హోమ్ / విద్య / బాలల హక్కులు / బాలల రక్షణ కు POCSO ఇ-బాక్స్
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలల రక్షణ కు POCSO ఇ-బాక్స్

లైంగిక నేరాల నుండి బాలల రక్షణకు POCSO ఇ-బాక్స్ గురించిన సమాచారం.

భారతదేశం లో పిల్లలపై లైంగిక వేదింపులు:

భారత దేశంలో బాలలపై హద్దులు మీరి జరుగుతున్న లైంగిక వేదిమ్పులలో కొద్ది శాతం మాత్రమే ఫిర్యాదు చేయబడుతున్నాయి. చాలా సందర్భాలలో లైంగికంగా వేధించిన వారు కుటుంబ సభ్యుడో లేదా చాల దగ్గరి సంబంది లేదా చాలా బాగా పరిచయమున్న వ్యక్తి ద్వార బాలలు లైంగికంగా వేదింప బడినప్పుడు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయబడడం లేదు.

ఒక అధ్యయనం ప్రకారం జరిగిన సర్వేలో 53% బాలలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు  వారి జీవితకాలంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిసింది.

లైంగిక వేధింపునకు గురికాబడిన బాలలలో వారి జీవితాంతం అది ఒక  మచ్చ గా మిగిలిపోతుంది.

లైంగిక వేధింపులకు గురైన బాలలలో  సంజ్ఞానాత్మక  బలహీనత, నిరాశ మరియు ఆతురత సహా, హింసాత్మక మరియు ప్రమాదం ప్రవర్తన చాలా తీవ్రమైన పరిణామాలకు ఎదుర్కొనవలసి వస్తుంది.

ఇలాంటి వారు సమాజంలో ఒక రకమైన సిగ్గుకు గురికావడం, ఆత్మా న్యూనతా భావానికి గురికావడం, ఇతరులతో సరియైన సంబంధాలు లేకపోవడం వంటివి కూడా బాలలలో గమనించదగ్గ విషయాలు.

లైంగిక నేరాల నుండి బాలల రక్షణ (POCSO) ఇ-బాక్స్:

 • లైంగిక నేరాల నుండి బాలల రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్.
 • పోస్కో ఈ బాక్స్ ని నేషనల్ కమిషన్  ఆన్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యం లో పని చేస్తుంది
 • ఆన్లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ, 2012 E బాక్స్ ఆపరేట్ చాలా సులభం సులభంగా ఉంటుంది.
 • POCSO చట్టం క్రింద నేరస్థులకు సకాలంలో శిక్ష పడేలా సంస్థ వ్యవహరిస్తుంది.
 • ఫిర్యాదులకు గోప్యతను నిర్వహించడానికి సహాయం చేస్తుంది.
 • POCSO ఇ-బాక్స్ ఎలా పని చేస్తుంది?

పోస్కో ఇ-బాక్స్ ఆక్సెస్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ లింక్ యూజర్ ని పోస్కో ఇ-బాక్స్ పై పుష్ బటన్ కలిగి ఉన్నజాతీయ కమిషన్ ఆన్  చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్) వెబ్సైట్ హోమ్ పేజీ (క్రింద చూపిన విధంగా) లోనికి ఓపెన్ అవుతుంది.

దశ-1

ఇది ఒక యానిమేషన్ చిత్రం కలిగిన ఒక విండో ఒక పేజీకి నావిగేట్ ఉంటుంది. ఈ యానిమేషన్ చిత్రం బాలలకి  సంభవించిన లైంగిక వేదింపుకు తాను కారణం కాదని ఎలాంటి ఆత్మాన్యూనతా భావానికి గురికారాదని ఒక స్నేహితునిలా మంచి హామీ ఇస్తుంది.

దశ 2 :

సభ్యుని పేజీలో బాణం గుర్తుపై నొక్కిన  తరువాత, అతను / ఆమె కనీసం ఒక చిత్రాన్ని ఎంపిక (వేధింపుల వర్గం వివరించే ఎంచుకోవడానికి కలిగి ఉన్న మరొక పేజీకి నావిగేట్స్) చేసుకునేట్లు ఉంటుంది.

దశ 3:

ఈ దశలో మొబైల్ సంఖ్య, ఇ-మెయిల్ మరియు వేధింపుల వివరణ వివరాలు పూరించవలసి ఉంటుంది. ఫిర్యాదు నమోదు తర్వాతా ఒక ఏకైక ఆటో ఉత్పత్తి ఫిర్యాదు సంఖ్య పొందడం జరుగుతుంది.

POCSO చట్టం గురించి:

 • పోస్కో చట్టం 2012 లో ఏర్పాటైంది.
 • బాలలను లైంగిక వేదింపుల నుండి పూర్తీ రక్షణ కలిగేట్లు వ్యవహరిస్తుంది.
 • బాలలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం, అశ్లీల నేరాల నుండి కాపాడడం.
 • ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి బాలలకు న్యాయం చేస్తుంది
 • 18 సంవత్సరాల వయస్సు లోపు వారందరూ బాలలే అని పోస్కో చట్టం తెలియ చేస్తుంది.

 

ఆధారం: జాతీయ కమిషన్ ఆన్  చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్) వెబ్సైట్

2.89887640449
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు