హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / సమగ్ర వ్యవసాయం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర వ్యవసాయం

సమగ్ర వ్యవసాయం.

ప్రస్తత తరుణంలో రైతులు వివిధ పంటల సాగుపైనే దృష్టి సారిస్తున్నారు.పంట సాగులో కేవలం రసాయన ఎరువులు, రసాయన పురుగులమందులు  వాడి సేద్యం చేస్తున్నారు. వీటివల్ల అనేక అనర్థాలు వాటిల్లాయి.భూములు, తెగుళ్లను నియంత్రించే సహజశత్రువులు కనుమరుగయ్యాయి. పురుగుమందుల అవశేషాలు  ఆహారపదార్థాలలో మిగిలిపోయాయి.మానవాళికి తీర్వమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటులు ధరలు లభించక సాగు ఖర్చులు ఆధికమయవి.రైతులు విలవిలలాడుతున్నారు. కోత అనంతరం సరైన యాజమాన్యం లేక ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల పంటల్లో సుమారు 40  శాతం నష్టం వాటిల్లుతుంది. రైతులు సరైన ఆదాయం లేక పిల్లలను పోషించలేక, చదివించలేక సతమతమవుతూ వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలసపోతున్నారు. భవిష్యత్తులో కూడా మనం వ్యవసాయ రంగం ఇలాగె కొనసాగితే తీర్వ పరిణామాలను  ఎదుర్కొనవలసి రావచ్చు. దీని పరిష్కారంఒకట్టే రైతులు కేవలం పంటల సాగు పైనే కాకా పశుపోషణ , కోళ్ల పెంపకం, మేకల పెంపకం,  గొర్రెల పెంపకం ,పట్టు పురుగుల పెంపకం ,పుట్ట గొడుగులా పెంపకం , తేనెటీగల పెంపకం ,చేపల పెంపకం  వంటి వాటి పై కూడా దృష్టి సారించితే వ్యవసాయ రంగంలో నిలదొక్కుకొని లాభాలు పొందడానికి వీలవుతుంది .ఇదే సమగ్ర వ్యవసాయం.

వ్యవసాయం తో పటు పైన తలిపిన అనుబంధ రంగాల కలయిక సమగ్ర వ్యవసాయం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వారి కుటుంబసభ్యులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

సమగ్ర వ్యవసాయం సాగు పద్దతులలో మార్పు తెచ్చి వనరులు సద్వినియోగ పరుచుకొని సాగులో ఆర్థిక దిగుబడులు సదినచడానికి తోడ్పడుతుంది.పొలంలోని వ్యర్థాలన్నింటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించి పంటల ఉత్పత్తిని పెంచవచ్చు. వివిధ వ్యవసాయాయ్ వాతావరణ మండలాల్లో రైతుల సాంఘిక ఆర్ధిక స్థితిగతులను బట్టి వ్యవసాయం తో పటు అనువైన వ్యాపకాలను చేపట్టి ఆర్థిక ఆదాయాన్ని పొందవచ్చు.

సమగ్ర వ్యవసాయ పద్ధతివల్ల ప్రయోజనాలు

జనాభా పెరుగుదలకు సరితూగే అరహోత్పత్తిని పొందవచ్చు.పొలంలోని వ్యర్థ పదార్థాలను, ఇతర వనరులను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వల్ల రైతు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ వ్యర్థాలను శుద్ధిచేసి వినియోగించడం వల్ల సుస్థిర భూసారం, ఉత్పాదకత పొందవచ్చు. కార్బోహైడ్రాట్లు , కొవ్వుపదార్ధాలు, విటమిన్లు, ప్రోటీన్లు, అధికంగా ఉన్న పోషకాహారం లభ్యమవుతుంది.పందుల పెంపకక్మ్, కోళ్ల పెంపకం, నుండి వచ్చే వ్యర్థాలను సమర్థవంతంగా శుద్ధి చేసి ఉపయోగించడం వలన వాతావరణాన్ని రక్షించవచ్చు.అనుబంధ వ్యాపకాల నుండి  వచ్చే ఉప ఉత్పత్తులను శుద్ధి చేసి తిరిగి వాడటం వలన సాగుఖర్చులు తగ్గుతాయి. సమగ్ర వ్యవసాయం లో అనుబంధ వ్యాపకాలనుండి లభించే గుడ్లు, పలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనె, పట్టు కాయలనుండి క్రమమైన నికరాదాయం లబోయిస్తుంది. సమగ్ర వ్యవసాయంలోని అడవుల పెంపకం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అయి ఇంధనం ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాలను అంతరపంటలను గాను,పొలంగట్టుపై రక్షిత పంటలుగాను పండించడం వలన మంచి పోషక విలువలున్న,పశుగ్రాసం సరిపడా పరిమాణంలో ఆవులకు , గేదెలకు , మేకలకు, జీవాలకు, కుందేళ్ళకు మేపడానికి  లభిస్తుంది. సహజ అడవులకు నష్టం వాటిల్లకుండా వంటచెరుకు, కలప అవసరాలు తీరుతాయి. సమగ్ర వ్యవసాయంలో అటవీ మొక్కలు, వివిధ పంటలు పెంపకం వల్ల భూమికోతను నివారించవచ్చు. సమగ్ర వ్యవసాయం ద్వారా సంవత్సరం పొడవునా పని దొరుకుతుంది.

సమగ్ర వ్యవసాయంలోని భాగాలు

పంటలు, పశువులు, పక్షులు,చెట్టు రకమయిన సమగ్ర వ్యవసాయ పద్ధతిలోనైనా ముఖ్య భాగాలు, పంటలలో ఉపపంటలు ఏకపంట, మిశ్రమపంటలు, ఆహారపంటలు, బహుపంటలు (ఆహారధాన్యాలు అపరాలు  నూనె గింజలు, పశుగ్రాసాలు) పశువులలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు. తేనెటీగలు, పట్టు పురుగులు. చెట్లల్లో రకాలు కలపచెట్లు, వంట చెరకు చెట్లు, పశుగ్రాసాచెట్లు, పండ్లచెట్లు.

3.04347826087
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు