অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన

కరవు తరహా పరిస్థితులు కనిపిస్తూ.. ఆహార ధరలు పైపైనే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో వేర్వేరు వ్యవసాయ పథకాల కోసం రూ.7,500 కోట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తూ.. వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి సాధనకు కట్టుబడి ఉన్నామనీ, సాగును లాభసాటిగా మారుస్తామనీ, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునికీకరణకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికీ పెద్ద ఎత్తున సాగు భూములు వర్షాలపైనే ఆధారపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి.. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు నిర్దుష్టంగా నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పారుదల సౌకర్యాల్ని మెరుగుపరిచేందుకు 'ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీనికోసం రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి లక్ష్యం రూ.8 లక్షల కోట్లువ్యవసాయ రుణాలపై తిరిగి చెల్లింపుల్ని సక్రమంగా చేసే వారికి ప్రస్తుతం అందిస్తున్న 3 శాతం వడ్డీ రాయితీ కొనసాగింపు 5 లక్షల మంది రైతు సమూహాలకు 'భూమి హీన్‌ కిసాన్‌' పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్‌ ద్వారా రుణాలు.

వ్యవసాయ రంగంలో జాతీయ మార్కెట్‌ ఏర్పాటులో భాగంగా.. ప్రైవేటు మార్కెట్‌ యార్డులు, ప్రైవేటు మార్కెట్లు నెలకొల్పేందుకు చట్ట సంస్కరణల కోసం కేంద్రం రాష్ట్రాలతో కలిసి కృషిరైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు పట్టణ ప్రాంతాల్లో రైతు మార్కెట్ల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రోత్సాహందేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్‌ 'గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్‌)' కార్పస్‌ నిధికి అదనంగా రూ.5 వేల కోట్ల పెంపుదల2014-15 సంవత్సరానికిగాను శాస్త్రీయ గిడ్డంగుల సౌకర్యాల ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల కేటాయింపువ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల పరపతి పెంచేందుకు దీర్ఘకాలిక గ్రామీణ పరపతి నిధిని నాబార్డ్‌లో ఏర్పాటు. ఇందులో సహాకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణసాయం కోసం ప్రాథమికంగా రూ.5 వేల కోట్లతో కార్పస్‌ నిధి ఏర్పాటు 2014-15 సంవత్సరంలో నాబార్డ్‌ స్వల్పకాలిక సహకార గ్రామీణ పరపతి రీఫైనాన్స్‌ నిధికి రూ.50 వేల కోట్లు ప్రతిపాదనచిన్న కమతాల రైతులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రొడ్యూస్‌ పేరిట రూ.200 కోట్లతో నాబార్డ్‌ కింద 'ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌'కు ప్రతిపాదన.

వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 2 వేల ఉత్పత్తిదారుల సంస్థల నిర్మాణం. ఎరువులను సమతుల పద్ధతుల్లో ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు రూ.వంద కోట్లతో ప్రతి రైతుకూ భూసార ఆరోగ్య కార్డుల అందజేత. రూ.56 కోట్లతో 100 సంచార భూసార ప్రయోగశాలలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో 'జాతీయ సర్దుబాటు నిధి' వ్యవసాయోత్పత్తుల ధరల అస్థిరత కారణంగా రైతులు కష్టనష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.500 కోట్లతో 'ధరల స్థిరీకరణ నిధి' భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తరహాలో అస్సాం, జార్ఖండ్‌లలోనూ  పరిశోధన కేంద్రాలు.

ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, తెలంగాణ, హర్యానాల్లో ఉద్యాన విశ్వవిద్యాలయాల ఏర్పాటు. రూ.200 కోట్ల నిధుల కేటాయింపు రెండో హరితవిప్లవంలో భాగంగా 'ప్రొటీన్లవిప్లవం' సాధన. కిసాన్‌ వికాస్‌ పత్రాల పునరుద్ధరణ. ఆర్గానిక్‌ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈశాన్య ప్రజలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ద్వారా భారీ లాభాలు సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల కేటాయింపు. వ్యవసాయ ఉపకరణాలను, రుణాలను అందించటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా రైతులకు వారు చేసిన వ్యయంపై కనీసం 50 శాతం లాభం దక్కేలా చర్యలు. 60 ఏళ్లకు పైబడిన చిన్న, మధ్యస్థాయి రైతులు, కూలీలకు సంక్షేమ పథకాలు. రైతులందరికీ పంటబీమా అమలు. నేల స్వభావాన్ని పరీక్షించటానికి మొబైల్‌ పరీక్ష కేంద్రాలు. నేల స్వభావాన్ని బట్టి పంటల సాగుకు సూచనలు. సేంద్రియ వ్యవసాయాన్ని పెంచటానికి ప్రోత్సాహం కల్పిస్తూ 'సేంద్రియ వ్యవసాయం, ఎరువు కార్పొరేషన్‌'ను ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ భాషల్లో రైతుల కోసం టీవీ ఛానళ్ల ఏర్పాటుకు ప్రయత్నాలు. రైతు బజార్లు. ప్రతి జిల్లాలో విత్తనోత్పత్తి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలతో కలిసి కృషి. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని, అరుదైన జాతుల మొక్కలను కాపాడటానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనశాలలు.భూముల స్వాధీనం వివాదాస్పదమైన నేపథ్యంలో 'జాతీయ భూవినియోగ విధానం' తీసుకొస్తాం.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/31/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate