ఇండియాలో ఇ-పాలన (ఇ-గవర్నెన్స్) ద్వారా “ప్రజలకు తన నివాస ప్రాంతంలోనే అన్నికేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలు సామాన్యుడికి అందజేయటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. 2006 లో ప్రారంభించిన జాతీయ ఇ-పాలన ప్రణాళిక (నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్లాన్... ఎన్ ఇ జి పి), దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేస్తున్న, సాధారణ సేవల కేంద్రాల (కామన్ సర్వీస్ సెంటర్స్... సి ఎస్ సి ల) ద్వారా, సామాన్య మానవులకు, వారి నివాస ప్రాంతంలోనే అన్ని ప్రభుత్వ సేవలను అందించడానికి కృషిచేస్తున్నది. 2012 ఫిబ్రవరి నాటికి, వివిధ బ్రాండ్ల పేరిట, దాదాపు 97,159 (సి ఎస్ సి వార్తాలేఖను - 2012) సి ఎస్ సి లు ఏర్పాటై, ప్రజలకు సేవలను అందజేయడం ప్రారంభించాయి. వివిధ సంస్థలు, ముఖ్యంగా సి ఎస్ సి లు, అందిస్తున్న పెక్కు ఐ సి టి కార్యక్రమాల ఫలాలను అందుకోవడానికి ఇండియాలోని గ్రామీణ వాతావరణం సానుకూలంగా, సంసిద్ధంగా వుండడంతో; గ్రామీణ ప్రజల జీవితాలలో మార్పుకు దోహదంచేసే, ఎంతో అవసరమైన సమాచారాన్ని, సేవల వివరాలను ఈ పోర్టల్ ద్వారా స్థానిక భాషలలో అందిస్తున్నది.
పౌర సేవలు, ఆయా రాష్ట్రాలలో అందుబాటులోవున్న ఇ- గవర్నెన్స్ కార్యక్రమాలు, ఆన్‌లైన్ న్యాయ సేవలు, ప్రభుత్వ సంచార (మొబైల్) సేవలు, ఆర్ టి ఐ మొదలైన వాటిని గురించిన సమాచారాన్నంతటిని ఒకేచోట అందించడం (ఒన్ స్టాప్ యాక్సెస్) ద్వారా, మనదేశంలో సాగుతున్న ఇ-గవర్నెన్స్ ఉద్యమానికి ఊతం ఇవ్వడంపై ఈ పోర్టల్ లోని, ఇ-గవర్నెన్స్ వెర్టికల్ (సమగ్ర సమాచార దర్శిని) ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తున్నది. వి ఎల్ ఇ లకు సమాచార సాధికారతను కలిగించవలసిన అవసరాన్ని దృష్టిలో వుంచుకుని, “వి ఎల్ ఇ కార్నర్” పేరిట , కొత్త విభాగాన్ని ఈ పోర్టల్ ప్రారంభించింది. ఈ విభాగంలో , వారికి అవసరమైన సమాచార వనరులను పొందుపరచడంతోపాటు, వారు తమ అనుభవాలను, తమ మాతృ భాషలో ఇతరులతో పంచుకునే వేదికను కూడా ఈ పోర్టల్ ఏర్పాటుచేసింది.
సమాజంలోని అట్టడుగువర్గాలవారికి కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందడానికి, వారు పౌరసేవలు పారదర్శకంగా, ఇబ్బందులేమీ లేకుండా, సమయానికి పొందడానికి భారత ప్రభుత్వం 1990ల చివరలో దేశంలో జాతీయ ఇ-పరిపాలనను ప్రవేశపెట్టింది.
మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం.
ఈ విభాగంలో ఆధార్ గురించి అవగాహన, ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్ మార్పులు) & బయోమెట్రిక్ అప్డేట్ (సవరణలు) ఆధార్ స్టేటస్ & డౌన్లోడ్, ఆధార్ తో బ్యాంకు అకౌంట్ అనుసందానం మరియు ఇతర ఆధార్ సర్వీసుల వివరాలు పొందుపరచబడినవి.
ఈ విభాగం CSCs గురించి వివరాలు, వివిధ ఉపయోగకరమైన లింక్ మరియు సంబంధిత సేవలను అందిస్తుంది.
ఈ విభాగం ఆన్ లైన్ లో పౌర సేవలు మరియు ఒక చిన్న పరిచయం వివిధ సంబంధిత ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లో ఇ-పాలన కార్యక్రమాలు గురించి వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం ఆన్ లైన్ లో చట్టపరమైన సేవలు చొరవ మరియు సంబంధిత వివిధ ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.
భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది.
ఈ విభాగం ప్రపంచ ఇ-పాలన వనరులు వివిధ నివేదికల వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం లో సామాన్య ప్రజలకు కావలసిన అవసరాలు వాటికీ సంబందించిన అవగాహన పొందుపరచినవి.
ఈ చర్చా వేదిక ఇ-పాలన కు సంబంధించిన సమస్యలపై చర్చ కోసం అందుబాటులో ఉంది.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/26/2020