హోమ్ / ఇ-పాలన / అవసరాలు - అవగాహన / పెన్షన్ ప్లాన్స్
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పెన్షన్ ప్లాన్స్

మనిషి తన జీవితంలో చివరి క్షణాలను ఆనందంగా జీవించాలంటే పెన్షన్ అవసరం.

ఎస్‌బీఐ పెన్షన్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి...?

మలి వయసులో ఉన్న వారికి కోసం ప్రత్యేకించి ఎస్‌బీఐ లైఫ్ పేరుతో మూడు పెన్షన్ పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉత్పత్తే ఈ ఎస్‌బీఐ లైఫ్.

మనిషి తన జీవితంలో చివరి క్షణాలను ఆనందంగా జీవించాలంటే పెన్షన్ అవసరం. జీవన కాలపు అంచనా రేటు పెరుగుతుండటం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగుతుండటం, భారతదేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వంటి ముఖ్య కారణాలు పదవీవిరమణ ప్రణాళికను బాగా క్లిష్టతరం చేస్తున్నాయి.

మీ జీవితం పదవీ విరమణ తర్వాతి కాలం ఆనందమయం చేసుకోవడాన్ని కొనసాగించడంలో సహాయం చేయడం కోసం, ఎస్‌బిఐ లైఫ్ మీకు సులభమైన, వినూత్న పెన్షన్ పథకాలను అందిస్తోంది. పెన్షన్ కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా మూడు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి ఎస్‌బీఐ లైఫ్ యాన్యుటీ ప్లస్, రెండోది ఎస్‌బీఐ సరళ్ పెన్షన్, మూడవది ఎస్‌బీఐ లైఫ్ రిటైర్ స్మార్ట్.

ఈ మూడు పెన్షన్ పథకాల గురించిన సమాచారాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాం. మలి వయసులో ఉన్న వారికి కోసం ప్రత్యేకించి ఎస్‌బీఐ లైఫ్ పేరుతో మూడు పెన్షన్ పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉత్పత్తే ఈ ఎస్‌బీఐ లైఫ్.

ఎస్‌బీఐ లైఫ్ - సరళ్ పెన్షన్

ఎస్‌బిఐ లైఫ్-సరళ్ పెన్షన్ అనేది వ్యక్తిగత, లాభాలతో కూడిన, సాంప్రదాయమైన పెన్షన్ ప్లాన్, మీకు భద్రతతో కూడిన భవిష్యత్తు, సంతోషకరమైన పదవీవిరమణ అందించి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి పూర్తి భద్రత కలిగిస్తుంది.

పథకం యొక్క ముఖ్యాంశాలు:

బోనస్: మొదటి 5 సంవత్సరాలకు హామీపూరిత సులభమైన బోనస్‌లు వస్తుంది, మొదటి మూడు సంవత్సరాలకు బీమాపై 2.50 శాతం, ఆ తర్వాతి రెండు సంవత్సరాలకు గాను 2.75 శాతం బోనస్ లభిస్తుంది. అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే హామీపూరిత బోనస్ వర్తిస్తుంది.

గడవు ముగింపు (మేచ్యురిటి) లాభం: పాలసీలో జమ అయిన బోనస్‌, బోనస్‌లు ముగింపు, ఏవైనా ఉంటే, బీమాపై 0.25 శాతం చొప్పున ప్రతి సంవత్సరం చక్రవడ్డీ కూడా కలుపబడుతుంది.‍‌

మృత్యువు లాభం: (చెల్లించిన ప్రీమియం మొత్తం 0.25% చక్రవడ్డీతో కలిపి + బోనస్‌) లేదా కనీసంగా చెలిలంచిన మొత్తంపై 105శాతంగా లభిస్తుంది.

జీవిత భద్రత: ఎస్‌బిఐ లైఫ్ - అదనపు జీవిత భద్రత ఎంపిక. పెన్షన్‌ ప్రారంభ తేదీనాడు, మెచ్యూరిటీ మొత్తంతో తక్షణ పెన్షన్‌ పాలసీ కొనుగోలు చేసుకొనవచ్చు లేదా 1/3వ వంతు నగదు రూపంలో తీసుకుని, మిగిలిన మొత్తంతో పెన్షన్‌ పాలసీ కొనుగోలు చేయవచ్చు.

సౌకర్యం: మీ గడవు ముగింపు తేదిని 70 సంవత్సరాల వయసు వరకు పొడిగించుకోవచ్చు లేదా మీ పాలసీ జమలను/ముగింపు వ్యవధిని పొడిగించుకోవచ్చు.

ఎస్‌బీఐ రిటైర్ స్మార్ట్

ఈ పాలసీలో, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని పెట్టబడి రిస్క్‌ పాలసీదారునిచే భరించబడుతుది. "ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఎలాంటి లిక్విడిటి అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే/విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు."

పథకం యొక్క ముఖ్యాంశాలు:
 • వార్షిక ప్రీమియం యొక్క 210 శాతం వరకు హామీతో మీ ఫండ్ విలువను పెంపొందించడం జరుగుతుంది. (నిబంధనలు వర్తిస్తాయి).
 • 15వ పాలసీ సంవత్సరం ముగింపు మొదలునుంచి, తదనంతరం పాలసీ వ్యవధి ముగింపు వరకు ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా వార్షిక ప్రీమియం యొక్క 10% హామీపూరితంగా చెల్లించడుతుంది.
 • గడువు ముగింపు లేదా ముందుగానే మృత్యువు సంభవిస్తే ఫండ్ విలువ యొక్క 1.5% అదనపు ముగింపును పొందవచ్చు.
 • మీ పెట్టుబడుల నిర్వహణ చింతను ‘అడ్వాంటేజ్ ప్లాన్' ద్వారా ఎస్‌బీఐ లైఫ్ వదలండి. గడువు ముగింపు నాడు చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ యొక్క కనీసం 101శాతానికి ఈ ప్లాన్ హామీ ఇస్తుంది.
 • ముందుగానే మృత్యువు సంభవిస్తే అన్ని ప్రీమియమ్స్ యొక్క కనీసం 105శాతం హామీపూరితంగా పొందొచ్చు.
 • ప్రీమియమ్స్ క్రమబద్ధంగా లేదా పరిమిత వ్యవధికి చెల్లించుకునేలా ఎంపిక చేసుకునే సౌకర్యం.
 • మీ గడువు ముగింపు వయసును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఎస్‌బీఐ యాన్యుటీ ప్లస్

ఇదో సాంప్రదాయమైన, తక్షణ ఎన్యుటి ప్లాన్, అంతర్నిర్మిత సౌకర్యాలతో విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలను ఇది అందిస్తోంది. ఎల్లప్పుడూ మంచి జీవిత ప్రమాణాలను కొనసాగించుకునేందుకు ఇది చక్కని అవకాశాలను అందిస్తుంది.

ముఖ్యమైన అంశాలు:

విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ

 • 40 సంవత్సరాల వయసు నుండే క్రమబద్ధమైన ఆదాయం పొంది సంతోషంగా ఉండండి.
 • మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జీవితాంతం ఎన్యుటి చెల్లింపులు పొందే ఎంపికను ఎంచుకోవచ్చు.
 • మీ అవసరాల ప్రకారం ఎన్యుటి చెల్లింపుల వ్యవధిని ఎంచుకునే సౌకర్యాన్ని మీరు పొందవచ్చు- నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సరానికి.
 • పెద్ద ప్రీమియమ్స్‌కి అధిక ఎన్యుటి ధరల పారితోషికాలు
 • మీ ఎన్యుటి చెల్లింపులను ముందుగానే తీసుకొనే సౌకర్యం
 • ప్రీమియం లేదా బాలన్స్ ప్రీమియం తిరిగి పొందే అవకాశం

ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్

వశిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పొదుపు మంచిదేనా?

ఉద్యోగ విరమణ అనంతరం అందుకున్న మొత్తాన్ని ఎక్కడ పొదుపు చేయాలని ఆలోచించే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలున్నాయి. ఇలాంటి పథకాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకం వశిష్ఠ పెన్షన్ బీమా యోజన. ఆగస్టు 14, 2015 వరకు అందుబాటులో ఉన్న ఈ పథకం విశేషాలు పాఠకులకు ప్రత్యేకం.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో 60 ఏళ్లు నిండిన భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 5000 ఫించను వచ్చేలా ఈ పథకంలో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ ఈ పించను పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఫించను నెలకొసారి తీసుకోవచ్చు. నగదు అవసరం లేదంటే 3, 6, 12 నెలలకొకసారి తీసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి ఫించను ఎప్పుడు తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది.

కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి నెలకు ఐదు వేలకు మించి పింఛను తీసుకునేలా చేసే డిపాజిట్‌‌కు అనుమతించరు. ఎన్ఈఎఫ్‌టీ లేదా ఈసీఎస్ ద్వారా పింఛన్‌ని నేరుగా బ్యాంకు ఖాతాకే బదిలీ చేస్తారు. డిపాజిట్ చేసిన దంపతులకు తీవ్ర అనారోగ్యం వంటి ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప డిపాజిట్ చేసిన మొత్తాన్ని 15 ఏళ్ల వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఈ పథకంలో లేదు. 15 ఏళ్ల గడువుకు ముందు డిపాజిట్ దారు ఉపసంహరించుకుంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 98 శాతం తిరగి ఇస్తారు.

అదే గడువుకి ముందే డిపాజిట్ దారు మరణిస్తే డిపాజిట్ మొత్తాన్ని ఇస్తారు. ఈ పథకం పేరులో బీమా ఉన్నా ఎలాంటి బీమా వర్తించదు. అయితే డిపాజిటే చేసిన మూడేళ్ల తర్వాత డిపాజిట్ మొత్తంలో 75 శాతం అప్పుగా తీసుకనేందుకు వీలుంది.

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకం కాల పరిమితి 15 సంవత్సరాలు కాగా, బ్యాంకు డిపాజిట్‌ల గరిష్ట కాలపరిమితి 10 సంవత్సరాలే. బ్యాంకులో డిపాజిట్ దారు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు. వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో రూ. 6,66,665 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీల్లేదు.

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో డిపాజిట్ చేసిన మొత్తానికి 3.09 శాతం సేవా పన్ను రద్దు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే ప్రకటించారు.

ముగింపు:

వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకంలో 15 ఏళ్లలోపు డిపాజిట్ రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. అదే బ్యాంకు డిపాజిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. వశిష్ఠ పెన్షన్ బీమా యోజన పొదుపు కొన్ని పరిస్ధితుల్లో ప్రతికూలంగానూ, మరికొన్ని పరిస్ధితుల్లో అనుకూలంగా ఉంటుంది.

ఆధారము: తెలుగు.గుడ్ రిటర్న్స్.ఇన్

3.00849617672
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు