హోమ్ / వ్యవసాయం / పథకములు / వాటర్‌షెడ్ పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వాటర్‌షెడ్ పథకం

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాలను వృద్ధి పర్చడానికే మెగా వాటర్‌షెడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాలను వృద్ధి పర్చడానికే మెగా వాటర్‌షెడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

వాటర్‌షెడ్ పథకం కింద నీటి నిలువ కుంటలు, చెక్‌డ్యామ్‌లను, పొలాల నుంచి మట్టి కొట్టుకు పోకుండా అడ్డుగా రాతి కట్టలు, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి, చెట్ల పెంపకం, కందకాల తవ్వకం, ఊటకుంటలు, డగ్ అవుట్ పాండ్స్ (వాగుల్లో నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు తవ్వే కుంటలు), వాగులో ఇంకుడు గుంటలు, రైతువారీ కుంటల పనులు వంటి కార్యక్రమాలను చేపడతారు.

చేపట్టిన పనులపై ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ సభలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలకు వాటర్‌షెడ్ పనులు కొనసాగుతున్న గ్రామాల్లో నలుగురు వలంటీర్లను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన ఈ వలంటీర్లను స్వగ్రామంలో కాకుండా ఇతర గ్రామాలకు పంపించి క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేస్తారు. అనంతరం తనిఖీ నివేదికలను, గ్రామ పంచాయతీల తీర్మానంతో కలిపి కలెక్టర్‌కు నివేదిస్తారు. కలెక్టర్ ఆదేశాలతో గ్రామసభలు నిర్వహించి బహిరంగచర్చ జరుపుతారు.

ఈ వాటర్‌షెడ్ పథకం మరింత అభివృద్ధి కోసం హరియాలీ మార్గదర్శక సూత్రాలు ప్రచురించబడినాయి. ఈ హరియాలీ మార్గదర్శక సూత్రాలు ఈ క్రింద వివరించబడినాయి.

ప్రజాస్వామ్య పరిపాలన 73 వ రాజ్యాంగ సవరణ, వ్యవసాయము – పేదరికం, గ్రామీనాభివృద్ధి పథకాలు, వాటర్ షెడ్ నిర్వచనం, ఉద్దేశ్యాలు, పరిణామ క్రమం, చతుర్విధ జల ప్రక్రియ, హరియాలీ మార్గదర్శక సూత్రాలు – సంస్థాగత ఏర్పాట్లు – నిధుల కేటాయింపు, వాటర్ షెడ్ పథకం అమలులో గ్రామ పంచాయితీ, గ్రామ సంఘం, రైతుల బృందం, కూలి బృందం పాత్ర – సమన్వయము పై విశ్లేషణ మొదలగునవి ఈ పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సామజిక చైతన్యం, సామర్థ్యాల పెంపుదల - ప్రక్రియలు – ప్రణాళికలు, సహజ వనరుల యాజమాన్యం – ప్రక్రియలు, ప్రణాళికలు, వ్యవసాయ పశుగణ ఉత్పాదక పెంపుదల – ప్రక్రియలు, ప్రణాళికలు, జీవనోపాధుల పెంపుదల – ప్రక్రియలు, ప్రణాళికలు, ప్రాజెక్ట్ యాజమాన్య చక్రం, వాటర్ షెడ్ అమలు మొదలగునవి ఈ పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మొగలి చెట్ల తాండా గ్రామ విజయగాధ, సహజ వనరుల యాజమాన్యం, వ్యవసాయ, పశుగణ ఉత్పాదకత, జీవనోపాధుల కల్పన, పెంపుదలపై క్షేత్ర సందర్శన మొదలగునవి ఈ పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వాటర్ షెడ్ యాజమాన్యంలో భూబౌగోళిక సమాచార వ్యవస్థ మరియు రిమోట్ సెన్సింగ్ గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థల పాత్ర

సహజ వనరుల యాజమాన్యంలో భూబౌగోళిక సమాచార వ్యవస్థ మరియు గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థల ఉపయోగాలు, వాటర్ షెడ్ మరియు వాటర్ షెడ్ డిమార్కేషన్, GIS జి.ఐ.ఎస్. వృత్తాంతం, GPS జి.పి.యస్. వల్ల ఉపయోగాలు, వాటర్ షెడ్ యాజమాన్యంలో భూబౌగోళిక సమాచార వ్యవస్థ మరియు రిమోట్ సెన్సింగ్ గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థల పాత్ర, రిమోట్ సెన్సింగ్ ఉపయోగాలు, భూబౌగోళిక సమాచార వ్యవస్థ మొదలగునవి ఈ పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్

3.00386100386
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు