్రికల్చర్‌ ఎక్స్పర్ట్‌) క్షేత్రానికి పంపించి, అభ్యర్ధనను పరిష్కరించే క్రమంలో నష్టాన్ని అంచనా వేయిస్తుంది. క్లెయిమ్‌ల కొరకు మొక్క చనిపోవుట/మొత్తం పాడైపోవుట (మొక్క ఆర్ధికంగా అనుత్పాదకమైనప్పుడు ) ను నష్టంగా ఈ పధకం భావిస్తుంది. మొక్క/చెట్టు ఎదుగుదల లేకపోవడం గాని క్షీణించడం గాని ఈ నష్ట పరిధిలోనికి రావు.

గమనిక: పైన పేర్కొన్న పధక సారాంశం సమాచారం మాత్రమే. ఇది వాస్తవ భీమా పధకం (పాలసి) యొక్క ప్రతి పద అన్వయించబడినది కాదు.

బంగాళదుంప పంట భీమా

ఈ పధకములోని ముఖ్యమైన అంశాలు

 • ప్రత్యేకమైన పరిస్థితుల భీమా రక్షణ, మొక్కలన్నిటి కి జరగగలిగే హానిని బట్టి ఇవ్వబడుతుంది.
 • బంగాళదుంప పండే ప్రాంతాలలోని ఒప్పందం కుదుర్చుకున్న బంగాళదుంప పండించే రైతులకు అందుబాటులో ఉంటుంది.
 • ఎకరానికి 25,000 రూపాయల గరిష్ఠ చెల్లింపు.
 • రైతు - ఉత్పత్తిదారుడు - పెట్టుబడిదారుడు - భీమా చేయించేవారు వంటి భాగస్వామ్య నమూనా పై ఆధారపడి ఉంది.
 • దేశంలో  బంగాళదుంప పండించే వివిధ ప్రాంతాల రైతులకు ఈ పధకం (పాలసి) తగినది.

భీమా చేయగలిగే అవకాశం

ఇది పెట్టుబడి ఖర్చు పై భీమా ఇచ్చే రక్షణ. మొక్క నాటిన వారం రోజుల నుండి పంట చేతికొచ్చే 7 రోజుల ముందు వరకు వర్తిస్తుంది. ఈ భీమా, భీమా చేసిన రైతుకు, ధన నష్టం, పెట్టుబడి ఖర్చు, మొక్కలకు హాని జరగడం వలన (చనిపోవడం/మొత్తం మొక్కలకు హాని కలగడం వలన మొక్కలు పరిమితి కి మించి తగ్గిపోవడం) భీమా చేయబడిన గండాలను బట్టి హామి ఉంటుంది. ఈ పధకం బంగాళదుంప దిగుబడి/ఉత్పత్తి లో వచ్చే నష్టాని కి , భీమా చేసిన గండాలకు సంబంధించి  బాధ్యత వహించదు. ఈ పధకం (పాలసి), భీమాచేసిన వారికి, అభ్యర్ధన అంచనా విధానం ప్రకారం (క్లెయిమ్‌ అసెస్మెంట్‌ ప్రొసీజర్‌ ) ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, తుపాను, సైక్లోన్‌ మరియు చీడపీడలు (లేట్‌ బ్లైట్‌ తప్ప (బూజు)) మొదలైనవి ఒకేసారి గాని, విడి విడిగా గాని ఏర్పడి మొక్కల సాంద్రత ను ఒక నియమిత సంఖ్య నుండి తగ్గించేయడం వలన భీమా గడువు లో జరిగే నష్టానికి హామి ఇస్తుంది.

అభ్యర్ధన (క్లెయిమ్‌) పరిగణించే విధానం (క్లెయిమ్‌ ప్రొసీజర్‌ )

ఏదైనా నష్టం, హాని జరిగనప్పుడు, భీమాదారుడు, భీమా సంస్థ (కంపెనీ) కు 48 గంటల లోపల  విషయం తెలుపవలసి ఉంటుంది. (నేరుగా గాని, లేక రుణమిచ్చే బ్యాంకుల ద్వారా గాని ఈ విషయాల్లో పాల్గొనే సంస్థ నుంచి గాని ). అంతే కాక వెంటనే లిఖిత పూర్వకంగా నష్టం లేక హాని జరగిన 15 రోజుల లోపల అభ్యర్ధన ఇవ్వవలసి ఉంటుంది. భీమాదారుడు, ఎ.ఐ.సి.(ఎగ్రికల్చర్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెని) కి సరైన సమాచారాన్ని, క్లెయిమ్‌ కు సంబధించిన ఋజువులను, ఈ ప్రక్రియకు  సహాయపడే విషయాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ పధకం ప్రకారం, భీమా రక్షణ లో ఉన్న పంటకు యూనిట్‌ ఏరియా ప్రకారం చేసిన పెట్టుబడి ఖర్చు ఈ పాలసి లో నిర్ణయించబడిన సొమ్ము మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పంటలో ఉండే దశలకు, ఖర్చులకు ఉండే నిష్పత్తి ని బట్టి శాతాల ప్రకారం ఈ భీమా సొమ్ము మొత్తం  ఉంటుంది. దీనిలో, అంచనా వేయబడే నష్టం యొక్క సొమ్ము, ఎకరానికి చనిపోయిన లేక పాడైపోయిన మొక్కల శాతం, ఎకరానికి పెట్టుబడి మీద అయ్యే ఖర్చు తో లెక్కించి చేసిన తరువాత వచ్చే సొమ్ముగా ఉంటుంది. ఏ దశలో, భీమా చేయబడిన గండము వలన నష్టం కలగడానికి ఆస్కారం ఉన్నదీ, షరతులు, నిబంధనలు, ఖర్చులో హెచ్చుతగ్గులు మరియు మరి ఏ విధమైన తగ్గింపుల ననుసరించి అంచనా వేయబడుతుంది.

భీమాదారుడు, భీమా నిరూపణ పత్రాన్ని గాని, ఎ.ఐ.సి. అడిగిన ఇంకా ఏదైనా దృవీకరణ పత్రాన్ని గాని క్లెయిమ్‌ పరిష్కారానికి ఇవ్వవలసి ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న పధకం యొక్క సారాంశం సమాచారం మాత్రమే; అంతే కాని నిజ భీమా పధకానికి ప్రతి పదం అన్వయించబడదు.

రబీ వాతావరణ భీమా

ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలుః

 • డిశంబరు, ఏప్రేల్‌, మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు, మంచు, తేమలో హెచ్చుతగ్గులు,   ఉష్ణోగ్రత, వర్షపాతం, మొదలైన వాటిలో వచ్చే ప్రతికూల మార్పులు, అస్థిరత్వానికి ప్రతిగా రక్షణ కల్పిస్తుంది.
 • సాధారణ రక్షణ పధకం ద్వారా  గోధుమ, బంగాళదుంప, బార్లీ, ఆవాలు, పప్పులు, మొదలైన   పంటలకు భీ మా కల్పించడం.
 • గరిష్ఠ చెల్లింపు, పంటకు జరిగిన ఖర్చు మీద ఆధారపడి ఉంటుంది. అది పంట పంట కూ  మారుతుంది.
 • వేగవంతమైన అభ్యర్ధనల (క్లెయిమ్‌) పరిష్కారం. భీమా రక్షణ గడువు తీరిన 4 - 6 వారాల లోపే.

ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఎక్కువగా గోధుమ, ఆవాలు, పప్పులు, బంగాళదుంప, మసూర్‌, బార్లీ, ధనియాలు రబీ కాలంలోని (సీజన్‌) ముఖ్యమైన పంటలు. ఈ పంటలు వాతావరణ పరిస్థితులైన అధిక వర్షపాతం, మంచు, ఉష్ణోగ్రత మార్పులు మున్నగు వాటికి బలహీనపడతాయి. వాతావరణ భీమా (రబీ) ఆపదలను నివారించే చర్యలను చేపట్టడం లో, ప్రతికూల

వాతావరణ పరిస్థితులకు లోనయ్యే వ్యక్తులు, సంస్థలకు, చేయూత నిస్తుంది.

వాతావరణ సూచీ భీమా యొక్క ముఖ్య ఉపయోగములుః
1.   పంట చేజారే పరిస్థితులు, అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించడం.
2.   హామీలకు వేగవంతమైన చెల్లింపు. వీలైనంత త్వరగా, హామీ గడువు ముగిసిన పక్షం రోజుల లోపే.
3.   అందరు రైతులు, చిన్న/మధ్య తరహా అయినా, స్వంతదారులు లేక కౌలుదారులు/భాగస్వామ్య వ్యవసాయదారులు అయినా కూడా ఈ వాతావరణ భీమా రక్షణ పధకాన్ని కొనవచ్చు.

భీమా పరిమితి

భారత వ్యవసాయ భీమా రక్షణ సంస్థ (అగ్రికల్చర్‌  ఇన్స్యూరెన్స్‌ కంపెని ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.) (ఎ.ఐ.సి) పంట ఉత్పత్తి కాని, దిగుబడి కాని క్రింద ఉదహరించిన వాటి వలన తగ్గినప్పుడు భీమా చేసినవారికి పరిహారం చెల్లించాలి.

గరిష్ఠ ఉష్ణోగ్రత (o సి) సాధారణ సగటుకు మించినప్పుడు / లేక ఉష్ణోగ్రతలలో తేడాలు సాధారణ పరిమితి దాటినప్పుడు/ లేక కనిష్ఠ ఉష్ణోగ్రత (o సి) సగటుకి  తగ్గినప్పుడు / కనిష్ఠ ఉష్ణోగ్రత 4o సి దిగువ కు పడిపోయి మంచు ఏర్పడినప్పుడు / లేక వర్షపాతం (రోజూవారి/వారం/నెల వారీగా గణించిన) సగటుకి మించి కురిసినప్పుడు / సాధారణ స్థితి కి తక్కువగా అధిక సూర్యరశ్మి సమయం ఉన్నప్పుడు.

భీమా రక్షణ అవధిః

ఈ భీమా పధకం, డిశంబరు నెల నుంచి ఏప్రెల్‌ దాకా ఉంటుంది. ఈ గడువు వివిధ పంటలకు, వివిధ పరిస్థితులకు వేరే వేరే గా ఉంటుంది.

అభ్యర్ధన(క్లెయిమ్‌) పరిశీలించే విధాన క్రమం (క్లెయిమ్‌ ప్రొసీజర్‌ నోట్‌)

క్లెయిమ్స్‌ వాటంతటవే పరిశీలింప బడతాయి. వాస్తవ గరిష్ఠ ఉష్ణోగ్రత, కనిష్ఠ ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు బి.ఎస్‌.హెచ్‌.  అందుకున్న సంస్థల, ఏజెన్సీల ను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్క పంటకు విడివిడి గా పరిహారం లభిస్తుంది. అభ్యర్ధనలు (క్లెయిమ్‌లు) చెల్లించవలసినవైతే ఒకే రేటుకు అందరు భీమా చేసిన ఆ ప్రాంతపు రైతులకు (వాతావరణ సూచన కేంద్రం పరిధికి లోబడి), భీమా చేసిన పంటకు పరిహారం చెల్లిస్తారు.

గమనికః పైన చెప్పిన పధకం యొక్క వ్యాఖ్యానం సమాచారం కొరకు మాత్రమే. అంతే కాని, అసలు భీమా పధకం/పాలసీ కి ప్రతి పదం పోలి ఉండదు.

కలపగుజ్జు (పల్ప్‌ ఉడ్‌) లభించే చెట్టు భీమా

అర్హత (అప్లికబిలిటి)

ఈ భీమా పధకం భీమా ద్వారా నిర్ణయించబడిన ఆపదల నుండి, దిగుబడికి వచ్చే నష్టాల కు కలప గుజ్జు లభించే చెట్లను పెంచే రైతుల, వ్యవసాయదారులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పధకం ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంలో అన్ని వసతులు అనుకూల పరిస్థితులలో పెంచబడే కలప గుజ్జు చెట్లకు వర్తిస్తుంది. ఈ రక్షణలోనికి వచ్చే చెట్లుః

1.       యూకలిప్టస్‌
2.       పొప్లార్‌
3.       సుబాబుల్‌
4.       కాజురినా (సరుగుడు చెట్టు)

భీమా చేసే అవకాశం

ఈ పధకం భీమాదారుడికి పెట్టుబడి ఖర్చు (అంగీకరింపబడిన విలువ) కు కలిగే ఆర్ధిక నష్టానికి హామి ఇస్తుంది. భీమాలో పేర్కొన్న ప్రకృతి వైపరీత్యాలైన అగ్ని ప్రమాదం, వరదలు, సైక్లోన్‌, తుఫాను, మంచు, చీడపీడలు మరియు వ్యాధులు, ఇవన్ని ఒకేసారిగాని, విడివిడిగా కాని ఏర్పడి చెట్లకు జరిగే హాని, నాశనమునకు చెల్లింపునిస్తుంది. మొత్తం నష్టమ అంటే, ఒక కలప గుజ్జు ఇచ్చే చెట్టుకు గాని, లేక మొత్తం చెట్ల క్షేత్రానికి గాని అపాయం జరిగి చెట్టు చనిపోయినా లేక అనుత్పాదకమైనా వచ్చే నష్టం.

ధన రక్షణ

ధన రక్షణ, పెట్టుబడి ఖర్చు (అంగీకరింపబడిన విలువ) యూనిట్‌ ఏరియా కు పెట్టేది, భీమా భద్రత కలిగిన చెట్టు యొక్క జాతి, వయసు మీద ఆధారపడి ఉంటుంది. ధన రక్షణ, పెట్టుబడి ఖర్చు యొక్క మొత్తం తో సమానంగా ఉంటుంది. ఒక్కొక్కసారి, అది పెట్టుబడి ఖర్చుకు మించి 125 శాతం/150శాతం వరకు ఉండవచ్చు.

వాయిదా (ప్రీమియం)

వాయిదా రేటు కూడా ఈ క్రింది విషయాల మీద ఆధారపడి నిర్ణయింప బడుతుంది. (ఎ) చెట్టు/పంట కు ఆపదకలగగలిగే అంశాలు.
(బి) నిర్ణయింపబడిన ఆపదల లక్షణాలు.
(సి) భౌగోళిక ప్రాంతం.
(డి) ఇటువంటి ఆపదలకే వేరే భీమా ఏజంట్లు వేసే రేట్లు.
(ఇ) తీసివేతలు.
(ఎఫ్‌) భీమాను భీమాదారుడు పెట్టే రకరకాల ఖర్చులు, పెట్టే పెట్టుబడిని బట్టి హెచ్చించడం.

భీమా వ్యవధి

ఈ పధకం వార్షికం. 5 సంవత్సరాల వ్యవధి వరకు అమలు లో ఉంటుంది.

ఈ భీమా పొందడం ఎలా?

ఈ భీమా పధకమ ఎ.ఐ.సి. యొక్క సంస్థల ద్వారా అందుబాటులో ఉంటుంది. రైతులు భీమా సమాచారం  కొరకు రుణమిచ్చే బ్యాంకులను, భీమా ఏజెన్సీ లను సంస్థలను పె ట్టుబడి సమకూర్చే వారి నుండి, రైతు సంఘం, భీమా దళారీలను కూడా సంప్రదించవచ్చు. వ్యక్తిగత వ్యవసాయదారుడు నేరుగా ఎ.ఐ.సి నుండి ఈ పాలసి కొనవచ్చు, లేక కార్పోరేట్‌ ఏజెంట్లు నుండి గాని, నియమింపబడిన వ్యక్తుల నుండి గాని పొందవచ్చు.

గమనిక: పైన  పేర్కొన్న  పధక సారాంశం సమాచారం మాత్రమే. ఇది వాస్తవ భీమా రక్షణ పధకమునకు పద పదమూ అన్వయించబడినది కాదు.

సమాచార ఆధారం: భారత వ్యవసాయ భీమా సంస్థ (ఏ.ఐ.సి)

సంబంధిత సమాచార వనరులు: http://apagrisnet.gov.in/t_padakalu.jsp© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate