অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆధార్ కార్డు

బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా... ఎక్కడైనా...ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని బట్టి తీర ప్రాంతాలకు అపరిచితులు ఎవరు వచ్చినా వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుంది. ముందుగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ జనాభా నమోదు (నేషనల్ పాప్యులేషన్ రిజిష్ట్రేషన్) కార్యక్రమం కింద ముందుగా తీర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలను సర్వే చేస్తారు. ఇంటింటికీ తిరిగి వేలి ముద్రలు ఫొటోలు నమోదు చేసి గుర్తింపు కార్డులు రూపొందిస్తారు.ముఖ్యంగా సముద్రంపై చేపలు పట్టే మత్స్యకారులకు ఈ కార్డుల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. చేపలవేట లో భాగంగా దేశంలో ఎక్కడకు వెళ్లినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చి అతని వివరాలు తెలుసుకోవాలనుకున్నా, చాలా సులభంగా ఈ బయోమెట్రిక్ కార్డుని కంప్యూటర్లో పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. అతనిది ఏ దేశం? ఏ ప్రాంతం? మత్స్యకారుడా? ఉగ్రవాదా? అతని రక్తం గ్రూపు, వేలిముద్రలతో సహా మొత్తం వివరాలు తెలుస్తాయి.

కళ్లు, చేతివేళ్లు

విశిష్ట గుర్తింపు కార్డు కు ఇవే ఆనవాళ్లు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ చేసేందుకు వారి కళ్లను స్కాన్‌ చేయడంతో పాటు మొత్తం పది చేతివేళ్ల ముద్రలు సేకరించాలని యూఐడీఏఐ సంస్థ యోచిస్తోంది. అధిక శ్రమ వల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు తమ శారీరక గుర్తులు కొంత వరకు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి కంటి చూపు, మరికొందరికి చేతివేళ్ల అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున మరో ప్రత్యామ్నాయం లేదని యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 16 అంకెలు గల బయోమెట్రిక్‌ విశిష్ట సంఖ్యను దేని ఆధారంగా ఇవ్వాలనే అంశం మీద గత కొద్ది రోజులుగా అధికారుల మధ్య చర్చలు సాగాయి.ప్రజల గుర్తింపు కోసం మొత్తం పది చేతివేళ్లు లేదా కళ్లు స్కాన్‌ చేయాలని సూచించిందని అధికారులు వెల్లడించారు. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో మాత్రం వీటిలో ఏదైనా ఒకదానిని అనుసరించాలని కమిటీ పేర్కొంది. గ్రామాల్లో మాత్రం రెండూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అయితే ప్రజల నుంచి డీఎన్‌ఏ గుర్తులు సేకరించాలనే సలహాను కమిటీ తిరస్కరించింది. డీఎన్‌ఏ సేకరణ వల్ల పలు సమస్యలు ఉత్పన్నం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది.

ఈ ఆధార్ కార్డు గురించి మరింత పూర్తి సమాచారం కోసం భారత ప్రభుత్వం కొన్ని శిక్షణా పాఠ్యాంశాలను విడుదల చేసింది.

మొదటి పాఠ్యాంశము

ఆధార్ కార్డు దాని లక్ష్యాలు, విశిష్ట గుర్తింపు ఉండటం వళ్ళ ప్రయోజనాలు, గుర్తింపును సరిచూడటం, ఆధార్ వళ్ళ ప్రభుత్వానికి కలిగే ఉపయోగాలు, ఇకో సిస్టం నమోదు, ఇకో సిస్టం అప్లికేషను, రిజిస్టార్లకు కలిగే ప్రయోజనాలు, ఆధర్ సంవాద ప్రక్రియ లో అంతరువులు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సంక్షిప్త చరిత్ర మొదలగునవి ఈ క్రింది పి.డి.ఎఫ్.లో ఉన్నాయి.

ఈ పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రెండవ పాఠ్యాంశము

ఉద్దేశ్యాలు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొరకు నమోదు సంస్థలు, ఆధర్ నమోదు మరియు దాన్ని నివాసికి చేరవేసే ప్రక్రియ, నమోదు ఏజెన్సీ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయటం, సమాచార నమోదు ప్రక్రియ, డెమోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ సమాచారాలను యు.ఐ.డి.ఎ.ఐ. కు బదిలీ చేయటం, సమాచారాన్ని డి-డూప్లికేట్ చేయటం, యు.ఐ.డి.ఎ.ఐ. చేత ఆధార్ ఉత్పత్తి చేయబడడం, ఆధార్ నెంబర్ ను మంజూరు చేయటం, పాత్రలు మరియు భాధ్యతలు. అనుభంధాలు: గుర్తింపు మరియు పరిచయ కర్త నమోదు, ప్రమాణాలు మరియు మార్గదర్శక సూచనలు, డెమోగ్రాఫిక్ సమాచార నమోదుకు కే.వై.ఆర్. ప్రమాణాలు, కే.వై.ఆర్.+, నమోదు దరాఖాస్తు, డెమోగ్రాఫిక్ సమాచార నమోదుకు మార్గదర్శక సూచనలు, నమోదు కేంద్ర స్థాపనకు చెక్ లిస్టు, నివాసుల సమస్యలు – తరచుగా అడిగే ప్రశ్నలు ఈ క్రింది పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉంటాయి.

ఈ పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మూడవ పాఠ్యాంశము

నమోదు కేంద్ర స్థాపన మరియు నిర్వహణ యొక్క సంపూర్ణ వివరాలు ఈ క్రింది పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మూడవ పాఠ్యాంశము యొక్క రెండవ భాగంలో బయోమెట్రిక్ డివైస్ తో కంప్యూటర్ సెట్ చేయడం, బయోమెట్రిక్ పరికరాలతో లాప్ టాప్ ను అనుసంధానం చేయడం, నమోదు ఏజెన్సీ సైట్ సంసిద్ధతను నిర్దారించుకోవటం, చెక్ లిస్టు నింపడం, ఆధర్ నమోదు క్లైంట్ ను ఇన్స్టాల్ చేయడం, విండోస్ యూసర్లను క్రియేట్ చేసే పద్ధతి, ఆధర్ యూసర్ నిర్వహణ మొదలగునవి ఉంటాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాలుగవ పాఠ్యాంశము

నాలుగవ లో హార్డ్ వేర్ పరికరాలు - ప్రాథమిక అంశాలు, బయో మెట్రిక్ పరికరాలు, ఐరిస్, డిజిటల్ కెమెరా, నాన్-బయోమెట్రిక్ పరికరాలు, కంప్యూటర్, డెస్క్ టాప్, లాప్ టాప్, సాఫ్ట్ వేర్, ప్రింటర్, స్టోరేజ్ పరికరాలు, సి.డి., డి.వి.డి., పెన్ డ్రైవ్, బార్ కోడ్, స్కానర్, యు.పి.యస్. మొదలగు వాటికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate