హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / గింజను కాపాడుకోవడం అంటే గింజను ఉత్పత్తి చేయడమే!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గింజను కాపాడుకోవడం అంటే గింజను ఉత్పత్తి చేయడమే!

పంట గింజల ఉత్పత్తి రక్షణ

ఆహార పంటల ఉత్పత్తే కాదు, తదనంతర రక్షణ కూడా చాలా కీలకమే. దేశవ్యాప్తంగా పంట గింజల ఉత్పత్తి అనంతరం 10-15 శాతం నష్టపోతున్నట్లుగా గణాంకాలు తెలియచేస్తున్నాయి. పండ్లు, కూరగాయల్లో ఈ నష్టం 30–40 శాతం వరకు ఉంటోంది. ఈ నష్టాన్ని నివారించడం ద్వారా మనం ఆహార భద్రత దిశగా పటిష్ట అడుగులు వేయగలం. గింజను కాపాడుకోవడం అంటే గింజను ఉత్పత్తి చేయడమే. దీనికి గాను రైతులు ఉత్పత్తిదారులుగానే కాకుండా కోతానంతర పరిజ్ఞానం ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా మన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పెంచుకోవాల్సి ఉంది. ఖర్చు తగ్గించి, నాణ్యత పెంచడం, సేంద్రియ పద్ధతులు పాటించి ఆహార ఆరోగ్యం, తద్వారా మానవాళి ఆరోగ్యం సాధించుకోవాల్సి ఉంది. కోతానంతర పరిజ్ఞానం, ప్రాసెసింగ్ పరికరాలు రైతులు సమిష్టి వినియోగంలోకి తెచ్చుకోవాలి.

పంటకోత అనంతరం శాస్త్రీయ పద్ధతులతో తేమను, వేడిని నియంత్రించడం, తూర్పారబట్టడం, ఆరబెట్టడం, సరైన ప్యాకింగ్, నిల్వలో పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవులు, బూజు తెగుళ్ళ నియంత్రణపై దృష్టి సారించడం చాలా అవసరం. అలా చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. అలాగే సరైన ప్రాసెసింగ్ విధానం అనుసరించడం, చెత్తా, ధూళి, జంతు - పక్షి అవశేషాలు, వెంట్రుకలు, మల మూత్రాలు, రసాయన పురుగు మందుల అవశేషాల వలన పంట గింజల నాణ్యతకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాటిపట్ల దృష్టి సారించాలి. నేటి సరళీకృత ఆర్థిక విధానం, ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలతో ముడిపడ్డ ఎగుమతులు, దిగుమతులు, దేశ విదేశీ ప్రమాణాలు అందుకోవాలంటే ఈ నష్టాలను అధిగమించాల్సి ఉంది. వ్యక్తులుగా రైతులు చేయడం ఖర్చుతో కూడింది కావచ్చు కానీ సమిష్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారని, వ్యవసాయశాఖ సహకారాన్ని ఉపయోగించుకుంటారని వ్యవసాయశాఖ ఆశిస్తోంది.

రాష్ట్ర రైతాంగానికి, వారి కుటుంబ సభ్యులకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి మొత్తంగా రాష్ట్ర ప్రజానీకానికి వ్యవసాయశాఖ హేవళంబి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

2.99319727891
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు