పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతరములు

వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఇతర పథకాలు ఈ విభాగంలో ఉన్నాయి

వ్యవసాయ యాంత్రీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖ ద్వారా రైతులు పండించే పంటలకు అవసరం అయ్యే ఖర్చు తగ్గించి, ఉత్పత్తులను పెంచి, అధిక లాభాలు పొందాలన్న ఉద్దేశ్యంతో అత్యంత ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందించాలన్న ఆశయంతో 2013-14 సం. నకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 274 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

భారతదేశం ప్రపంచంలోని ప్రత్తి ఉత్పత్తి మరియు నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. మన రాష్ట్రం భారతదేశంలోనున్నసాగు విస్తీర్ణంలో 9.6% శాతం కలిగి మొత్తం ప్రత్తి ఉత్పత్తిలో 8.4% శాతం మేర ఆక్రమించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో సాగుచేయబడి , 53 లక్షల బేళ్ళ ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు.

బి.టి ప్రత్తి సంకర వంగడాల దిగుబడి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైతు ఆత్మబంధు - రైతు బంధు పథకం

రైతు సంక్షేమ కొరకై రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంను రైతులకు వరములాగా ప్రవేశపెట్టింది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

చెక్ డ్యామ్స్

 • లక్ష్యం: ఎస్సీలకు చెందిన వ్యవసాయ భూముల కోత ను నివారించేందుకు ఆనకట్టల నిర్మాణం.
 • అర్హత: కోత కు గురి అయ్యే భూములు 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండరాదు..
 • లబ్దిదారులు: కోతకు గురయ్యే భూములు కలిగిన రైతులు.
 • ప్రయోజనాలు: 100% ఆనకట్ట మంజూరు. యూనిట్ ఎకరానికి రూ. 20,000/-.
 • సంప్రదించాల్సిన వివరాలు: గ్రామ పంచాయతి కార్యదర్శి /వి.ఓ /ఎం.పి.డి.ఓ/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ఎస్సీ కార్పొరేషన్.
 • జి.ఓ నం.: G.O.Ms.No. 76, SW (TW.GCC 1) Dept, తేది 21.9.2005.

బోరు బావులు

 • లక్ష్యం: విద్యుత్ సౌకర్యం, ఎలక్ట్రిక్ మోటార్లను కలిగిన రైతులకు బోరు బావులు సమకూర్చడం.
 • అర్హత: కనీసం ముగ్గురు లబ్దిదారులు కలిసి కనీసం 2 ½ ఎకరాల భూమిని విద్యుత్ సౌకర్యం, ఎలక్ట్రిక్ మోటార్ల సౌకర్యంతో కలిగి ఉన్నవారు.
 • లబ్దిదారులు: ప్రతి ఒక్కరు 2 ½ ఎకరాల భూమి కలిగి ఉన్న ముగ్గురు చిన్న,సన్నకారు రైతుల సమూహం.
 • ప్రయోజనాలు: 50% సబ్సిడీ తో బోర్లు. యూనిట్ ధర రూ. 10,000/- రూపాయలు 5,000/- సబ్సిడీతో సహా.
 • సంప్రదించాల్సిన వివరాలు: గ్రామ పంచాయతి కార్యదర్శి/వి.ఓ /ఎం.పి.డి.ఓ/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
 • జి.ఓ నం.: G.O.Ms.No. 76, SW (TW.GCC 1) Dept, తేది 21.9.2005.

ఆత్మహత్య రైతుల కుటుంబాలకు ఉపశమనం

 • లక్ష్యం: ఆత్మహత్య రైతుల కుటుంబాల మద్దతు,మధ్యంతర ప్రత్యేక ప్యాకేజీ వంటి ఆర్థిక సాయం అందించడం.
 • అర్హత: ఆత్మహత్య రైతు కుటుంబ సభ్యులు.
 • లబ్దిదారులు: అర్హత కలిగిన ఆత్మహత్య రైతు కుటుంబ సభ్యులు.
 • ప్రయోజనాలు:
  1. మరణించిన రైతు యొక్క కుటుంబంకు/బంధువుకు రూ. 1.00 లక్షల ఎక్స్ గ్రేషియా.
  2. రుణదాతల ఒక్కసారి లోన్ పరిష్కారం రూ. 50,000/- వరకు.
  3. సామాజిక సంక్షేమ పాఠశాలలు మరియు హాస్టల్ లో పిల్లలను చేర్పించడం.
  4. ఇందిరా ఆవాస్ యోజన పథకం క్రింద గృహముల కేటాయింపు.
  5. ప్రభుత్వ పథకాల ఆధ్వర్యంలో ఆర్థిక మద్దతు.
  6. కుటుంబంకు పింఛను.
 • సంప్రదించాల్సిన వివరాలు: సర్పంచ్/ఎం.ఆర్.ఓ/అర్.డి.ఓ/జిల్లా కలెక్టర్.
 • జి.ఓ నం.: GOMs.No.421 రెవెన్యూ ఉత్తర్వు (DA-II), తేది 1.6.2004.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

2014 - 15 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు

 • 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.31,062.94 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.26,070.87 కోట్లుగా ఉంది.
 • ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్‌లో వేర్వేరు వ్యవసాయ పథకాల కోసం రూ.7,500 కోట్లు ప్రకటించింది.
 • వ్యవసాయరంగంలో 4 శాతం వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నామని, సాగును లాభసాటిగా మారుస్తామనీ చెప్పారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునికీకరణకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల నుంచి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రకటించారు.
 • నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 'ప్రధానమంత్రి కృషి సించయీ యోజన' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం రూ.1000 కోట్లు కేటాయించారు.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి లక్ష్యం రూ.8 లక్షల కోట్లు.
 • వ్యవసాయ రుణాలపై తిరిగి చెల్లింపులను సక్రమంగా చేసేవారికి ప్రస్తుతం అందిస్తున్న 3 శాతం వడ్డీ రాయితీ కొనసాగింపు.
 • 5 లక్షల రైతు సమూహాలకు 'భూమి హీన్ కిసాన్' పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా రుణాలు.
 • వ్యవసాయరంగంలో జాతీయ మార్కెట్ ఏర్పాటులో భాగంగా ప్రైవేట్ మార్కెట్ యార్డులు, ప్రైవేట్ మార్కెట్లు నెలకొల్పేందుకు చట్ట సంస్కరణల కోసం రాష్ట్రాలతో కలిసి కృషి చేస్తారు.
 • రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు పట్టణ ప్రాంతాల్లో రైతు మార్కెట్ల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రోత్సాహం.
 • వ్యవసాయోత్పత్తుల ధరల అస్థిరత కారణంగా రైతులు కష్టనష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.500 కోట్లతో 'ధరల స్థిరీకరణ నిధి'.
 • భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తరహాలో అసోం, జార్ఖండ్‌లోనూ పరిశోధన కేంద్రాలు.
 • ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు; తెలంగాణ, హర్యానాలో ఉద్యాన విశ్వవిద్యాలయాల ఏర్పాటు. దీనికోసం రూ.200 కోట్ల నిధుల కేటాయింపు.
 • రెండో హరితవిప్లవంలో భాగంగా 'ప్రొటీన్ల విప్లవం' సాధన.
 • కిసాన్ వికాస్ పత్రాల పునరుద్ధరణ.
 • దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్ 'గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్)' కార్పస్ నిధికి అదనంగా రూ.5 వేల కోట్లు పెంపుదల.
 • 2014-15 సంవత్సరానికి గాను శాస్త్రీయ గిడ్డంగుల సౌకర్యాల ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయింపు.
 • వ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల పరపతిని పెంచేందుకు దీర్ఘకాలిక గ్రామీణ పరపతినిధిని నాబార్డ్‌లో ఏర్పాటు. ఇందులో సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణసాయం కోసం ప్రాథమికంగా రూ.5 వేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు.
 • 2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ స్వల్పకాలిక సహకార గ్రామీణ పరపతి రీఫైనాన్స్ నిధికి రూ.50 వేల కోట్లు ప్రతిపాదన.
 • చిన్న కమతాల రైతులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రొడ్యూస్ పేరిట రూ.200 కోట్లతో నాబార్డ్ కింద 'ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ఫండ్‌'కు ప్రతిపాదన. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2 వేల ఉత్పత్తిదారుల సంస్థల నిర్మాణం.
 • ఆర్గానిక్ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈశాన్య ప్రజలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ద్వారా భారీ లాభాలు సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయింపు.
 • ఎరువులను సమతుల పద్ధతుల్లో ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు రూ.100 కోట్లతో ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య కార్డుల అందజేత.
 • రూ.56 కోట్లతో 100 సంచార భూసార ప్రయోగశాలలు.
 • వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో 'జాతీయ సర్దుబాటు నిధి'.
కిసాన్ టీవీ
 • రైతులకు అవసరమైన తాజా సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'కిసాన్ టీవీ'ని ఆరంభించనుంది. ఇందుకోసం 2014-15 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది.
 • కొత్త వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం లాంటి అంశాలకు సంబంధించిన తాజా విషయాలను అందించడం కిసాన్ టీవీ ఉద్దేశం.
 • వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుంది. ఈ కొత్త ఛానెల్‌ను ఆరంభించడంపై ప్రసార భారతి ఇప్పటికే పనిచేస్తోంది.
జౌళి రంగానికి ఊతం
 • తాజా బడ్జెట్‌లో జౌళి రంగానికి ఊతం ఇచ్చేలా దేశవ్యాప్తంగా కొన్ని భారీ టెక్స్‌టైల్ క్లస్టర్లను ప్రతిపాదించారు. వాణిజ్య కేంద్రాలు, క్రాఫ్ట్ మ్యూజియాల నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. వీటితో వారణాసి, ఇతర హస్తకళలకు ప్రాచుర్యం కల్పించనున్నారు.
 • బరేలీ, లక్నో, సూరత్, కచ్, భాగల్‌పూర్, మైసూర్, తమిళనాడుల్లో టెక్స్‌టైల్ క్లస్టర్ల కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
 • ఢిల్లీలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో హస్తకళా అకాడమీని ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
 • పష్మినా (ఉన్ని) ప్రాచుర్య కార్యక్రమం, జమ్మూ కాశ్మీర్‌లోని ఇతర కళల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించారు.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు