పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జర్మనీ

జర్మనీ దేశ విశేషాలు.

germanyజర్మనీ అంటేనే రెండవ ప్రపంచ యుద్ధం గుర్తుకోస్తుంది. క్రూర నియంత అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) గుర్తుకోస్తాడు. నిజమే ! ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదం ప్రపంచ యుద్ధం. అటువంటి యుద్దానికి, నాలుగు కోట్ల మంది చావుకు, ఎంతో సంపద నష్టానికి కారణమైన జాతి దురాహంకార నాజీ సిద్దాంతాన్ని హసహ్యించుకొని వారు ఉండరు. అటువంటి సిద్దాంతాన్ని ఆచరించిన హిట్లర్ ను ఈ రోజు జర్మనీ ప్రజలు కూడా క్షిమించడం లేదు. హిట్లర్ తమ దేశాస్తుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు.

నాణానికి ఒకవైపు అదయితే మరో పక్క సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ జర్మన్. ప్రపంచానికి వెలుగు చూపిన దార్శనికుడు, తత్వవేత్త కార్ల్ మార్క్ పుట్టింది జర్మనీలోనే. అలాగే మనకు ముద్రతా యంత్రాన్ని అందించిన జోహెన్నస్ గుటేన్ బర్గ్, కాంట్ లాంటి మేధావులకు పుట్టినిల్లు. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని పారిశ్రామిక అగ్రరాజ్యంగా ప్రపంచ పటం మీద నిలుస్తూ ఉంది జర్మనీ.

మద్య యూరప్ దేశమైన జర్మనీకి ఉత్తరాన నార్త్ సీ డెన్మార్క్ బాల్టిక్ సముద్రం తూర్పున పోలెండ్, చెక్ రిపబ్లిక్ పడమట బెల్జియం, లక్జెంబర్గ్, ఫ్రాన్స్ , దక్షిణాన స్విట్జర్ లాండ్ , ఆస్త్రియాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1 లక్షా 38 వేల చదరపు మైళ్ళ విస్తిర్ణతో 8 కోట్ల జనాభా కలిగిఉంది. ఇక్కడి ప్రధాన మతం క్రైస్తవం. పారిశ్ర్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన జర్మనీ ప్రపంచ ఎగుమతులలో 4 వస్ధానం ఆక్రమించింది.

2.99705014749
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు