హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / మేము చిరు ధాన్యాలం - కాదు సిరిధాన్యాలము
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మేము చిరు ధాన్యాలం - కాదు సిరిధాన్యాలము

చిరుధాన్యాలయిన రాగి, జొన్న, కొర్ర, గంటి, సామలు, అరికెలు, వొదలు గురించి

మా అత్మక్షోబ చదవండి వినండి వీలైతే మరోకిరోతో చదివించండి. మేము చిరుదన్యలమని మమ్ములను చిన్న చూపు చూడకండి. మేము సిరులు కురిపించే సిరుదాన్యాలం. మేమంతా మీకు చిరపరిచుతలమే.

మా పేర్లు

రాగి, జొన్న, కొర్ర, గంటి, సామలు, అరికెలు, వొదలు.

మేముంటే మీఇంట వంటల ఘుమ ఘుమలు. మేమే మీ ఆరోగ్యానికి సోపానాలు. మేము మీరు తినే మీ పళ్ళెంలో లేకపోతే మీరు అనారోగ్యం పాలవుతారు. అది మధుమేహం నకు కానీ రక్తపోటుకు కాని రక్త హీనతకు ఇలా నానా రకాల జబ్బులకు దారితీస్తుంది. ఆ జబ్బులకు డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి మానవాళి అప్పులు చేసి అప్పులు పాలవుతారు. కావున మమ్మలిని మీ మడిలో నుండి మదిలొ నుండి దూరం చేసి మీ ఆరోగ్య భద్రతకు ముప్పు తెచ్చుకోకండి. మా గోడు వినండి. మీరు ఆరోగ్యంగా వుండండి.

మీ తిండిలో మేముంటే మీకు బహుముక పోషకాలు మీకు అందిస్తాము. మీకు పౌష్టిక ఆహార భద్రతా కల్పిస్తాం. అందుకే మేము మీకు మొరపెడుతున్నాం పండిచండి సిరుదాన్యాలు తినండి ప్రతి రోజుమెండుగా, వుండండి. పుష్టి కరంగా ఎల్లప్పుడు. వొక్కడే జీవించలేడు ఏమి పండించ లేడు. అందుకు కావాలి మీకు పశు పక్ష్యాదులు మీకు నేస్తాలుగా, వాటికీ కావాలి మేము ఆహారంగా .మీ పశువులకు అవసరమైన మేతగా మా గడ్డిని మీకు అందిస్తున్నాం. వాటికీ దానాగా మేమే ఆనందంగా బలి ఆవుతున్నాం. అయినా మాకు భాద లేదు. మీ ఆనందమే మా ఆనందం. మీకు పశుగ్రాస భద్రతా కల్పించడమే మా జీవితలక్ష్యం. మీ పశువులు మీకు సొమ్ములు, పాలిస్తాయి, గుడ్లు ఇస్తాయి, మాంసాన్ని అందిస్తాయి, అమ్ముకుంటే డబ్బు ఇస్తాయి మీ ఇంట సిరులు కురిపిస్తాయి. అందుకే మేము చిరు దాన్యాలం కాదు సిరిదాన్యలము. అందుకే మమ్ములను మీ పసుపక్ష్యదులను మీ పొలం నుండి దూరం చేయకండి. ఇది మా ఆవేదన.

ప్రతి రోజు ఏదో పండగ ప్రతి ఇంట ఏదో సందడి లేదా అలజడి అందరి నోట, అది పుట్టినరోజు కావచ్చు, చని చని పోయిన రోజు కావచ్చు, లేదా వినాయక పండుగ లేదా దీపావళి పండుగ, వరలక్ష్మి వ్రతం లేదా నాగుల చవితి. అందరు చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి కావచ్చు. అప్పుడు మేముండాలి మీ దేవుని మూలకు ఫలహారంగా. మేము లేనిదే అక్కడ పున్యకార్యలకు పండుగ కార్యాలకు పెద్ద వెళితే. పాయాసంగా, వుంద్రల్లుగా ప్రసాదంగా అక్కడ మేరు వుండాలి. మేము లేనిచో మీ సాంస్కృతిక విలువులకు భంగం వాటిల్లుతుంది. మీ పవిత్ర దేవతా దేవుళ్ళ దీవినలకు మీరు దూరం అవుతారు, కావున మా మనోవేదన ఆలకించి మమ్మలిని పండిచి మీ సాంస్కృతిక సాధికారతను కాపాడుకోమని మిక్కిలి వినయపూర్వకముగా మిమ్ములను వేడుకోనుచున్నాం.

ఈ ఫై మా ఆత్మఘోష ఎందుకీ వినిపిస్తున్నాం అంటే మీకు కావాల్సిన ఆహార సాదికరత, పౌష్టికా సాదికరత, ఆరోగ్య సాదికరత, పశుగ్రాస సాదికారితకు మేము మీకు భరోసా ఇస్తున్నాం. మమ్మలను పండిచండి ఆరగించండి ఆరోగ్యంగా వుండండి, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే -- అందుకే -- అందుకే... మేము చిరుదాన్యాలం కాదు సిరులు కురిపించే సిరిదాన్యలము.

మా పంటకు తక్కువ నీటివసతి సరిపోతుంది చిన్న చిన్న చినుకులకే మేము పులకరించిపోతాం మంచుతోనే మై మరిచి మా పంట మీ చేతికందిస్తాము వాతావరణ ప్రభావాన్ని తట్టుకొనే శక్తి మా సొంతం. వాతావరణ మార్పు వలన సరిగ్గా వర్షాలు రాకపోయినా ఎండలు మండి పోయిన రాత్రి వేళ కురిసే మంచుతోనే మేము మీకు పంట దిగుబడిని ఇస్తాం ఏడాది పొడుగునా ఎలాంటి కాలపరిమితి లేకుండా మమ్ములను సాగు చేసుకోవచ్చు. అనంతమైన సారం లేని నేలల్లో మమ్మలను మీరు పండిచుకోవచ్చు. క్షార భూమ్ముల్లోను ఆమ్ల భూమ్ముల్లోను మేము మొలకేత్తగలం. ఇసుక భూములు మా పుట్టిన్నిల్లు. కావున ఎలాంటి నేలలోనైన మేము బ్రతికి మిమ్ములను బ్రతికించే సత్తా మాకుంది.

మాకు రసాయన ఎరువులు అవసరంలేదు. మీ ఇంట్లో పాకల్లో పొలంలో వుండే చెత్త చెదారం తో మేము నిలవగలం మీ పశువుల పేడతో పెంటతో మేము సంతృప్తి చెందుతాము.

మేమంటే చీదపీదలకు భయం. అందుకే మాకు క్రిమిసంహారిక మందులు అవసరంలేదు. మా పంటకు మీకు పెట్టుబడి అవసరం లేదు. కావున మా కోసం మీరు అప్పుల పాలుకానవసరంలేదు. మీరు మావలన ఆత్మ హత్యలకు బలికానవసరం లేదు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మీయంగా ఉండగలరు.

మేము జీవవైవిద్యానికి మారు పేరు ఒకే భూమిలో ఏక కాలంలో రక రకాల పంటలను మీకు అందిస్తాం. మాతో ఆనేక పప్పు జాతులు మాతో జత కడతాయి. అవి మమ్ములను ప్రేమించి మాతో సహజీవనం చేస్తాయి. ఇది మీకు ఢబుల్ ధమాక.

ఇన్ని వేసులుబాతులు ఫలితాలు మీకు అందిస్తున్న మా సాగును మీరెందుకు తగ్గిస్తున్నారు. మేము ఏమి పాపం చేసాం. సిరులు మీ ఇంట మీ కోద్దా? జబ్బులు కావాలో డబ్బులు కావాలో మీరే తేల్చుకోండి.

అమలు చేయవలసిన నిర్ణయాలు

మా మనోవేదన మా ఆత్మ క్షోభ అర్ధం చేసుకొంటే ఈ కింది నిర్ణయాలను తక్షణమే అమలు చేయండి.

  1. పోషక విలువలు ఎక్కువగ వున్నమా చిరుదాన్యాలను ప్రజా పంపిణి వ్యవస్థలో దేశమంతట ప్రవేశపెట్టండి.
  2. సంక్షేమ హస్థల్లొను మధ్యాన్న భోజన పదకంలోను పేద పిల్లల పౌష్టిక ఆహార లోపాన్ని నివారించటానికి మమ్ములను వారి పళ్ళెంలో భాగసౌమ్యులను చేయండి.
  3. మమ్ములను ఒక పంటగా కాకుండా జీవవైవిద్యానికి తోడ్పడే సాగు పద్దతిగా గుర్తించి మమ్ములను పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించండి.
  4. ఊరూరా మమ్ములను పండించి రక్షించే, రైతులను చిరుదన్యాల సైనికులుగా (మిలేట్ బ్రిగేడ్) గా గుర్తించండి, ప్రోత్సహించండి.
  5. మా పంటల ఉత్పత్తి సామర్ద్యం పంపిణి ప్రోత్స హించడానికి పరిశోధన సంస్థలకు స్వచంద సంస్తలకు నిధులు విసృతంగా కేటాఇంచండి.
  6. మా సరఫరాకు మార్కెట్టుకు కొత్త మార్కెట్టులను అభివృద్ది చేసి చిరుదన్యాల సైనికులకు తగిన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రోత్సహించండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు