హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / ప్రకాశం జిల్లాలో "ఆత్మ" ధ్వారా అమలవుతున్న కార్యక్రమములు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రకాశం జిల్లాలో "ఆత్మ" ధ్వారా అమలవుతున్న కార్యక్రమములు

ప్రకాశం జిల్లాలో "ఆత్మ" ధ్వారా అమలవుతున్న కార్యక్రమములు.

ATMA అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ సంస్థ వ్యవసాయశాఖఎం పశుసంవర్ధక శాఖఎం మత్ర్సశాఖ , పట్టుశాక మరియు ఉద్యానవన శాఖ మధ్య సమస్వయంతో పనిచేయును. ఈ పధకమునకు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వములు 90:10 నిష్పత్తిలో నిధులు సమకూర్చిను. ఆత్మ అనగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజిమెంట్ ఏజెన్సీ). ఈ సంస్థ వివిధ శాఖలకు నిధులను సమకూర్చుతూ వారి ధ్వారా ఈ క్రింది పనులు చేపట్టటం జరుగుతుంది.

  1. శిక్షణ కార్యక్రమము: దీని క్రింద రైతులు జిల్లా లోపల, రాష్టం లోపల, రాష్టం ధాటి వివిధ ప్రదేశాలలో రైతులకు వివిధ మెళుకువలు మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిచుటగాను ఈ శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయబడుతున్నవి. దీని క్రింద జిల్లా లోపల ఒక్కో శిక్షణకు గాను 50 మాది రైతులకు రూ.10,000/- ఖర్చు చేయబడును. అటులనే రాష్టం లోపల బ్లాక్ నుండు 100 మంది రైతులకు గాను రూ. 75,000/- కేటాయంచటం జరుగుతుంది. ఇతర రాష్టంలో బ్లాక్ నుండి 50 మంది రైతులకి శిక్షణకుగాను సంవత్సరమునకు  50,000/- కేటాయంచబడుచున్నది.
  2. ప్రదర్శన క్షేత్రాలు: ఈ ప్రదర్శన క్షేత్రాలు క్రింది ఒక ఎకరం విస్తీర్ణంలో ప్రతి రైతుకు 4000/- విలువైన ఉపకరణములు రైతులకు ఉచితంగా పంపిణీచేయబడుచున్నవి, ఈ ప్రదర్శన క్షేత్రం ప్రతి బ్లాక్ లో వ్యవసాయ శాఖ ద్వారా 125 ప్రదర్శన క్షేత్రాలు మరియు ఇతర అనుబంధ శాఖల ధ్వారా 50 మంది రైతులకు లబ్ది చేకూర్చబడును.
  3. విజ్ఞాన యాత్రలు: దీని క్రింద ప్రతి బ్లాక్ స్థాయి లో 100  మంది రైతులకు రూ.25000/- కేటాయంచటం జరుగుతుంది. అదే విధంగా రాష్టంలోని ఇతర ప్రతేశాలకు ప్రతి బ్లాక్ నుండి 25 మంది రైతులకు రూ,75000/- కేటాయంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి బ్లాక్ నుండి 5 రైతులు ఇతర రాష్టంలో విజ్ఞాన యాత్రల నిమిత్తము రూ, 30,000/- కేటాయంచడం జరుగుతుంది దీని ధ్వారా రైతులకు క్రొత్త పంటల పై అవగాహనా కల్పించడం, ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకం పై అణగహస కల్పించడంఎం మేలైన యాజమాన్య వదతులు ఆచరించడం ధ్వారా ఖర్చు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవడం, అదే విధంగా అధిక లాభాలను ఎలా పొందడం అనే దాని పై అవగాహనా  తీసుకు రావడం జరుగుతుంది.
  4. నైపుణ్యం పెంపుదల: వివిధ రైతు మిత్ర గ్రూపులు, సహకార సంఘాలు, స్వయం సేవా గ్రూపులు వారి యొక్క సామర్థ్యం పెంచుకునేందుకుగాను, ప్రతి బ్లాక్ నుండి ఒక్కో గ్రూప్ కి 5000/- కేటాయంచడం ధ్వారా లక్ష రూపాయలు ఖర్చు చేయుటకు వీలగుచున్నది.
  5. రైతు ప్రోత్నహాక అవార్డులు: దీని క్రింద ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారం ఇచ్చి అబ్ద్యుధాయ  రైతుకు రూ,5000/- నగదు, శాలువా మరియు జ్ఞాపిక ఆత్మ పధకం ధ్వారా ఇచ్చి రైతులను సత్కరించటం జరుగుచున్నది
  6. రైతు సమాచార ప్రచురణ: దీని క్రింద రైతులకు అవగాహనా కార్పించేందుకు వివిధ అంశాలపై కారపత్రములు, బూక్లెటిన్ లు, పుస్తకములు, బ్రోచర్ లు, ముద్రించి రైతులను చెతన్యం పరుచుటకుగాను వివిధ శాఖలకు సంబంధించి సమాచారమును రైతులకు పంపిణీ చేయుట జరుగుచున్నది.
  7. రైతులు, శాస్త్రవేత్తల చర్చగోప్తి: ఇవి సంవత్సరమునకు జిల్లా స్థాయిలో రెండు చర్చగోష్ఠలు నిర్వహించడం ధ్వారా రైతు సమస్యలను శాస్త్రవేత్తలు నేరుగా అర్ధం చేసుకొని వాటిని పరిష్కరించేందుకు ఉపమోగా పదును.

ఇవి కాకుండా కిసాన్ మేళాలు మరియు ఎగ్జిబిషన్ నిర్వహించబడును.

3.08695652174
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు