హోమ్ / ఇ-పాలన / డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు / అంతర్జాలం - బ్యాంకింగ్‌ పదజాలం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర్జాలం - బ్యాంకింగ్‌ పదజాలం

అంతర్జాలం - బ్యాంకింగ్‌ పదజాలం

NEFT ఎన్‌ఈఎఫ్‌టీ: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌... ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ తన ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేసుకొనే సదుపాయం. నగదు బదిలీపై ఎలాంటి పరిమితులు లేకపోయినా ఒక్కో ట్రాన్జాక్షన్‌కు సంబంధించి పలు బ్యాంకులు కొన్ని పరిమితులు విధించి ఉంటాయి. బదిలీ చేసే నగదును బట్టి సేవా ఛార్జీలు ఉంటాయి.
RTGS ఆర్టీజీఎస్‌: రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌.. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ వారి ఆదేశాల మేరకు వారు సూచించిన ఖాతాకు వారు సూచించిన సమయం లోపు నగదు బదిలీ చేసే సదుపాయం. ఈ లావాదేవీలన్నీ కూడా రిజర్వు బ్యాంకు రిజిష్టర్లో నమోదు అవుతుంటాయి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌ రెండూ బ్యాంకు సూచించిన నిర్ణీత గడువులోపే బదిలీ చేయడానికి వీలుంటుంది.
IMPS ఐఎంపీఎస్‌: ఇమ్మీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌.. 24/7 ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎవరికైనా ఎంత నగదైనా బదలాయించుకునే సాధనం. పీసీ, ల్యాప్‌టాప్‌, చరవాణుల నుంచి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశముంటుంది. తక్షణం డబ్బు మనం బదలాయించాలన్న వ్యక్తి ఖాతాలోకి చేరిపోతుంది. ఇందులోనే ఐమొబైల్‌, ఇంటర్నెట్‌ ద్వారా కార్యకలాపాలు చేసుకునే వీలుంటుంది. వీటిలో ఏ పద్ధతిలో నగదు బదలాయించాలన్నా ఐఎఫ్‌ఎసీ లేదా ఎంఎంఐడీ కోడ్‌ నంబర్లు అవసరం.
IFSC ఐఎఫ్‌ఎస్‌సీ: ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ కోడ్‌... ఇది ఆంగ్ల అక్షరాలు, అంకెల సమ్మిళత కోడ్‌. ఆయా బ్యాంకు శాఖకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు కోడ్‌ ఇది. 11 అంకెలున్న ఈ కోడ్‌లో మొదటి నాలుగు అక్షరాలు బ్యాంకు కోడ్‌ను తెలుపుతాయి.
MMAID ఎంఎంఎఐడీ: మొబైల్‌ మనీ ఐడెంటిఫైర్‌... ఇది ఏడు అంకెల కోడ్‌. మొదటి నాలుగు అంకెలు మనం డబ్బులు పంపాలనుకున్న ఖాతాదారుడి బ్యాంక్‌ శాఖకు సంబంధించిన ప్రత్యేక కోడ్‌.
UPI యూపీఐ: యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌... మన బ్యాంకు ఖాతాకు సంబంధించి పెద్ద వివరాలు లాంటివేమీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా చిటికెలో మన స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ఎవరికైనా, ఏ ఇతర ఖాతాలకైనా నగదు పంపే సదుపాయం. గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆయా బ్యాంకులు అందిస్తున్న ఐమొబైల్‌/పాకెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో మనకంటూ సొంత వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ (వీపీఏ)ను ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మనం నగదు పంపాలనుకున్న బ్యాంకు ఖాతా నంబరుకు అనుసంధానం చేస్తే చాలు ఇట్టే నగదును బదలాయించే అవకాశం వీలుంటుంది.
USSD యూఎస్‌ఎస్‌డీ: అన్‌ స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డాటా... ఒక ఎస్‌ఎంఎస్‌తో మన చరవాణి నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునే సాంకేతిక సదుపాయం. దీన్ని వినియోగించుకోవాలంటే మొబైల్‌ బ్యాంకింగ్‌లో ఇప్పటికే ఖాతాదారుడు నమోదు చేసుకుని ఉండాలి. ఫోన్‌ నుంచీ తెలుగులో కావాలంటే *99*24# ఆంగ్లంలో అయితే *99# టైపు చేసి ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు. తెరపై ‘ఎన్‌యుయుపి’ కనిపిస్తుంది. దాని కింద మొదటి గదిలో బ్యాంకు సంక్షిప్త నామం మూడు అక్షరాల్లో (ఉదాహరణకు ఎస్బీఐ-భారతీయ స్టేట్‌ బ్యాంక్‌), రెండో దాంట్లో బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మొదటి నాలుగు అక్షరాలు నమోదు చేసి ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు. వెంటనే మొబైల్‌ తెరపై మనకు ‘ఖాతా బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌, ఎంఎంఐడీ సాయంతో నగదు బదిలీ, ఐఎఫ్‌ఎస్‌సి సాయంతో నగదు బదిలీ, ఎంపిన్‌ మార్పు’ అనే సేవలు కనిపిస్తాయి.
OTP వన్ టైమ్ పాస్వర్డ్ వినియోగదారులు కు అదనపు భద్రతా కోసం మొబైల్ ఫోన్కు   నెట్వర్క్ ద్వారా ధ్రువీకరణ కు పుంపై సంఖియా . ఈ ఒటిపి ఒక సారి మాత్రమే ఉపయోగించవచ్చు

ఆధారం: వివిధ బ్యాంకు వెబ్సైట్లు

2.97647058824
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు