హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / కెరీర్‌ ‘బ్యాడ్‌ హ్యాబిట్స్‌’
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కెరీర్‌ ‘బ్యాడ్‌ హ్యాబిట్స్‌’

కెరీర్‌లో కొందరు వరుస ప్రమోషన్లతో చకాచకా ఎదిగిపోతూ ఉంటారు. వర్క్‌ ఎథిక్స్‌ పాటించటంతోపాటు, సమయానికి ప్రాజెక్ట్స్‌ పూర్తి చేయటంలాంటి వర్కింగ్‌ స్టయిల్‌ ఫాలో అవటమే ఇందుకు కారణం. ఈ క్వాలిటీలతోపాటు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సక్సె్‌సఫుల్‌ కెరీర్‌ మీదే!

ఎలాంటి కంపెనీ అయినా ఏడాదికోసారి ఉద్యోగుల పర్‌ఫార్మెన్స్‌ రివ్యూ చేపడుతూ ఉంటుంది. పని చేసే తీరు, వేగం, నాణ్యతల ఆధారంగా ఉద్యోగుల మీద ఓ ఇంప్రెషన్‌ ఏర్పరుచుకుంటుంది. ఒకవేళ మీరు పని చేస్తున్న కంపెనీ మీకు చాలా కాలంగా జీతం పెంచకపోవటం, ప్రమోట్‌ చేయకపోవటంలాంటివి చేసిందంటే అందుకు కారణాలు మీలో ఉన్నాయేమో తరచి చూసుకోవాలి. బహుశా ఆఫీసుకి లేటుగా రావటం, పని వేళల్లో కాలక్షేపం చేయటంలాంటి చిన్న చిన్న అలవాట్లే మీ ఎదుగుదలకు అవరోధాలవుతున్నాయేమో గమనించుకోండి.

  • చెప్పిన టైమ్‌కి పని పూర్తి చేయండి: డెడ్‌లైన్‌కి చేరుకోలేకపోతే మీరు ఆ పని చేయలేని అసమర్ధులనే భావన మీ బాస్‌కి కలగటం సహజం. ఇది ఎప్పుడో ఒకసారైతే ఫర్వాలేదు. పని ఇచ్చిన ప్రతిసారీ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతే కచ్చితంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. కాబట్టి డెడ్‌లైన్‌ చేరుకోవటానికి పని ఒత్తిడి, ఇతరత్రా ఆటంకాలుంటే వాటిని పరిష్కరించుకోండి. సహోద్యోగుల సహాయం తీసుకోండి.

  • ఈమెయిల్స్‌ మీద ఓ కన్నేసి ఉంచాలి: ఇన్‌బాక్స్‌లో మెయిల్స్‌ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉంటే వాటిలో మీ బాస్‌ పంపిన మెయిల్‌ను మీరు మిస్సయ్యే ప్రమాదం ఉంది. అఫిషియల్‌ మెయిల్స్‌కు రెస్పాండ్‌ కాకపోవటం పెద్ద తప్పే! ప్రతిరోజూ మెయిల్స్‌ చెక్‌ చేసుకోకపోవటం అన్‌ప్రొషెషనల్‌. కాబట్టి సీట్‌లో కూర్చోగానే మొదట మెయిల్స్‌ చెక్‌ చేసుకోవటం అలవాటుగా మార్చుకోండి.
  • ఓవర్‌ కాన్ఫిడెన్స్‌: పని విషయంలో మీకు కాన్ఫిడెన్స్‌ ఉండటం మంచిదే! అయితే సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటూ జూనియర్స్‌ని తక్కువగా ట్రీట్‌ చేయటం ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అవుతుంది. ఇలాంటి నైజం పనిలో కొత్త విషయాలు నేర్చుకోవటానికి అడ్డంకిగా మారుతుంది.

  • యాటిట్యూడ్‌: కొత్త ప్రాజెక్ట్‌ల మీద పని చేయమని మీ బాస్‌ ఆర్డర్‌ వేయొచ్చు. సంస్థ ఎదుగుదలకు ఒకడుగు ముందుకేసి పని చేసే ఉద్యోగులనే మేనేజర్లు ప్రిఫర్‌ చేస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు సూటిగా ‘నో’ చెప్పేసి ప్రమోషన్‌కు తోడ్పడే అవకాశాల్ని చేజార్చుకోకండి.

  • గాసిప్‌: కో వర్కర్ల గురించి గాసిప్స్‌ చెప్పుకోవటం బ్యాడ్‌ ఇంప్రెషన్‌ కలిగిస్తుంది. వర్కింగ్‌ అవర్స్‌లో ఇలాంటి అనవసరపు గాసిప్స్ లో మీరూ ఇన్వాల్వ్‌ అయితే పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ సమయం వృథా చేసే వ్యక్తుల కోవలోకి మీరూ వెళ్తారు. కాబట్టి గాసి్‌ప్సకు, గాసిపింగ్‌ ఎంప్లాయి్‌సకు దూరంగా ఉండండి

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.92929292929
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు