హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఎడారి ప్రాంతాలలో ఇసుక నేలలు ఉండి, తక్కువ వర్షపాతం ఉంటుంది. ఎందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎడారి ప్రాంతాలలో ఇసుక నేలలు ఉండి, తక్కువ వర్షపాతం ఉంటుంది. ఎందుకు?

ఎడారి ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడానికి కారణాలు తెలుసుకుందాం.

desertఏ భూభాగంలో అయితే సంవత్సర సగటు వర్షపాతం 25 శాతం కంటే తక్కువ నమోదు అవుతుందో లేదా ఏ ప్రాంతపు భూమి సారవంతమైనది కాకుండా ఉంటుందో లేదా ఈ రెండు లక్షణాలను కలిగి ఉండే భూభాగాన్ని ఎడారులుగా శాస్త్రం పరిగణిస్తుంది. సర్వ సాధారణంగా ఎడారులు విస్తారమైన భూభాగంతో పొడి వాతావరణము కలిగి, చెట్లు పెరగడానికి ప్రతికూలంగా ఉంటాయి. ఎడారి వాతావరణ ఉష్ణోగ్రతలలో ఎక్కువ తేడాలు ఉంటాయి. అక్కడ రాళ్ళు, పగుళ్ళకు లోనవుతాయి. ఎడారులలో వీచే ఈదురు గాలులు చాలా ధూళిని, ఇసుకను పోగుచేస్తాయి. సాధారణంగా భూగోళముపై అక్షాంశానికి ఇరువైపుల దక్షిణా, ఉత్తర దిశలలో 15 డిగ్రీల నుంచి 35 డిగ్రీల రేఖాంశాల మధ్య ప్రాంతాలలో ఎడారులు ఏర్పడుతాయి. ఈ ప్రాంతములో అత్యధిక పీడనము కలిగి ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతము నుండి వీచు చల్లని గాలులు క్రిందికి ప్రయాణించి, వేడి కాబట్టి అక్కడి వాతావరణము లోని తేమను శోషణ గావించుకుంటాయి. కావున ఆ ప్రాంత వాతావరణము పొడిగా, ఎక్కువ వేడితో వర్షాబావ లక్షణంలో ఉంటుంది. ఇదే విధమైన వాతావరణం సముద్రము నుండి పర్వతాలచే వేరు చేయబడుతున్న భూభాగములోనూ ఏర్పడుతుంది. ఎందుచేతనంటే సముద్రము పై నుండి అధిక తేమ కలిగిన గాలులు వీస్తూ పర్వతాలపై ఎత్తులకు ప్రయాణించినపుడు చల్లబడి తమలోని నీటి తేమను కోల్పోతాయి, తిరిగి అవి మరో వైపున ఉన్న నేల ప్రాంతమును చేరినపుడు క్రిందికి ప్రయాణించి వేడెక్కి అక్కడి వాతావరణంలోని తేమను గ్రహించి, ఆ ప్రాంత వాతావరణాన్ని పొడిగా చేస్తాయి. దీనివల్ల అక్కడ వర్షాభావం ఉంటుంది దీనిని వర్షాభావ ఛాయ ప్రాంతం అని అంటారు. ఈ విధంగా ఎడారులలో సాధారణమైన మొక్కలు పెరగకున్ననూ, కొన్ని అరుదైన వృక్షజాతులకు ఆలవాలం అయి ఉంటాయి.

రచన: డా. ఎస్.బుద్ధుడు

3.0145631068
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు